MA
-
చరిత్ర సృష్టించిన సిలికానాంధ్ర స్నాతకోత్సవం..ఏకంగా 16 మంది..
కాలిఫోర్నియాలో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం ఆరవ స్నాతకోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ స్నాతకోత్సవం అత్యంత చరిత్రాత్మకమైనది. ఎందుకంటే రెండువేల ఏళ్ళనాటి చరిత్రలో తొలి సారిగా ఒక విదేశం..అంటే అమెరికాలో 16 మంది తెలుగులో మాస్టర్స్ డిగ్రీ పట్టాలు అందుకున్నారు. ఆ 16 మందిలో ఒకరు వంగెన్ చిట్టెన్ రాజు చెప్పారు. "సరిగ్గా 50 ఏళ్ళ క్రితం, 1974 లో బొంబాయి ఇండియన్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి డాక్టరేట్ పట్టా అందుకున్న నేను ఈ ఏడాది 2024లో తెలుగులో ఎంఏ పట్టా అందుకోవడం భలే ఆనందంగా అనిపించిందంన్నారు" చిట్టెన్ రాజు . అందుకోసమే వంగెన్ చిట్టెన్ రాజు గారి కుటుంబం అంతా కలిసి ఈ స్నాతకోత్సవంలో పాల్గొనడానికి సిద్ధమయ్యింది. అయితే తెలుగులో పట్టభద్రులైన ఆ 16 మందిలో వంగెన్ చిట్టెన్ రాజుగారి వయసులో అందరికంటే పెద్ద వ్యక్తి. ఆయన 76 ఏళ్ల వయసులో సిలికానాంధ్ర విశ్వ విద్యాలయం లో ఈ ఎంఏ తెలుగు కోర్స్‌లో చేరడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం వారు వేలిడిక్టోరియన్ స్థాయిలో ఆయన్ను మాట్లాడమని తగిన ఏర్పాట్లు కూడా చేశారు. వృధాప్య రీత్యా వచ్చే శారీరక సమస్యలు కారణంగా కాలిఫోర్నియాలో జరుగుతున్న సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి వెళ్లలేకపోయారు. దీంతో సహాధ్యాయులు రావడం కుదరకపోతే కనీసం వీడియోలో సందేశం పంపిస్తే దాన్ని ఈ కార్యక్రమం రోజున ప్రశారం చేస్తామని చెప్పారు. ఇదేదో బాగానే ఉందని వంగెన్ చిట్టెన్ రాజు గారు..తాను సిద్ధం చేసుకున్న గ్రాడ్యయేషణ గౌనూ, టోపీ పెట్టుకుని తన ఇంట్లోనే కూర్చొని ప్రసంగం రికార్డు చేసి పంపించడం జరిగింది. ఆ ప్రసంగంలో ఆయన తెలుగు శాఖని పటిష్టం చేయడానికి, వంగూరి సంస్థ ఆశయాలు, భాష, సాహిత్యాల అభివృద్ధికి తన వంతుగా లక్ష డాలర్ల విరాశంతో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఎండోమెంట్ ఫండ్ ఫర్ తెలుగు స్టడీస్ పేరిట ధార్మిక నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దానికి అందరూ చప్పట్లు కొడుతూ స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వడం జరిగింది. అంతేగాదు మన సనాతన భారతీయ భాషా, సాహిత్య, సాంస్కృతిక, సంగీత, నాట్య సంపదలని, కళారూపాలని స్నాతకోత్తర స్థాయిలో అధ్యయన అవకాశాలని కల్పిస్తున్న సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం, ఇతర వ్యవస్థలని మనం అందరం బలోపేతం చేయ్యాలి అని చెప్పారు. ఇలా అందరం కలిసి తలో చెయ్యీ వేసి ప్రోత్సహిస్తేనే కదా బావితరాలకి మన సాంస్కృతిక అస్తిత్వాన్ని అందజేయగలం అని చెప్పారు చిట్టెన్ రాజు. ఇక వంగెన్ చిట్టెన్ రాజు గారి తోపాటు ఎంఏ పట్టాలు తీసుకుంటున్న 15 మంది ఎవరంటే.. ప్రముఖ రచయిత్రి కొమరవోలు సరోజ (కెనడా), అమెరికాలో పలు నగరాల నుంచి అమృతవల్లి కవి, భాస్కర్ రాయవరం, వేణు ఓరుగంటి, కిరణ్ సింహాద్రి, మధు కిరణ్ ఇవటూరి, పావని తణికెళ్ళ, ప్రసాద్ జోస్యుల, రామారావు పాలూరి, శ్రీ గౌరి బానావత్తుల, శ్రీని రామనాధం, సుమలిని సోమ, సువర్ణ ఆదెపు, వేణుగోపాల నారాయణ భట్ల, విద్యాధర్ తాతినేని తదితరులు. అలాగే మాకు అసమానమైన పాండిత్యమూ, బోధనా పటిమలతో రెండేళ్ళు పాఠాలు చెప్పి, పరీక్షలు పెట్టి, పరిశోధనలు చేయించి, థీసిస్ లు రాయించి పట్టాలు ఇప్పించిన ఆచార్యులు సి. మృణాళిని, పాలెపు వారిజా రాణి, అద్దంకి శ్రీనివాస్, లక్ష్మణ చక్రవర్తి, గురజాడ శ్రీశ్రీ, గంగిశెట్టి లక్ష్మీనారాయణ గార్లు. వీరిలో మృణాళిని గారు, వారిజా రాణి గారు తదితరులు ఈ స్నాతకోత్సవంలో పాలుపంచుకున్నారు. ఈ స్నాతకోత్సవం లో తెలుగు పట్టభద్రులతో పాటు కూచిపూడి నృత్యం, భరత నానాట్యం, హిందూస్తానీ సంగీతం, కర్నాటక సంగీతం, భరత నాట్యం విభాగాలలో సుమారు 40 మంది మాస్టర్స్, డిప్లమా లు అందుకున్నారు. అది కూడా చరిత్రలో ఒక మైలు రాయి. కాగా, ఈ స్నాతకోత్సవంలో ప్రత్యేక అతిధిగా పాల్గొన్న ఆనంద్ కూచిభొట్ల, వైద్యులు డా. ముక్కామల అప్పారావు (డిట్రాయిట్) గారు, డా. కేశవ రావు గారు అనుకోని పనిమీద హ్యూస్టన్ వచ్చి వంగూరి చిట్టెన్ రాజుగారిని పరామర్శించడం విశేషం. ఇక చిట్టెన్ రాజు గారు ఎంఏ తెలుగు పట్టాలో పరిశోధానంశం “అమెరికా తెలుగు డయస్పోరా కథలు-చారిత్రక, వస్తు విశ్లేషణ.వంగూరీ చిట్టెన్ రాజు(చదవండి: 18వ ఆటా కన్వెన్షన్ యూత్ కాన్ఫరెన్స్ సర్వం సన్నద్ధం!) -
యాకమ్మ ఒక గొప్ప వెలుగు
తాళ్లపల్లి యాకమ్మ ఇంట్లో ఎవరూ చదువుకోలేదు. కథలు అంటే తెలియదు. మహబూబాబాద్ దళితవాడలో అర్ధాకలితో పెరిగిన యాకమ్మ తల్లిదండ్రుల్ని కోరింది ఒక్కటే – చదివించమని. ఇంటర్లో పెళ్లయినా ఆ తర్వాత పిల్లలు పుట్టినా యాకమ్మ చదువు మానలేదు. తెలుగులో పిహెచ్డి చేసింది. ఎం.ఏ సంస్కృతం చేసింది. ఆ సమయంలో కథలు చదివి తన బతుకు గోస కూడా కథలుగా రాయాలనుకుంది. రెండు కథాసంపుటాలు, ఒక నవల వెలువరించింది. ‘చదువుకుంటే ఏమవుతుందో నన్ను చూసైనా నా జాతి ఆడపిల్లలు తెలుసుకోవాలని నా తపన’ అంటున్న యాకమ్మ పరిచయం. ‘దళిత ఆడపిల్లలు బాగా చదువుకోవాలి. ఉద్యోగాలు తెచ్చుకోవాలి. ఆర్థికంగా గట్టిగా నిలబడాలి. ఆ తర్వాత రాజకీయ అధికారం కోసం ప్రయత్నించి పదవులు పొంది దళితుల కోసం, పేదల కోసం పని చేయాలి’ అంటారు యాకమ్మ. ఆమె ‘కెరటం’ అనే దళిత నవల రాశారు. అందులోని మల్లమ్మ అనే దళిత మహిళ పాత్ర అలాగే ప్రస్థానం సాగిస్తుంది. కష్టపడి చదువుకుని, ఉద్యోగం పొంది, ఆ తర్వాత సవాళ్లను ఎదుర్కొని సర్పంచ్ అయ్యి, ఆ తర్వాత ఎం.ఎల్.ఏ. అవుతుంది. ‘ప్రజలు’ ఎప్పుడూ ప్రజలుగానే ఉండిపోవడం ఏ కొద్దిమంది మాత్రమే ఎం.ఎల్.ఏనో ఎం.పినో అవ్వాలనుకోవడం ఎందుకు అని యాకమ్మ ప్రశ్న. యాకమ్మది వరంగల్ జిల్లా మహబూబాబాద్. అక్కడికి దగ్గరగా ఉన్న అన్నారంలోని యాకూబ్ షా వలీ దర్గాలో మొక్కుకుంటే పుట్టిందని తల్లిదండ్రులు యాకమ్మ అని పేరు పెట్టారు. ఇంటికి పెద్ద కూతురు యాకమ్మ. ఇంకో చెల్లి. తండ్రి మాదిగ కులవృత్తిని నిరాకరించి దొర దగ్గర జీతానికి పోయేవాడు. తల్లి కూలి పని చేసేది. ఇద్దరూ కూడా తమకు పుట్టిన ఇద్దరు ఆడపిల్లలు తమలాంటి జీవితం కాకుండా మంచి జీవితం చూడాలని అనుకునేవారు. ముఖ్యంగా తల్లి అబ్బమ్మ తన కూతుళ్లను బాగా చదివించాలనుకునేది. యాకమ్మ కూడా అందుకు తగ్గట్టే చదువును ఇష్టపడేది. అక్కడ పదోతరగతి దాటితే పెళ్లి చేయడం ఆనవాయితీ. యాకమ్మ ఇంటర్‌కు రాగానే పెళ్లి చేయాలని తల్లిదండ్రులు అనుకున్నారు. యాకమ్మ తల్లిదండ్రులను, భర్తను అడిగింది ఒక్కటే– పెళ్లయ్యాక కూడా చదువు కొనసాగించేందుకు అనుమతి ఇవ్వమని. మంచినీళ్లు తాగి పెళ్లయ్యాక అత్తగారింట యాకమ్మకు చదువు వీలయ్యేది కాదు. భర్త వీరాస్వామి డ్రైవర్‌గా పని చేసేవాడు. అతని తోబుట్టువుల రాకపోకలు ఉండేవి. సంపాదన చాలక తినడానికి కూడా ఉండేది కాదు. తల్లిదండ్రులు ఇచ్చిన రెండు జతల బట్టలతోనే కాలేజీకి వెళ్లి డిగ్రీ పూర్తి చేసింది యాకమ్మ. లంచ్బెల్లో స్నేహితురాళ్లు లంచ్ చేస్తుంటే దూరంగా చెట్టు కింద కూచుని మంచినీళ్లు తాగి మళ్లీ తరగతులకు వచ్చేది. ఆకలి ఉన్నా చదువు ఆపలేదు. ఇద్దరు పిల్లలు పుట్టినా చదువు ఆపలేదు. తెలుగులో పీహెచ్డీ యాకమ్మ కాకతీయ యూనివర్సిటీలో పి.జి. ఆ తర్వాత ద్రవిడ యూనివర్సిటీ నుంచి పి.హెచ్.డి. చేసింది. తెలుగు పండిట్‌గా ఉద్యోగం రావడంతో పిల్లలకు పాఠాలు చెప్పాలంటే సంస్కృతం కూడా తెలిసి ఉండాలని సంస్కృతంలో పి.జి. చేసింది. ఆ సమయంలోనే తన గైడ్ బన్న ఐలయ్య ద్వారా సాహిత్యం తెలిసింది. కథలు చదివే కొద్దీ తన జీవితంలోనే ఎన్నో కథలు ఉన్నాయి ఎందుకు రాయకూడదు అనిపించింది. కాని ఎలా రాయాలో తెలియదు. అయినా సరే ప్రయత్నించి రాసింది. ‘కథలు రాస్తున్నాను’ అని వారికీ వీరికీ చెప్తే ‘ఈమె కూడా పెద్ద రచయితనా? ఈమెకు ఏం రాయవచ్చు’ అని హేళన చేశారు. కానీ వాళ్లే ఆ తర్వాత ఆమె రచనలను అంగీకరించారు. యాకమ్మ కుమార్తె ఎం.బి.బి.ఎస్ చేస్తోంది. కుమారుడు ఇంటర్ చదువుతున్నాడు. భర్త అనారోగ్యం వల్ల పని తగ్గించుకున్నాడు. ఇంటిని, ఉద్యోగాన్ని చూసుకుంటూనే కథను విడవకుండా సాధన చేస్తోంది యాకమ్మ. చదువుకుంటే జీవితాలు మారతాయని తనను చూసి తెలుసుకోండి అని అట్టడుగు వర్గాల ఆడపిల్లలకు ఆమె మాటల ద్వారానో కథల ద్వారానో చెప్తూనే ఉంటుంది. ‘ఆడపిల్లలు చదువుకోవాలి. సమాజాన్ని మార్చాలి. పెళ్లి పేరుతోనో డబ్బులేదనో వారిని చదువుకు దూరం చేయొద్దు’ అంటుంది యాకమ్మ. ఆమె చీకట్లను తరిమికొట్టడానికి విద్యను, సాహిత్యాన్ని ఉపయోగిస్తోంది. యాకమ్మ ఒక గొప్ప వెలుగు. రెండు సంపుటాలు యాకమ్మ 2018 నుంచి రాయడం మొదలుపెట్టింది. కథ వెంట కథ రాసింది. ‘మమతల మల్లెలు’, ‘రక్షణ’ అనే రెండు సంపుటాలు వెలువరించింది. ఆ తర్వాత దళిత నవల ‘కెరటం’ రాసింది. తన జీవితం నుంచి తాను చూసిన జీవితాల నుంచి కథలను వెతికింది. వెతలు తెలిపింది. కోవిడ్ నేపథ్యంలో వరుసపెట్టి కథలు రాసి ‘దుఃఖ నది’ అనే సంకలనం తెచ్చింది. వెక్కిరించిన వాళ్లు, వివక్ష చూపిన వారు మెల్లగా సర్దుకున్నారు. వరంగల్ జిల్లా మొత్తం ఇప్పుడు యాకమ్మ అంటే ‘కథలు రాసే యాకమ్మేనా’ అని గుర్తిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు పిలుస్తున్నారు. అవార్డులు ఇస్తున్నారు. ఇదీ యాకమ్మ ఘనత. – సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ఇందులో తక్కువ కులం ఏది? ప్రశ్నాపత్రంపై తీవ్ర దుమారం
చెన్నై: తమిళనాడు పెరియార్ యూనివర్సిటీ పరీక్షల్లో ఓ ప్రశ్నాపత్రంలో కులానికి సంబంధించిన ప్రశ్న అడగటం తీవ్ర దుమారం రేపింది. ఎంఏ హిస్టరీ మొదటి ఏడాది రెండో సెమిస్టర్ పరీక్ష గురువారం జరిగింది. అయితే ప్రశ్నాపత్రంలో 'కింది వాటిలో తమిళనాడుకు చెందిన తక్కువ కులం ఏది?' అనే ప్రశ్న వచ్చింది. జవాబు ఎంచుకునేందుకు నాలుగు కులాల పేర్లను ఆప్షన్లుగా ఇచ్చారు. 'ఫ్రీడం మూవ్మెంట్ ఆఫ్ తమిళనాడు ఫ్రం 1800-1947' అనే సబ్జెక్టు పరీక్ష రాసిన విద్యార్థులకు ఈ ప్రశ్న ఎదురైంది. Tamil Nadu | 1st-year MA History students of Periyar University in Salem got asked in the exam, "Which one is the lower caste that belongs to Tamil Nadu?" with 4 options mentioning different castes pic.twitter.com/kdJxQrMo5R — ANI (@ANI) July 15, 2022 అయితే పరీక్షలో కులానికి సంబంధించిన ప్రశ్న అడగటం వివాదాస్పదమైంది. దీనిపై పెరియార్ యూనివర్సిటీ ఉప కులపతి జగన్నాథన్ స్పందించారు. సమాజంలో అసమానతలు రూపుమాపే దిశగా విద్యను అందించాల్సిన ప్రొఫెసర్లు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే, ప్రశ్నాపత్రం తాము తయారు చేయలేదని, వేరే యూనివర్సిటీ సిబ్బంది రూపొందించారని జగన్నాథన్ తెలిపారు. క్వశ్చన్ పేపర్ లీక్ కాకూడదనే ఇలా చేస్తున్నట్లు పేర్కొన్నారు. పరీక్ష జరిగే వరకు ప్రశ్నాపత్రాన్ని ఎవరూ చూడలేదని, అందులోని వివాదాస్పద ప్రశ్న గురించి తమకు ఎలాంటి సమాచారం అందలేదని చెప్పారు. ఈ విషయంపై కచ్చితంగా విచారణ జరుపుతామని స్పష్టం చేశారు. చదవండి: పిల్లాడు బూతులు మాట్లాడుతున్నాడు.. పొలిటికల్ లీడర్లు మాట్లాడుతుంటే టీవీ పెట్టారా..? -
Ayushi: చీకటిని చీల్చి సివిల్ ర్యాంకర్‌గా..
నిమిషంపాటు కళ్లుమూసుకుని నడవాలంటేనే కష్టం. అటువంటిది పుట్టినప్పటినుంచే కారు చీకటి కమ్మేసిన కళ్లు అవి. జీవితంమొత్తం అంధకారమే అని తెలిసినప్పటికీ, బ్రెయిలీ లిపి సాయంతో అరకొర చదువుకాకుండా ఉన్నత చదువు చదివింది. అక్కడితో అగకుండా ప్రభుత్వ స్కూలు టీచర్ అయ్యింది. ఇక చాలు అనుకోకుండా .. దేశవ్యాప్తంగా పోటీపడే యూపీఎస్సీ పరీక్ష రాసి 48వ ర్యాంకు సాధించి, చరిత్ర సృష్టించింది.. చరిత్ర చెప్పే టీచర్ ఆయుషి. ఢిల్లీలోని రాణిఖేడా గ్రామంలోని ఓ సాధారణ కుటుంబం లో పుట్టింది ఆయుషి. పుట్టుకలోనే విధికన్నెర్ర చేసి తన రెండు కళ్లనూ చీకటిమయం చేసింది. రెండు కళ్లకు చీకటి తప్ప మరేం కనిపించదు. అయినా గ్రామంలోని ఓ ప్రైవేటు స్కూల్లో చదువుకుంది. ఆ తరువాత శ్యాంప్రసాద్ ముఖర్జీ కాలేజీలో బి.ఏ, ఇగ్నో యూనివర్శిటీలో చరిత్ర ప్రధాన సబ్జెక్టుగా ఎంఏ (హిస్టరీ), జామియా మిల్లియా ఇస్లామియా నుంచి బి.ఈడీ. చేసింది. ఆ తరువాత 2012లో మున్సిపల్ కార్పొరేషన్∙స్కూల్లో కాంట్రాక్ట్ టీచర్‌గా చేరింది. 2016లో ప్రైమరీ టీచర్ అయ్యింది. 2019లో ‘ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డు’ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలో హిస్టరీ టీచర్ అయ్యింది. పదేళ్లుగా టీచర్‌గా సేవలందిస్తోన్న ఆయుషి ప్రస్తుతం ముబారఖ్‌పూర్ దబాస్ గవర్నమెంట్ గర్ల్స్ సీనియర్ సెకండరీ స్కూల్లో.. పదకొండు, పన్నెండు తరగతుల విద్యార్థులకు హిస్టరీని బోధిస్తోంది. సివిల్స్‌కు ఎందుకంటే.. ‘‘స్కూల్లో పాఠాలు చెబుతూ ఎంతోమంది భవిష్యత్‌ను చక్కగా తీర్చిదిద్దగలుగుతున్నాను. యూపీఎస్సీలో సెలక్ట్ అయితే మరెంతోమంది జీవితాలను తీర్చిదిద్దే అపారమైన అవకాశం లభిస్తుంది. తనలాంటి వైకల్యం కలవారి జీవితాల్లో వెలుగులు నింపవచ్చు’’ అని ఆయుషికి అనిపించింది. దీంతో 2016 నుంచి సివిల్స్ రాయడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. టీచర్‌గా బిజీగా ఉన్నప్పటికీ తన ప్రిపరేషన్‌ను మాత్రం వదల్లేదు. వలంటరీ రిటైర్మెంట్ తీసుకుని... ఆయుషి పుట్టుకతోనే అంధురాలైనప్పటికీ సివిల్స్ దాక రాణించడానికి కారణం కుటుంబం వెన్నుతట్టి ప్రోత్సహించడమే. కుటుంబ సభ్యుల్లో ముఖ్యంగా ఆయుషి తల్లి... ప్రిపరేషన్‌కు చాలా బాగా సాయం చేశారు. సీనియర్ నర్సింగ్ అధికారిగా పనిచేస్తోన్న ఆయుషి తల్లి ఆశా రాణి 2020లో వలంటరీగా పదవి విరమణ చేసి ఆయుషి ప్రిపరేషన్‌కు పూర్తి సమయాన్ని కేటాయించారు. ఆయుషికి కావాల్సిన స్టడీ మెటిరీయల్‌ను ఆయుషి భర్తతో కలిసి ఆడియో రూపంలో రికార్డు చేసి ఇచ్చేవారు. ఇవి ఆమె ప్రిపరేషన్‌కు బాగా ఉపయోగపడ్డాయి. వరుసగా నాలుగు ప్రయత్నాల్లో విఫలమైంది. వీటిలో ఒక్కసారి కూడా కనీసం మెయిన్స్ కూడా క్లియర్ చేయని 29 ఏళ్ల ఆయుషి.. తాజాగా ఐదో ప్రయత్నంలో దేశంలోనే 48వ సివిల్ ర్యాంకర్‌గా నిలిచింది. రాతపరీక్షకు ఎటువంటి కోచింగ్ తీసుకోకుండా, మాక్ టెస్ట్‌కు మాత్రమే కోచింగ్ తీసుకుని ర్యాంక్ సాధించింది. కేంద్రపాలిత ప్రాంతాలు (డ్యానిక్స్) లేదా హర్యాణా క్యాడర్లో బాలికలు, వికలాంగుల విద్యారంగంలో సేవలందించడానికి ఆయుషి ఆసక్తి చూపుతోంది. వైకల్యం కళంకం కాకూడదు అంధురాలిగా విద్యార్థులకు పాఠాలు బోధించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. అయితే టీచింగ్‌ను నేను ఎప్పుడు ఒక ఉద్యోగంగా చూడలేదు. అభిరుచిగా భావించాను. అందుకే విద్యార్థులు నా టీచింగ్‌ను ఇష్టపడేంతగా వారిని ఆకట్టుకోగలిగాను. ఆసక్తిగా పాఠాలు చెబుతూనే సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యాను. ఈసారి కచ్చితంగా సివిల్స్ క్లియర్ చేస్తానని నమ్మకం ఉంది. కానీ యాభైలోపు ర్యాంకు రావడం చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇన్నాళ్లకు నా కల నిజమైంది. టాప్–50 జాబితాలో నా పేరు ఉందని తెలియడం మాటల్లో్ల వర్ణించలేని ఆనందాన్ని కలిగించింది. పుట్టినప్పటి నుంచి అనేక కష్టాలను ఎదుర్కొంటూ పెరిగాను. కుటుంబ సభ్యులు ముఖ్యంగా అమ్మ సాయంతో అన్నింటిని జయిస్తూ నేడు ఈ స్థాయికి చేరుకోగలిగాను. విద్య అనేది సాధికారతా సాధనం. బాలికలు, వికలాంగుల విద్యా రంగంలో పనిచేస్తూ వారికి రోల్‌మోడల్‌గా నిలవాలనుకుంటున్నాను. వికలాంగుల జీవితాల్లో వైకల్యం ఒక కళంకంగా ఉండకూడదు. వైకల్యంపట్ల సమాజ దృక్పథాన్ని మార్చుకోవాలి. వికలాంగులు కూడా అన్ని లక్ష్యాలను సాధించగలరు. – ఆయుషి దేవుడు ఆయుషి రెండు కళ్లు తీసుకున్నప్పటికీ, ఆమె బంగారు భవిష్యత్‌కు చక్కని దారి చూపాడు. ఎన్ని కష్టాలు ఎదురైనా అన్నింటిని ధైర్యంగా ఎదుర్కొంది. స్కూలుకెళ్లడానికి నలభై నిమిషాలు పడుతుంది. ఆ సమయాన్ని కూడా తన ప్రిపరేషన్‌కు కేటాయించి, ఈ స్థాయికి చేరుకున్నందుకు ఆయుషి తల్లిగా ఎంతో గర్వపడుతున్నాను. – ఆశారాణి (ఆయుషి తల్లి) -
81 ఏళ్ల వయసులో పీజీ పట్టా !
సాక్షి, బళ్లారి: చదువుకు వయసుతో పనిలేదు. చదువుకోవాలనే కోరిక ఉంటే చాలు వయసుతో నిమిత్తం లేదు. వృద్ధాప్యంలో ఉన్న కొందరు యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. విజయపుర జిల్లా జేఎస్ఎస్ మహా విద్యాలయంలో 81 ఏళ్ల వయసులో నింగయ్య బసయ్య ఎంఏ ఇంగ్లిషులో పట్టా పొందారు. అదే విధంగా విశ్రాంత ఉపాధ్యాయుడు పరసప్ప ఇప్పటికే పోస్టు గ్రాడ్యుయేషన్ డిగ్రీలు సాధించాడు. తాజాగా ఎంఏ ఇంగ్లిషు పరీక్షలు రాయడం విశేషం. -
Tuktuki Das: ఎం.ఏ ఇంగ్లిష్ చాయ్వాలీ
ఎం.ఏ ఇంగ్లిష్ చదివిన అమ్మాయిలు టీచర్ అవుతారు. లెక్చరర్లు కావాలని ప్రయత్నిస్తారు. ప్రయివేటు ఉద్యోగాలు అన్వేషిస్తారు. కాని టుక్టుకీ దాస్ అలా కాదు. ‘ఎంఏ ఇంగ్లిష్ చాయ్వాలీ’ పేరుతో టీకొట్టు తెరిచింది. నేను ఉపాధి వెతుక్కోవడం కాదు. వ్యాపార రంగంలో ఎదిగి నలుగురికీ ఉపాధి ఇస్తాను అంటోంది. కుతూహలం రేపుతున్న ఈ పోస్ట్‌గ్రాడ్యుయేట్ కథ ఏంటి? ‘ఐయామ్ హ్యాపిలీ సేయింగ్ దట్ ఐయామ్ బిజీ’ అంటుంది 26 ఏళ్ల టుక్టుకీదాస్. ఎంత బిజీ ఆ అమ్మాయి? ఉదయం ఐదు గంటలకు లేచి సైకిల్ మీద తన ఇంటికి రెండు మూడు కిలోమీటర్ల దూరం ఉన్న రైల్వేస్టేషన్‌కు వెళుతుంది. అప్పటికే ఆమె టీ కోసం కస్టమర్లు వెయిట్ చేస్తుంటారు. అప్పటి నుంచి రాత్రి 10 వరకూ తన టీకొట్టులోనే ఉంటుంది. వచ్చిన వారందరికీ టీ ఇస్తుంది. వారితో కబుర్లు చెబుతుంది. టీ అన్నీ చోట్లా ఉంటుంది. మరి ఎందుకు ఆమె దగ్గరికే వచ్చి కొంటారు అనంటే ఆమె టీకొట్టు పేరు ‘ఎంఏ ఇంగ్లిష్ చాయ్వాలీ’. ఎం.ఏ ఇంగ్లిష్ చేసిన ఒక అమ్మాయి తయారు చేసి అమ్ముతున్న టీ కనుక ఇప్పుడు ఈ క్రేజ్. బెంగాల్ అమ్మాయి టుక్టుకీదాస్ది పశ్చిమ బెంగాల్‌లోని 24 పరగణ జిల్లాలోని హాబ్రా. ముగ్గురు పిల్లల్లో తను పెద్దది. తండ్రి వ్యాన్ డ్రైవర్. తల్లికి చిన్న కిరాణాషాపు ఉంది. ‘అందరు ఆడపిల్లల్లాగే నేను కూడా రెండు విషయాలు వింటూ పెరిగి పెద్దదాన్నయ్యా. ఒకటి:గవర్నమెంట్ ఉద్యోగం, రెండు: పెళ్లి’ అంటుంది టుక్టుకీ దాస్. 2020లో రవీంద్రభారతి యూనివర్సిటీ నుంచి ఇంగ్లిష్‌లో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేశాక కొన్నాళ్లు ట్యూషన్ చెప్పింది. ‘నాకు టీచింగ్ అంటే ఇష్టమే కాని అది ఒకేచోట ఆపేస్తున్నట్టు అనిపిస్తుంది. నేను ఇంకా ఏదో సాధించాలి. నా కాళ్ల మీద నేను నిలబడాలి’ అంటుంది టుక్టుకీ దాస్. ఎం.బి.ఏ చాయ్‌వాలా స్ఫూర్తి ఎం.బి.ఏ చాయ్‌వాలా పేరుతో ప్రఫుల్ బిల్లోర్ అనే ఎంబిఏ కేండిడేట్ తెరిచిన వరుస టీకొట్లు హిట్ అయ్యాయి. అలాగే ఆస్ట్రేలియాలో ఉప్మా విర్ది అనే ఆమె చాయ్వాలీ పేరుతో టీ అమ్ముతూ ఫేమస్ అయ్యింది. ‘నేను కూడా వారిలాగే చాయ్ దుకాణం తెరుద్దామని అనుకున్నాను. నేను ఎం.ఏ ఇంగ్లిష్ చదివాను కనుక ఎం.ఏ ఇంగ్లిష్ చాయ్వాలీ పేరుతో టీకొట్టు తెరిచాను. దీనికి ముందు ఎక్కడ టీకొట్టు పెట్టాలా అని ఆలోచిస్తే కాలేజీల వద్ద, హాస్పిటల్స్ వల్ల లేదా రైల్వే స్టేషన్లో అనే ఆప్షన్స్ కనిపించాయి. కాలేజీలు కరోనా వల్ల సరిగ్గా నడవడం లేదు. హాస్పిటల్స్ దగ్గర మనుషులు తాగడం లేదు. అందుకని రైల్వేస్టేషన్‌ను ఎంచుకున్నాను’ అంటుంది టుక్టుకీ దాస్. ఆ షాపు తెరవడానికి గత సంవత్సరం ట్యూషన్ చెప్పి దాచుకున్న 10 వేల రూపాయలను పెట్టుబడిగా పెట్టింది. ‘అమ్మా నాన్నలకు నేను చాయ్ దుకాణం పెడతానని చెప్తే వద్దనలేదు కాని ఆశ్చర్యపోయారు. పైగా రైల్వేస్టేషన్ అనేసరికి ఎలా ఉంటుందో అనుకున్నారు. కాని వారి మద్దతుతో ముందుకే వెళ్లాను’ అంటుందామె. మొదటిరోజే ఉచితంగా నవంబర్ 1, 2021న హాబ్రా రైల్వేస్టేషన్లో కొంతమంది మిత్రుల మధ్య, మైక్‌లో వినిపిస్తున్న అనౌన్స్మెంట్ల మధ్య ‘ఎంఏ ఇంగ్లిష్ చాయ్వాలీ’ దుకాణాన్ని తెరిచింది టుక్టుకీదాస్. దానికి ముందు నుంచే ఆమె బ్లాగింగ్ కూడా చేస్తుండటం వల్ల తన రోజువారీ అనుభవాలను కూడా వీడియో తీసి బ్లాగ్‌లో ఉంచడం మొదలెట్టింది. ఈ పేరు కొత్తగా ఉండటం, ఫేస్బుక్లో ఆమె రోజూ వీడియోలు పెడుతుండటంతో వెంటనే గుర్తింపు వచ్చేసింది. జనం కుతూహలంతో ఆమె షాపుకు వచ్చి టీ తాగడం మొదలెట్టారు. ‘అక్కా.. టీ ఇవ్వు. అలాగే ఒక సెల్ఫీ కూడా’ అని కాలేజీ పిల్లలు అడగడం మొదలైంది. మొదటి రోజు రెండు గంటల పాటు కస్టమర్లను ఆకర్షించడానికి ఉచితంగా టీ ఇచ్చింది టుక్టుకీ దాస్. ఆ తర్వాత డబ్బులు అవే గల్లాపెట్టెలో పడటం మొదలయ్యాయి. ఏదీ తక్కువ కాదు రైల్వే స్టేషన్లో టీ అమ్మే అమ్మాయిని చూసి అక్కడి పోర్టర్లే మొదట చులకనగా చూశారు టుక్టుకీ దాస్‌ని. ‘ఏ పనైనా గౌరవప్రదమైనదే అని మన దేశంలో గ్రహించరు. అమ్మాయిలు శ్రమ చేసి తమ కాళ్ల మీద తాము నిలబడటాన్ని చూసి హర్షించాలి’ అంటుంది టుక్టుకీ దాస్. అయితే ఇప్పుడు అందరూ ఆమెను ప్రశంసాపూర్వకంగా చూస్తున్నారు. సాయం వద్దు టుక్టుకీ దాస్ చాయ్ దుకాణం పాపులర్ అయ్యేసరికి కొంతమంది పెద్దలు వచ్చి సాయం చేస్తామన్నారు. ‘నేను సున్నితంగా వారించాను. నేను పైకి వస్తే నా వల్లే రావాలి తప్ప వేరొకరి సాయంతో కాదు. నేను ఇప్పుడు నా చాయ్ దుకాణంతో సంతోషంగా ఉన్నాను. ఇంకా నేను ఈ బ్రాండ్‌తో కోల్కటాలో దుకాణాలు తెరవాలి. కాని ఈ దుకాణం మాత్రం మూసేయను. ఇది మొదటిది. నా సెంటిమెంట్‘ అంటుంది టుక్టుకీ దాస్. టుక్టుకీ దాస్ రోజూ చాలా బిజీగా ఉంటోంది. చాలామంది ఫుడ్బ్లాగర్స్ ఆమెతో వీడియోలు చేస్తున్నారు. ఒక అమ్మాయి ఆత్మవిశ్వాసంతో టీ అమ్ముతూ ఉండటం సంతోషంగా ఉండటం అందరికీ ఎందుకు నచ్చదు. భిన్నంగా ఆలోచిస్తే మామూలు టీ కూడా ఇలా బ్రాండ్ అయి కూచుంటుంది. -
జీఎస్టీ చట్టం: ఓ ఆసక్తికరమైన వార్త
సాక్షి, ముంబై: బీజేపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన జీఎస్టీ చట్టంపై మరో ఆసక్తికరమైన వార్త. పుణే యూనివర్శిటీ జీఎస్టీ చట్టంపై కొత్త కోర్సును ప్రవేశపెట్టబోతోంది. వచ్చే ఎకడమిక్ ఇయర్ నుంచి వివిధ కోర్సుల్లో జీఎస్టీ చట్టాన్ని ఒక కొత్త సబ్జెక్టుగా చేర్చనుంది. పుణే విశ్వవిద్యాలయం సావిత్రిబాయి ఫులే అకడమిక్ కౌన్సిల్ జీఎస్టీపై ఎంబీఏ, ఎంఏ కోర్సుల్లో ఈ సబ్జెక్టును ప్రవేశపెట్టేందుకు నిర్ణయించింది. 2018-19 విద్యా సంవత్సరం నుంచి ఈ కోర్సులను ప్రారంభించనుంది. యూనివర్శిటీ ప్రతినిధి అభిజిత్ గోర్పడే ఈ విషయాన్ని ప్రకటించారు. -
ఎంఏలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
శ్రీశైలం: శ్రీశైల దేవస్థానం పరిధిలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం చరిత్ర, సంస్కృతి, పురావస్తు శాస్ట్ర పీఠంలో 2016–17 విద్యా సంవత్సరానికి ఎంఏ ప్రథమ సంవత్సరం (చరిత్ర, పురావస్తుశాస్త్రం) ప్రవేశానికి ఈ నెల 15 లోగా దరఖాస్తులు చేసుకోవాలని తెలుగువర్శిటీ డీన్ ఆచార్య పి చెన్నారెడ్డి గురువారం తెలిపారు. మొత్తం 26 సీట్లు ఉన్నాయని, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. సంబంధిత సర్టిఫికెట్లతో పాటు రూ. 350లు ప్రవేశ రుసుం చెల్లించాలని, మిగతా వివరాల కోసం 08524–287153, 9440047299ను సంప్రదించాలన్నారు. -
'ప్రధాని ఫస్ట్ క్లాస్'
అహ్మదాబాద్: ప్రధాని మోదీ 62.3 శాతం మార్కులతో 1983లో ఎం.ఏ. డిగ్రీ దూరవిద్య ద్వారా ఉత్తీర్ణులయ్యారని గుజరాత్ వర్సిటీ ఆదివారం తెలిపింది. ప్రధాని విద్యార్హతలపై వివాదం నేపథ్యంలో వీసీ ఎం.ఎన్.పటేల్ స్పందించారు. నరేంద్ర దామోదర్‌దాస్ మోదీ ఎం.ఏ. పొలిటికల్ సైన్స్‌లో 800కు గాను 499 మార్కులు సాధించి ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులయ్యారన్నారు. ఎం.ఏ. తొలి ఏడాదిలో 400కు 237 మార్కులు, రెండో ఏడాదిలో 400కు 262 మార్కులు పొందారని చెప్పారు. ఇంతవరకూ తమకు కేంద్ర సమాచార సంఘం(సీఐసీ) ఆదేశాలు అందలేదని, మీడియా ద్వారానే వివరాలు తెలిశాయన్నారు. ఆదేశాలు వస్తే సంబంధిత సమాచారం దరఖాస్తుదారుడికి అందిస్తామన్నారు. 20 ఏళ్లు దాటితే వివరాలు అందించలేమని, మోదీ బీఏపై తమ వద్ద వివరాలు లేవన్నారు. ఓటరు గుర్తింపు ధ్రువపత్ర వివరాలు ఇవ్వాలన్న సీఐసీ ఆర్టీఐ దరఖాస్తుపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. సమాచారం ఇవ్వడానికి సిద్ధమేనని, అయితే ప్రధాని విద్యార్హత వివరాల్ని సీఐసీ తెలపాలన్నారు. కేజ్రీవాల్ లేఖనే దరఖాస్తుగా పరిగణించిన సీఐసీ... ప్రధాని డిగ్రీ వివరాలు ఇవ్వాలంటూ ఢిల్లీ, గుజరాత్, ప్రధాని కార్యాలయాలను శుక్రవారం ఆదేశాలిచ్చింది. -
మోదీ ఎంఏలో ఫస్ట్ క్లాస్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన విద్యార్హతలు ఏమిటి? అసలు ఆయన విద్యార్థిగా ఎలా ఉన్నారు. బాగా చదివారా.. నేటి విద్యార్థుల మాదిరిగా ఫస్ట్ క్లాస్ మార్కులు తెచ్చుకున్నారా? వంటి పలు అంశాలు తెలుసుకునేందుకు ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకు ప్రధాన కారణం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. అవును.. ఆయన మోదీ విద్యకు సంబంధించిన వివరాలు తెలియజేయాలంటూ ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేయడంతో కేంద్ర సమాచార కమిషనర్ శ్రీధర్ ఆచార్యులు శుక్రవారం అటు గుజరాత్, ఢిల్లీ యూనివర్సిటీలకు ఆ సమాచారం తమకు అందించాలని ఆదేశించారు. అయితే, ఆ వివరాలు బయటకు రాకముందే అహ్మదాబాద్ మిర్రర్ అనే పత్రిక ఆయన విద్యకు సంబంధించిన వివరాలు తెలిపింది. మోదీ ఎంఏ పొలిటికల్ సైన్స్‌లో ఫస్ట్ క్లాస్ సాధించినట్లు వెల్లడించింది. మోదీ సగటు విద్యార్థికంటే మెరుగైన దశలో ఉండేవారని ఎంతో క్రమ శిక్షణతో నడుచుకునే వారని తెలిపింది. 1983లో ఎంఏ పొలిటికల్ సైన్స్ చేసిన మోదీ.. 62.3శాతం మార్కులతో పట్టా పొందారని ఆయన యూరోపియన్ పాలిటిక్స్, ఇండియన్ పొలిటికల్ అనాలసిస్, సైకాలజీ ఆఫ్ పాలిటిక్స్ చదివారని చెప్పింది. అయితే, మోదీ గ్రాడ్యుయేషన్ చెప్పకుండా.. విస్నగర్ లోని ఎంఎన్ సైన్స్ కాలేజీలో ప్రిసైన్స్ చదివినట్లు తెలిపింది. అంతేకాదు మోదీ ప్రి-సైన్స్ చదువుతున్న సమయంలో ప్రస్తుత గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీ బెన్ ఆ సమయంలో ఇనార్గినిక్ కెమిస్ట్రీలో ఎంఎస్సీ చేస్తున్నారట. వీరిద్దరి రోల్ నెం కూడా 71. గతంలో పలువురు వ్యక్తులు ఈ వివరాలు తెలపాల్సిందిగా దరఖాస్తు చేసుకున్నా గుజరాత్, ఢిల్లీ యూనివర్సిటీలు ఆ వివరాలు తెలిపేందుకు నిరాకరించాయి. -
1938లో డిగ్రీ.. 2016లో పీజీ..
పాట్నాః 'పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ' అన్న చందంగా ఉంది ఆ వృద్ధుడి ప్రయత్నం. 97 ఏళ్ళ వయసులోనూ చదువంటే సై అంటున్నాడు. ఎప్పుడో ఏడున్నరు దశాబ్దాల క్రితం గ్యాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆయన.. ఇప్పుడు మళ్ళీ ఎకనామిక్స్ లో ఎం.ఏ పరీక్షలు రాసేందుకు సిద్ధమయ్యాడు. కుటుంబ బాధ్యతలతో డిగ్రీతోనే ఆపేయాల్సి వచ్చిన చదువును తిరిగి కొనసాగిస్తున్నాడు. బీహార్ కు చెందిన రాజ్ కుమార్ వైశ్యా ఎకనామిక్స్ లో మాస్టర్స్ డిగ్రీ కోసం గతేడాది ఎన్ రోల్ చేసుకున్నాడు. 97 ఏళ్ళ వయసులోనూ మూడు గంటలపాటు ఎగ్జామ్ సెంటర్లో కూర్చొని మరీ ఆంగ్లంలో సమాధానాలను రాశాడు. 1938 లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన రాజ్ కుమార్.. అప్పట్లో కుటుంబ బాధ్యతలతో పై చదువులు చదువలేక పోయాడు. అందుకే ఇప్పడు తన కోర్కెను తీర్చుకునేందుకు సన్నద్ధమయ్యాడు. నలందా ఓపెన్ యూనివర్శిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పట్టా పొందేందుకు 97 ఏళ్ళ వయసులో పరీక్షలు రాశాడు. ఎం.ఏ ఎకనామిక్స్ లో మొదటిభాగం పరీక్ష రాసేందుకు ఆయన సుమారు 23 పేపర్ షీట్లను వినియోగించినట్లు వర్శిటీ అధికారులు తెలిపారు. మిగిలిన విద్యార్థులకు ఏమాత్రం తీసిపోకుండా మూడు గంటలపాటు పరీక్షా కేంద్రంలో కూర్చొని మరీ పరీక్షలు రాయడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తించింది. ఆయనతోపాటు పరీక్షలు రాసిన వారంతా ఆయన మనవలకంటే కూడ చిన్నవారేనట. మాడ్చేస్తున్న ఎండలకు భయపడి జనం ఇళ్ళనుంచి బయటకు రాలేని సమయంలో ఆ వృద్ధుడు మిగిలిన యువ విద్యార్థులతో కలసి ఉత్సాహంగా పరీక్షలు రాశాడని వర్శిటీ అధికారులు చెప్తున్నారు. అయితే వైశ్యా ఈ వయసులో ఎకనామిక్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేయాలన్న పట్టుదలకు వెనుక రెండు కారణాలున్నాయట. ఒకటి తాను ఎం.ఏ పూర్తి చేయాలన్న కోరిక, రెండోది భారత్ ఎందుకు ఆర్థిక ప్రకగతిని సాధించి, సమస్యలను అధిగమించలేకపోతోందో తెలుసుకోవాలన్న ఆరాటమూనట. అందుకే ఇప్పుడు పరీక్ష రాసిన రాజ్ కుమార్...తన కల నెరవేరిందంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. 1920 లో ఉత్తర ప్రదేశ్ బరెల్లీ పట్టణంలో పుట్టిన రాజ్ కుమార్ వైశ్యా... జార్ఘండ్ లో ఉన్న ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ 1980 లో పదవీవిరమణ పొందారు. ఆగ్రా యూనివర్శిటీలో 1938 లో డిగ్రీ పూర్తి చేసి, 1940 లో లా పట్టాను కూడ పొందారు. అయితే కుటుంబ బాధ్యతలతో తాను మాస్టర్స్ డిగ్రీని పొందలేకపోయానన్న కోరిక అలాగే ఉండిపోయిందని, ఇప్పుడా కోరిక తీరిందని వైశ్యా చెప్తున్నారు. పదేళ్ళ క్రితం భార్య చనిపోయిన అనంతరం వైశ్యా.. పాట్నా రాజేంద్రనగర్ కాలనీలోని చిన్న కుమారుడు సంతోష్ కుమార్ వద్ద ఉంటున్నాడు. సంతోష్ కుమార్ పాట్నాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పనిచేసి రిటైరయ్యారు. ఆయన భార్య భారతి కూడ పాట్నా యూనివర్శిటీలో ప్రొఫెసర్ గా పనిచేసి రిటైరయ్యారు. 97 ఏళ్ళ వయసులోనూ ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉన్న వైశ్యా... భారత శాఖాహార భోజనాన్నే ఇష్టపడతాడట. ఎప్పుడూ వేపుళ్ళను తిననని, మితంగానే భుజిస్తానని కూడ చెప్తున్నాడు. -
టిస్ కోర్సులు... ప్రవేశాలు
దేశంలోని ప్రముఖ ఇన్స్టిట్యూట్లలో ఒకటైన.. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్ (టిస్) 2015-17 విద్యా సంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశం కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. టిస్‌కు ముంబై, హైదరాబాద్, తుల్జాపూర్, గువహటిలలో క్యాంపస్‌లు ఉన్నాయి. తాజా నోటిఫికేషన్ ద్వారా ఈ నాలుగు క్యాంపస్‌లలో ఎంఏ, ఎంఎస్సీ, ఎంహెచ్ఏ, ఎంపీహెచ్ వంటి విభాగాల్లో మొత్తం 49 రకాల కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తుంది. క్యాంపస్‌ల వారీగా అందిస్తున్న కోర్సులు.. హైదరాబాద్ క్యాంపస్: కోర్సు - సీట్లు ఎంఏ (రూరల్ డెవలప్మెంట్ అండ్ గవర్నెన్స్)- 30 ఎంఏ (ఎడ్యుకేషన్) -30 ఎంఏ (పబ్లిక్ పాలసీ అండ్ గవర్నెన్స్)- 30 ఎంఏ (ఉమెన్ స్టడీస్)- 30 ఎంఏ (డెవలప్మెంట్ స్టడీస్)- 30 ఎంఏ (నేచురల్ రీసోర్సెస్ అండ్ గవర్నెన్స్) - 30 ప్రవేశం: ప్రవేశ ప్రక్రియ 225 మార్కులకు మూడు దశలుగా ఉంటుంది. వివరాలు.. రాత పరీక్ష (100 మార్కులు), ప్రీ ఇంటర్వ్యూ టెస్ట్ (పీఐటీ)/గ్రూప్ డిస్కషన్ (జీడీ-50 మార్కులు), పర్సనల్ ఇంటర్వ్యూ (75 మార్కులు). ఈ మూడు దశలకు కలిపి మొత్తం 225 మార్కులు కేటాయించారు. మొదటి దశలో రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇది ఆన్లైన్ విధానంలో ఉంటుంది. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులు ప్రీ ఇంటర్వ్యూ టెస్ట్ (పీఐటీ)/గ్రూప్ డిస్కషన్ కు హాజరు కావాలి. ఈ దశను విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి చివరగా పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఈ క్రమంలో రాత పరీక్షకు 50 శాతం వెయిటేజీ, పీఐటీ/జీడీకి 20 శాతం వెయిటేజీ, పర్సనల్ ఇంటర్వ్యూకు 30 శాతం వెయిటేజీ ఇస్తారు. రాత పరీక్ష ఇలా: రాత పరీక్షలో అభ్యర్థుల ప్రజ్ఞా సామర్థ్యాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు అడుగుతారు. సామాజిక అంశాలు, ప్రస్తుతం వివిధ రంగాల్లో జరుగుతున్న పరిణామాలతోపాటు అనలిటికల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్, ఇంగ్లిష్ విభాగాల నుంచి ప్రశ్నలడుగుతారు. డెమో కొశ్చన్ పేపర్, గతేడాది ప్రశ్నపత్రాలు వెబ్సైట్లో లభ్యమవుతాయి. వాటి ఆధారంగా ప్రశ్నల స్థాయి తెలుసుకోవచ్చు. రెండో దశ.. పీఐటీ: ప్రీ ఇంటర్వ్యూ టెస్ట్.. రాత పరీక్ష (ఎస్సే) రూపంలో ఉంటుంది. ఇందుకు 45 నిమిషాల సమయం కేటాయించారు. ఎంచుకున్న క్యాంపస్, కోర్సును బట్టి ఎస్సే అంశాలు వేర్వేరుగా ఉంటాయి. దాదాపుగా అన్ని అంశాలు ఎంచుకున్న కోర్సు నేపథ్యంగా సమకాలీనంగా చోటు చేసుకుంటున్న సంఘటనల ఆధారంగా ఉంటాయి. నిర్దేశించిన పద పరిమితిలోనే ఎస్సేను పూర్తి చేయాలి. తర్వాతి దశలో పర్సనల్ ఇంటర్వ్యూలో సైతం ఎంచుకున్న కోర్సుకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. ప్లేస్‌మెంట్స్: టిస్‌లో కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులకు అవకాశాల పరంగా ఎటువంటి ఢోకా లేదని చెప్పొచ్చు. అభ్యర్థులు ఎంచుకున్న కోర్సు ఆధారంగా పలు కార్పొరేట్ కంపెనీలు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ద్వారా ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నాయి. డెవలప్మెంట్ స్టడీస్ అభ్యర్థులను ఇంటర్నేషనల్ మార్కెట్ రీసెర్చ్ బ్యూరో వంటి అంతర్జాతీయ కన్సల్టెన్సీలు రిక్రూట్ చేసుకుంటున్నాయి. హెచ్ఆర్ఎం అండ్ ఎల్ఆర్ (హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ అండ్ లేబర్ రిలేషన్) అభ్యర్థులను హిందూస్థాన్ లీవర్, ప్రొక్టర్ అండ్ గ్యాంబల్, ఎర్నెస్ట్ అండ్ యంగ్, యాక్సిస్ బ్యాంక్, పలు ఐటీ కంపెనీలు నియమించుకుంటున్నాయి. టిస్ ప్రవేశ ప్రక్రియ ఆధారంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్, సోషల్ సెన్సైస్ అండ్ ట్రాన్స్‌డిసిప్లినరీ రీసెర్చ్ (ఐఎంహెచ్ఎస్టీ)-చెన్నై, మెంటల్ హెల్త్ యాక్షన్ ట్రస్ట్-కాలికట్, జీ-సెట్-రాంచీ ఇన్స్టిట్యూట్లలోని వివిధ కోర్సుల్లో కూడా ప్రవేశం పొందొచ్చు. తుల్జాపూర్ క్యాంపస్ ఎంఏ (రూరల్ డెవలప్మెంట్) ఎంఏ/ఎంఎస్సీ (డెవలప్మెంట్ పాలసీ, ప్లానింగ్ అండ్ ప్రాక్టీస్) ఎంఏ (సోషల్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్) ఎంఏ/ఎంఎస్సీ (సస్టెయినబిలిటీ లైవ్లీహుడ్స్ అండ్ నేచురల్ రీసోర్సెస్ గవర్నెన్స్) గువహటి క్యాంపస్ ఎంఏ (ఎకాలజీ, ఎన్విరాన్మెంట్ అండ్ సస్టెయినబుల్టీ డెవలప్మెంట్) ఎంఏ (లేబర్ స్టడీస్ అండ్ సోషల్ ప్రొటెక్షన్) ఎంఏ (పీస్ అండ్ కన్ఫ్లిక్ట్ స్టడీస్) ఎంఏ (సోషియాలజీ అండ్ సోషల్ ఆంత్రోపాలజీ) ఎంఏ (సోషల్ వర్క్, నాలుగు స్పెషలైజేషన్స్‌తో) ముంబై క్యాంపస్ స్కూల్ ఆఫ్ సోషల్ వర్క్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ లేబర్ స్టడీస్ స్కూల్ ఆఫ్ హెల్త్ సిస్టమ్ స్టడీస్ స్కూల్ ఆఫ్ డెవలప్మెంట్ స్టడీస్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్కూల్ ఆఫ్ హబిటాట్ స్టడీస్ ఎంఏ/ఎంఎస్సీ (డిజాస్టర్ మేనేజ్మెంట్) సెంటర్ ఫర్ హ్యుమన్ ఎకాలజీ స్కూల్ ఫర్ మీడియా అండ్ కల్చరల్ స్టడీస్ స్కూల్ ఆఫ్ లా, రైట్స్ అండ్ కాన్స్టిట్యూషనల్ గవర్నెన్స్ మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఆన్లైన్ కోర్సులు: ఎంఏ (సోషల్ వర్క్ ఇన్ చైల్డ్ రైట్స్, ఇంటర్నేషనల్ ఫ్యామిలీ స్టడీస్). ఈ స్కూల్స్‌లో పలు రకాల స్పెషలైజేషన్స్ అందుబాటులో ఉన్నాయి. నోటిఫికేషన్ సమాచారం అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ (10 + 2 + 3 లేదా 10 + 2 + 4 లేదా 10 + 2 + 2+ 1 విధానంలో, 15 సంవత్సరాల ఫార్మల్ ఎడ్యుకేషన్ తప్పనిసరి). కోర్సుల వారీగా అర్హత ప్రమాణాలు వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి సంబంధిత వివరాలను వెబ్సైట్ ద్వారా పొందొచ్చు. దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: నవంబర్ 29, 2014. పరీక్ష తేదీ: జనవరి 10, 2015. స్కోర్ కార్డులు పంపే తేదీ: ఫిబ్రవరి 3, 2015. పీఐటీ/ఇంటర్వ్యూ షెడ్యూల్: మార్చి 9-27, 2015. తుది ఫలితాల వెల్లడి: ఏప్రిల్ 23, 2015. వివరాలకు: https://admissions.tiss.edu www.tiss.edu అదేవిధంగా 2015 సంవత్సరానికి ఎంఫిల్, పీహెచ్డీ, షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్‌లలో కూడా ప్రవేశానికి టిస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మెరిట్ ఆధారంగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. వీరికి రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి ఎంఫిల్, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 15, 2015. షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్‌ల విషయానికొస్తే.. ఎంచుకున్న విభాగాన్ని బట్టి రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ కూడా ఎంచుకున్న కోర్సును బట్టి వేర్వేరుగా ఉంది. సోషల్సెన్సైస్తో సామాజిక అవగాహన సోషల్ సెన్సైస్ కోర్సులు అభ్యసించిన వారికి సమాజం, అభివృద్ధి క్రమంలో చోటు చేసుకునే సామాజిక మార్పులు పట్ల విస్తృత స్థాయిలో అవగాహన ఏర్పడుతుంది. టిస్‌లో ఎంఏ రూరల్ డెవలప్మెంట్ అండ్ గవర్నెన్స్, ఎంఏ ఇన్ పబ్లిక్ పాలసీ అండ్ గవర్నెన్స కోర్సులకు డిమాండ్ ఉంది. సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు సైతం ఈ కోర్సుల్లో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు. ఉన్నత విద్య, పరిశోధన, సమాచారాన్ని భిన్న కోణాల్లో విశ్లేషించడంలో ఆసక్తి ఉన్నవారు ఎంఏ డెవలప్మెంట్ స్టడీస్‌ను ఎంచుకుంటున్నారు. మహిళా సాధికారత, విద్యావిధానంలో మార్పులు, సహజ వనరులు, వాతావరణ మార్పులు తదితర అంశాలపై ఆసక్తి ఉన్నవారు ఎంఏ ఉమెన్స్ స్టడీస్, ఎంఏ ఎడ్యుకేషన్, ఎంఏ నేచురల్ రిసోర్సెస్ అండ్ గవర్నెన్స కోర్సుల్లో చేరుతున్నారు. సోషల్ సైన్స కోర్సులు పూర్తిచేసిన వారు పంచాయతీలు, వివిధ ప్రభుత్వ కార్యక్రమాలైన నేషనల్ లైవ్లీహుడ్స్ మిషన్, నేషనల్ రూరల్ హెల్త్ మిషన్, ఎంఎన్ఈఆర్జీఏ.. తదితర పథకాల్లో వివిధ హోదాల్లో అవకాశాలను సొంతం చేసుకోవచ్చు. ఈ కోర్సుల్లో చేరాలనుకునేవారికి నేర్చుకునే తత్వం, పరిశీలనా నైపుణ్యాలు, సమాచారాన్ని విశ్లేషించే సామర్థ్యం ఉండాలి. అంతేకాకుండా వారికి ఇంగ్లిష్ భాషలో ప్రావీణ్యం ఉంటే త్వరగా ఉన్నత హోదాలో స్థిరపడొచ్చు. - డా. లక్ష్మీ లింగం, డిప్యూటీ డెరైక్టర్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్, హైదరాబాద్.