డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో సీసీటీవీలో అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తులు ఉగ్రవాదులు కాదని ఆ రాష్ట్ర పోలీసులు తేల్చేశారు. వారంతా కాలేజీ విద్యార్థులేనని స్పష్టం చేశారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఉగ్రవాదులు దేశంలో బాంబు పేలుళ్లకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో అన్ని చోట్ల పోలీసులు అప్రమత్తంగా ఉన్న విషయం తెలిసిందే. అందులో భాగంగా తెల్లవారు జామున ఏడు నుంచి ఎనిమిది మంది వ్యక్తులు ముసుగులు ధరించి వెళుతుండగా సీసీటీవీలో ఆ దృశ్యాలు రికార్డయ్యాయి.
ఆ దృశ్యాలను వాట్సాప్ ద్వారా విడుదల చేసిన పోలీసులు ఈ వీడియోల్లో చూసిన వ్యక్తులను గుర్తుపడితే సమాచారం ఇవ్వాలని, ఉగ్రవాదులనే అనుమానం ఉందని అభిప్రాయం చెప్పారు. 'సీసీటీవీలో రికార్డయిన దృశ్యాల ఆధారంగా ఆ వ్యక్తులను గుర్తించాం. వారు రాజ్ పూర్ రోడ్డులోని బైబిల్ కాలేజీ విద్యార్థులు. వారు రెండు గ్రూపులుగా మారి సెయింట్ థామస్ కు వెళ్లొస్తుండగా వారి దృశ్యాలే సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి' అని డెహ్రాడూన్ పోలీసు ఉన్నతాధికారి సదానంద డేట్ తెలిపారు.
'వాళ్లు ఉగ్రవాదులు కాదు.. విద్యార్థులు'
Published Thu, Jan 28 2016 7:07 AM | Last Updated on Tue, Nov 6 2018 8:51 PM
Advertisement