రాణించిన మధు, వంశీ | madhu,vamsi successful | Sakshi
Sakshi News home page

రాణించిన మధు, వంశీ

Published Fri, Aug 23 2013 11:52 PM | Last Updated on Fri, Sep 1 2017 10:03 PM

madhu,vamsi successful

జింఖానా, న్యూస్‌లైన్: ఆల్ సెయింట్స్ జట్టు ఆటగాళ్లు మధుకుమార్ (70), వంశీ శ్రీవాస్తవ్ (86) రాణించడంతో జట్టుకు విజయం దక్కింది. కోకాకోలా కప్ అండర్-16 ఇంటర్ స్కూల్ టోర్నీలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఆల్ సెయింట్స్ జట్టు 82 పరుగుల తేడాతో ఆదిలాబాద్ జట్టుపై గెలిచింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆల్ సెయింట్స్ జట్టు 199 పరుగులు చేసింది. తరువాత లక్ష్య ఛేదనకు దిగిన ఆదిలాబాద్ జట్టు 117 పరుగుల వద్ద అలౌటయింది. ఆల్ సెయింట్స్ జట్టు బౌలర్లు వంశీ 4, హితేష్ 3 వికెట్లు తీశారు.
 
 ఆదిలాబాద్ జట్టులో సైఫ్ అలీ (37) మినహా మిగతా వారు రాణించలేకపోయారు. మరో మ్యాచ్‌లో శ్రీచైతన్య టెక్నో స్కూల్ జట్టు ఆటగాడు యష్ కపాడియా 86 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. మొదట బ్యాటింగ్ చేసిన నిజామాబాద్ జట్టు 201 పరుగులు చేసింది. అఖిల్ (72), మజీద్ (39) కదం తొక్కారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శ్రీచైతన్య జట్టు మూడు వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసి గెలిచింది.
 
 ఇతర మ్యాచ్‌ల స్కోర్లు
 గౌతమ్ మోడ ల్ స్కూల్: 291 (చరణ్ 96, తాషా షైక్ 31, సాగర్ 56; రాకేష్ 5/39), వెస్లీ బాయ్స్ జేసీ: 293/3 ( చందన్ షానీ 108, శ్రీకాంత్ 49, వినీత్ 76, అర్జున్ 44)
 బాయ్స్ టౌన్: 191 (అబ్రార్ 44, మొహమ్మద్ సలాం 48; దుర్గేశ్ 3/34), సెయింట్ మేరీస్ జూనియర్ కాలేజ్: 117 (అక్షయ్ కుమార్ 59; కరణ్ కణ్ణన్ 4/22, అలీ అబ్దుల్లా 3/17)
 సెయింట్ పాట్రిక్స్: 140 (హృషికేష్ 74; రిత్విక్ 4/17, జైస్వాల్ 3/32), సెయింట్ జాన్స్ చర్చ్ జేసీ: 141/3 (భగత్ వర్మ 70 నాటౌట్, మిఖిల్ జైస్వాల్ 55 నాటౌట్).
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement