![Academic Council of Savitribai Phule Pune University takes the decision to add GST Act as a subject - Sakshi](/styles/webp/s3/article_images/2017/12/20/gst-1.jpg.webp?itok=Tw-dufnm)
సాక్షి, ముంబై: బీజేపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన జీఎస్‌టీ చట్టంపై మరో ఆసక్తికరమైన వార్త. పుణే యూనివర్శిటీ జీఎస్‌టీ చట్టంపై కొత్త కోర్సును ప్రవేశపెట్టబోతోంది. వచ్చే ఎకడమిక్ ఇయర్ నుంచి వివిధ కోర్సుల్లో జీఎస్‌టీ చట్టాన్ని ఒక కొత్త సబ్జెక్టుగా చేర్చనుంది.
పుణే విశ్వవిద్యాలయం సావిత్రిబాయి ఫులే అకడమిక్ కౌన్సిల్ జీఎస్‌టీపై ఎంబీఏ, ఎంఏ కోర్సుల్లో ఈ సబ్జెక్టును ప్రవేశపెట్టేందుకు నిర్ణయించింది. 2018-19 విద్యా సంవత్సరం నుంచి ఈ కోర్సులను ప్రారంభించనుంది. యూనివర్శిటీ ప్రతినిధి అభిజిత్ గోర్పడే ఈ విషయాన్ని ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment