సాక్షి, అనంతపురం: ఆల్‌రౌండర్ షమ్స్ ములానీ (174 బంతుల్లో 88 బ్యాటింగ్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. దీంతో దులీప్ ట్రోఫీలో భాగంగా భారత్ ‘డి’తో గురువారం మొదలైన రెండో రౌండ్ మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 82 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. ప్రధాన ఆటగాళ్లు విఫలమైన చోట... ములానీ చక్కటి ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ ‘ఎ’ జట్టుకు శుభారంభం దక్కలేదు.
కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (7)తో పాటు మరో ఓపెనర్ ప్రథమ్ సింగ్ (7) సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడంతో 21 పరుగులకే ఆ జట్టు రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత హైదరాబాద్ ఆటగాడు తిలక్ వర్మ (10), రియాన్ పరాగ్ (37; 5 ఫోర్లు, ఒక సిక్సర్), శాశ్వత్ రావత్ (15) ఎక్కువసేపు నిలవలేకపోయారు. దీంతో భారత్ ‘ఎ’ జట్టు 93 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. కాసేపటికే కుమార్ కుశాగ్ర (28) కూడా వెనుదిరిగాడు.
ఈ దశలో తనుశ్ కొటియాన్ (53; 6 ఫోర్లు, ఒక సిక్సర్)తో కలిసి షమ్స్ ములానీ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. టాపార్డర్ సత్తా చాటలేకపోయిన చోట సంయమనంతో క్రీజులో నిలిచి ఒక్కో పరుగు జోడి స్తూ స్కోరు బోర్డు ను ముందుకు నడిపించాడు. అతడికి తనుశ్ నుంచి చక్కటి సహకారం లభించింది. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 91 పరుగులు జోడించారు. ఆట ముగిసే సమయానికి షమ్స్ ములానీతో పాటు ఖలీల్ అహ్మద్ (15 బ్యాటింగ్; 3 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు.
స్కోరు వివరాలు
భారత్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్: ప్రథమ్ సింగ్ (సి) అర్‡్షదీప్ (బి) విద్వత్ 7; మయాంక్ (సి) సామ్సన్ (బి) విద్వత్ 7; తిలక్ వర్మ (సి) శ్రేయస్ (బి) సారాంశ్ జైన్ 10; రియాన్ పరాగ్ (సి) పడిక్కల్ (బి) అర్‡్షదీప్ 37; శాశ్వత్ రావత్ (సి) శ్రేయస్ (బి) హర్షిత్ రాణా 15; కుశాగ్ర (సి) యశ్ దూబే (బి) అర్‡్షదీప్ 28; షమ్స్ ములానీ (బ్యాటింగ్) 88; తనుశ్ (సి) అర్‡్షదీప్ (బి) సౌరభ్ 53; ప్రసిద్ధ్ కృష్ణ (సి) (సబ్) శ్రీకర్ భరత్ (బి) హర్షిత్ రాణా 8; ఖలీల్ అహ్మద్ (బ్యాటింగ్) 15; ఎక్స్‌ట్రాలు: 20; మొత్తం: (82 ఓవర్లలో 8 వికెట్లకు) 288. వికెట్ల పతనం: 1–18, 2–21, 3–65, 4–69, 5–93, 6–144, 7–235, బౌలింగ్: హర్షిత్ రాణా 16–4–49–2; విద్వత్ 14–5–30–2; అర్‡్షదీప్ 18–3–73–2; సారాంశ్ జైన్ 14–3–55–1; సౌరభ్ కుమార్ 20–1–65–1.
Comments
Please login to add a commentAdd a comment