డెహ్రాడున్: అర్జంటు పని లేకున్నా బయటికి వస్తే పోలీసులు బడితె పూజ చేస్తున్నారు. దీంతో సామాన్య జనం అడుగు బయటపెట్టాలంటే వణికిపోతున్నారు. అయితే పైకి ఇంత కఠినంగా కనిపించే నాలుగో సింహం(పోలీసు)లో కనిపించని మరో యాంగిల్ కూడా ఉందని నిరూపించారు ఉత్తరాఖండ్‌కు చెందిన పోలీసులు. విధుల నిర్వహణలో భాగంగా గాంభీర్యాన్ని ప్రదర్శించినప్పటికీ ఆకలితో అలమటిస్తున్నవారికి సహాయం చేస్తూ తమలోనూ దయాగుణం ఉందని చాటి చెప్తున్నారు. కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ వల్ల తిండిగింజ దొరక్క పస్తులుంటున్న పేదవారికి గుప్పెడు మెతుకులు పెడుతూ ఆకలి చావుల నుంచి రక్షిస్తున్నారీ రక్షక భటులు. (కరోనా: బాల మేధావి చెప్పిందే జరుగుతోందా!?)
అందుకోసం హరిద్వార్‌లోని వీధుల్లో ఓ చెక్క మంచాన్ని ఏర్పాటు చేసి దానిపై ఆహార ప్యాకెట్లను పెడుతున్నారు. పూట గడవడం కష్టంగా ఉన్నవాళ్లను నేరుగా వచ్చి వారికవసరమైనంత ఆహారాన్ని తీసుకెళ్లమని చెప్తూ ఉదారతను చాటుకున్నారు. డబ్బు సాయం కాకుండా చాలా చోట్ల సైతం జనాలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అన్నార్థులకు ఆహారాన్ని అందిస్తున్నారు. అయితే ఇప్పటికీ కడుపు నిండా కూడు దొరకని కడు పేదలు తిండి దొరక్క అనేక కష్టాలు అనుభవిస్తున్నారు. పలు చోట్ల వీరి పరిస్థితి దుర్భరంగా ఉండగా లాక్‌డౌన్ ఎప్పుడు పూర్తవుతుందా అని రోజులు లెక్కపెంటుకుంటున్నారు. (అసత్య ప్రచారానికి చెక్‌పెట్టేలా..)
Comments
Please login to add a commentAdd a comment