savitribai phule
-
Savitribai Phule: మహిళా విద్యకు తొలి వెలుతురు
‘సావిత్రిబాయి ఫూలే ప్రతిరోజూ సంచిలో అదనంగా చీర పెట్టుకుని స్కూల్‌కు వెళ్లేవారు. దారిలో ఎవరో ఒకరు ఆమె మీద పేడ విసిరితే కడుక్కుని కట్టుకోవడానికి’ అని రాస్తుంది రీతా రామస్వామి గుప్తా. నిమ్న వర్గాల ఆడపిల్లల విద్యకు జీవితాన్ని అంకితం చేసిన సావిత్రిబాయి ఫూలేమీద ఎన్నో పుస్తకాలు వచ్చాయి. కాని రచయిత్రి రీతా రామస్వామి మరిన్ని జీవిత చిత్రాలను సేకరించి తెచ్చిన పుస్తకం ‘సావిత్రిబాయి పూలే’ తాజాగా విడుదలైంది. రీతా రామస్వామి గురించి, పుస్తకంలో ఉన్న విశేషాల గురించి... ‘ఇవాళ బాలికల విద్య అనగానే ప్రపంచానికి మలాలా పేరు గుర్తుకొస్తుంది. కాని బాలికల విద్య కోసం జీవితాన్ని అర్పించిన తొలి మహిళ సావిత్రిబాయి పూలే. మన దేశంలో ఆమె తొలి మహిళా ఉపాధ్యాయిని. ఆడపిల్లల చదువును ప్రచారం చేయడానికి ఆమె ఎదుర్కొన్న వ్యతిరేకత అంతా ఇంతా కాదు’ అంటుంది రీతా రామస్వామి గుప్తా. గతంలో నటుడు సంజీవ్ కుమార్‌పై రాసిన బయోగ్రఫీతో పాఠకులకు తెలిసిన రీతా రామస్వామి ఆ తర్వాత ‘రంగ్ దే బసంతి’ దర్శకుడు ఓం ప్రకాష్ మెహ్రాతో కలిసి అతని జీవిత సంగ్రహం రాసింది. ‘ఇలా ఇంకొన్ని పుస్తకాలు రాయాలనుకుంటుండగా నా 18 ఏళ్ల కుమార్తె– అమ్మా... ఎందుకు నువ్వు ఎప్పుడూ మగవాళ్ల గురించే రాస్తావు. నువ్వు రాయదగ్గ స్త్రీలు లేరా? అని ప్రశ్నించింది. ఆ ప్రశ్న నన్ను ఆలోచింపచేసింది. దానికి జవాబే నా కొత్త పుస్తకం– సావిత్రిబాయి పూలే.. హర్ లైఫ్.. హర్ రిలేషన్షిప్స్.. హర్ లెగసీ’ అంది రీతా రామస్వామి. హార్పర్ కాలిన్స్ ఇండియా ప్రచురణ సంస్థ నుంచి ఈ పుస్తకం తాజాగా విడుదలైంది. బలహీనులకు అందని విద్య ‘బ్రిటిష్ వారు 1813లో క్రైస్తవ మిషనరీల ద్వారా మన దేశంలో పాశ్చాత్య విద్యకు అంకురార్పణ చేశారు. అయితే వారి ఉద్దేశాలు వేరే. తమ వ్యవహారాల కోసం ఇంగ్లిష్ తెలిసిన కొంతమంది ఉద్యోగులు అవసరం కనుక పై వర్గాల వారికి చదువు నేర్పిస్తే వారి నుంచి కింది వర్గాల వారికి చదువు అందుతుంది అని భావించారు. కాని పై వర్గాలకు మొదలైన చదువు కింది వర్గాల వరకూ చేరలేదు. కింది వర్గాల వారికి పాఠశాలల్లో అనుమతి లేని పరిస్థితి. అంటరానితనం విస్తృతంగా ఉండేది. ఇక చదువుకు ఆడపిల్లలు నిషిద్ధం చేయబడ్డారు. ప్రభుత్వ టీచర్లకు ఇంగ్లిష్ వచ్చి ఉండాలన్న నియమం కూడా బ్రిటిష్ ప్రభుత్వం పెట్టింది. వీటన్నింటినీ దాటి సావిత్రిబాయి పూలే టీచర్ అయ్యింది. జ్యోతిబా పూలేతో కలిసి 1848లో బ్రిటిష్‌వారితో సంబంధం లేని, మిషనరీలతో సంబంధం లేని బాలికల తొలి పాఠశాలను మొదలెట్టింది. దిగువ వర్గాల బాలికల విద్య కోసం పోరాడింది’ అంటుంది రీతా రామస్వామి. ఆ ఇద్దరు ‘సావిత్రిబాయి పూలే హర్ లైఫ్, హర్ రిలేషన్షిప్స్, హర్ లెగసీ’... పుస్తకంలో రీతా రామస్వామి కేవలం సావిత్రిబాయి పూలే గురించే రాయలేదు. ఆమెను ఆదర్శంగా తీసుకుని బాలికల విద్య కోసం తోడైన తొలి ముస్లిం ఉపాధ్యాయిని ఫాతిమా షేక్ గురించీ... సావిత్రి, ఫాతిమా కలిసి మహరాష్ట్రలో బాలికల విద్య కోసం స్కూళ్లు స్థాపించి నిర్వహించడానికి పడిన ఆరాటం గురించి కూడా రాసింది. ‘ఫాతిమ షేక్ తొలి క్వాలిఫైడ్ ముస్లిం ఉమెన్ టీచర్ మన దేశంలో. ఆమె సావిత్రిబాయి పూలేకి బాసటగా నిలిచింది. ఒక దశలో సావిత్రిబాయి సుదీర్ఘకాలం జబ్బు పడితే స్కూళ్ల నిర్వహణభారం మోసింది. ఆ వివరాలన్నీ నా పుస్తకంలో ఉన్నాయి’ అని తెలిపింది రీతా రామస్వామి. ఎన్నెన్నో అవమానాలు ‘దిగువ వర్గాల వారిలో ఆడపిల్లలకు చదువెందుకు అనే భావన విపరీతంగా ఉండేది. వాళ్లకు చిన్న వయసులో పెళ్లిళ్లు చేసేవారు. కాని వారి ఇళ్లకు వెళ్లి బడికి పంపమని కోరేది సావిత్రి. వారు శాపనార్థాలు పెట్టేవారు. దారిన పోతూ ఉంటే రాళ్లు విసిరేవారు. దానికి తోడు పేద వర్గాల వారిని చదివిస్తున్నందుకు అగ్రవర్ణాలు కక్ష కట్టి సావిత్రిబాయి మీద పేడనీళ్లు చల్లేవారు. అందుకని ఆమె స్కూలుకు వెళుతున్నప్పుడు తన సంచిలో చీర అదనంగా పెట్టుకునేది. ఎవరైనా పేడ నీళ్లు చల్లినా వెరవకుండా స్కూలుకు వెళ్లి చీర మార్చుకుని పాఠాలు చెప్పేది. ఆమె స్ఫూర్తి నేటికీ కొనసాగడం వల్ల మన దేశంలో బాలికల విద్య గణనీయంగా పెరిగింది. చదువులో ఉద్యోగాల్లో అమ్మాయిలు గొప్పగా రాణిస్తున్నారు. వారంతా తప్పక తెలుసుకోవాల్సిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే’ అంది రీతా రామస్వామి. -
Savitribai Phule: మహిళా విద్యా ప్రదాత
విద్య ద్వారా సమాజంలో ఉన్న అసమానతలను చదును చేయాలని... 18వ శతాబ్దంలోనే మహాత్మ జ్యోతిబాఫూలే, సావిత్రీబాయి ఫూలే దంపతులు ప్రయత్నించారు. మొక్కవోని వారి దీక్ష వల్ల అప్పటి సమాజంలో హీన స్థితిలో ఉన్న స్త్రీల జీవితాలకు అండ దొరికింది. భర్త జ్యోతిబా ఫూలే ప్రోత్సాహంతో స్వయంగా చదువుకున్న సావిత్రీబాయి దేశంలో మహిళా విద్యకు దారిదీపం అయింది. 1840లో 9 ఏళ్ల సావిత్రీబాయి వివాహం 13 ఏళ్ల జ్యోతిబా ఫూలేతో జరిగింది. స్త్రీలకు విద్య చాలా అవసరం అని గ్రహించి ముందు తన భార్య సావిత్రీబాయికి చదువు నేర్పాడు జ్యోతిబా. భారతదేశ చరిత్రలోనే స్త్రీ విద్యను మొట్ట మొదట ప్రవేశపెట్టిన వాడు జ్యోతిబాఫూలే. తన పొలం దగ్గర మామిడి చెట్టు నీడలో మొట్ట మొదటి పాఠశాల పెట్టాడు. ఆ పాఠశాలలో ఆయన అక్క సుగుణబాయి, భార్య సావిత్రీ బాయి విద్యార్థులు! స్త్రీ విద్యా ప్రయోగశాలగా ఆ పాఠశాల చరిత్రలో మిగిలిపోయింది. 1848లో ఓ భవంతిలో స్త్రీల కోసం పాఠశాలను ఏర్పాటు చేశాడు ఫూలే. చదువు నేర్చుకునే క్రమంలో సావిత్రీబాయి ఎన్నో పుస్తకాలు చదివి స్త్రీ ఎంత దారుణ స్థితిలో ఉందో అర్థం చేసుకుంది. అదే సమయంలో అమెరికా నల్లజాతి వివక్ష వ్యతిరేక పోరాట నాయకులు థామస్ క్లార్క్ జీవిత చరిత్ర చదివి స్ఫూర్తి పొందింది. బ్రాహ్మణ స్త్రీలతోపాటూ బహు జన స్త్రీ జనోద్ధరణకు భర్తతో పాటూ నడుం బిగించింది. స్త్రీ జనోద్ధరణకు సంబంధించిన అన్ని కార్యక్రమాలకూ ఆమే ఇన్చార్జ్గా వ్యవహరించింది. 1851లో పూణేలో అమ్మాయిల కోసం మరో స్కూలు ప్రారంభించారు. మెల్లమెల్లగా పూలే దంప తులు 18 పాఠశాలలను స్థాపించారు. అయితే నాటి ఛాందసవాదులు సావిత్రీబాయి మామగారిని... ఆయన కొడుకూ, కోడలూ శ్రాస్త విరుద్ధంగా వ్యవహ రిస్తున్నారని రెచ్చగొట్టారు. దీంతో ఫూలే దంపతులను మామగారు ఇంటి నుండి వెళ్లగొట్టారు. అయినా ఆ దంప తులు తమ మార్గాన్ని మార్చు కోలేదు. ఆత్మహత్య చేసుకోబోతున్న కాశీ బాయి అనే గర్భవతి అయిన బ్రాహ్మణ వితంతు మహిళను కాపాడి ఆమె కన్న పిల్లవాడిని దత్తత తీసుకుని ‘యశ్వంతరావు’ అని పేరు పెట్టుకొని పెంచి పెద్ద చేశారు. 1876–77లో మహా రాష్ట్రలో భయంకరమైన కరువు వచ్చి జనాలు ఆకలితో అలమటిస్తుంటే తమ ‘సత్య శోధక సమాజ్’ ద్వారా ఆహార సేకరణ చేసి ఆదుకున్నారు. ఆమె మంచి ఉపాధ్యాయురాలే కాదు, కవయిత్రి కూడా. ఆమె రచించినటువంటి ‘కావ్య పుష్పాలు’ అనే సంపుటి చాలా గొప్పది. ప్లేగు వ్యాధి గ్రస్థులకు సేవ చేస్తూ ఆ వ్యాధికే బలై 1897 మార్చి 10వ తేదీన తుది శ్వాసవిడిచి ఎందరికో స్ఫూర్తిప్రదాతగా నిలిచిన మహనీయురాలు సావిత్రీబాయి. (క్లిక్ చేయండి: ‘భీమా కోరేగావ్’ స్ఫూర్తితో పోరాడుదాం!) – తండ సదానందం, టీపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ (జనవరి 3 సావిత్రిబాయి ఫూలే జయంతి) -
ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి
-
శిథిలావస్థలో సావిత్రిబాయి పూలే పాఠశాల.. కొత్త కళను తీసుకువచ్చేందుకు
Savitribai Phule Birth Anniversary: సావిత్రిబాయి పూలే అంటే పేరు కాదు. ఆత్మగౌరవ పోరాటం. అక్షర ఆయుధం. స్త్రీ విద్య అనేది ఊహకు కూడా రాని కాలంలో, భర్త జ్యోతి బాపూలేతో కలిసి మనదేశంలో తొలి బాలికల పాఠశాల స్థాపించారు. 1848లో పుణె (మహరాష్ట్ర)లో ఏర్పాటైన ఈ పాఠశాల నిమ్నవర్గాల బాలికలకు చదువు నేర్పింది. ‘ఆడపిల్లలకు చదువు వద్దు’ అనే అహంకార ధోరణికి ఉప్పుపాతర వేసింది. ఆ బడి నిర్వాహణ నల్లేరు మీద నడకేమీ కాదు. ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి. భౌతికదాడులు కూడా జరిగాయి. అయినప్పటికీ ఆడపిల్లలు ముందడుగు వేయడానికి తాము ఒక్క అడుగు కూడా వెనక్కి వెయ్యలేదు. ఎన్నడూ రాజీ పడలేదు. స్త్రీ చైతన్యం కోసం ‘మహిళా మండల్’ పేరుతో మరో సంచలనానికి శ్రీకారం చుట్టారు సావిత్రిబాయి. ఇక తాజా విషయానికి వస్తే... చారిత్రక కట్టడంగా భావించే పుణెలోని తొలి బాలికల పాఠశాల శిథిలావస్థలో ఉంది. ఈ పాఠశాలను పునర్నిర్మించి కొత్త కళను తీసుకువచ్చే బాధ్యతను తీసుకుంది పుణె మున్సిపాలిటి కార్పోరేషన్ (పీఎంసి) ఈ కొత్త సంవత్సరంలోనే నిర్మాణపనులు జరగనున్నాయి. విశేషం ఏమిటంటే, ఆ కాలంలో ఉనికిలో ఉన్న అర్కిటెక్చర్తోనే స్కూల్ నిర్మించనున్నారు. దీన్ని జాతీయ స్మారక చిహ్నంగా మారుస్తారు. ఏడు అంతస్తులతో నిర్మాణమయ్యే ఈ భవనంలో అయిదు ఫ్లోర్లను స్కూల్ కోసం కేటాయిస్తారు. బాలికల కోసం అత్యాధునిక సదుపాయాలు కల్పిస్తారు. చదవండి: పట్టులాంటి జుట్టుకోసం.. ఇవి కలిపి జుట్టుకి పట్టించండి.. మరోవైపు ఈ భవనాన్ని ‘అడ్వాన్స్డ్ నాలెడ్జ్ సెంటర్’గా తీర్చిదిద్దుతారు. స్కూల్ ఏర్పాటు, నిర్వాహణలో ఆనాడు సావిత్రిబాయి, జ్యోతిబాపూలేకు సహకరించిన వారి ఛాయచిత్రాలు చూడవచ్చు. వారికి సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు. 19, 20 శతాబ్దాలకు సంబంధించిన సామాజిక సంస్కరణల తాలూకు వివరాలు ఇక్కడ అందుబాటులో పెడతారు. స్థూలంగా చెప్పాలంటే... పునర్నిర్మాణం కానున్న ఈ చారిత్రక కట్టడం, ఒక నగరానికి పరిమితమనుకునే కట్టడం కాదు. కోటానుకోట్లమందిని ముందుకు నడిపించే జీవచైతన్యం. ఆత్మగౌరవ పతాకం. -
అణగారిన వర్గాల దీపస్తంభం
అట్టడుగు వర్గాల్లో విజ్ఞానాన్ని నింపడానికి సర్వస్వం త్యాగం చేసిన మహోన్నతమైన వ్యక్తి సావిత్రీబాయి ఫూలే. ఆనాటి సమాజపు కట్టు బాట్లను ధిక్కరించి భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు అయ్యారు. దేశంలో బహుజనులకు మెుట్టమెుదటి పాఠశాల ప్రారంభిం చారు. సావిత్రీబాయి మహారాష్ట్ర సతారా జిల్లాలోని నయాగావ్ గ్రామంలో 1831 జనవరి 3న జన్మిం చారు. వాళ్ల కుటుంబానికి తెలంగాణ ప్రాంతంతో బంధుత్వం ఉంది. బోధన్ ప్రాంతపు మున్నూరుకాపులు వీరికి చుట్టాలు. ఆమె తన తొమ్మిదో ఏట పన్నెండేళ్ల జ్యోతి రావు ఫూలేను 1840లో వివాహ మాడారు. నిరక్షరాస్యురాలైన ఆమెకు భర్త జ్యోతిబా మొదటి గురువు. ఉపాధ్యాయ శిక్షణ పొంది 1848లో భర్తతో కలిసి బాలికల కోసం పుణేలో మొదటి పాఠశాలను ప్రారంభించారు. ఇది నడపటం అగ్రవర్ణాలకు నచ్చకపోయినా, పట్టు వీడక ఫూలే దంపతులు సాగించిన విద్యా ఉద్య మానికి తక్కువ కాలంలోనే గుర్తింపు, సహ కారం లభించాయి. దంపతుల జీవితకాలంలో మొత్తం 52 పాఠశాలలు ప్రారంభించారు. మానవ హక్కుల గురించి మహిళలను చైతన్య పరచడానికి 1852లో మహిళా సేవామండల్ స్థాపిం చారు సావిత్రీబాయి. కుల, పితృస్వామ్య వ్యవస్థల అణచివేతకు వ్యతిరేకంగా ఈ సంఘం పనిచేసింది. మహిళా హక్కులే మానవ హక్కులని తొలిసారిగా నినదించినది సావిత్రీబాయి. 1873లో భర్త మహాత్మా ఫూలేతో కలిసి ‘సత్య శోధక్ సమాజ్’ స్థాపించి, బాల్య వివాహాలు, మూఢనమ్మకాలు, సతీసహగమనానికి వ్యతిరేకంగా; వితంతు పునర్వి వాహాలకు అనుకూలంగా ఉద్యమం నడిపారు. ఈ సంఘపు మహిళా విభాగానికి ఆమె నేతృత్వం వహించారు. బాల్యంలోనే వైధవ్యాన్ని అనుభ వించే ఎంతోమంది ఆడపిల్లలకు అన్నం పెట్టి ఆశ్రయం కల్పించారు. గర్భవతులైన వారికి పురుళ్లు పోశారు. అలా పురుడు పోసుకుని తనవద్దే వదిలేసి పోయిన ఓ బ్రాహ్మణ వితంతువు బిడ్డను అక్కున చేర్చుకుని, యశ్వంత్గా నామకరణం చేసి, పెంచి పెద్ద చేశారు. వితంతువు లకు శిరోముండనం చేయడాన్ని తీవ్రంగా ఖండించి, క్షురకులను చైతన్య పర్చి, వారికి శిరో ముండనం చేయ బోమంటూ సమ్మె చేయించారు. అంటరాని తనానికి వ్యతిరేకంగా పోరా డారు. దేశంలో తీవ్ర దుర్భిక్షం ఏర్పడినప్పుడు ఫూలే దంపతులు చేసిన కృషి మరువలేనిది. కరువు వాతపడిన కుటుంబాల్లోని అనాధ బాలలను దాదాపు 2,000 మందిని అక్కున చేర్చుకున్నారు. తమ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ప్రారంభించారు. సావిత్రీబాయి ఫూలే సంఘ సంస్కర్తగానే కాదు, రచయిత్రిగా కూడా వేగుచుక్కగా నిలిచారు. (నేడు సావిత్రీబాయి ఫూలే జయంతి) సంపత్ గడ్డం, కామారెడ్డి జిల్లా మొబైల్ : 78933 03516 -
మహిళా టీచర్లకు పురస్కారం
సాక్షి, విజయవాడ: సావిత్రిభాయి పూలే 188వ జయంతి సందర్భంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఉత్తమ మహిళా ఉపాధ్యాయులకు సావిత్రి భాయి పూలే పురస్కారాలు ప్రదానం చేశారు. శుక్రవారం విజయవాడలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, మాజీ మంత్రి శైలజానాథ్, మాజీ ఎంపీ కొనగళ్ళ నారాయణ, విద్యార్థి సమాఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ.. దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిభాయి పూలే అని, ఆమె జయంతిని పురస్కరించుకుని ఉత్తమ మహిళా ఉపాధ్యాయురాళ్లను సత్కరించటం శుభపరిణామం అన్నారు. అలాగే మహాత్మా జ్యోతీరావు పూలే ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. అస్సృశ్యత, అంటరాని తనంపై పోరాడిన మానవతావాది జ్యోతిరావ్ పూలే అని, ఇప్పటికీ సమాజంలో పురుషాధిక్యత కొనసాగుతోందని అన్నారు. మహిళలపై దాడులు, అకృత్యాలు పెరిగిపోయాయని, దేశంలో తల్లులకు దిక్సూచి సావిత్రిభాయి పూలే అని పేర్కొన్నారు. రచయిత, సామాజిక వేత్త అయిన సావిత్రిభాయి పూలే చేసిన త్యాగం వల్లనే మహిళల చదువుకు మంచి రోజులు వచ్చాయని అన్నారు. కాగా దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో సావిత్రిభాయి పూలే, జ్యోతీరావు పూలే జయంతి, వర్ధంతులు అధికారికంగా నిర్వహించేలా జీవోలు తెచ్చారని ఎమ్మెల్సీ తెలిపారు. మాజీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆ జీవోను కోనసాగించలేదని, వచ్చే ఏడాది నుంచి వారి జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేలా కృషి చేస్తామన్నారు. అలాగే మహిళా ఉపాధ్యాయులను సత్కరించేలా చర్యలు కూడా చేపడతామని హామీ ఇచ్చారు. అదేవిధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళలకు పెద్దపీట వేశారని, మంత్రి వర్గకూర్పులో మహిళలకు ప్రాధాన్యత కల్పించారని పేర్కొన్నారు. అలాగే మహిళల రిజర్వేషన్లు 33 శాతం నుంచి 50శాతం పెంచారని తెలిపారు. మహిళల రక్షణకు దిశ చట్టం చేశారని అన్నారు. ఇక మాజీ మంత్రి శైలజానాథ్ మాట్లాడుతూ.. సావిత్రి భాయిపూలే ఆశయాలను అందరు గుర్తుపెట్టుకోవాలని అన్నారు. ఎన్ఆర్సీ బిల్లుపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి 3 రోజుల్లో మూడు మాటలు మాట్లాడారని విమర్శించారు. ప్రజలను ప్రశాంతంగా బతకనివ్వాలని వ్యాఖ్యానించారు. -
బీజేపీకి దళిత ఎంపీ రాం..రాం..
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీకి గట్టి షాక్ తగిలింది. దళిత నాయకురాలు, న్యాయవాది, ఎంపీ సావిత్రి బాయి ఫూలే బీజేపీకి రాజీనామా చేశారు. సమాజంలో బీజేపీ విభజనలు సృష్టిస్తోందని ఆమె ఆరోపించారు. ఉత్తర ప్రదేశ్‌లోని బహ్రెయిచ్ నుంచి ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్న ఆమె బీజేపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సమాజాన్ని విభజించేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని, దేశ బడ్జెట్‌ను విగ్రహాలను నెలకొల్పడానికే ఖర్చుచేస్తోందని విమర్శించారు. గత కొంత కాలంగా బీజేపీ తీరుపై బహిరంగంగానే విమర్శిస్తున్న ఆమె.. అంబేద్కర్ వర్దంతి రోజునే ఆ పార్టీకి రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై కూడా ఆరోపణలు చేశారు. హనుమంతుడు దళితుడంటూ యోగి వివాదానికి తెరదీశారని ఆగ్రహించారు. హనుమంతుడు కూడా మనిషేనని.. ఆయన కోతి కాదని.. దళితుడైనందుకు అవమానాన్ని ఎదుర్కొన్నారని తన అభిప్రాయాన్ని తెలిపారు. హనుమంతుడిని మనువాదులకు బానిసగా మార్చేశారు.. రాముడి కోసం ఆయన ఎంతో చేశారన్నారు. చివరికి హనుమంతుడికి ఓ తోకను తగిలించి ముఖానికి మసిపూసి కోతిగా ఎందుకు చిత్రీకరించారు అంటూ ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో లబ్ది పొందేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ యోగిపై ధ్వజమెత్తారు. -
జిన్నా మహాపురుషుడు: బీజేపీ ఎంపీ
లక్నో : అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ)లో పాకిస్తాన్ వ్యవస్థాపకుడు మహమ్మద్ అలీ జిన్నా చిత్రపటంపై వివాదం చల్లారకముందే బీజేపీ ఎంపీ సావిత్రిబాయి పూలే మరో వివాదానికి తెర లేపారు. జిన్నాను మహాపురుషుడిగా (గొప్ప వ్యక్తి) కీర్తించి కలకలం రేపారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహా పురుషుడని జిన్నాను పొగిడారు. సావిత్రి బాయి గత కొన్ని రోజులుగా బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తూ సొంత పార్టీకి తలనొప్పిగా మారారు. తాజాగా అలీగఢ్ విశ్వవిద్యాలయంలో జిన్నా ఫొటో వివాదానికి ఆజ్యం పోశారు. జిన్నా గురించి మాట్లాడుతూ... ‘భారత స్వాతంత్ర్య పోరాటంలో జిన్నా ఎనలేని కృషి చేశారు. ఆయన మహాపురుషుడు, మనం ఆయన త్యాగాన్ని మరవకూడదు’ అంటూ పొగిడి బీజేపీని ఇరుకున పెట్టారు. అంతేకాక తాజాగా రాష్ట్రంలో, కేంద్రంలో బీజేపీ నిర్వహిస్తున్న ‘దళితల ఇళ్ల సందర్శన’ కార్యక్రమంపై విమర్శలు గుప్పించారు. రాజకీయ నాయకులు దళితుల ఇళ్లకు వెళ్లడమంటే వారిని తీవ్రంగా అవమానించడమే అవుతుందని వ్యాఖ్యానించారు. ఏఎంయూలో జిన్నా చిత్రపటాన్ని ఎందుకు ఉంచారో వివరణ ఇవ్వాలని స్థానిక బీజేపీ ఎంపీ సతీశ్ గౌతమ్.. వర్సిటీ వైస్ చాన్స్‌లర్ (వీసీ) తారిఖ్ మన్సూర్‌కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి ఏఎంయూ అధికార ప్రతినిధి షఫీ కిద్వాయ్ మీడియాకు వివరణ ఇచ్చారు. ‘జిన్నా ఏఎంయూ వ్యవస్థాపక సభ్యుడు. వర్సిటీకి విరాళం ఇచ్చారు. అంతేకాదు పాకిస్తాన్ కోసం డిమాండ్ చేయకముందే వర్సిటీ ఏర్పాటుకు కృషి చేశారు. 1938లో వర్సిటీ విద్యార్థి సంఘం జీవిత కాల సభ్యత్వం పొందారు. అలా సభ్యత్వం పొందినవారి చిత్రపటాలు యూనియన్ కార్యాలయంలో ఉంచడం సంప్రదాయంగా వస్తోంది. ఆ చిత్రపటాలు ఉమ్మడి భారతదేశ వారసత్వ సంపద’ అన్నారు. -
బీజేపీలో దళితుల ముసలం
సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీని కొన్ని దశాబ్దాల క్రితం ‘బ్రాహ్మణ్–బనియన్’ పార్టీగా అభివర్ణించేవారు. ఈ ముద్రను చెరిపేసుకొని హిందూ మతంలోని అన్ని కులాలు, ముఖ్యంగా దళితుల సంక్షేమం కోరుకునే పార్టీగా పేరు సంపాదిస్తే తప్ప ఎన్నికల్లో రాణించలేమని గ్రహించిన బీజేపీ ఆ దిశగా ప్రయత్నించింది. ముఖ్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్‌ను నిజమైన స్వాతంత్య్ర యోధుడుగా అభివర్ణిస్తూ 2014 పార్లమెంట్ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా దళితులను ఆకర్షించారు. 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే 2014 ఎన్నికల్లో బీజేపీ అన్ని కులాల ఓటర్ల సంఖ్య 12 శాతం పెరగ్గా, అగ్రవర్ణాల ఓట్ల శాతం 18, ఓబీసీల ఓట్ల శాతం 12, ఎస్సీల ఓట్ల శాతం 12, ఎస్టీల ఓట్ల శాతం 14 పెరిగింది. ముఖ్యంగా మోదీ ప్రచారం 2014లో జరిగిన ఉత్తరప్రదేశ్ లోక్‌సభ, గతేడాది అసెంబ్లీ ఎన్నికలపై ఎంతో ప్రభావం చూపింది. లోక్‌సభ ఎన్నికల్లో దళితులు 21 శాతం మంది ఓటు వేసిన కారణంగానే ఆ రాష్ట్రంలో 80 స్థానాలకుగాను బీజేపీ 40 స్థానాలను గెలుచుకోగలిగింది. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 24 శాతం దళితుల ఓట్లను సాధించడం ద్వారా అధికారంలోకి రాగలిగింది. 85 రిజర్వ్డ్ సీట్లలో 69 సీట్లను బీజేపీ గెలుచుకోగలిగింది. అలాంటి యూపీలోనే బీజేపీకి చెందిన దళిత ఎంపీలు తిరుగుబాటు జెండా ఎగరేశారు. దేశంలోని దళితుల పట్ల పార్టీ అనుసరిస్తున్న వైఖరిని వారు తీవ్రంగా విమర్శించారు. ముఖ్యంగా ఏప్రిల్ రెండవ తేదీన దళితులు జరిపిన భారత్ బంద్ హింసాత్మకంగా మారడం, పది మంది దళితులు చనిపోవడం పట్ల వారు ఆందోళన వ్యక్తం చేశారు. వారిలో అందరికన్నా ముందుగా పార్టీ ఎంపీ సావిత్రి భాయ్ ఫూలే ఏప్రిల్ ఒకటవ తేదీనే లక్నోలో ‘రాజ్యాంగాన్ని రక్షించండి! రిజర్వేషన్లను రక్షించండి’ అంటూ దళితులతో కలసి నిరసన ప్రదర్శన జరిపారు. దళితులపట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని విమర్శించారు. ఆ తర్వాత ఏప్రిల్ రెండవ తేదీన పార్టీ దళిత ఎంపీ డాక్టర్ యశ్వంత్ సింగ్, ఏప్రిల్ ఐదవ తేదీన ఛోటేలాల్ ఖర్వార్, అశోక్ దోహ్రే నేరుగా ప్రధాని నరేంద్ర మోదీకే లేఖలు రాశారు. నాలుగేళ్ల ఆయన పాలనలో దళితులకు ఎలాంటి మేలు జరగలేదని ఆరోపించారు. దళితులపై హింస నిరోధక చట్టాన్ని సుప్రీం కోర్టు నీరుకార్చడాన్ని విమర్శించారు. మరో బీజేపీ ఎంపీ ఉదిత్ రాయ్ రాష్ట్రంలో యోగి ఆధిత్యనాథ్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని తీవ్రంగా విమర్శించారు. ఇటు పార్టీలోనే కాకుండా అటు బయట కూడా దళితుల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పట్ల అసంతృప్తి పెరుగుతోంది. దళిత నాయకుల చొరవ లేకుండా లక్షలాది మంది దళితులు ఏప్రిల్ 2వ తేదీన వీధుల్లోకి వచ్చి భారత్ బంద్‌ను నిర్వహించడమే అందుకు కారణం. ఈ విషయాన్ని గ్రహించిన నరేంద్ర మోదీ కనిపించిన అంబేడ్కర్ విగ్రహానికల్లా శిరస్సు వంచి నమస్కరిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు అమిత్ షా తాము రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని పదే పదే చెబుతూ వస్తున్నారు. ఏప్రిల్ 14వ తేదీన అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహించేందుకు బీజేపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అందులో నిజంగా దళితులకు లబ్ధి చేకూర్చే కార్యక్రమాలు ఉండాలే తప్ప, ప్రచార కార్యక్రమాలు మాత్రమే ఉంటే మరోసారి నమ్మి మోసపోయే పరిస్థితుల్లో దళితులు లేరు. -
రిజర్వేషన్ల ఎత్తివేతకు కుట్ర.. బీజేపీ ఎంపీ తిరుగుబాటు!
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ దళిత ఎంపీ సావిత్రిబాయి ఫూలె సొంత పార్టీపైనే తిరుగుబాటు జెంగా ఎగురవేశారు. మోదీ సర్కారు ఎస్సీ, ఎస్టీ వ్యతిరేక విధానాన్ని అనుసరిస్తోందని ఆమె మండిపడుతున్నారు. బడుగు, బలహీన వర్గాలకు ప్రస్తుతం అందజేస్తున్న రిజర్వేషన్ ఎత్తివేసేందుకు కుట్ర జరుగుతోందని, దీనికి వ్యతిరేకంగా ఏప్రిల్ 1న లక్నోలో తాను ర్యాలీ నిర్వహించబోతున్నట్టు స్పష్టం చేశారు. సొంత పార్టీలోనే రిజర్వేషన్‌కు వ్యతిరేకంగా కొందరు గళమెత్తుతున్నారని బహ్రైచ్ ఎంపీ అయిన సావిత్రి బాయి మండిపడ్డారు. తనకు వ్యతిరేకంగా బీజేపీ చర్య తీసుకుంటే.. రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరించినట్టేనని ఆమె అంటున్నారు. ‘రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లు సమీక్షించాలన్న చర్చ నిరంతరం కొనసాగుతూనే ఉంది. ఇది రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు జరుగుతున్న రహస్య కుట్ర ఇది. రిజర్వేషన్లను కాపాడుకునేందుకు నేను ఇప్పటికే బహ్రైచ్‌లోని నాన్‌పరాలో ర్యాలీ నిర్వహించాను. త్వరలో లక్నోలోని కాశీరాం స్మృతివనంలో ‘అరక్షన్ (రిజర్వేషన్) బచావో ర్యాలీ’ని నిర్వహించబోతున్నాను’ అని మీడియాతో తెలిపారు. రిజర్వేషన్లను ఎత్తివేసే ప్రయత్నాన్ని తాను తీవ్రంగా అడ్డుకుంటానని, ఈ విషయంలో ఎంతదూరం వెళ్లేందుకైనా సిద్ధమేనని ఆమె సవాల్ చేశారు. -
జీఎస్టీ చట్టం: ఓ ఆసక్తికరమైన వార్త
సాక్షి, ముంబై: బీజేపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన జీఎస్టీ చట్టంపై మరో ఆసక్తికరమైన వార్త. పుణే యూనివర్శిటీ జీఎస్టీ చట్టంపై కొత్త కోర్సును ప్రవేశపెట్టబోతోంది. వచ్చే ఎకడమిక్ ఇయర్ నుంచి వివిధ కోర్సుల్లో జీఎస్టీ చట్టాన్ని ఒక కొత్త సబ్జెక్టుగా చేర్చనుంది. పుణే విశ్వవిద్యాలయం సావిత్రిబాయి ఫులే అకడమిక్ కౌన్సిల్ జీఎస్టీపై ఎంబీఏ, ఎంఏ కోర్సుల్లో ఈ సబ్జెక్టును ప్రవేశపెట్టేందుకు నిర్ణయించింది. 2018-19 విద్యా సంవత్సరం నుంచి ఈ కోర్సులను ప్రారంభించనుంది. యూనివర్శిటీ ప్రతినిధి అభిజిత్ గోర్పడే ఈ విషయాన్ని ప్రకటించారు. -
ఉపాధ్యాయులు సమాజ మార్గదర్శకులు
– ఎంపీ బుట్టా రేణుక – 200 మంది ఉపాధ్యాయులకు అవార్డులు – రక్తదానం చేసిన యువత – ఘనంగా సావిత్రిబాయి పూలే 185వ జయంతి కర్నూలు(అర్బన్) : ఉపాధ్యాయులు సమాజానికి మార్గదర్శకులని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక అన్నారు. మంగళవారం జెడ్పీ సమావేశ భవనంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో సావిత్రిఽబాయి పూలే 185వ జయంతి ఘనంగా జరిగింది. విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు జే లక్ష్మినరసింహ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి డీఐజీ బీవీ రమణకుమార్, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య హాజరయ్యారు. నాటి ఆచారాలు, కట్టుబాట్లకు ఎదురొడ్డి భర్త జ్యోతిరావు పూలే సహకారంతో సావిత్రిబాయి ఉపాధ్యాయురాలిగా ఎదిగి సమాజానికే మార్గదర్శకురాలయ్యారని ఎంపీ కొనియాడారు. కుటుంబంలోని తండ్రి, భర్త సహకారం అందిస్తే మహిళలు అన్ని రంగాల్లో ముందుకెళ్తారన్నారు. ఇటీవల మహిళలపై వేధింపులు పెరిగిపోతున్నాయని, అందుకు కారణాలను విశ్లేషిస్తే వాటిని అరికట్టవచ్చన్నారు. మంచి సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర కీలకమన్నారు. డీఐజీ రమణకుమార్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు ప్రణాళిక ప్రకారం విద్యాబుద్ధులు నేర్పిస్తే మంచి సమాజం ఏర్పడుతుందన్నారు. మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ మాట్లాడుతూ బాలికల విద్య కోసం సావిత్రిబాయి చేసిన కృషికి గుర్తింపుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆమె జయంతిని అధికారికంగా నిర్వహించనున్నాయని చెప్పారు. కార్యక్రమంలో 200 మంది ఉపాధ్యాయులను సన్మానిస్తున్నట్లు చెప్పారు. సభాధ్యక్షుడు లక్ష్మినరసింహ మాట్లాడుతూ రాష్ట్రంలోని అందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల సిఫారసు లేఖలను శాసనసభ బీసీ కమిటీ చైర్మన్ తిప్పేస్వామి ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేందుకు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఇందులో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ క్రిష్ణమూర్తి ఎంతో కృషి చేశారని చెప్పారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు, బీసీ జనసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు టీ శేషఫణి, మాకం నాగరాజు, బత్తుల లక్ష్మికాంతయ్య, బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ కులాల సమాఖ్య మహిళా కన్వీనర్ పట్నం రాజేశ్వరి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి గంగాధర్, గొర్రెల సహకార సంఘం చైర్మన్ వై నాగేశ్వరరావు యాదవ్, బీసీ మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు పార్వతమ్మ, వాడాల నాగరాజు, ఉపాధ్యాయ ఎంపిక కమిటీ సభ్యులు ఓంకార్‌యాదవ్, విజయభాస్కర్‌యాదవ్, మియ్యా పాల్గొన్నారు. యువత రక్తదానం ఈ సందర్భంగా పలువురు బీసీ వర్గాలకు చెందిన యువత రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో బ్లడ్ బ్యాంక్ చైర్మన్ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఆకట్టుకున్న మియ్యా గీతాలు ... కార్యక్రమంలో అభ్యుదయ గాయకులు మహమ్మద్‌మియ్యా ఆలపించిన పలు గీతాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ప్రధానంగా మహిళలకు సంబంధించి ‘ ఎక్కడమ్మా నీవు లేనిది, ఏమిటీ నువు చేయలేనిది ’ అనే గీతం ఆహుతులతో పాటు వేదికపైన ఉన్న వారి గుండెలను హత్తుకుంది. -
తొలి మహిళా గురువుపై నాడు రాళ్లేసారు
ఆమె భారత దేశంలోనే తొలి మహిళా గురువు. 1848లోనే విద్యాబుద్ధులు నేర్పేందుకు నడుంకట్టారు. ప్రత్యేక బాలికల పాఠశాలను స్థాపించి ఎంతో మందికి ఆదర్శప్రాయులయ్యారు. ఆమె చేస్తున్న మంచి పనులు చూసి ఓర్వలేక రాళ్లు విసిరినవారు ఉన్నారు.. ఆమె వెళ్లే మార్గంలో పేడను వేసినవారు ఉన్నారు. అయినప్పటికీ మొక్కవోని ధైర్యంతో భర్త ప్రముఖ సామాజిక వేత్త జ్యోతిరావ్ పూలే ఇచ్చిన అండదండలతో ముందుకు సాగి నేడు దేశంలోని తొలి మహిళా గురువుగా నిలిచారు. దేశ వ్యాప్తంగా ప్రతి ఏటా ఆమె జన్మదినం జరుపుకునే స్థాయిలో ఉన్నారు. ఆమె ఎవరో కాదు. సావిత్రీబాయి పులే. ఆమె 186వ జయంతి నేడు. ఈ సందర్భంగా ప్రతిష్టాత్మక నెటిజన్ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ఆమెకు డూడుల్ ద్వారా ఘన నివాళి అర్పించింది. కులమతాలకు అతీతంగా సావిత్రీబాయి విద్యాబోధన చేశారు. వితంతువులకు ఆశ్రయం కల్పించారు. సొంతంగా క్లినిక్ స్థాపించి వైద్య సేవలు కూడా అందించారు. -
విద్యతోనే మహిళా సాధికారత
– జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ – భారీగా రన్ ఫర్ ఉమెన్ వెల్ఫేర్ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థినీలు కర్నూలు(అర్బన్): విద్యతోనే మహిళా సాధికారత సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ అన్నారు. జనవరి 3న జరగనున్న సావిత్రీబాయి పూలే జయంతి ఉత్సవాల నేపథ్యంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో గురువారం 'రన్ ఫర్ ఉమెన్ వెల్ఫేర్ ' కార్యక్రమం జరిగింది. స్థానిక బిర్లాగేట్ పూలే విగ్రహం ఎదుట ముందుగా కలెక్టర్ విజయమోహన్ సావిత్రీబాయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించిన అనంతరం జెండా ఊపి రన్‌ను ప్రారంభించారు. సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు జే లక్ష్మినరసింహ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలకు విద్య అందనంత దూరంలో ఉన్న కాలంలోనే సావిత్రీబాయి మహిళల విద్య కోసం ఎంతో కృషి చేసి దేశంలోనే తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా కీర్తి గడించారని గుర్తు చేశారు. ఆమె చేసిన సేవలకు గుర్తుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది నుంచి ఆమె జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేసిందన్నారు. సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు జే లక్ష్మినరసింహ మాట్లాడుతూ బాలికలను విద్యావంతులను చేసేందుకు 1948లోనే సావిత్రీబాయి పూలే ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేశారని చెప్పారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లైనా రాష్ట్రంలో బాలికలకు ప్రత్యేకంగా హాస్టళ్లు ఉన్నా, సొంత భవనాలు లేకపోవడం దురదృష్టకరమన్నారు. మహిళా రక్షణ చట్టాలు కూడా సక్రమంగా అమలు కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రోజు రోజుకు మహిళలపై దాడులు అధికమయ్యాయని, చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయన్నారు. జీపీఎస్ టెక్నాలజీని ఉపయోగించి మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలన్నారు. మహిళలకు ప్రత్యేక బ్యాక్లాగ్ ద్వారా ఉపాధి కల్పించాలని, సావిత్రీబాయి పూలేని మహిళలు ఆదర్శంగా తీసుకొని అన్ని రంగాల్లో రాణించాలన్నారు. కార్యక్రమంలో బీసీ జనసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు టి.శేషఫణి, మహిళా సంఘం అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి, రవీంద్ర విద్యా సంస్థల ఆధినేత పుల్లయ్య, ప్రిన్సిపాల్ రామకృష్ణ, విద్యార్థి సమాఖ్య జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు భరత్‌కుమార్, ముక్తార్‌బాషా, హెచ్‌డబ్ల్యూఓలు హారతీదేవి, మేరీ పాల్గొన్నారు. 2కే రన్ బిర్లాగేట్ నుంచి కలెక్టరేట్ వరకు సాగింది. -
అబలల చేతి అక్షరాయుధం
కొత్త కోణం జ్యోతిరావు తండ్రి గోవిందరావును భయపెట్టి కొడుకునీ, కోడలినీ ఇంటి నుంచి పంపించ డంలో కృతకృత్యులయ్యారు. ఆ సమయంలో సావిత్రి స్నేహితురాలు ఫాతిమా షేక్ ఆశ్రయం ఇచ్చారు. పాఠశాలలు ఆగలేదు. అలాగే దాడులూ ఆగలేదు. సావిత్రి పాఠశాలకు వెళ్తున్న సమయంలో పేడతో, రాళ్లతో చాటు నుంచి దాడిచేసేవారు. ఇది నిత్యకృత్యం కావడంతో సావిత్రీబాయి పాఠశాలకు వెళ్తున్నప్పుడు ఒక పాత చీర కట్టుకొని, మరొకటి వెంట తీసుకొని వెళ్లేవారు. కానీ వారి దాడులు తీవ్రమయ్యాయే తప్ప తగ్గలేదు. ‘‘మేము సజీవంగా సమాధుల్లో మగ్గుతున్న వాళ్లం. అక్షరం మాకు నిషిద్ధం. భగవంతుడు మా మొరనాలకించి బ్రిటిష్ వారిని పాలకులుగా పంపాడు. ఇప్పుడు మమ్మల్నెవరూ వే«ధించి, బాధించలేరు. ఉరితీసి చంప టానికీ, సజీవంగా పాతిపెట్టడానికీ సాహసించరు. మా ముందు తరాలకు కూడా భవిష్యత్తుపై భరోసా ఉన్నదిప్పుడు. మేమిప్పుడు ఒంటినిండా బట్ట కట్టగలుగుతున్నాం. స్వేచ్ఛగా, అర్థవంతంగా జీవిస్తున్నాం. ఆంక్షలూ, నిషే ధాలూ తొలగిపోయి బజారులూ, ఉద్యానవనాలూ మాకు తలుపులు తెరిచాయి.’’ 1848లో ప్రారంభమైన ఒక బాలికల పాఠశాలలో చదివిన మాతంగ కులానికి చెందిన విద్యార్థిని రాసిన ఉత్తరమిది. సామాజిక విప్లవ పితామహు డుగా పేర్గాంచిన జ్యోతిబా పూలే, ఆయన సతీమణి సావిత్రీబాయి çఫూలే నిర్వహించిన పాఠశాలల ప్రత్యక్ష ఫలితమిది. సామాజిక అసమానతలను తలకిందులు చేసి మహర్, మాతంగ కులాల్లోని యువతీ యువకుల్లో చైత న్యాన్ని నింపిన ఒక ఉద్యమ సందర్భమది. ఆ బాలిక పేర్కొన్నట్టే అంటరాని కులాలకు అందివచ్చిన భద్రతకు సంబంధించిన ఒక ఘటన సావిత్రీబాయి ఫూలే నాయకత్వంలో జరిగింది. ఈ వివరాలను సావిత్రీబాయి, జ్యోతీరావు ఫూలేకు రాసిన లేఖలో తెలియజేశారు. అనారోగ్యంతో సావిత్రీబాయి తల్లి గారి ఊరైన సతారా జిల్లా నయ్గావ్లో ఉన్నప్పుడు అది జరిగింది. ‘‘మా గ్రామంలో గణేష్ అనే బ్రాహ్మణ యువకుడు చుట్టుపక్కల గ్రామాల్లో జాతకాలు చెప్పేవాడు. మహర్ కులానికి చెందిన షార్జా అనే అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. వాళ్ల ప్రేమ వ్యవహారం బయటపడేనాటికే ఆ అమ్మాయి ఆరునెలల గర్భవతి. ఇది తెలుసుకున్న గ్రామస్తులు వాళ్లిద్దరినీ చంపడానికి నిర్ణయించుకున్నారు. ఆ విషయం నా చెవినపడగానే అక్కడికి పరుగెత్తాను. వాళ్లను హత్యచేస్తే బ్రిటిష్ ప్రభుత్వపు ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించాను. దాంతో బెదిరిపోయిన గ్రామపెద్దలు హత్యాప్రయత్నాన్ని విరమించుకున్నారు. వాళ్లిద్దరినీ గ్రామం నుంచి వెలేశారు. నేను కలుగజేసు కోకపోతే వారి ప్రాణాలు దక్కేవి కావని నా పాదాలపై పడి కన్నీళ్లు పెట్టు కున్నారు. వారికి ఆశ్రయమిచ్చి, ఏదైనా ఉపాధి కల్పించండి!’’ రెండు ఉత్తరాలు. ఒకటి ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. రెండవది ధిక్కార స్వరం. మాతంగ బాలికకు ఆత్మవిశ్వాసం కలగడానికి సావిత్రీబాయి చూపిన పోరాటపటిమే కారణం. జ్యోతిబా, సావిత్రీబాయి ఇరువురూ సామాజిక మార్పుకోసం కలసికట్టుగా చేసిన పోరాటం ఆనాడు మహారాష్ట్రలోని పూనా ప్రాంతంలో ఒక చరిత్ర. ఉద్యమమే ఊపిరిగా... అంటరాని కులాలను దుర్మార్గంగా హింసించిన పీష్వాల పాలన 1818 లోనే అంతమైంది. సుమారు అయిదు వందల మంది మహర్ సైనికులు, వేలాది మందితో ఉన్న పీష్వాల సైన్యాన్ని తుదముట్టించి బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు పునాదులు వేశారు. అప్పటివరకు అంతులేని కుల వివక్ష, అణచివేతని అనుభవించిన అంటరాని కులాలు బ్రిటిష్ వారి రాకతో ఊపిరి పీల్చుకు న్నాయి. వారు ప్రారంభించిన ఇంగ్లిష్ విద్య సావిత్రీబాయి లాంటి వాళ్లను చైతన్యపరిచింది. అయినప్పటికీ కొన్ని దుర్భర పరిస్థితులు అప్పటికి మిగిలే ఉన్నాయి. ఆ నేపథ్యంలో సావిత్రీబాయి కృషి ఎలాంటిదో అర్థం చేసుకోవా లంటే నాటి సామాజిక స్థితిగతులను గమనించాలి. ఈస్టిండియా కంపెనీ రైల్వే, తపాల, విద్యాశాఖలను ప్రారంభించింది. అయితే భారత సమాజం కులాలుగా విడిపోయి ఉంది. మహిళల పరిస్థితి మరింత దయనీయం. శూద్రులతో సమంగా, ఇంకా చెప్పాలంటే వారికన్నా హీనంగా స్త్రీలను చూసేవారు. ఆధిపత్య కులాలు, బ్రాహ్మణ కులాల్లో పురు షుల దాష్టీకం ఎక్కువగా ఉండేది. బాల్య వివాహం, సతీసహగమనం, పున ర్వివాహాల వల్ల చాలామంది యుక్తవయసులోనే వితంతువులయ్యేవారు. వీరిని పురుషులు కేవలం పనిముట్లుగా భావించేవాళ్లు. మగవారి పశుత్వానికి బలై, గర్భవతులైతే ఇక వారికి ఆత్మహత్యలే శరణ్యం. వితంతువులకు శిరోముండనం చేసేవాళ్లు. అప్పుడే దహనసంస్కారానికి అర్హమైన పవిత్రత సిద్ధిస్తుందని భావించేవారు. రెండవది భర్త చనిపోతే ఆస్తులు పంచవలసి వస్తుందని మహిళలను ఇంటినుంచి గెంటివేసేవాళ్లు. స్త్రీల పట్ల దుర్మార్గమైన పద్ధతులు అవలంబిస్తూనే సమస్త నష్టాలకు మళ్లీ మహిళలే మూలమనే దుర భిప్రాయాన్ని ప్రచారం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో మహాత్మా జోతీరావు, సావిత్రీబాయి ఉద్యమం పురుడుపోసుకున్నది. స్త్రీవిద్యకు అంకురార్పణ సావిత్రీబాయి 1831 జనవరి 3న మహారాష్ట్రలోని సతారా జిల్లా నయా గావ్‌లో జన్మించారు. ఖండోజి నేవనే పాటిల్, లక్ష్మీబాయి మొదటి సంతానం సావిత్రి. ఆమెకు సిద్ధూజీ, సఖారామ్, శ్రీపతి అనే ముగ్గురు తమ్ముళ్లు. పూనాకు చెందిన జ్యోతీరావుతో సావిత్రీబాయికి తొమ్మిదో ఏట పెళ్లి కుది రింది. అప్పుడు ఫూలేకు 13 ఏళ్లు. తల్లి చిన్నప్పుడే మరణించింది. దూరపు బంధువు సుగుణాబాయి ఫూలేను పెంచింది. ఆమె ఒక క్రైస్తవ ఫాదర్ ఇంట్లో పనిచేసేది. సుగుణాబాయి వద్ద పెరగడం వల్ల ఫూలేకు ఇంగ్లీషు భాష పట్ల మక్కువ ఏర్పడింది. క్రైస్తవంలో ఉండే మానవీయ విలువలు ప్రభావితం చేశాయి. నిజానికి సుగుణాబాయి చొరవతోనే సావిత్రి, జ్యోతిరావుల వివా హం జరిగింది. సుగుణాబాయికి జ్యోతిరావుకు ఇంగ్లిష్ చదువు చెప్పించాలని ఉండేది. కానీ ఫూలే తండ్రి గోవిందరావు ఒక బ్రాహ్మణ పూజారి మాటతో కొడుకుచేత చదువుకు స్వస్తి పలికించి వ్యవసాయంలో పెట్టాడు. దానితో కలత చెందిన సుగుణాబాయి లెగ్గిట్ అనే ఇంగ్లిష్ ఆఫీసరు, గఫార్ బేగ్ అనే ముస్లిం విద్యావంతుని ద్వారా ఫూలే తండ్రిని ఒప్పించగలిగారు. దానితో జ్యోతిబాకు తిరిగి చదువు కొనసాగించే అవకాశం కలిగింది. 1843లో సుగు ణాబాయి చొరవతో ఫూలే మిషన్ స్కూల్లో చేరి చదువు మొదలుపెట్టారు. ఒకవైపు చదువు సాగిస్తూనే, రెండోవైపు తన పొలంలోని మామిడి చెట్ల నీడలో మొట్టమొదటి పాఠశాలను ప్రారంభించారు. అందులో సుగుణాబాయి, సావి త్రీబాయితో సహా ఇంకొందరు విద్యార్థులు చేరారు. మగవారికీ, ఆధిపత్య కులాలకూ సైతం అప్పుడప్పుడే చదువు అందు తున్నది. స్త్రీలకైతే అది గగనకుసుమమే. అయినా పురుషుల కన్నా స్త్రీ విద్య అవసరం ఎక్కువని గుర్తించినందువల్లనే చెట్ల కింద విద్యాబుద్ధులు నేర్పేం దుకు జ్యోతిబా సిద్ధమయ్యారు. తరువాత పూర్తిస్థాయిలో పాఠశాలను నడపా లని నిర్ణయించుకున్నారు. అయితే బ్రిటిష్ ప్రభుత్వం అప్పటికే (1832) బాలికల కోసం పూనాలోని బుధవార్ పేట్లో పాఠశాలను ప్రారంభించింది. కానీ అందులో చేరాలంటే కలెక్టర్ అనుమతి కావాలి. ఇది ఫూలేకు నచ్చలేదు. అందుకే 1848 జనవరి 14న అదే వాడలో తాత్యాసాహెబ్ బీడే అనే బ్రాహ్మ ణుని ఇంటిలో బాలికల పాఠశాలను ఫూలే ప్రారంభించారు. సావిత్రీబా యితో సహా ఫూలే ఇంటింటికీ తిరిగి, అమ్మాయిలను పాఠశాలల్లో చేర్పిం చాలని ప్రచారం చేసేవారు. అన్నపూర్ణా జోషి, సుమతీ ముఖాషీ, దుర్గా దేశ్ ముఖ్, మాధవి దత్తే, సోనూ పవార్, జాన్ కరెడిలే అనే ఆరుగురు అమ్మా యిలు ఈ పాఠశాలలో అడుగుపెట్టారు. ఈ తొలి బృందానికి మొదటి ఉపా ధ్యాయిని సావిత్రీబాయి ఫూలే. ఆ తరువాత 1851 సెప్టెంబర్ 1న రాస్తా పేటలో ఫూలే దంపతులు మరో పాఠశాలను తెరిచారు. దీనితో పాఠశాలల్లో చేరే అమ్మాయిల సంఖ్య పెరుగుతూ వచ్చింది. పాఠశాలల సంఖ్య కూడా 18కి పెరిగింది. ఇందులో కొన్ని పాఠశాలలను అంటరాని కులాలైన మహర్, మాతంగ్ కులాల పిల్లల కోసమే నిర్వహించడం విశేషం. ప్రతిఘటనలను అధిగమించి... ఈ పాఠశాలల మీద దుష్ప్రచారంతో పాటు, ఫూలే దంపతులపై దాడులు మొదలయ్యాయి. అప్పుడు సావిత్రిబాయికి 17 ఏళ్లు. ఛాందసులు కొందరు ఈ పాఠశాలల నిర్వహణను ఆపడానికి భౌతికంగా ఆమె మీద దాడులకు సిద్ధపడ్డారు. జ్యోతిరావు తండ్రి గోవిందరావును భయపెట్టి కొడుకునీ, కోడలినీ ఇంటి నుంచి పంపించడంలో కృతకృత్యులయ్యారు. ఆ సమయంలో సావిత్రి స్నేహితురాలు ఫాతిమా షేక్ ఆశ్రయం ఇచ్చారు. పాఠశాలలు ఆగ లేదు. అలాగే దాడులూ ఆగలేదు. సావిత్రి పాఠశాలకు వెళ్తున్న సమయంలో పేడతో, రాళ్లతో చాటు నుంచి దాడిచేసేవారు. ఇది నిత్యకృత్యం కావడంతో సావిత్రీబాయి పాఠశాలకు వెళ్తున్నప్పుడు ఒక పాత చీర కట్టుకొని, మరొకటి వెంట తీసుకొని వెళ్లేవారు. కానీ వారి దాడులు రోజు రోజుకు తీవ్రమయ్యాయే తప్ప తగ్గలేదు. కొంతమంది గూండాలు ఒక యువకుడిని రెచ్చగొట్టి సావిత్రీ బాయి మీదకు ఉసిగొల్పారు. ఆ యువకుడు దుర్భాషలాడుతూ, అంటరాని కులాలకు చదువు చెప్పావంటే నీ అంతుచూస్తానని సావిత్రీబాయిపై చేయి చేసుకోబోయాడు. ఆ పరిస్థితిని ముందే గమనించిన సావిత్రీబాయి వెంటనే తేరుకొని చెంపమీద చెడామడా వాయించింది. ఆ పరిణామానికి భయపడిన ఆ యువకుడు సిగ్గుతో అక్కడి నుంచి పారిపోయాడు. దానితో మరెప్పుడూ, మరెవ్వరూ ఆమె మీద దాడికి సాహసించలేదు. ఆ సంఘటనతో సావిత్రీ బాయి మీద ప్రజలకు విశ్వాసం పెరిగింది. కాశీబాయి అనే వితంతువు గర్భవతై ఆత్మహత్యకు ప్రయత్నించింది. జ్యోతిబా వారించి, మూడు నెలల తరువాత ప్రసవించిన ఆమె కుమారుడిని దత్తత తీసుకున్నాడు. ఆ తరువాత ఇటువంటి పిల్లల కోసం బాల రక్షణ సదనాన్ని ప్రారంభించారు. వితంతువు లుగానీ, ఇతరులుగానీ పిల్లలను కని, పెంచలేని పరిస్థితి వస్తే ఈ సదనం ఆశ్రయం ఇచ్చేది. 1890 నవంబర్ 28న జ్యోతిబా మరణం సావిత్రీబాయిని కుంగదీసింది. అయినప్పటికీ వారు ప్రారంభించిన సత్యశోధక్ సమాజ్ బాధ్యతను నెత్తిన వేసుకున్నారు. ఒక వైపు విద్య, సామాజిక కార్యక్రమాల నిర్వహణతో పాటు 1897లో ప్లేగు వ్యాధి ప్రబలిన సమయంలో రాత్రింబవళ్లు రోగుల సేవలో సావిత్రీబాయి నిమగ్నమయ్యారు. అదే సమయంలో ఆమె అనారోగ్యానికి గురైంది. చివరకు 1897 మార్చి, 10 వ తేదీన తుదిశ్వాస విడిచారు. నేటికి నూటఇరవై ఏళ్ల క్రితమే బాలికల విద్య కోసం, అంటరాని కులాల అభ్యున్నతి కోసం, స్త్రీల హక్కుల కోసం అంతులేని పోరాటం చేసిన సావిత్రీబాయి నేటికీ, ఏనాటికీ మహిళా పోరాటాలకు స్ఫూర్తిదాయకమే. (జనవరి 3, సావిత్రీబాయి ఫూలే జయంతి) (వ్యాసకర్త : మల్లెపల్లి లక్ష్మయ్య, సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 97055 66213 ) -
వంద మంది టీచర్లకు సావిత్రీబాయి పూలే అవార్డులు
కర్నూలు(అర్బన్): దేశంలోనే తొలి మహిళా ఉపాధ్యాయినీ సావిత్రీబాయి పూలే జయంతి సందర్భంగా జనవరి 3వ తేదీన జిల్లాకు చెందిన వంద మంది ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, అధ్యాపకులు, హెచ్‌డబ్ల్యూఓలకు అవార్డులను అందిస్తున్నట్లు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు జే లక్ష్మినరసింహ తెలిపారు. స్థానిక మద్దూర్‌నగర్‌లోని సమాఖ్య కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏటా ఇస్తున్నట్లే ఈ ఏడాది కూడా ఉత్తమ ఉపాధ్యాయులను అవార్డులతో సన్మానిస్తామన్నారు. సావిత్రీబాయి పూలే కృషి వల్లనే నేడు మహిళలు విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక రంగాల్లో రాణిస్తున్నారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సావిత్రీబాయి ఆశయాలకు తూట్లు పొడుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళా కళాశాల వసతి గృహాలకు నేటి వరకు ఒక్క సొంత భవనం కూడా నిర్మించిన పాపాన పోలేదన్నారు. జనవరి 3న సావిత్రీబాయి పూలే జయంతిని అధికారికంగా నిర్వహించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. సమావేశంలో బీసీ జనసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు టీ శేషఫణి, ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా కార్యదర్శి ఓంకార్‌యాదవ్, విద్యార్థి సమాఖ్య జిల్లా అధ్యక్షుడు భరత్‌కుమార్, ఉపాధ్యాయులు భాస్కర్‌యాదవ్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
అక్షర జ్యోతి
‘‘కదలిరండి... చదువుకోండి. స్వశక్తితో నిలవండి. శ్రమించండి. విజ్ఞానం, ధనం ఆర్జించండి. విజ్ఞానం లేకుంటే... అన్నీ నిష్ర్పయోజనమే. వివేచన లేదంటే... మనం వింత పశువులమే. - సావిత్రీబాయి సంఘ సంస్కరణ... స్త్రీ విద్య... కుల వివక్షపై పోరాటం... వితంతువులకు తగిన గౌరవం కోసం ఉద్యమం... ఇవన్నీ ఇప్పటికీ మనం చూస్తున్న విషయాలే! వింటున్న మాటలే!! ఈ అంశాలను తల కెత్తుకొని పోరాడు తున్న వాళ్ళను ఉద్యమకారులనో, స్త్రీవాదులనో, మరొకటో ఇప్పుడు అంటున్నాం. కానీ, ఇప్పటికి 150 ఏళ్ళ క్రితమే వీటి కోసం గళం విప్పి, కదం తొక్కిన మనిషి, అందునా మహిళ ఒకరు ఉన్నారంటే నమ్ముతారా? బ్రిటిషువారి ఏలుబడిలోనే ఒక అమ్మ మరెందరో అమ్మల అవస్థల్ని తప్పించడం కోసం ఈ పోరాటం చేసిందంటే మీరేమంటారు? అలాంటి మహిళను ఏమనాలి? అందుకే, ఆధునిక భారతదేశంలో తొలితరం స్త్రీవాది... సావిత్రీ బాయి ఫూలే. స్త్రీల అభ్యున్నతికి పోరాడే వారికి నిరంతర స్ఫూర్తి. పద్దెనిమిదో శతాబ్దంలోనే ఇంతటి చైతన్యదీప్తి మన దేశంలో మార్గదర్శనం చేసిందంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆలోచనల్లో, ఆచరణలో కాలానికన్నా ముందున్న సంఘ సంస్కర్త్రి, కవయిత్రి సావిత్రి తన 66 ఏళ్ళ జీవితంలో అధికభాగం సమాజసేవకే అంకితం చేశారు. 1831 జనవరి 3న మహారాష్ర్టలోని నైగావ్‌లో రైతు కుటుంబంలో పుట్టారు సావిత్రి. తొమ్మిదేళ్ళప్పుడు 12 ఏళ్ళ జ్యోతీరావ్ ఫూలేతో పెళ్ళయింది. అప్పట్లో అన్నీ బాల్య వివాహాలే. పైగా మరణాల రేటు ఎక్కువ. దాంతో, యుక్త వయస్సు రాక ముందే ఎంతోమంది ఆడపిల్లలు వితంతువులుగా మారేవారు. ఆ వితంతువులకు గుండు కొట్టించి, సాదా ఎర్రరంగు చీర కట్టించే వారు. వాళ్ళు కఠోర నియమాలతో జీవితం సాగించాల్సి వచ్చేది. సావిత్రీబాయి ఈ ఆచారాన్ని వ్యతిరేకిస్తూ, వితంతువులకి శిరోముండనం చేయరాదని క్షురకులపై సమ్మె నిర్వహించారు. అలాగే, లైంగిక అత్యాచారానికి గురైన స్త్రీలు సమాజ నిందకు వెరచి ఆత్మహత్య చేసుకోవడమో, కడుపున పుట్టిన పసికందుల్ని చంపేయ డమో చేస్తున్నట్లు సావిత్రి గమనించారు. లైంగిక అత్యాచారానికి గురై గర్భవతు లైనవారి కోసం ‘బాలహత్యా ప్రతిబంధక్ గృహ’ అనే సంరక్షణ కేంద్రం పెట్టారు. మహిళల్ని బానిసల్లా చూసే రోజుల్లో అధ్యాపకురాలైన తొలి భారతీయ మహిళ కూడా సావిత్రీబాయే! పుణేలోని భిడే వాడాలో 1848లో బాలికల కోసం ఆ దంప తులు తొలిసారి పాఠశాల పెట్టారు. వివిధ కులాలకు చెందిన 8 మంది బాలికలు తొలి రోజునే బడిలో చేరారు. ఉద్యోగానికి ఆడ వాళ్ళు బయటకెళ్ళడం అపచారమనే ఆ రోజుల్లో ఆమె బడికి వెళుతుంటే, మగవాళ్ళు రాళ్ళు విసిరేవారు. బురద, పేడ చల్లేవారు. దాంతో సావిత్రి ఖరాబైన దుస్తులు మార్చు కోవడానికి రోజూ తనతో మరో చీర తీసు కెళ్ళాల్సొచ్చేది! అయినా 1851 నాటికల్లా 150 మంది బాలికలతో 3 స్కూళ్ళు నడిపే స్థాయికెళ్ళారు. చదువు మధ్యలో ఆపకుండా ఉండేందుకు పిల్లలకు ప్రోత్సాహకంగా స్టయిపండ్లూ ఇచ్చేవారు. కుల, లింగ వివక్ష పాటిస్తూ, మను షుల్ని తక్కువగా చూసే పద్ధతిని రూపు మాపాలని ఆమె కృషి చేశారు. అస్పృశ్యు లుగా అందరూ దూరం పెడుతున్నవాళ్ళ కోసం 1868లోనే ఆమె తమ ఇంట్లో బావి తవ్వించారు. వాళ్ళంతా మంచినీటి కోసం దాన్ని వాడుకొనేలా చూశారు. పక్షవాతానికి గురైన భర్తకు దగ్గరుండి సేవచేసిన సావిత్రి, ఆయన చనిపోయినప్పుడు హిందూ ఆచారాల్ని తోసిపుచ్చి, చితి కుండ చేత పట్టి, అంతిమయాత్రలో ముందు నిలిచారు. జ్యోతీరావ్ ఫూలే, సావిత్రి దంపతులకు పిల్లలు లేరు. ఒక బ్రాహ్మణ వితంతువు బిడ్డ అయిన యశ్వంత్రావ్ను పెంచుకున్నారు. డాక్టర్‌గా శిక్షణ పొందిన అతనూ తల్లితో పాటు సమాజసేవలో నడిచారు. 1897 ప్రాంతంలో పుణే పరిసరాల్లో భయం కర ప్లేగు వ్యాధి వ్యాపించింది. అప్పుడు రోగులకు చికిత్స అందించడానికి పుణేకు దగ్గరలో, జనావాసాలకు దూరంగా ససానే మాలాలో సావిత్రి తన బిడ్డతో కలసి చికిత్సాలయం ఏర్పాటుచేశారు. తానే స్వయంగా రోగుల్ని తీసుకువెళ్ళి, చికిత్స చేయించేవారు. అలా రోగుల బాగోగులు చూస్తున్నప్పుడే ఆమెకూ ప్లేగు సోకింది. రోగులకు సేవ చేస్తూనే 1897 మార్చి 10న ఆమె కన్నుమూశారు. ఆమె కవితా సంపు టాలు ‘కాబ్య ఫూలే’, ‘బవన్ కషీ సుబోధ్ రత్నాకర్’ మరాఠీ సాహిత్యంలో ప్రసిద్ధం. ఒక్కమాటలో ఆధునిక భారతదేశంలో స్త్రీ విద్యకు సావిత్రి ఆద్యురాలు. ఇవాళ చదువుకుంటున్న ఆడవాళ్ళందరూ ఆమెకు బుుణగ్రస్థులే. పుణేలో ‘హెరిటేజ్ వాక్’కు వెళితే, సావిత్రి స్థాపించిన బాలికల బడి ఇప్పటికీ సందర్శనీయ స్థలం. ఇవాళ్టికీ అనేకచోట్ల ఆమె జీవితంపై మరాఠీ నాటక ప్రదర్శన జరుగుతుంటే, ఆడిటోరియవ్ు హౌస్‌ఫుల్. అలా ఆ స్త్రీమూర్తి జీవితం ఇన్నేళ్ళ తర్వాతా లక్షలమందికి స్ఫూర్తినిస్తోం దంటే అంతకన్నా మణిదీపమెవరుంటారు! చిత్రమేమంటే, జ్యోతిబా ఫూలేకు ఆలస్యంగానైనా భారత సామాజిక విప్లవ పితామహుడిగా గుర్తింపు వచ్చింది. కానీ, ఆయనకు బాసటగా నిలిచి, భారతీయ స్త్రీల స్వేచ్ఛకు శ్వాసనిచ్చిన సావిత్రీబాయ్కి దేశ వ్యాప్తంగా అంత గుర్తింపునిచ్చామంటారా! ఆడవాళ్ళు బయటకెళ్ళడం అపచారమనే ఆ రోజుల్లో ఆమె బడికి వెళుతుంటే, మగవాళ్ళు రాళ్ళు విసిరేవారు. బురద, పేడ చల్లేవారు. దాంతో సావిత్రి ఖరాబైన దుస్తులు మార్చుకోవడానికి రోజూ తనతో మరో చీర తీసుకెళ్ళాల్సొచ్చేది! - రెంటాల -
ఆధునిక భారత చరిత్రలో ధృవతార సావిత్రీబాయి ఫూలే
భారతదేశంలో ప్రముఖ సంఘ సంస్కర్తలలో సావిత్రీబాయి ఫూలే ఒకరు. ఆమె దేశంలో తొలి ఆదర్శ ఉపాధ్యాయిని. బ్రిటిష్ పాలన నాటి ప్రజల స్థితిగతులు, విద్య, సాంఘిక దురాచారాలు, సతీ సహగమనం, బాల్య వివాహాలు సావిత్రీబాయిని కదిలించాయి. మహారాష్ట్రలో సతారా జిల్లాకు చెందిన నయ్గావ్లో 1831వ సంవత్సరం జనవరి 3వ తేదీన సావిత్రీబాయి జన్మించింది. ఈమెది కూడా బాల్య వివాహమే. ఆమె వివాహం సంఘసంస్కర్త జ్యోతిరావు ఫూలేతో జరిగింది. వివాహానంతరం సావిత్రీబాయికి విద్యాభ్యాసం చేసి ఉపాధ్యాయ శిక్షణ ఇప్పించారు. కుల వ్యవస్థ నిర్మూలనకు, పీడిత ప్రజానీకం పట్ల ఆమె మనసులో ఆలోచనలను గుర్తించిన జ్యోతిరావు ఫూలే బాలికల పాఠశాల ప్రారంభించడానికి ప్రయత్నం చేశారు. 1848వ సంవత్సరంలో మహారాష్ట్రలోని పుణే లో ఒక ఇంట్లో బాలికల పాఠశాలను సావిత్రీబాయి ప్రారంభించింది. ఆమె ప్రధానోపాధ్యాయినిగా 9 మంది పిల్లలతో బడి నడిపేది. ఈ పాఠశాల నడపటం ఉన్నత, అగ్రవ ర్ణాలకు నచ్చలేదు. దీంతో సావిత్రీ బాయిపై వేధింపులకు, భౌతికదాడు లకు పూనుకున్నారు. పాఠశాలకు నడిచే దారిలో ఆమెపై బురద చల్ల డం, రాళ్లు విసరడం, అసభ్య పదజా లాన్ని వాడటం వంటివి చేశారు. బుర దతో మలినమైన చీరను పాఠశాలకు వెళ్లిన తరువాత మార్చుకుని, మరల వచ్చేటప్పుడు బురద చీరను కట్టుకుని వచ్చేది. ఎవరైనా అడిగిన ప్పుడు ధైర్యంగా ‘నా విధిని నేను నిర్వహిస్తున్నాను’ అని చెప్పేది. అయినా రోజూ వేధింపులకు విసిగి ఒకరోజు ఒకడి చెంప పగులకొట్టింది. పట్టు వీడక వారు సాగించిన విద్యా ఉద్యమా నికి తక్కువ కాలంలోనే సహకారం గుర్తింపు లభిం చాయి. ఒక ముస్లిం వ్యక్తి తన ఇంటిని బడికి కేటా యించాడు. కొంత మంది పుస్తకాలు సేకరించారు. మోరోవిఠల్, వాల్వేకర్, దియోరావ్ వంటి ప్రముఖులు పాఠశాల నిర్వహ ణకు సహకరించారు. 1851లో మరల పాఠశాల ప్రారంభించారు. బాలికల చదువు కోసం, విద్యాభి వృద్ధి కోసం సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేసింది. ఈ కృషిని గుర్తించిన ఆనాటి ప్రభుత్వం 1851, నవంబర్ 16న విద్యాశాఖ ఆధ్వర్యంలో శాలు వాలతో ఘనంగా సత్కరించింది. తన జీవితాన్ని త్యాగం చేసి విద్యాబోధనకు, బాలికలకు అంకిత మైంది. సాంఘిక దురాచారాల నిర్మూలన కోసం పెద్దలతో ఘర్షణ పడవలసివచ్చినా బెదరలేదు. వితంతువులకు శిరోముండనం చేయబోమంటూ క్షురకులను చైతన్యవంతులను చేసింది. అనాథ స్త్రీలకు, పిల్లలకు శరణాలయాలు, ఆశ్రమాలు ఏర్పా టు చేయించింది. సత్యశోధక సమాజంలో మహిళా విభాగాన్ని ఏర్పాటు చేసి కులాంతర వితంతు వివాహాలు జరిపించింది. 1890లో భర్త జ్యోతిరావు ఫూలే మరణిస్తే అంత్యక్రియలు జరిపే సందర్భంలో బంధువులు, దత్తపుత్రులు ఘర్షణ పడుతుంటే తానే చితికి నిప్పు అంటించి అంత్యక్రియలు పూర్తి చేసిం ది. ఆమె తెగువకు యావత్ భారతదేశం దిగ్భ్రాంతి చెందింది. సామాజిక సేవలో అంతిమశ్వాస 1890వ దశకంలో ప్లేగు వ్యాధి బారినపడిన పిల్లల కోసం వైద్య శిబిరాలు నిర్వహించింది. దుర్భరమైన కరువు పరిస్థితుల్లో కూడా రోజుకు 2 వేల మంది పిల్లలకు భోజనాలు పెట్టించింది. 1897వ సంవత్స రం, మార్చి 10న ఒక పిల్లవాడికి సేవ చేస్తుండగా ఆమెకు ఆ వ్యాధే సోకి మరణించింది. క్రాంతి బాయిగా ప్రజలందరూ పిలుచుకునే సావిత్రీబాయి ఫూలే ఆధునిక భారతదేశ చరిత్రలో ధృవతారగా వెలుగొందుతూనే ఉంటుంది. (నేడు సావిత్రీబాయి ఫూలే 185వ జయంతి) కె.విజయగౌరి యూటీఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షులు -
మహిళల హక్కుల కోసం రాజీలేని పోరాటం
జనవరి 3వ తేదీ భారతీయ తొలి ఉపాధ్యాయు రాలు సావిత్రీబాయి ఫూలే 185వ జయంతి. స్త్రీలపై సామాజిక అణచివేత, కులవ్యవస్థ పీడన, దోపిడీకి వ్యతిరేకంగా ఆమె గత శతాబ్దంలోనే సామాజిక ఉద్యమాలను సాగించారు. సావిత్రీబాయి ఫూలే జయంతి రోజునే ప్రగతిశీల మహిళా సంఘం (పీఓడబ్ల్యూ) ఖమ్మం జిల్లాలో 6వ రాష్ట్ర మహా సభలు జరుపుకోబోతోంది. జనవరి 3 నుంచి 5 వరకు జరుగనున్న ఈ మహాసభ తెలంగాణ రాష్ట్రంలో తొలి మహాసభ. 2006లో విశాఖపట్నం లో జరిగిన 5వ రాష్ట్ర మహాసభ నుంచి నిర్వహిం చిన కార్యక్రమాలను పోరాటాలను సమీక్షించుకుని భవిష్యత్ ఉద్యమ కర్తవ్యాలను రూపొందించుకో వడానికి ఖమ్మంలో 6వ మహాసభలను జరుపు కుంటోంది. ప్రగతిశీల మహిళా సంఘం 1974లో ఉస్మా నియా విశ్వవిద్యాలయంలో అభ్యుదయ మహిళా సంఘంగా ఆవిర్భవించింది. ప్రారంభమైనప్పటి నుంచి మహిళల సాధారణ సమ స్యలపై కేంద్రీకరించడమే కాకుం డా రమీజాబీ, మధురలపై అత్యా చారం వంటి సామాజిక సమస్య లపై పీఓడబ్ల్యూ తీవ్రంగా పోరా డింది. సారా వ్యతిరేక ఉద్యమం లో, మహిళల్ని వ్యభిచార కూపా ల్లోకి లాగే ముఠాలకు, అందాల పోటీలకు వ్యతిరేకంగా సంస్థ కార్యకర్తలు ఆందోళనలు చేపట్టి అరెస్టయ్యారు. గిరిజన తండాల్లో ఆడపిల్లల్ని అమ్మే యడం, వారిని విదేశాలకు ఎగుమతి చేయడంలో డీజీపీ భార్య తోడ్పాటు వంటి ఘటనలపై ఆందో ళన చేపట్టింది. నిర్భయ ఘటనపై దేశవ్యాప్త ఉద్య మంలో పీఓడబ్ల్యూ భాగస్వామ్యం తీసుకుంది. చట్టాలను అమలు చేసే పోలీసులు, న్యాయమూ ర్తులు, రాజకీయ నేతలకు మహిళా దృక్పథాన్ని అల వర్చాల్సిన అవసరముందని ఎలుగెత్తింది. స్త్ర్రీలపై వివక్షతకు వ్యతిరేకంగానూ, గౌరవ ప్రదమైన జీవితం కోసం పీఓడ బ్ల్యూ పోరాడుతోంది. విద్యార్థిను లపై జరుగుతున్న అవమానాలకూ, వేధింపులకూ వ్యతిరేకంగా పీఓడ బ్ల్యూ తన పిడికిలి బిగించింది. మహిళలపై హింసకు వ్యతిరేకంగా, వరకట్న హత్యలు, అత్యాచారాలు, బాల్య వివాహాలు, అశ్లీలత సమస్య లపై ఉద్యమాలు నిర్మించింది. వివ క్షత, అవిద్య, దోపిడీ, అణచివేతలో మగ్గిపోతున్న మహిళల విముక్తికి సామాజిక మార్పు అవసరాన్ని గుర్తించి దాన్ని తన లక్ష్యంగా మార్చుకుంది. స్త్రీలు ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకునే చైతన్యాన్ని అంది స్తూనే సమాజ మార్పు కోసం జరిగే పోరాటాల్లో మమేకమవుతోంది. నేడు సమాజంలో మహిళల మనుగడ, భద్రత, ఉపాధి ప్రశ్నార్థకంగా మారిన ప్రత్యేక పరిస్థితుల్లో ప్రగతిశీల మహిళా సంఘం తెలంగాణ 6వ మహా సభను జరుపుకుంటున్నది. ఖమ్మం జిల్లాలో మహి ళలకు తెలంగాణ సాయుధ పోరాట కాలం నుంచి ఉన్న పోరాట వారసత్వం స్ఫూర్తిని పీఓడబ్ల్యూ అందిపుచ్చుకుంటుంది. ఆనాడు రాంబాయమ్మ, గోదావరి లోయ ప్రతిఘటన పోరులో శాంతక్క, లలితక్క ప్రాణాలర్పించారు. పీఓడబ్ల్యూ జిల్లా నేతలు సుశేన, చింతా లక్ష్మిలను బూటకపు ఎన్‌కౌం టర్లలో పోలీసులు కాల్చిచంపారు. ప్రత్యేక తెలం గాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం కూడా సంస్థ క్రియాశీ లకంగా ఉద్యమించింది. పార్లమెంటులో బిల్లుపె ట్టాలని ఆందోళన నిర్వహించింది. తెలంగాణ జేఏసీ ఇచ్చిన పిలుపులో అగ్రభాగాన ఉంది. మిలియన్ మార్చ్, సాగరహారం, రైల్ రోకో, బంద్ కార్యక్ర మాల్లో పాల్గొంది. స్త్రీలపై శారీరక, మానసిక హింస లను అరికట్టడానికి ఉద్యమాలను నిర్మించాల్సిన కర్త వ్యం మహిళా ఉద్యమంపై ఉంది. - జి. ఝాన్సీ పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు