ఇంటర్ స్టేట్ కోకాకోలా కప్
ముంబై: కోకాకోలా ఇంటర్‌స్టేట్ క్రికెట్ టోర్నమెంట్‌లో నగరానికి చెందిన సెయింట్ జోన్స్ జూనియర్ కాలేజి జట్టు పరాజయం చవిచూసింది. ఇక్కడి హెచ్‌పీసీఎల్ గ్రౌండ్స్‌లో గురువారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో సల్వాన్ బాయ్స్ సీనియర్ సెకండరీ స్కూల్ (ఢిల్లీ) జట్టు 56 పరుగుల తేడాతో సెయింట్ జోన్స్‌పై గెలిచింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సల్వాన్ బాయ్స్ స్కూల్ 44.1 ఓవర్లలో 206 పరుగులు చేసి ఆలౌటైంది.
ముకులిత్ భట్ (76 బంతుల్లో 75, 13 ఫోర్లు), రిషబ్ ద్రాల్ (90 బంతుల్లో 70, 7 ఫోర్లు) అర్ధసెంచరీలతో కదం తొక్కారు. సెయింట్ జోన్స్ బౌలర్లు రిత్విక్ 4, ప్రణీత్ రాజ్ 2 వికెట్లు తీశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన సెయింట్ జోన్స్ జూనియర్ కాలేజి 41.1 ఓవర్లలో 150 పరుగులకే కుప్పకూలింది. అభిషేక్ సింగ్ 35, మికిల్ జైస్వాల్ 27 పరుగులు చేశారు. సల్వాన్ జట్టు బౌలర్లలో సాహిల్ శర్మ 3, భరత్ శంకర్ 2 వికెట్లు పడగొట్టారు.
బుధవారం జరిగిన లీగ్‌లో సెయింట్ జోన్స్ జట్టు 40 పరుగుల తేడాతో దేహినగర్ కేసీఆర్ విద్యాపీఠ్ (పశ్చిమ బెంగాల్) జట్టుపై గెలిచింది. తొలుత సెయింట్ జోన్స్ జట్టు 45 ఓవర్లలో 194 పరుగులు చేసి ఆలౌటైంది. మిఖిల్ జైస్వాల్ 33, ప్రణీత్ రాజ్ 27 పరుగులు చేశారు. కేసీఆర్ విద్యాపీట్ బౌలర్లలో తన్మయ్ ఆదిత్య, బిషాల్ దాస్ చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన విద్యాపీఠ్ జట్టు 37.2 ఓవర్లలో 154 పరుగులకే ఆలౌటైంది. బౌలింగ్‌లో మెరిసిన ప్రణీత్ రాజ్ 3 వికెట్లు తీయగా, అభిషేక్ సింగ్ 2 వికెట్లు పడగొట్టాడు.
సెయింట్ జోన్స్ పరాజయం
Published Fri, Apr 18 2014 12:02 AM | Last Updated on Sat, Sep 2 2017 6:09 AM
Advertisement