uttarakhand police
-
రంగంలోకి డ్రోన్లు.. పోలింగ్ బూత్‌లలో పటిష్ట నిఘా
డెహ్రాడూన్: రానున్న లోక్‌సభ ఎన్నికలకు పటిష్ట నిఘాను ఏర్పాటు చేస్తున్నారు ఉత్తరాఖండ్ పోలీసులు. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలు, వాటి సమీప పరిసరాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. ఇక్కడ మొత్తం 5 లోక్‌సభ స్థానాలున్నాయి. అన్నింటికీ ఏప్రిల్ 19న మొదటి దశలో పోలింగ్ జరగనుంది. "2024 లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలలో అత్యంత మారుమూల ప్రాంతాల్లోని పోలింగ్ స్టేషన్లు, పరిసర ప్రాంతాలను ఉత్తరాఖండ్ పోలీసులు డ్రోన్ల ద్వారా పర్యవేక్షిస్తారు" అని ఉత్తరాఖండ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక ప్రకటన ద్వారా తెలియజేసింది. ఉత్తరాఖండ్‌లోని క్లిష్ట భౌగోళిక పరిస్థితుల కారణంగా చాలా ప్రాంతాలలో సీసీటీవీ కెమెరాలు, నిఘా, ఫోటో, వీడియోగ్రఫీ వంటి వాటి కష్ట సాధ్యమని పేర్కొంది. ఇలాంటి మారుమూల ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా నిఘాను పర్యవేక్షించనున్నారు. ఈ డ్రోన్లు పంపిన ప్రత్యక్ష దృశ్యాలను స్కాన్ చేయడానికి రాష్ట్ర పోలీసులు తాత్కాలిక కంట్రోల్ రూమ్‌ను కూడా ప్రారంభించారు. "డ్రోన్ పంపిన చిత్రాలు, వీడియోలను ఎప్పకప్పుడు పర్యవేక్షిస్తూ అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు, కార్యకలాపాలు గుర్తించిన వెంటనే ఆ సమాచారం పోలీసు ప్రధాన కార్యాలయంలో ఉన్న ఎన్నికల కార్యకలాపాల కేంద్రానికి వెళ్తుంది" అని రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ వివరించింది. -
తప్పుడు వార్తలు.. తాగి నడిపితే 200 కిమీ దూరం ఎలా వస్తాడు!
టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ తాగి నడపడంతోనే కారు ప్రమాదానికి గురయ్యిందంటూ కొంతమంది సోషల్ మీడియాలో పేర్కొనడం సంచలనం రేపింది. అయితే ఈ వార్తలను పోలీసులు ఖండించారు. పంత్ తాగి కారు నడిపి ఉంటే అంత దూరం ఎలా వస్తాడని.. ఇవన్నీ తప్పుడు వార్తలని.. ఎవరు నమ్మొద్దని.. యాక్సిడెంట్ జరిగిన సమయంలో పంత్ సాధారణ స్థితిలోనే ఉన్నట్లు వైద్యులు నిర్థారించారని పోలీసులు పేర్కొన్నారు. ''మేము 8-10 స్పీడ్ కెమెరాలను పరిశీలించాం. ఒకవేళ పంత్ మద్యం సేవించి ఉంటే ఢిల్లీ నుంచి 200 కిలోమీటర్ల దూరం ఒక్క యాక్సిడెంట్ కూడా చేయకుండా కారు ఎలా నడపగలడు? కారు ప్రమాదానికి గురైనప్పుడు పంత్ సాధారణ స్థితిలోనే ఉన్నట్లు ప్రాథమిక చికిత్స చేసిన వైద్యుడు వెల్లడించాడు. పంత్ మద్యం సేవించలేదు కాబట్టి కారు లోంచి బయటకు రాగలిగాడు. ఆ టైమ్‌లో తాగినవాళ్లు కారు నుంచి బయటకు రాలేరు. పైగా పంత్‌ను రక్షించిన బస్ డ్రైవర్‌తో కూడా పంత్ మాములుగానే మాట్లాడడం సీసీటీవీ ఫుటేజీల్లో రికార్డయింది. పంత్ తన కారును ఎక్కడా 80 కిలోమీటర్ల వేగ పరిమితికి మించి నడపలేదు. బహుశా నిద్రమత్తు రావడంతో కారు డివైడర్‌ను ఢీకొట్టి ఉంటుంది. అయితే 70 నుంచి 80 కిమీ వేగంతో ఉండడంతోనే కారు గాల్లో పల్టీ కొట్టింది. మా టెక్నికల్ టీమ్ యాక్సిడెంట్ జరిగిన స్థలానికి వెళ్లింది. అక్కడ ఓవర్ స్పీడ్‌కు సంబంధించిన ఆధారాలు ఏవీ లభించలేదు. నిజానిజాలు తెలుసుకోకుండా మాట్లాడడం తప్పు'' అని హరిద్వార్ సీనియర్ ఎస్పీ అజయ్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ ఆస్పత్రిలో పంత్ చికిత్స పొందుతున్నాడు. అతనికి ఈరోజు ప్లాస్టిక్ సర్జరీ చేశారు. గాయాల తీవ్రత ఎక్కువగా ఉండడంతో పంత్ కోలుకునేందుకు కనీసం ఆరు నెలలు పడుతుందని వైద్యులు పేర్కొన్నారు. దీంతో పంత్ వచ్చే ఏడాది క్రికెట్ ఆడడం అనుమానమే. చదవండి: WWE: అంతుచిక్కని వ్యాధితో మాజీ రెజ్లింగ్ స్టార్ కన్నుమూత తల్లిని సర్ప్రైజ్ చేద్దామనుకుని ఇలా!.. త్వరగా కోలుకో.. కోహ్లి ట్వీట్ -
రోడ్డు ప్రమాదంలో పంత్ వస్తువులు, డబ్బులు చోరీ.. పోలీసుల క్లారిటీ
టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత రిషభ్ పంత్ నగలు, గిఫ్టులు చోరీ జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. న్యూ ఇయర్ కోసం కుటుంబ సభ్యులకు పంత్ విలువైన కానుకలు కొన్నాడని, ప్రమాదం జరిగిన సమయంలో కారులోని వస్తువులు దుండగులు ఎత్తుకెళ్లిన్నట్లు ప్రచారం జరుగుతోంది.. అతన్ని కాపాడుతున్నట్లు నటిస్తూ డబ్బు, నగలు చోరీ చేశారని, కానుకలతోపాటు క్రికెటర్ మెడలోని గొలుసు, బ్రేస్లెట్ కూడా చోరీకి గురైనట్లు సమాచారం. తాజాగా దీనిపై ఉత్తరాఖండ్ పోలీసులు క్లారిటీ ఇచ్చారు. పోలసులు ఏమన్నారంటే.. రోడ్డు ప్రమాదంలో రిషభ్ పంత్ గాయాలతోపడి ఉంటే అతని దగ్గరున్న విలువైన వస్తువులు దుండగులు ఎత్తుకెళ్లారంటూ వస్తున్న వార్తలను ఖండించారు. అతని వస్తువులు, డబ్బులు ఎవరూ దొంగిలించలేదని స్పష్టం చేశారు. ఇవన్నీ తప్పుడు ప్రచారమంటూ కొట్టిపారేశారు. పంత్‌ను కాపాడిన వారు స్వయంగా అతని వస్తువులను సేకరించి భద్రపరిచారని వాటిని క్రికెటర్ తల్లికి అందజేసినట్లు ఉత్తరాఖండ్ డీజేపీ అశోక్ కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు హరిద్వార్ ఎస్ఎస్పీ అజయ్ సింగ్ మాట్లాడిన వీడియోను డీజీపీ షేర్ చేశారు. చదవండి: Rishabh Pant: తల్లిని సర్ప్రైజ్ చేద్దామనుకుని ఇలా!.. త్వరగా కోలుకో.. కోహ్లి ట్వీట్ సీసీటీవీ ఫుటేజీ చెక్‌చేశాం అందులో.. ‘రిషబ్ పంత్‌ను కాపాడిన వారే.. అతను ధరించిన విలువైన వస్తువులు. ముఖ్యంగా అతని మెడలోని ప్లాటినం చైన్, గోల్డ్ బ్రాస్లెట్. రూ. 4 వేల నగదు గుర్తించారు. కారులో కొత్త బట్టలు కలిగి ఉన్న బ్యాగ్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. అంబులెన్స్ రాగానే పంత్‌ను ఎక్కించి అతని వస్తువులు, డబ్బు, బ్యాగ్‌ను కూడా అందులో పంపించారు. తర్వాత వాటిని కుటుంబ సభ్యులకు(అతని తల్లి) అందజేశారు. ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత ఈ విషయాన్ని ధృవీకరించాం. దీనిని విశ్లేషించేందుకు సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లోని సీసీటీవీ ఫుటేజీని కూడా పరిశీలించాం. కొంతమంది యువకులు రిషభ్ పంత్ వస్తువులను దొంగిలించారని పలు మీడియా సంస్థలు తప్పుడు సమాచారం ఇచ్చాయి. వాస్తవానికి అలాంటి సంఘటన ఏదీ మాకు కనిపించలేదు. కాబట్టి ఈ కథనం పూర్తిగా అబద్ధం. నేను అతని కుటుంబ సభ్యులతో టచ్‌లో ఉన్నాను కాబట్టి ఈ వార్తలన్నీ నిరాధారమైనవని స్పష్టమవుతోంది’ అని పేర్కొన్నారు. सड़क दुर्घटना के बाद क्रिकेटर #RishabhPant जी के सामान को लोगों द्वारा चोरी किये जाने की सूचना असत्य है। जो यह भ्रामक खबरें फैला रहे हैं, कृपया ऐसा न करें। ऐसे लोगों के साथ SSP हरिद्वार अजय सिंह का वीडियो शेयर करें। pic.twitter.com/xmSBttaCUh — Ashok Kumar IPS (@AshokKumar_IPS) December 30, 2022 కాగా ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీకి తన మెర్సిడెస్ బెంజ్ కారులో పంత్ ప్రయాణిస్తుండగా శుక్రవారం తెల్లవారుజామున రూర్కీ సమీపంలో ప్రమాదం సంభవించింది. దీంతో క్షణాల్లోనే కారులో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన పంత్ కిటికీ అద్దాలు పగలగొట్టుకొని కారు నుంచి బయటకు దూకడంతో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అయితే డ్రైవ్ చేస్తున్న సమయంలో ఒక క్షణం నిద్రలోకి జారుకోవడంతో కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢికొట్టినట్లు తెలుస్తోంది. అనంతరం కారులో మంటలు చెలరేగడంతో.. కారు పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ప్రమాదాన్ని గమనించిన అటుగా వెళ్తున్న బస్సు డ్రైవర్ పంత్‌ను కాపాడి అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో పంత్ తల, మోకాలికి గాయాలయ్యాయి. వీపు భాగం కాలిపోయింది. కాలికి ఫ్రాక్చర్ అయింది. ప్రమాద సమయంలో కారులో పంత్ ఒక్కడే ఉన్నట్లు ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ తెలిపారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం డెహ్రాడూన్ లోని ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు. పంత్ ఆరోగ్యంపై బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది. అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ట్రీట్మెంట్ కొనసాగుతోందని తెలిపింది. టీమిండియా యువ బ్యాటర్ త్వరగా కోలుకోవాలని ప్రముఖులు, క్రికెట్ అభిమనులతోపాటు యావత్ దేశం ప్రార్ధిస్తుంది. ఇది కూడా చదవండి: క్రికెటర్ల ప్రాణం మీదకు తెచ్చిన రోడ్డు ప్రమాదాలు -
ఆ యూట్యూబర్ ఆచూకీ చెబితే రూ.25,000 రివార్డ్!
డెహ్రాడూన్: విమానంలో సిగరెట్ తాగుతూ, రోడ్డుపై మద్యం సేవిస్తూ ఇటీవల వైరల్‌గా మారిన ప్రముఖ యూట్యూబర్ బాబీ కటారియా అరెస్ట్‌కు పోలీసులు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. డెహ్రాడూన్‌లో రోడ్డు మధ్యలో మద్యం సేవిస్తూ ట్రాఫిక్ జామ్‌కు కారణమైన కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో భాగంగా బాబీ కటారియాను అరెస్ట్ చేసేందుకు గాలిస్తున్నారు. ఈ క్రమంలో యూట్యూబర్ ఆచూకీ చెప్పిన వారికి రూ.25,000 రివార్డ్ అందిస్తామని ప్రకటించారు. ‘నిందితుడిపై నాన్ బెయిలెబుల్ వారెంట్ జారీ అయ్యింది. కటారియాను అరెస్ట్ చేసేందుకు హరియాణాలోని గురుగ్రామ్‌లో అతడి నివాసంలో సోదాలు నిర్వహించారు ఉత్తరాఖండ్ పోలీసులు. కానీ, అతడు పారిపోయాడు. దాంతో అతడిని పట్టుకునేందుకు రూ.25,000 రివార్డ్ ప్రకటించటం జరిగింది.’అని తెలిపారు డెహ్రాడూన్ ఎస్ఎస్పీ దిలీప్ సింగ్ కున్వార్. ముస్సోరీ కిమాడి మార్గ్‌లో రోడ్డ మధ్యలో టెబుల్ వేసుకుని మద్యం సేవిస్తూ ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలిగించాడని తెలిపారు. అలాగే మద్యం మత్తులో బైక్ ప్రమాదకరంగా నడిపాడన్నారు. దీంతో బాబీ కటారియాపై 342,336,290,510, 67 ఐటీ యాక్ట్‌ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు దిలీప్ సింగ్. ఇదీ చదవండి: స్పైస్‌జెట్ విమానంలో సిగరెట్ తాగుతూ సెల్ఫీ వీడియో.. కేసు నమోదు -
పోలీసుల లాఠీ దెబ్బలే కాదు, ఇది కూడా చూడండి
డెహ్రాడున్: అర్జంటు పని లేకున్నా బయటికి వస్తే పోలీసులు బడితె పూజ చేస్తున్నారు. దీంతో సామాన్య జనం అడుగు బయటపెట్టాలంటే వణికిపోతున్నారు. అయితే పైకి ఇంత కఠినంగా కనిపించే నాలుగో సింహం(పోలీసు)లో కనిపించని మరో యాంగిల్ కూడా ఉందని నిరూపించారు ఉత్తరాఖండ్‌కు చెందిన పోలీసులు. విధుల నిర్వహణలో భాగంగా గాంభీర్యాన్ని ప్రదర్శించినప్పటికీ ఆకలితో అలమటిస్తున్నవారికి సహాయం చేస్తూ తమలోనూ దయాగుణం ఉందని చాటి చెప్తున్నారు. కరోనా నేపథ్యంలో విధించిన లాక్డౌన్ వల్ల తిండిగింజ దొరక్క పస్తులుంటున్న పేదవారికి గుప్పెడు మెతుకులు పెడుతూ ఆకలి చావుల నుంచి రక్షిస్తున్నారీ రక్షక భటులు. (కరోనా: బాల మేధావి చెప్పిందే జరుగుతోందా!?) అందుకోసం హరిద్వార్‌లోని వీధుల్లో ఓ చెక్క మంచాన్ని ఏర్పాటు చేసి దానిపై ఆహార ప్యాకెట్లను పెడుతున్నారు. పూట గడవడం కష్టంగా ఉన్నవాళ్లను నేరుగా వచ్చి వారికవసరమైనంత ఆహారాన్ని తీసుకెళ్లమని చెప్తూ ఉదారతను చాటుకున్నారు. డబ్బు సాయం కాకుండా చాలా చోట్ల సైతం జనాలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అన్నార్థులకు ఆహారాన్ని అందిస్తున్నారు. అయితే ఇప్పటికీ కడుపు నిండా కూడు దొరకని కడు పేదలు తిండి దొరక్క అనేక కష్టాలు అనుభవిస్తున్నారు. పలు చోట్ల వీరి పరిస్థితి దుర్భరంగా ఉండగా లాక్డౌన్ ఎప్పుడు పూర్తవుతుందా అని రోజులు లెక్కపెంటుకుంటున్నారు. (అసత్య ప్రచారానికి చెక్‌పెట్టేలా..) -
గంగాదీప్ సింగ్ సోషల్ మీడియాలో హీరో
-
సోషల్ మీడియాలో పోలీసు హీరో
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్‌లోని రామ్‌నగర్‌లో గంగాదీప్ సింగ్ అనే సబ్ ఇనిస్పెక్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక్కసారిగా హీరో అయ్యారు. కొంత మంది హిందూ మతతత్వవాదులు ఓ ముస్లిం యువకుడితో గొడవ పడి అతన్ని చితక్కొట్టబోతే సకాలంలో అక్కడికి చేరుకున్న పోలీసు అధికారి సింగ్ అతనికి తన శరీరాన్ని రక్షణ కవచంలా అడ్డేసి రక్షించారు. ఓ పక్కన ఆ ముస్లిం యువకుడిని కొట్టేందుకు ప్రయత్నిస్తున్న అల్లరి మూకకు నచ్చ చెబుతూనే బాధితుడికి అంగరక్షకుడిలా నిలిచారు. ఇతర పోలీసుల్లాగా పోలీసు బలగాలు వచ్చే వరకు అతను నిరీక్షించలేదు. ఉద్రిక్త పరిస్థితి గురించి తెల్సిన వెంటనే పరుగుపరుగున అక్కడికి వచ్చారు. ఈ సంఘటనకు సంబం«ధించి ఎవరో శుక్రవారం తీసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమిళనాడులోని తూత్తుకుడిలో స్టెరిలైట్ కంపెనీకి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న ప్రజలపై నిర్ధాక్షిణ్యంగా పోలీసులు కాల్పులు జరపడం, ఆ సంఘటనలో 13 మంది చనిపోవడం లాంటి సంఘటనలు విన్నప్పుడు పోలీసులు అంత దుర్మార్గులు మరొకరు ఉండరని అనిపిస్తుంది. గంగాదీప్ సింగ్ లాంటి వారిని చూసినప్పుడు పోలీసుల్లో కూడా మహానుభావులు ఉంటారనిపిస్తోంది. ఇలాంటి మహానుభావులు అరుదుగానే కనిపిస్తారు. ముంబైలోని కమలా మిల్స్ కాంప్లెక్స్‌లో కొంతకాలం క్రితం అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు వోర్లీ పోలీస్ స్టేషన్‌కు చెందిన సుదర్శన్ షిండే అనే పోలీసు కానిస్టేబుల్ తన ప్రాణాలకు తెగించి తన భుజాల మీదుగా బాధితులను మోసుకురావడం వల్ల ఎనిమిది మంది ప్రాణాలను కాపాడారు. నాటి అగ్ని ప్రమాదంలో 14 మంది మరణించారు. కేరళలోని తిరువనంతపురంలో ఏఎస్ఐ సాజిష్ కుమార్ నదిలోకి దూకి మునిగిపోతున్న టీనేజర్‌ను రక్షించారు. అలాగే నాసిక్‌లో కుంభమేళ సందర్భంగా నీటిలో మునిగిపోతున్న ఓ మనిషిని రక్షించేందుకు మనోజ్ భారతే అనే పోలీసు అధికారి ఏకంగా 20 అడుగుల వంతెనపై నుంచి దూకారు. వాస్తవానికి పోలీసులు సామాజిక సేవకులుగానే ఉండాలి. కానీ రాజకీయ అవినీతి వల్ల వారు చెడిపోతున్నారు. నియామకాల్లో, బదిలీల్లో భారీ అవినీతి జరగడమే అందుకు కారణం. అవినీతిని నిర్మూలించడంతో పాటు సామాజిక సేవారంగంలో పోలీసులకు తగిన శిక్షణ కల్పించినప్పుడు, వారిలో సేవా దృక్పథాన్ని పెంచేందుకు సామాజిక శాస్త్రవేత్తల సేవలను వినియోగించినప్పుడు పోలీసుల్లో మహానుభావుల సంఖ్య పెరుగుతుంది. -
అమ్మాయి మిస్సయిందని.. కుర్రాడి లాకప్‌డెత్
ఉత్తరాఖండ్‌లో ఓ అమ్మాయి ఇంట్లోంచి కనపడకుండా పోయింది. దాంతో పోలీసులు జియాయుద్దీన్ రజా (16) అనే ఓ కుర్రాడిని అదుపులోకి తీసుకున్నారు. ఏమయిందో ఏమో తెలియదు గానీ.. రజా పోలీసు లాకప్‌లో ఉండగా ఉరికి వేలాడుతూ మరణించాడు. దీంతో ఒక్కసారిగా ఉత్తరాఖండ్ పోలీసులపై నిరసనలు వెల్లువెత్తాయి. నాలుగు రోజుల క్రితం కనపడలేదన్న ఆ అమ్మాయి ఆచూకీ చివరకు లక్నోలో తేలింది. దాంతో పోలీసులు వ్యవహరించిన తీరుపై అనుమానాలు తలెత్తాయి. పోలీసులు తమ కొడుకును తీసుకెళ్లేటప్పుడు అతడి దగ్గర ఏమీ లేవని.. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి అతడు తాడుతో ఉరేసుకున్నాడని చెప్పడంలో అర్థం ఏముందని బాలుడి తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో నలుగురు పోలీసులను సస్పెండ్ చేసిన సీనియర్ ఎస్పీ సెంథిల్ అబూదెయి మొత్తం వ్యవహారంపై దర్యాప్తునకు ఆదేశించారు. ఒక ఎస్ఐ, ఒక విలేకరి, ఐదుగురు గుర్తుతెలియని పోలీసులు, మరో ఇద్దరు.. మొత్తం 9 మందిపై హత్యకేసు నమోదు చేశారు. రజా మరణానికి కారణమేంటో విచారించి 72 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని ఈ కేసును సుమోటోగా విచారణకు స్వీకరించిన ఉత్తరాఖండ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ ఆదేశించింది. పదో తరగతి చదువుతున్న రజా ఇంటి సమీపంలో ఉండే ఓ అమ్మాయి ఇంట్లోంచి కనపడకుండా పోవడంతో.. అందుకు కారణం ఇతడే అయి ఉంటాడన్న అనుమానంతో పోలీసులు రజాను అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే ఆ తర్వాత అతడు లాకప్ డెత్ కావడంతో అది తీవ్ర వివాదం అయ్యింది. -
దోషిగా తేలితే నా కాలు నరుక్కుంటా!!
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ పోలీసు గుర్రం శక్తిమాన్ మృతిపై జంతు ప్రేమికులు, రాజకీయ నాయకుల నుంచి తీవ్ర సంతాపం వ్యక్తమవుతున్నది. ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీశ్ రావత్ బుధవారం శక్తిమాన్ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. శక్తిమాన్ మృతి తీవ్ర విషాదకరమని, ఈ విషాదంపై స్పందించడానికి నోట మాట రావడం లేదని రావత్ అన్నారు. శక్తిమాన్ చక్కగా కోలుకుంటున్నదని తాము భావించామని, ఇంతలోనే ఇలా జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరాఖండ్‌లో ప్రజాస్వామ్యాన్ని మోదీ ప్రభుత్వం ఖూనీ చేసిన తరహాలోనే బీజేపీ ఎమ్మెల్యే దాడితో పోలీసు గుర్రం చనిపోవాల్సి రావడం బాధాకరమని కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సూర్జేవాలా పేర్కొన్నారు. ఇలా జరుగుతుందని అనుకోలేదు! బీజేపీ ఆందోళనలో గాయపడిన శక్తిమాన్ చక్కగా కోలుకుంటున్నదని, అది చనిపోతుందని తాము భావించలేదని, ఇది చాలా బాధాకరమని ఆ గుర్రానికి చికిత్స అందించిన వైద్యుడు ఖంబాటా తెలిపారు. మూడు కాళ్లతో గుర్రం బతకడం కష్టమని, అందుకే అది తుదిశ్వాస విడిచిందని, ఇకనైనా జంతు పరిరక్షణ చట్టాలను మరింత పటిష్టం చేయాల్సిన అవసరముందని జంతు హక్కుల కార్యకర్త, పెటా ప్రతినిధి భువనేశ్వరీ అన్నారు. నా కాలు నరుక్కుంటా! శక్తిమాన్ మృతిపై బీజేపీ ఎమ్మెల్యే గణేష్ జోషి విచారం వ్యక్తం చేశారు. తాను ఆ గుర్రాన్ని కొట్టలేదని, తన వల్ల ఆ గుర్రం గాయపడలేదని ఆయన మరోసారి పేర్కొన్నారు. తాను గుర్రం కాలు విరగగొట్టినట్టు రుజువు చేస్తే.. అందుకు బదులుగా తన కాలును నరుక్కుంటానని గణేష్ జోషి పునరుద్ఘాటించారు. బీజేపీ ఆందోళన సందర్భంగా ఎమ్మెల్యే గణేశ్ జోషి లాఠీతో కొట్టడం వల్లే ఈ గుర్రం గాయపడిందని పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. -
పాపం.. ఆ శక్తిమాన్ ఇక లేదు!
శక్తిమాన్ గుర్తుంది కదా.. బీజేపీ ఎమ్మెల్యే గణేష్ జోషి చేతిలో దారుణంగా దెబ్బలు తిని.. ఆ మధ్య దేశవ్యాప్తంగా సానుభూతి పొందిన ఈ ఉత్తరాఖండ్ పోలీసు గుర్రం ఇక లేదు. గత నెల హరీశ్ రావత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ నిర్వహించిన ఆందోళనలో తీవ్రంగా గాయపడిన ఈ 14 ఏళ్ల గుర్రం ఓ కాలిని వైద్యులు శస్త్రచికిత్స జరిపి తొలగించారు. ఆ కాలి స్థానంలో కృత్రిమ కాలును అమర్చి.. వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ఇన్నాళ్లు ప్రాణాలతో పోరాడిన శక్తిమాన్ బుధవారం తుదిశ్వాస విడిచింది. గత కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ గుర్రం చనిపోవడానికి కారణమని బీజేపీ ఆరోపిస్తున్నది. బీజేపీ ఆందోళనలో గాయపడిన కారణంగా ఈ గుర్రానికి సరైన వైద్యం అందించకుండా చనిపోయేలా హరీశ్ రావత్ ప్రభుత్వం చేసిందని కమలం నేత అజయ్ భట్ ఆరోపించారు. ఉత్తరాఖండ్ అశ్వ పోలీసు దళంలో శక్తిమాన్ సేవలందించింది. మార్చి 14న డెహ్రాడూన్‌లో బీజేపీ నిర్వహించిన ఆందోళన సందర్భంగా శక్తిమాన్ గాయపడింది. బీజేపీ ఎమ్మెల్యే గణేశ్ జోషి లాఠీతో కొట్టడం వల్లే ఈ గుర్రం గాయపడిందని పోలీసులు కేసు నమోదు చేసి, ఆయనను అరెస్టు చేశారు. గణేశ్ జోషి గుర్రాన్ని కొడుతున్నట్టు వీడియో కూడా వెలుగులోకి వచ్చింది. ఆయన మాత్రం తాను గుర్రాన్ని కొట్టలేదని, తన వల్ల అది గాయపడలేదని వాదిస్తున్నారు. -
'వాళ్లు ఉగ్రవాదులు కాదు.. విద్యార్థులు'
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో సీసీటీవీలో అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తులు ఉగ్రవాదులు కాదని ఆ రాష్ట్ర పోలీసులు తేల్చేశారు. వారంతా కాలేజీ విద్యార్థులేనని స్పష్టం చేశారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఉగ్రవాదులు దేశంలో బాంబు పేలుళ్లకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో అన్ని చోట్ల పోలీసులు అప్రమత్తంగా ఉన్న విషయం తెలిసిందే. అందులో భాగంగా తెల్లవారు జామున ఏడు నుంచి ఎనిమిది మంది వ్యక్తులు ముసుగులు ధరించి వెళుతుండగా సీసీటీవీలో ఆ దృశ్యాలు రికార్డయ్యాయి. ఆ దృశ్యాలను వాట్సాప్ ద్వారా విడుదల చేసిన పోలీసులు ఈ వీడియోల్లో చూసిన వ్యక్తులను గుర్తుపడితే సమాచారం ఇవ్వాలని, ఉగ్రవాదులనే అనుమానం ఉందని అభిప్రాయం చెప్పారు. 'సీసీటీవీలో రికార్డయిన దృశ్యాల ఆధారంగా ఆ వ్యక్తులను గుర్తించాం. వారు రాజ్ పూర్ రోడ్డులోని బైబిల్ కాలేజీ విద్యార్థులు. వారు రెండు గ్రూపులుగా మారి సెయింట్ థామస్ కు వెళ్లొస్తుండగా వారి దృశ్యాలే సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి' అని డెహ్రాడూన్ పోలీసు ఉన్నతాధికారి సదానంద డేట్ తెలిపారు. -
17 మంది పోలీసులకు యావజ్జీవం
ఎంబీఏ విద్యార్థి బూటకపు ఎన్కౌంటర్ కేసులో ఢిల్లీ కోర్టు తీర్పు న్యూఢిల్లీ: 22 ఏళ్ల ఎంబీఏ విద్యార్థిని కిడ్నాప్ చేసి, బూటకపు ఎన్కౌంటర్ చేసిన కేసులో దోషులుగా తేలిన 17 మంది ఉత్తరాఖండ్ పోలీసులకు ఢిల్లీ కోర్టు సోమవారం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అత్యంత అరుదైన కేసుల్లో మాత్రమే దోషులకు ఉరిశిక్ష వేస్తామని, ఈ కేసు అత్యంత అరుదైనది కాదని, అందువల్ల యావజ్జీవ కారాగార శిక్షతో సరిపెడుతున్నామని పేర్కొంది. 2009 జులై 3న ఉద్యోగం కోసం ఘజియాబాద్ నుంచి డెహ్రాడూన్ వచ్చిన రణబీర్ సింగ్ అనే యువకుడిని అపహరించి బూటకపు ఎన్కౌంటర్ చేసి చంపేసిన కేసులో ఈ 17 మంది పాత్రా ఉందని ఇటీవలే కోర్టు నిర్ధారించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సోమవారం తీర్పు వెలువరిస్తూ.. విద్యార్థి హత్యతో నేరుగా సంబంధమున్న ఏడుగురు పోలీసులకు(వీరిలో ఆరుగురు సబ్ ఇన్స్పెక్టర్లు) రూ.50 వేల చొప్పున, మిగతా 10 మందికి రూ.20 వేల చొప్పున జరిమానా విధించింది. ఈ సొమ్ము అంతటినీ బూటకపు ఎన్కౌంటర్లో మరణించిన యువకుడి తల్లిదండ్రులకు పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. అయితే వారికి జరిగిన నష్టాన్ని ఇది పూడ్చలేదని, ఈ నేపథ్యంలో మరింత పరిహారం చెల్లించేలా ఢిల్లీ న్యాయ సేవల అథారిటీ చర్యలు తీసుకోవాలని సూచించింది. దోషులకు ఉరిశిక్ష వేయాలని సీబీఐ కోరగా.. ఈ కేసు అత్యంత అరుదైనది కాదని, యావజ్జీవ శిక్ష అన్నది నిబంధన అని, ఉరిశిక్ష మినహాయింపని చెప్పింది. మృతుడి తల్లిదండ్రులు కోర్టు హాల్లోనే ఈ తీర్పుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. లోక్‌సభకు ట్రాయ్ ఆర్డినెన్స్ న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ముఖ్య కార్యదర్శిగా టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియూ (ట్రాయ్) మాజీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా నియూమకానికి మార్గం సుగమం చేసిన ఆర్డినెన్స్ సోమవారం లోక్‌సభ ముందుకువచ్చిం ది. మిశ్రా నియూమకానికి చట్టపరంగా ఉన్న ఆటంకాలను తొలగించేందుకు వీలు గా కేంద్రం ఈ ఆర్డినెన్సు జారీ చేసింది. ట్రాయ్ (సవరణ) ఆర్డినెన్స్-2014 ప్రతి ని సభ ముందుంచినట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి సంతోష్ తెలిపారు.