ఎంబీఏ విద్యార్థి బూటకపు ఎన్‌కౌంటర్ కేసులో ఢిల్లీ కోర్టు తీర్పు
న్యూఢిల్లీ: 22 ఏళ్ల ఎంబీఏ విద్యార్థిని కిడ్నాప్ చేసి, బూటకపు ఎన్‌కౌంటర్ చేసిన కేసులో దోషులుగా తేలిన 17 మంది ఉత్తరాఖండ్ పోలీసులకు ఢిల్లీ కోర్టు సోమవారం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అత్యంత అరుదైన కేసుల్లో మాత్రమే దోషులకు ఉరిశిక్ష వేస్తామని, ఈ కేసు అత్యంత అరుదైనది కాదని, అందువల్ల యావజ్జీవ కారాగార శిక్షతో సరిపెడుతున్నామని పేర్కొంది. 2009 జులై 3న ఉద్యోగం కోసం ఘజియాబాద్ నుంచి డెహ్రాడూన్ వచ్చిన రణబీర్ సింగ్ అనే యువకుడిని అపహరించి బూటకపు ఎన్‌కౌంటర్ చేసి చంపేసిన కేసులో ఈ 17 మంది పాత్రా ఉందని ఇటీవలే కోర్టు నిర్ధారించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సోమవారం తీర్పు వెలువరిస్తూ.. విద్యార్థి హత్యతో నేరుగా సంబంధమున్న ఏడుగురు పోలీసులకు(వీరిలో ఆరుగురు సబ్ ఇన్‌స్పెక్టర్లు) రూ.50 వేల చొప్పున, మిగతా 10 మందికి రూ.20 వేల చొప్పున జరిమానా విధించింది.
ఈ సొమ్ము అంతటినీ బూటకపు ఎన్‌కౌంటర్‌లో మరణించిన యువకుడి తల్లిదండ్రులకు పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. అయితే వారికి జరిగిన నష్టాన్ని ఇది పూడ్చలేదని, ఈ నేపథ్యంలో మరింత పరిహారం చెల్లించేలా ఢిల్లీ న్యాయ సేవల అథారిటీ చర్యలు తీసుకోవాలని సూచించింది. దోషులకు ఉరిశిక్ష వేయాలని సీబీఐ కోరగా.. ఈ కేసు అత్యంత అరుదైనది కాదని, యావజ్జీవ శిక్ష అన్నది నిబంధన అని, ఉరిశిక్ష మినహాయింపని చెప్పింది. మృతుడి తల్లిదండ్రులు కోర్టు హాల్లోనే ఈ తీర్పుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు.
లోక్‌సభకు ట్రాయ్ ఆర్డినెన్స్
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ముఖ్య కార్యదర్శిగా టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియూ (ట్రాయ్) మాజీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా నియూమకానికి మార్గం సుగమం చేసిన ఆర్డినెన్స్ సోమవారం లోక్‌సభ ముందుకువచ్చిం ది. మిశ్రా నియూమకానికి చట్టపరంగా ఉన్న ఆటంకాలను తొలగించేందుకు వీలు గా కేంద్రం ఈ ఆర్డినెన్సు జారీ చేసింది. ట్రాయ్ (సవరణ) ఆర్డినెన్స్-2014 ప్రతి ని సభ ముందుంచినట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి సంతోష్ తెలిపారు.
17 మంది పోలీసులకు యావజ్జీవం
Published Tue, Jun 10 2014 12:53 AM | Last Updated on Tue, Oct 16 2018 2:53 PM
Advertisement