coca cola cup
-
సెయింట్ జోన్స్ పరాజయం
ఇంటర్ స్టేట్ కోకాకోలా కప్ ముంబై: కోకాకోలా ఇంటర్‌స్టేట్ క్రికెట్ టోర్నమెంట్లో నగరానికి చెందిన సెయింట్ జోన్స్ జూనియర్ కాలేజి జట్టు పరాజయం చవిచూసింది. ఇక్కడి హెచ్‌పీసీఎల్ గ్రౌండ్స్‌లో గురువారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో సల్వాన్ బాయ్స్ సీనియర్ సెకండరీ స్కూల్ (ఢిల్లీ) జట్టు 56 పరుగుల తేడాతో సెయింట్ జోన్స్‌పై గెలిచింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సల్వాన్ బాయ్స్ స్కూల్ 44.1 ఓవర్లలో 206 పరుగులు చేసి ఆలౌటైంది. ముకులిత్ భట్ (76 బంతుల్లో 75, 13 ఫోర్లు), రిషబ్ ద్రాల్ (90 బంతుల్లో 70, 7 ఫోర్లు) అర్ధసెంచరీలతో కదం తొక్కారు. సెయింట్ జోన్స్ బౌలర్లు రిత్విక్ 4, ప్రణీత్ రాజ్ 2 వికెట్లు తీశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన సెయింట్ జోన్స్ జూనియర్ కాలేజి 41.1 ఓవర్లలో 150 పరుగులకే కుప్పకూలింది. అభిషేక్ సింగ్ 35, మికిల్ జైస్వాల్ 27 పరుగులు చేశారు. సల్వాన్ జట్టు బౌలర్లలో సాహిల్ శర్మ 3, భరత్ శంకర్ 2 వికెట్లు పడగొట్టారు. బుధవారం జరిగిన లీగ్‌లో సెయింట్ జోన్స్ జట్టు 40 పరుగుల తేడాతో దేహినగర్ కేసీఆర్ విద్యాపీఠ్ (పశ్చిమ బెంగాల్) జట్టుపై గెలిచింది. తొలుత సెయింట్ జోన్స్ జట్టు 45 ఓవర్లలో 194 పరుగులు చేసి ఆలౌటైంది. మిఖిల్ జైస్వాల్ 33, ప్రణీత్ రాజ్ 27 పరుగులు చేశారు. కేసీఆర్ విద్యాపీట్ బౌలర్లలో తన్మయ్ ఆదిత్య, బిషాల్ దాస్ చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన విద్యాపీఠ్ జట్టు 37.2 ఓవర్లలో 154 పరుగులకే ఆలౌటైంది. బౌలింగ్‌లో మెరిసిన ప్రణీత్ రాజ్ 3 వికెట్లు తీయగా, అభిషేక్ సింగ్ 2 వికెట్లు పడగొట్టాడు. -
రాణించిన మధు, వంశీ
జింఖానా, న్యూస్‌లైన్: ఆల్ సెయింట్స్ జట్టు ఆటగాళ్లు మధుకుమార్ (70), వంశీ శ్రీవాస్తవ్ (86) రాణించడంతో జట్టుకు విజయం దక్కింది. కోకాకోలా కప్ అండర్-16 ఇంటర్ స్కూల్ టోర్నీలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఆల్ సెయింట్స్ జట్టు 82 పరుగుల తేడాతో ఆదిలాబాద్ జట్టుపై గెలిచింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆల్ సెయింట్స్ జట్టు 199 పరుగులు చేసింది. తరువాత లక్ష్య ఛేదనకు దిగిన ఆదిలాబాద్ జట్టు 117 పరుగుల వద్ద అలౌటయింది. ఆల్ సెయింట్స్ జట్టు బౌలర్లు వంశీ 4, హితేష్ 3 వికెట్లు తీశారు. ఆదిలాబాద్ జట్టులో సైఫ్ అలీ (37) మినహా మిగతా వారు రాణించలేకపోయారు. మరో మ్యాచ్‌లో శ్రీచైతన్య టెక్నో స్కూల్ జట్టు ఆటగాడు యష్ కపాడియా 86 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. మొదట బ్యాటింగ్ చేసిన నిజామాబాద్ జట్టు 201 పరుగులు చేసింది. అఖిల్ (72), మజీద్ (39) కదం తొక్కారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శ్రీచైతన్య జట్టు మూడు వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసి గెలిచింది. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు గౌతమ్ మోడ ల్ స్కూల్: 291 (చరణ్ 96, తాషా షైక్ 31, సాగర్ 56; రాకేష్ 5/39), వెస్లీ బాయ్స్ జేసీ: 293/3 ( చందన్ షానీ 108, శ్రీకాంత్ 49, వినీత్ 76, అర్జున్ 44) బాయ్స్ టౌన్: 191 (అబ్రార్ 44, మొహమ్మద్ సలాం 48; దుర్గేశ్ 3/34), సెయింట్ మేరీస్ జూనియర్ కాలేజ్: 117 (అక్షయ్ కుమార్ 59; కరణ్ కణ్ణన్ 4/22, అలీ అబ్దుల్లా 3/17) సెయింట్ పాట్రిక్స్: 140 (హృషికేష్ 74; రిత్విక్ 4/17, జైస్వాల్ 3/32), సెయింట్ జాన్స్ చర్చ్ జేసీ: 141/3 (భగత్ వర్మ 70 నాటౌట్, మిఖిల్ జైస్వాల్ 55 నాటౌట్).