suscide
-
యువతి ఆత్మహత్య..మంత్రాల నేపంతో దారుణం
సాక్షి, ములుగు: సమాజం ఎంత ముందుకు వెళ్తున్నా... కొంతమంది మనుషులు మాత్రం ఇంకా మూఢ నమ్మకాలను విశ్వసిస్తున్నారు. మనిషి ఇంకా తన పాత పద్దతులను వీడటం లేదు , మంత్రాల నేపంతో మనుషులను చంపుతూనే ఉన్నాడు. చెప్పుడు మాటలు విని.. అమాయకులను బలి తీసుకుంటున్న ఘటనలు తరచూ వింటూనే ఉన్నాం. మంత్రాలు నేపంతో ఓ యువకున్ని గొడ్డలితో నరికి చంపిన ఘటన ములుగు జిల్లా తాడ్వాయి మండలం బొల్లెపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు లోకి వెళ్తే తోలెం విజయ్ కుమార్ అనే యువకుడు గత ఐదు సంవత్సరాలుగా కూలీ పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇదే గ్రామానికి చెందిన పూనేం సురేష్ (22) యొక్క చెల్లె నీలవేణి 6 నెలల క్రితం పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.విజయ్ కుమార్ మంత్రాలు చేయడం వల్లే తన చెల్లెలు ఆత్మహత్య చేసుకుందనే అనుమానంతో కక్ష పెంచుకున్నాడు. గురువారం రాత్రి సురేష్ మృతుడి ఇంటికి గొడ్డలి పట్టుకుని వెళ్లి గొడవ పెట్టుకున్నాడు. ఆ తరువాత అతన్ని ఇంటి బయటకు లాక్కొచ్చి అతి కిరాతకంగా గొడ్డలితో నరికి చంపివేశాడు. మృతుడికి తల్లిదండ్రలు ఎవరూ లేరు. పెద్దమ్మ పూనెం సారక్క ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాడ్వాయి ఎస్సై శ్రీ సీఎచ్.వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసుకొని సంఘటనా స్థలానికి వెళ్ళి పరిశీలించారు. చదవండి:బ్యాంకు సెక్యురిటీ గార్డు దారుణం.. మాస్కు ధరించలేదని కాల్చిపడేశాడు -
ఉద్యోగం తెచ్చుకోమన్నారని ..ఆత్మహత్య
కదిరి అర్బన్: మొటుకుపల్లితండా గ్రామానికి చెందిన గోవర్దన్(24) అనే ఎంబీఏ విద్యార్థి మంగళవారం అర్ధరాత్రి పురుగుమందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రూరల్ ఎస్ఐ వెంకటస్వామి తెలిపిన మేరకు వివరాలిలాఉన్నాయి. బాగా చదువుకుని ఉద్యోగం తెచ్చుకో అంటూ గోవర్దన్‌ను తల్లిదండ్రులు రత్నమ్మ సుధాకర్‌లు మంగళవారం రాత్రి మందలించారు. దీంతో మనస్తాపం చెందిన గోవర్దన్ పురుగుమందు తాగాడు. అపస్మారక స్థితిలో పడి ఉన్న అతడిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం బత్తలపల్లికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. -
ఒంటరి జీవితం భరించలేక బలవన్మరణం
సాక్షి, రాయదుర్గంటౌన్: ఒంటరి జీవితం భరించలేక ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. బళ్లారి జిల్లా రూపనగుడి గ్రామానికి చెందిన లింగన్న, పద్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. స్వగ్రామం నుంచి 25 ఏళ్ల క్రితమే రాయదుర్గం పట్టణానికి వచ్చి స్థిరపడ్డారు. కోతిగుట్ట కాలనీలో నివాసముంటున్నారు. జ్యోతి తల్లిదండ్రులు ఐదేళ్ల క్రితం మృతి చెందారు. ఇద్దరు అక్కలకు వివాహం కాగా.. సోదరుడు స్వగ్రామానికి వెళ్లి పొలం పనులు చేసుకుంటున్నాడు. డిగ్రీ వరకు చదువుకున్న జ్యోతి స్వగ్రామానికి వెళ్లలేక రాయదుర్గంలోనే ఓ కంప్యూటర్ ఇన్స్టిట్ట్యూట్లో ఆపరేటర్‌గా పనిచేస్తూ జీవిస్తోంది. నెల రోజుల నుంచి పనికి కూడా వెళ్లడం లేదు. అక్కలు, సోదరుడు ఎవరూ తనను పట్టించుకోకపోవడంతో మనస్థాపానికి గురై.. ఒంటరి జీవితం భరించలేక మంగళవారం ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఉద్యోగం లేదని ఉసురుతీసుకున్నాడు
సాక్షి, రాయదుర్గంటౌన్: ఉన్న ఉద్యోగం.. కొత్తగా ఎక్కడా పని దొరక్కపోవడంతో మనస్తాపానికి గురైన యువకుడు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. రాయదుర్గం పట్టణంలోని 28వ వార్డు బళ్లారి రోడ్డు పక్కన నివాసం ఉంటున్న పూల వ్యాపారి వెంకటేశులు, గీతమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడైన అరవింద్ (28) బీటెక్ చదివి బెంగళూరులోని విప్రో కంపెనీలో పనిచేస్తున్నాడు. వారం రోజుల క్రితం అతడిని ఉద్యోగం నుంచి తొలగించారు. మరో ఉద్యోగం చూసుకునేందుకు బెంగళూరుకు వెళ్లి మంగళవారం ఉదయమే రాయదుర్గం వచ్చాడు. ఉన్న ఉద్యోగం పోవడం.. సరైన ఉద్యోగం దొరక్కపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేవారు. -
కిరోసిన్ పోసుకుని మహిళ ఆత్మహత్య
సాక్షి, గూడూరు : భార్యాభర్తలు గొడవ పడిన ఘటనలో ఓ మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకొని కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని గుండెంగలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం...నెక్కొండ మండలం చంద్రుగొండకు చెందిన నర్సింగోజు రాజు, భవాని (38) దంపతులు 10 సంవత్సరాల క్రితం మండలంలోని గుండెంగకు వచ్చి ఆర్ఎంపీ వైద్యం చేసుకుంటూ స్థిర పడ్డారు. కొన్ని రోజులు గా భార్యాభర్తల నడుమ కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం రాజు, భవాని గొడవపడ్డారు. భర్తతో గొడవ పడిన భవాని ఆవేశానికి గురై ఇంట్లో ఉన్న కిరోసిన్ డబ్బా పట్టుకొని పక్కనే ఉన్న బాత్రూంలోకి వెళ్లి కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. మంటలతో కేకలు వేయగా రాజు వెంటనే వెళ్లి మంటలు ఆర్పే ప్రయత్నం చేశాడు. దీంతో అతని చేతులు, ముఖం కాలింది. స్థానికులు అక్కడకు చేరుకుని భవానిని చికిత్స నిమిత్త నర్సంపేటకు తరలించారు. అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ భవాని మృతిచెందింది గ్రామస్తులు తెలిపారు. -
మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య
సాక్షి, ములుగు రూరల్: మనస్తాపంతో పురుగుల మందుతాగి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని రాంనగర్‌తండాలో సోమవారం చోటు చేసుకుంది. ఏఎస్సై లలిత కథనం ప్రకారం...మండలంలో రాంనగర్‌తండాకు చెంది న పాల్తియా సమ్మయ్య (55) తనకున్న భూమిలో వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. కొన్ని రోజులు గా సమ్మయ్య ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ మనస్తాపానికి గురై నిత్యం బాధపడుతుండేవాడు. సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చుట్టు పక్కల వారు గమనించి ఆస్పత్రికి తరలించే క్రమంలో పరిస్థితి విషమించి మృతి చెందాడు. మృతుడి భార్య ప్రమీల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు. -
భార్యను చంపిన భర్త..ఆత్మహత్య
సాక్షి, కరీమాబాద్: భార్యను గొడ్డలితో నరికి తాను సమీపంలోని రైలు పట్టాలపై రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వరంగల్ అర్బన్ జిల్లాలోని అండర్ రైల్వేగేట్ 23వ డివిజన్ ఎస్ఆర్ఆర్ తోటలోని హనుమాన్ గుడి వీధిలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. మిల్స్‌కాలనీ పోలీసులు, కుటుంబ సభ్యుల, స్థానికుల కథనం ప్రకారం... ఎస్‌ఆర్‌ఆర్‌తోటలో చాలా కాలంగా ఊగ చిన్న,కన్నమ్మ దంపతులతో పాటు కుటుంబ సభ్యులు కిరాయి ఇంట్లో ఉంటున్నారు. ఉగ చిన్న (57)తాగుడుకు బానిసయ్యాడు. ప్రతిరోజూ తన భార్య కన్నమ్మ(52)తో గొడవకు దిగడంతో పాటు కొట్టేవాడు. ఈ క్రమంలో శుక్రవారం తీవ్ర జ్వరంతో బాధపడుతున్న కన్నమ్మను మద్యం మత్తులో ఉన్న చిన్న అతి కిరాతరంగా కన్నమ్మను గొడ్డలితో తలపై నరికి చంపాడు. అక్కడి నుంచి పారిపోయిన చిన్న సమీపంలోని రైల్వే ట్రాక్‌పైకి వెళ్లి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాళం చెవి కోసం మనవరాలు ప్రియదర్శిని కన్నమ్మ చనిపోయి ఉన్న విషయాన్ని చూసి వెళ్లి తన తల్లిదండ్రులకు చెప్పింది. ఈ లోగా మిల్స్‌కాలనీ సీఐ దయాకర్, ఎస్సై భీమేష్‌తో పాటు పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి వివరాలు తీసుకుని పంచనామా చేసి మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. అదే విధంగా వరంగల్ జీఆర్పీ పోలీసులు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న చిన్న మృతదేహాన్ని సైతం ఎంజీఎంకు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఇదిలా ఉండగా కన్నమ్మ–చిన్నలకు నాగలక్ష్మి, శ్రీలత, లావణ్య, శివ ఉన్నారు. కుమారుడు ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగంలో చేరాడని స్థానికులు చెబుతున్నారు. మిన్నంటిన కూతుళ్ల రోదనలు అటు తల్లిని చంపి, ఇటు తండ్రి కూడా రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవడంతో వారి కూతుర్లు నాగలక్ష్మి, లావణ్యల రోదనలు మిన్నంటాయి. తన తల్లి తమను పండ్లు, కూరగాయలు, కంకులు అమ్మి సాదుకుందని, తమకు ఎలాంటి లోటు లేకుండా పెంచిందని ఏడుస్తూ గుర్తు చేశారు. తమ తండ్రి చిన్న తాగుడుకు బానిసై తమ కుటుంబాన్ని ఏనాడు పట్టించుకోలేదని బోరున విలపించారు. -
డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
ముత్తారం: ముత్తారం మండలం లక్కారం గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థిని మాదాసి వాణి(17) శనివారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. వాణి గ్రామానికి చెందిన ఓ అబ్బాయితో మట్లాడుతుందని తల్లిదండ్రులు ఇటీవల మందలించారు. దీంతో మనస్తాపం చెందిన వాణి గతనెల 26న ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. తల్లిదండ్రుల బంధువుల ఇళ్లలో గాలించి మరుసటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండలం నస్పూర్‌లోని బంధువుల ఇంట్లో ఉన్న వాణిని తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ క్రమంలో శనివారం ఇంట్లోని ఉరేసుకుంది. తల్లి మల్లేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
యువకుడి బలవన్మరణం
ముస్తాబాద్ : ముస్తాబాద్ మండలం ఆవునూర్ గ్రామానికి చెందిన చిన్ని మహేందర్‌రెడ్డి(24) హైదరాబాద్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజిరెడ్డి, రాజవ్వ దంపతుల కుమారుడు మహేందర్‌రెడ్డి గతేడాది బీటెక్ పూర్తిచేశాడు. కొన్ని నెలలుగా రియల్ ఎస్టేట్ కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తూ బాచుపల్లిలో అద్దెకు ఉంటున్నాడు. మహేందర్‌రెడ్డి తాత అనారోగ్యానికి గురికాగా.. హైదరాబాద్‌లోని ఓ ప్రై వేటు ఆసుపత్రిలో బుధవారం శస్త్రచికిత్స చేయించారు. ఆసుపత్రిలో సాయంత్రం వరకు ఉన్న మహేందర్‌రెడ్డి రూమ్‌కు వెళ్లివస్తానని చెప్పి గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న కుటుంబీకులు హైదరాబాద్‌కు తరలివెళ్లారు. వారి రోదనలు మిన్నంటాయి. -
అనారోగ్యంతో వీఆర్వో ఆత్మహత్య
ఇల్లంతకుంట : అనారోగ్యంతో ఇల్లంతకుంట మండలం గుండారం గ్రామ నివాసి, సిరిసిల్ల మండలం నర్సింహులపల్లి వీఆర్వో ఎలుక బాబు (45) ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బాబు ఆర్నెల్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్నా తగ్గలేదు. మృతుడికి భార్య విజయ, కుమారుడు ఉన్నారు. బాబు మృతదేహాన్ని పరిశీలించిన తహసీల్దార్ సిరిసిల్ల రూరల్ : బాబు మృతదేహాన్ని సిరిసిల్ల ప్రాంతీయ ఆస్పత్రికి తరలించగా.. తోటి వీఆర్వోలు కంటతడిపెట్టారు. తహసీల్దార్ రాజు మృతదేహన్ని పరిశీలించారు. ఆత్మహత్యకు గల కారణాలను కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు. తాత్కాలిక సాయం కింద రూ.20వేల సాయాన్ని రెవెన్యూశాఖ తరఫున అందించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇల్లంతకుంట ఏఎస్సై విజయ్‌కుమార్ తెలిపారు. -
నారాయణరెడ్డి ఆత్మహత్య వెనుక ఆంతర్యమేమిటి?
మోహన్‌రెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డిలే కారణమంటూ కూతురు ఫిర్యాదు తర్వాత పొరపాటుగా ఫిర్యాదు చేశామంటూ పోలీసులకు పిటిషన్ కానీ వారిద్దరే కారణమంటూ నారాయణరెడ్డి సూసైడ్ నోట్ సాక్షి ప్రతినిధి, కరీంనగర్/కరీంనగర్ క్రైం : కరీంనగర్ విద్యానగర్‌కు చెందిన చాడ నారాయణరెడ్డి ఆత్మహత్య సర్వత్రా చర్చనీయాంశమైంది. అక్రమ ఫైనాన్స్ దందాతో సంచనలం సృష్టించిన ఏఎస్సై మోహన్‌రెడ్డి, కరివేద శ్యాంసుందర్‌రెడ్డి అనే వ్యక్తుల వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నాడంటూ తొలుత పోలీసులకు ఫిర్యాదు చేసిన మృతుడి కుటుంబసభ్యులు ఆ తరువాత కొద్దిసేపటికే మాట మార్చారు. ఇందులో మోహన్‌రెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డి ప్రమేయం లేదని, ఇతరుల మాటలు నమ్మి పొరపాటుగా ఫిర్యాదు చేశామని పేర్కొంటూ పోలీసులకు మళ్లీ పిటిషన్ ఇవ్వడం విశేషం. అయితే అప్పటికే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన నారాయణరెడ్డి కుటుంబసభ్యులు ఇతరుల మాటలు నమ్మి తొలుత పొరపాటుగా ఫిర్యాదు చేశామని వెల్లడించారు. మరోవైపు నారాయణరెడ్డి ఎవరో తనకు తెలియదని, ఈ విషయంలో ఏ విచారణకైనా సిద్ధమని మోహన్‌రెడ్డి ప్రకటించడం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. బెజ్జంకి మండలం గుండ్లపల్లికి చెందిన చాడ నారాయణరెడ్డి(48) తన కుటుంబంతో గత కొంతకాలంగా కరీంనగర్ విద్యానగర్‌లో నివాసం ఉంటున్నారు. ఇతనికి ఇద్దరు సంతానం. కుమారుడు వంశీధర్‌రెడ్డి సింగపూర్‌లో ఉద్యోగం చేస్తుండగా, కూతురు తిరుమల వివాహం కావడంతో వరంగల్‌లో నివాసం ఉంటున్నారు. నారాయణరెడ్డి సోమవారం రాత్రి మద్యంలో పురుగుల మందు కలుపుకుని తాగాడు. ఈ విషయం గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో నారాయణరెడ్డి మృతి చెందాడు. మంగళవారం ఉదయం నారాయణరెడ్డి కూతురు గంగ తిరుమల, తల్లి చాడ లక్ష్మితో కలిసి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తన తండ్రి చావుకు ఏఎస్సై మోహన్‌రెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డిలే కారణమని, ఈ మేరకు తన తండ్రి సూసైడ్ నోట్ రాశారని పేర్కొంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన తండ్రికి స్వగ్రామంలోని సర్వే నంబర్ 293లో రెండెకరాల వ్యవసాయ భూమి ఉండేదని, సుమారు ఐదేళ్ల క్రితం కుటుంబ అవసరాలకు శ్యాంసుందర్‌రెడ్డి ద్వారా ఏఎస్సై మోహన్‌రెడ్డి వద్ద ఆ భూమిని తనఖా పెట్టి రూ.2లక్షలు అప్పుగా తీసుకున్నాడని పేర్కొన్నారు. తర్వాత వడ్డీతో కలిపి మొత్తం చెల్లించినా ఆ భూమి పత్రాలు తిరిగి ఇవ్వలేదని అందులో తెలిపారు. ఇదే విషయంపై తన తండ్రి నారాయణరెడ్డి బెజ్జంకి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి సీఐడీకి బదిలీ చేశారని, తర్వాత ఆ భూమిని వేరొకరికి రిజిస్ట్రేషన్ చేయడంతో ఇదే విషయంపై తన తండ్రి బాధపపడుతుండేవాడని పేర్కొన్నారు. సోమవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఇంటికొచ్చిన తన తండ్రి నోటి నుంచి నురగ రావడంతో ప్రతిమ ఆసుపత్రికి తీసుకెళ్లామని, అక్కడ పరీక్షించిన డాక్టర్లు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారని తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా చనిపోయాడని డాక్టర్లు చెప్పారని, అప్పటికే అర్ధరాత్రి ఒంటి గంట అయ్యిందని పేర్కొన్నారు. తన తండ్రి జేబులో ‘మోహన్‌రెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డి వేధింపుల వల్లనే నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను’ అని రాసి ఉన్న సూసైడ్ నోటు లభించిందని ఫిర్యాదులో తెలిపారు. ఫిర్యాదు, సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరోవైపు కుటుంబసభ్యులు పోలీసులకు అందజేసిన సూసైడ్ నోట్లో ‘నేను అందరూ నావాళ్లు అనుకుని సాయం చేసిన. కానీ నన్నెవరూ అర్ధం చేసుకోలేదు. మీ నుంచి నేను వెళ్లిపోతున్నందుకు క్షమించగలరు. నా చావుకు ముఖ్య కారకులు ఏఎస్సై మోహన్‌రెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డి’ అని రాసి ఉండటం గమనార్హం. ఫిర్యాదు పొరపాటు... మోహన్‌రెడ్డి ప్రమేయం లేదు ఉదయం మోహన్‌రెడ్డి వల్లే తన తండ్రి చనిపోయాడని ఫిర్యాదు చేసిన నారాయణరెడ్డి కూతురు తిరుమల మధ్యాహ్నం తల్లి, ఇతర కుటుంబసభ్యులతో కలిసి మళ్లీ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి మరో పిటిషన్ ఇచ్చారు. ‘గత కొద్దిరోజులుగా తన తండ్రి కడుపు నొప్పితో తీవ్రంగా బాధపడుతున్నాడు. సోమవారం నొప్పి ఎక్కువకావడంతో ఇంట్లోకి వెళ్లి క్రిమిసంహారక మందు తాగాడు. అది గమనించి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లడంతో అప్పటికే చనిపోయాడని డాక్టర్లు చెప్పారు. మా నాన్న చావుకు ఏఎస్సై మోహన్‌రెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డిలకు ఎలాంటి సంబంధం లేదు. వాళ్లు ఎప్పుడూ మా నాన్నను వేధింపులకు గురి చేయలేదు. కావున వారిపై ఎలాంటి చర్య తీసుకోవద్దు. ఇది నేను ఆరోగ్యంగా మానసికంగా ఉండి రాసి ఇస్తున్నాను’ అని పిటిషన్లో పేర్కొన్నారు. అనంతరం ప్రెస్‌భవన్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఇదే విషయాన్ని మీడియాకు వెల్లడించారు. తొలుత మోహన్‌రెడ్డే కారణమంటూ ఎందుకు ఫిర్యాదు చేశారని విలేకరులు ప్రశ్నించగా... మోహన్‌రెడ్డి బాధిత సంఘం సభ్యులు వచ్చి ఆయనపై లేనిపోనివి కల్పించి చెప్పడంతో వారి మాటలు నమ్మి పొరపాటుగా తప్పుడు ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు. నాకు సంబంధం లేదు : మోహన్‌రెడ్డి నారాయణరెడ్డి చావుతో తనకు ఎలాంటి సంబంధం లేదని సస్పైండైన ఏఎస్సై మోహన్‌రెడ్డి మంగళవారం సాయంత్రం మీడియాకు ప్రకటన విడుదల చేశారు. కొందరు వ్యక్తులు తనపై పై కక్షకట్టి కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తూ మానసిక ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఈ విషయంలో ఎలాంటి విచారణకైనా సిద్ధమని పేర్కొన్నారు. -
యువకుడి ఆత్మహత్య
ముత్తారం : ముత్తారం మండలం బుధవారంపేట (రామయ్యపల్లి) శివారులో మంథని మండలం సిద్దపల్లికి చెందిన కలవేన సంతోష్(22) ఆత్మహత్య చేసుకున్నాడు. కొద్ది సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతున్న సంతోష్ అది భరించలేక అఘాయిత్యానికి పాల్పడ్డట్టు పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపారు. సోమవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వచ్చిన సంతోష్ రాత్రి 7గంటల ప్రాంతంలో సమీప బంధువుకు ఫోన్ చేసి గ్రామ శివారులోని గుట్ట వైపు దారిలో తాను క్రిమిసంహారక మందు తాగినట్లు చెప్పాడు. దీంతో కుటుంబసభ్యులు అర్ధరాత్రి వరకు పరిసర ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. అప్పటికే సంతోష్ సెల్‌ఫోన్ చార్జింగ్ లేకపోవడంతో స్విచ్ఛాఫ్ అయ్యింది. మంగళవారం ఉదయం అటుగా వెళ్తున్న రైతులు మతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించారు. పోస్టుమార్టం అనంతరం మతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. సంతోష్ తండ్రి లింగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.