
స్నేహితురాలితో అసభ్యప్రవర్తన: ఎంబీఏ విద్యార్థి అరెస్టు
హైదరాబాద్: తాగిన మైకంలో స్నేహితురాలితో అసభ్యంగా ప్రవర్తించి ఓ ఎంబీఏ విద్యార్థి కటకటాల పాలయ్యాడు. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. రహ్మత్‌నగర్ నివాసి పవన్‌కుమార్ (23)ఎంబీఏ చదువుతున్నాడు. బోనాల సంద ర్భంగా ఆదివారం రాత్రి స్నేహితులతో కలిసి మద్యం తాగాడు. మద్యం మత్తులో ఉన్న పవన్ సోమవారం తె ల్లవారుజామున 4 గంటలకు శాలివాహననగర్‌లో నివసించే తన స్నేహితురాలి ఇంటి వద్దకు వెళ్లాడు.
గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించి స్నేహితురాలితో అసభ్యంగా ప్రవర్తించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.