రాణించిన మధు, మారుతి | Madhu, maruti successful | Sakshi
Sakshi News home page

రాణించిన మధు, మారుతి

Published Thu, Nov 21 2013 11:49 PM | Last Updated on Sat, Sep 2 2017 12:50 AM

Madhu, maruti  successful

 జింఖానా, న్యూస్‌లైన్: ఆల్ సెయింట్స్ బ్యాట్స్‌మెన్ మారుతి రెడ్డి (76 నాటౌట్), మధు కుమార్ (54 నాటౌట్) అర్ధ సెంచరీలతో అజేయంగా నిలిచారు. దీంతో ఆ జట్టు 10 వికెట్ల తేడాతో కేంద్రీయ విద్యాలయం (బొల్లారం)పై ఘనవిజయం సాధించింది. హెచ్‌సీఏ బ్రదర్ జాన్ ఆఫ్ గాడ్ అండర్-14 నాకౌట్ టోర్నీలో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేంద్రీయ విద్యాలయం 141 పరుగులు చేసింది. ఆదర్శ్ కుమార్ (45 నాటౌట్) మెరుగ్గా ఆడాడు. ఆల్ సెయింట్స్ బౌలర్ హితేశ్ యాదవ్ 3 వికెట్లు తీశాడు.

అనంతరం బరిలోకి దిగిన ఆల్ సెయింట్స్ వికెట్ కోల్పోకుండా 142 పరుగులు చేసింది. మరో మ్యాచ్‌లో బోస్టన్ మిషన్ హైస్కూల్ 5 వికెట్ల తేడాతో మహేష్ విద్యాభవన్‌పై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన మహేష్ విద్యాభవన్ 148 పరుగులకే కుప్పకూలింది. కమల్ కుమార్ 37, ఆశిష్ 30 పరుగులు చేశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బోస్టన్ మిషన్ హైస్కూల్ 5 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. సయ్యద్ యూసఫ్ తమిమ్ 47, ముకేశ్ 39 పరుగులు చేసి ఫర్వాలేదనిపించారు.
 
 ఇతర మ్యాచ్‌ల స్కోర్లు
 ఠ సెయింట్ మార్క్స్ ప్రోగ్రెసివ్ స్కూల్: 125 (నిహాంత్ రెడ్డి 42; యూనిస్ జుబాది 3/21); సెయింట్ మార్క్స్ బాయ్ టౌన్: 126/5 (ప్రగున్ దూబే 53).
 
 ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్
 టీమ్ స్పీడ్: 171 (సంతోష్ 91; సాయి ప్రసాద్ రెడ్డి 4/11, సాయి శ్రవణ్ కుమార్ 3/66); కాంటినెంటల్‌తో మ్యాచ్.
 
 రాజు సీసీ: 117; చార్మినార్ సీసీ: 118/4 (చాయ్ ప్రసాద్ 61 నాటౌట్).  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement