
ప్రకాశం జిల్లా / బేస్తవారిపేట: ఎంబీఓ మొదటి సంవత్సరం చదువుతున్న బిక్కా కల్పన (21) కడుపునొప్పి భరించలేక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన స్థానిక అచ్చిరెడ్డి కాలనీలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. అచ్చిరెడ్డి కాలనీకి చెందిన బిక్కా నరసింహారెడ్డి పెద్ద కుమార్తె కల్పన మార్కాపురంలో ఎంబీఏ చదువుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల నుంచి ఆమె తీవ్ర కడుపునొప్పితో బాధపడుతోంది. చదువుకునేందుకంటూ కల్పన బెడ్‌రూమ్‌లోకి వెళ్లి తలుపునకు గడియ పెట్టుకుంది. అర్ధరాత్రి మిగిలిన కుటుంబ సభ్యులు బాత్‌రూమ్‌కు వెళ్లేందుకు ఎంతసేపు తలుపుకొట్టినా తీయలేదు. అనుమానం వచ్చి గడ్డపారతో తలుపు పగులగొట్టారు. అప్పటికే కల్పన తన చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment