
సాక్షి, పాయకరావుపేట: కెనడాలో ఎంబీఏ చదువుతున్న విశాఖ జిల్లా పాయకరావుపేటకు చెందిన నిట్టెల మధుకుమార్ (30) ఆదివారం ఆకస్మికంగా మృతి చెందాడు. పట్టణానికి చెందిన నిట్టెల నూకరాజు మూడో కుమారుడైన మధుకుమార్ నెల రోజుల క్రితమే టోరెంటో నగరంలోని యార్క్ యూనివర్సిటీలో చదివేందుకు కెనడా వెళ్లాడు. ఈవెనింగ్ వాక్ చేస్తూ (భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం) హఠాత్తుగా కుప్పకూలిపోయాడని, స్థానికులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే ప్రాణం పోయిందని మృతుని స్నేహితులు తల్లిదండ్రులకు ఫోన్ చేసి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment