మహిళల హక్కుల కోసం రాజీలేని పోరాటం
జనవరి 3వ తేదీ భారతీయ తొలి ఉపాధ్యాయు రాలు సావిత్రీబాయి ఫూలే 185వ జయంతి. స్త్రీలపై సామాజిక అణచివేత, కులవ్యవస్థ పీడన, దోపిడీకి వ్యతిరేకంగా ఆమె గత శతాబ్దంలోనే సామాజిక ఉద్యమాలను సాగించారు. సావిత్రీబాయి ఫూలే జయంతి రోజునే ప్రగతిశీల మహిళా సంఘం (పీఓడబ్ల్యూ) ఖమ్మం జిల్లాలో 6వ రాష్ట్ర మహా సభలు జరుపుకోబోతోంది. జనవరి 3 నుంచి 5 వరకు జరుగనున్న ఈ మహాసభ తెలంగాణ రాష్ట్రంలో తొలి మహాసభ. 2006లో విశాఖపట్నం లో జరిగిన 5వ రాష్ట్ర మహాసభ నుంచి నిర్వహిం చిన కార్యక్రమాలను పోరాటాలను సమీక్షించుకుని భవిష్యత్ ఉద్యమ కర్తవ్యాలను రూపొందించుకో వడానికి ఖమ్మంలో 6వ మహాసభలను జరుపు కుంటోంది.
ప్రగతిశీల మహిళా సంఘం 1974లో ఉస్మా నియా విశ్వవిద్యాలయంలో అభ్యుదయ మహిళా సంఘంగా ఆవిర్భవించింది. ప్రారంభమైనప్పటి నుంచి మహిళల సాధారణ సమ స్యలపై కేంద్రీకరించడమే కాకుం డా రమీజాబీ, మధురలపై అత్యా చారం వంటి సామాజిక సమస్య లపై పీఓడబ్ల్యూ తీవ్రంగా పోరా డింది. సారా వ్యతిరేక ఉద్యమం లో, మహిళల్ని వ్యభిచార కూపా ల్లోకి లాగే ముఠాలకు, అందాల పోటీలకు వ్యతిరేకంగా సంస్థ కార్యకర్తలు ఆందోళనలు చేపట్టి అరెస్టయ్యారు. గిరిజన తండాల్లో ఆడపిల్లల్ని అమ్మే యడం, వారిని విదేశాలకు ఎగుమతి చేయడంలో డీజీపీ భార్య తోడ్పాటు వంటి ఘటనలపై ఆందో ళన చేపట్టింది.
నిర్భయ ఘటనపై దేశవ్యాప్త ఉద్య మంలో పీఓడబ్ల్యూ భాగస్వామ్యం తీసుకుంది. చట్టాలను అమలు చేసే పోలీసులు, న్యాయమూ ర్తులు, రాజకీయ నేతలకు మహిళా దృక్పథాన్ని అల వర్చాల్సిన అవసరముందని ఎలుగెత్తింది. స్త్ర్రీలపై వివక్షతకు వ్యతిరేకంగానూ, గౌరవ ప్రదమైన జీవితం కోసం పీఓడ బ్ల్యూ పోరాడుతోంది. విద్యార్థిను లపై జరుగుతున్న అవమానాలకూ, వేధింపులకూ వ్యతిరేకంగా పీఓడ బ్ల్యూ తన పిడికిలి బిగించింది. మహిళలపై హింసకు వ్యతిరేకంగా, వరకట్న హత్యలు, అత్యాచారాలు, బాల్య వివాహాలు, అశ్లీలత సమస్య లపై ఉద్యమాలు నిర్మించింది. వివ క్షత, అవిద్య, దోపిడీ, అణచివేతలో మగ్గిపోతున్న మహిళల విముక్తికి సామాజిక మార్పు అవసరాన్ని గుర్తించి దాన్ని తన లక్ష్యంగా మార్చుకుంది. స్త్రీలు ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకునే చైతన్యాన్ని అంది స్తూనే సమాజ మార్పు కోసం జరిగే పోరాటాల్లో మమేకమవుతోంది.
నేడు సమాజంలో మహిళల మనుగడ, భద్రత, ఉపాధి ప్రశ్నార్థకంగా మారిన ప్రత్యేక పరిస్థితుల్లో ప్రగతిశీల మహిళా సంఘం తెలంగాణ 6వ మహా సభను జరుపుకుంటున్నది. ఖమ్మం జిల్లాలో మహి ళలకు తెలంగాణ సాయుధ పోరాట కాలం నుంచి ఉన్న పోరాట వారసత్వం స్ఫూర్తిని పీఓడబ్ల్యూ అందిపుచ్చుకుంటుంది. ఆనాడు రాంబాయమ్మ, గోదావరి లోయ ప్రతిఘటన పోరులో శాంతక్క, లలితక్క ప్రాణాలర్పించారు. పీఓడబ్ల్యూ జిల్లా నేతలు సుశేన, చింతా లక్ష్మిలను బూటకపు ఎన్‌కౌం టర్లలో పోలీసులు కాల్చిచంపారు. ప్రత్యేక తెలం గాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం కూడా సంస్థ క్రియాశీ లకంగా ఉద్యమించింది. పార్లమెంటులో బిల్లుపె ట్టాలని ఆందోళన నిర్వహించింది. తెలంగాణ జేఏసీ ఇచ్చిన పిలుపులో అగ్రభాగాన ఉంది. మిలియన్ మార్చ్, సాగరహారం, రైల్ రోకో, బంద్ కార్యక్ర మాల్లో పాల్గొంది. స్త్రీలపై శారీరక, మానసిక హింస లను అరికట్టడానికి ఉద్యమాలను నిర్మించాల్సిన కర్త వ్యం మహిళా ఉద్యమంపై ఉంది.
- జి. ఝాన్సీ పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు