
కదిరి అర్బన్: మొటుకుపల్లితండా గ్రామానికి చెందిన గోవర్దన్(24) అనే ఎంబీఏ విద్యార్థి మంగళవారం అర్ధరాత్రి పురుగుమందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రూరల్ ఎస్‌ఐ వెంకటస్వామి తెలిపిన మేరకు వివరాలిలాఉన్నాయి. బాగా చదువుకుని ఉద్యోగం తెచ్చుకో అంటూ గోవర్దన్‌ను తల్లిదండ్రులు రత్నమ్మ సుధాకర్‌లు మంగళవారం రాత్రి మందలించారు. దీంతో మనస్తాపం చెందిన గోవర్దన్ పురుగుమందు తాగాడు. అపస్మారక స్థితిలో పడి ఉన్న అతడిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం బత్తలపల్లికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు.