బీజేపీ ఎంపీ సావిత్రిబాయి ఫూలె
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ దళిత ఎంపీ సావిత్రిబాయి ఫూలె సొంత పార్టీపైనే తిరుగుబాటు జెంగా ఎగురవేశారు. మోదీ సర్కారు ఎస్సీ, ఎస్టీ వ్యతిరేక విధానాన్ని అనుసరిస్తోందని ఆమె మండిపడుతున్నారు. బడుగు, బలహీన వర్గాలకు ప్రస్తుతం అందజేస్తున్న రిజర్వేషన్ ఎత్తివేసేందుకు కుట్ర జరుగుతోందని, దీనికి వ్యతిరేకంగా ఏప్రిల్ 1న లక్నోలో తాను ర్యాలీ నిర్వహించబోతున్నట్టు స్పష్టం చేశారు. సొంత పార్టీలోనే రిజర్వేషన్‌కు వ్యతిరేకంగా కొందరు గళమెత్తుతున్నారని బహ్రైచ్ ఎంపీ అయిన సావిత్రి బాయి మండిపడ్డారు. తనకు వ్యతిరేకంగా బీజేపీ చర్య తీసుకుంటే.. రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరించినట్టేనని ఆమె అంటున్నారు.
‘రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లు సమీక్షించాలన్న చర్చ నిరంతరం కొనసాగుతూనే ఉంది. ఇది రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు జరుగుతున్న రహస్య కుట్ర ఇది. రిజర్వేషన్లను కాపాడుకునేందుకు నేను ఇప్పటికే బహ్రైచ్‌లోని నాన్‌పరాలో ర్యాలీ నిర్వహించాను. త్వరలో లక్నోలోని కాశీరాం స్మృతివనంలో ‘అరక్షన్ (రిజర్వేషన్) బచావో ర్యాలీ’ని నిర్వహించబోతున్నాను’ అని మీడియాతో తెలిపారు. రిజర్వేషన్లను ఎత్తివేసే ప్రయత్నాన్ని తాను తీవ్రంగా అడ్డుకుంటానని, ఈ విషయంలో ఎంతదూరం వెళ్లేందుకైనా సిద్ధమేనని ఆమె సవాల్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment