madhu kumar
-
కెనడాలో విశాఖ జిల్లా విద్యార్థి మృతి
సాక్షి, పాయకరావుపేట: కెనడాలో ఎంబీఏ చదువుతున్న విశాఖ జిల్లా పాయకరావుపేటకు చెందిన నిట్టెల మధుకుమార్ (30) ఆదివారం ఆకస్మికంగా మృతి చెందాడు. పట్టణానికి చెందిన నిట్టెల నూకరాజు మూడో కుమారుడైన మధుకుమార్ నెల రోజుల క్రితమే టోరెంటో నగరంలోని యార్క్ యూనివర్సిటీలో చదివేందుకు కెనడా వెళ్లాడు. ఈవెనింగ్ వాక్ చేస్తూ (భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం) హఠాత్తుగా కుప్పకూలిపోయాడని, స్థానికులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే ప్రాణం పోయిందని మృతుని స్నేహితులు తల్లిదండ్రులకు ఫోన్ చేసి తెలిపారు. -
50 ఓవర్లు... 510 పరుగులు...
ఆల్ సెయింట్స్ స్కూల్ సంచలనం సాక్షి, హైదరాబాద్: ఓ మ్యాచ్‌లో తొలుత 500 పరుగులు చేసి, ఆ తర్వాత ప్రత్యర్థిని 100 పరుగులకు ఆలౌట్ చేస్తే... ఇది చాలామంది క్రికెటర్లు కనే కల. దీనిని నిజం చేశారు హైదరాబాద్‌లోని ఆల్‌సెయింట్స్ స్కూల్ పిల్లలు. హెచ్‌సీఏ ‘ఎ’ డివిజన్ వన్డే లీగ్‌లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 50 ఓవర్లలో 510 పరుగులు బాదారు. ఎలెవన్ మాస్టర్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆల్‌సెయింట్స్ ఆటగాళ్లు ఏకంగా 79 బౌండరీలు, 12 సిక్సర్లు బాదారు. మధు కుమార్ (145 బంతుల్లో 185; 32 ఫోర్లు, 1సిక్స్), ఆదిశ్ శశిధరన్ (73 బంతుల్లో 143; 22 ఫోర్లు, 6 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగారు. మారుతి రెడ్డి (64 బంతుల్లో 90; 13 ఫోర్లు, 3 సిక్సర్లు), సులేమాన్ (23 బంతుల్లో 53 నాటౌట్; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీలు చేశారు. అనంతరం అసాధ్యమైన లక్ష్యఛేదనకు దిగిన ఎలెవన్ మాస్టర్స్ 25.3 ఓవర్లలో 111 పరుగులకే కుప్పకూలింది. ఆల్ సెయింట్స్ బౌలర్లు అద్వైత్ 5, హితేశ్ యాదవ్ 4 వికెట్లు తీశారు. -
రాణించిన మధు, మారుతి
జింఖానా, న్యూస్‌లైన్: ఆల్ సెయింట్స్ బ్యాట్స్‌మెన్ మారుతి రెడ్డి (76 నాటౌట్), మధు కుమార్ (54 నాటౌట్) అర్ధ సెంచరీలతో అజేయంగా నిలిచారు. దీంతో ఆ జట్టు 10 వికెట్ల తేడాతో కేంద్రీయ విద్యాలయం (బొల్లారం)పై ఘనవిజయం సాధించింది. హెచ్‌సీఏ బ్రదర్ జాన్ ఆఫ్ గాడ్ అండర్-14 నాకౌట్ టోర్నీలో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేంద్రీయ విద్యాలయం 141 పరుగులు చేసింది. ఆదర్శ్ కుమార్ (45 నాటౌట్) మెరుగ్గా ఆడాడు. ఆల్ సెయింట్స్ బౌలర్ హితేశ్ యాదవ్ 3 వికెట్లు తీశాడు. అనంతరం బరిలోకి దిగిన ఆల్ సెయింట్స్ వికెట్ కోల్పోకుండా 142 పరుగులు చేసింది. మరో మ్యాచ్‌లో బోస్టన్ మిషన్ హైస్కూల్ 5 వికెట్ల తేడాతో మహేష్ విద్యాభవన్పై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన మహేష్ విద్యాభవన్ 148 పరుగులకే కుప్పకూలింది. కమల్ కుమార్ 37, ఆశిష్ 30 పరుగులు చేశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బోస్టన్ మిషన్ హైస్కూల్ 5 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. సయ్యద్ యూసఫ్ తమిమ్ 47, ముకేశ్ 39 పరుగులు చేసి ఫర్వాలేదనిపించారు. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు ఠ సెయింట్ మార్క్స్ ప్రోగ్రెసివ్ స్కూల్: 125 (నిహాంత్ రెడ్డి 42; యూనిస్ జుబాది 3/21); సెయింట్ మార్క్స్ బాయ్ టౌన్: 126/5 (ప్రగున్ దూబే 53). ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్ టీమ్ స్పీడ్: 171 (సంతోష్ 91; సాయి ప్రసాద్ రెడ్డి 4/11, సాయి శ్రవణ్ కుమార్ 3/66); కాంటినెంటల్‌తో మ్యాచ్. రాజు సీసీ: 117; చార్మినార్ సీసీ: 118/4 (చాయ్ ప్రసాద్ 61 నాటౌట్). -
రాణించిన మధు, వంశీ
జింఖానా, న్యూస్‌లైన్: ఆల్ సెయింట్స్ జట్టు ఆటగాళ్లు మధుకుమార్ (70), వంశీ శ్రీవాస్తవ్ (86) రాణించడంతో జట్టుకు విజయం దక్కింది. కోకాకోలా కప్ అండర్-16 ఇంటర్ స్కూల్ టోర్నీలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఆల్ సెయింట్స్ జట్టు 82 పరుగుల తేడాతో ఆదిలాబాద్ జట్టుపై గెలిచింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆల్ సెయింట్స్ జట్టు 199 పరుగులు చేసింది. తరువాత లక్ష్య ఛేదనకు దిగిన ఆదిలాబాద్ జట్టు 117 పరుగుల వద్ద అలౌటయింది. ఆల్ సెయింట్స్ జట్టు బౌలర్లు వంశీ 4, హితేష్ 3 వికెట్లు తీశారు. ఆదిలాబాద్ జట్టులో సైఫ్ అలీ (37) మినహా మిగతా వారు రాణించలేకపోయారు. మరో మ్యాచ్‌లో శ్రీచైతన్య టెక్నో స్కూల్ జట్టు ఆటగాడు యష్ కపాడియా 86 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. మొదట బ్యాటింగ్ చేసిన నిజామాబాద్ జట్టు 201 పరుగులు చేసింది. అఖిల్ (72), మజీద్ (39) కదం తొక్కారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శ్రీచైతన్య జట్టు మూడు వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసి గెలిచింది. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు గౌతమ్ మోడ ల్ స్కూల్: 291 (చరణ్ 96, తాషా షైక్ 31, సాగర్ 56; రాకేష్ 5/39), వెస్లీ బాయ్స్ జేసీ: 293/3 ( చందన్ షానీ 108, శ్రీకాంత్ 49, వినీత్ 76, అర్జున్ 44) బాయ్స్ టౌన్: 191 (అబ్రార్ 44, మొహమ్మద్ సలాం 48; దుర్గేశ్ 3/34), సెయింట్ మేరీస్ జూనియర్ కాలేజ్: 117 (అక్షయ్ కుమార్ 59; కరణ్ కణ్ణన్ 4/22, అలీ అబ్దుల్లా 3/17) సెయింట్ పాట్రిక్స్: 140 (హృషికేష్ 74; రిత్విక్ 4/17, జైస్వాల్ 3/32), సెయింట్ జాన్స్ చర్చ్ జేసీ: 141/3 (భగత్ వర్మ 70 నాటౌట్, మిఖిల్ జైస్వాల్ 55 నాటౌట్).