కాలిఫోర్నియాలో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం ఆరవ స్నాతకోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ స్నాతకోత్సవం అత్యంత చరిత్రాత్మకమైనది. ఎందుకంటే రెండువేల ఏళ్ళనాటి చరిత్రలో తొలి సారిగా ఒక విదేశం..అంటే అమెరికాలో 16 మంది తెలుగులో మాస్టర్స్ డిగ్రీ పట్టాలు అందుకున్నారు. ఆ 16 మందిలో ఒకరు వంగెన్ చిట్టెన్ రాజు చెప్పారు. "సరిగ్గా 50 ఏళ్ళ క్రితం, 1974 లో బొంబాయి ఇండియన్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి డాక్టరేట్ పట్టా అందుకున్న నేను ఈ ఏడాది 2024లో తెలుగులో ఎంఏ పట్టా అందుకోవడం భలే ఆనందంగా అనిపించిందంన్నారు" చిట్టెన్ రాజు .
అందుకోసమే వంగెన్ చిట్టెన్ రాజు గారి కుటుంబం అంతా కలిసి ఈ స్నాతకోత్సవంలో పాల్గొనడానికి సిద్ధమయ్యింది. అయితే తెలుగులో పట్టభద్రులైన ఆ 16 మందిలో వంగెన్ చిట్టెన్ రాజుగారి వయసులో అందరికంటే పెద్ద వ్యక్తి. ఆయన 76 ఏళ్ల వయసులో సిలికానాంధ్ర విశ్వ విద్యాలయం లో ఈ ఎంఏ తెలుగు కోర్స్‌లో చేరడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం వారు వేలిడిక్టోరియన్ స్థాయిలో ఆయన్ను మాట్లాడమని తగిన ఏర్పాట్లు కూడా చేశారు. వృధాప్య రీత్యా వచ్చే శారీరక సమస్యలు కారణంగా కాలిఫోర్నియాలో జరుగుతున్న సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి వెళ్లలేకపోయారు. దీంతో సహాధ్యాయులు రావడం కుదరకపోతే కనీసం వీడియోలో సందేశం పంపిస్తే దాన్ని ఈ కార్యక్రమం రోజున ప్రశారం చేస్తామని చెప్పారు.
ఇదేదో బాగానే ఉందని వంగెన్ చిట్టెన్ రాజు గారు..తాను సిద్ధం చేసుకున్న గ్రాడ్యయేషణ గౌనూ, టోపీ పెట్టుకుని తన ఇంట్లోనే కూర్చొని ప్రసంగం రికార్డు చేసి పంపించడం జరిగింది. ఆ ప్రసంగంలో ఆయన తెలుగు శాఖని పటిష్టం చేయడానికి, వంగూరి సంస్థ ఆశయాలు, భాష, సాహిత్యాల అభివృద్ధికి తన వంతుగా లక్ష డాలర్ల విరాశంతో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఎండోమెంట్ ఫండ్ ఫర్ తెలుగు స్టడీస్ పేరిట ధార్మిక నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దానికి అందరూ చప్పట్లు కొడుతూ స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వడం జరిగింది. అంతేగాదు మన సనాతన భారతీయ భాషా, సాహిత్య, సాంస్కృతిక, సంగీత, నాట్య సంపదలని, కళారూపాలని స్నాతకోత్తర స్థాయిలో అధ్యయన అవకాశాలని కల్పిస్తున్న సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం, ఇతర వ్యవస్థలని మనం అందరం బలోపేతం చేయ్యాలి అని చెప్పారు.
ఇలా అందరం కలిసి తలో చెయ్యీ వేసి ప్రోత్సహిస్తేనే కదా బావితరాలకి మన సాంస్కృతిక అస్తిత్వాన్ని అందజేయగలం అని చెప్పారు చిట్టెన్ రాజు. ఇక వంగెన్ చిట్టెన్ రాజు గారి తోపాటు ఎంఏ పట్టాలు తీసుకుంటున్న 15 మంది ఎవరంటే.. ప్రముఖ రచయిత్రి కొమరవోలు సరోజ (కెనడా), అమెరికాలో పలు నగరాల నుంచి అమృతవల్లి కవి, భాస్కర్ రాయవరం, వేణు ఓరుగంటి, కిరణ్ సింహాద్రి, మధు కిరణ్ ఇవటూరి, పావని తణికెళ్ళ, ప్రసాద్ జోస్యుల, రామారావు పాలూరి, శ్రీ గౌరి బానావత్తుల, శ్రీని రామనాధం, సుమలిని సోమ, సువర్ణ ఆదెపు, వేణుగోపాల నారాయణ భట్ల, విద్యాధర్ తాతినేని తదితరులు. అలాగే మాకు అసమానమైన పాండిత్యమూ, బోధనా పటిమలతో రెండేళ్ళు పాఠాలు చెప్పి, పరీక్షలు పెట్టి, పరిశోధనలు చేయించి, థీసిస్ లు రాయించి పట్టాలు ఇప్పించిన ఆచార్యులు సి. మృణాళిని, పాలెపు వారిజా రాణి, అద్దంకి శ్రీనివాస్, లక్ష్మణ చక్రవర్తి, గురజాడ శ్రీశ్రీ, గంగిశెట్టి లక్ష్మీనారాయణ గార్లు.
వీరిలో మృణాళిని గారు, వారిజా రాణి గారు తదితరులు ఈ స్నాతకోత్సవంలో పాలుపంచుకున్నారు. ఈ స్నాతకోత్సవం లో తెలుగు పట్టభద్రులతో పాటు కూచిపూడి నృత్యం, భరత నానాట్యం, హిందూస్తానీ సంగీతం, కర్నాటక సంగీతం, భరత నాట్యం విభాగాలలో సుమారు 40 మంది మాస్టర్స్, డిప్లమా లు అందుకున్నారు. అది కూడా చరిత్రలో ఒక మైలు రాయి. కాగా, ఈ స్నాతకోత్సవంలో ప్రత్యేక అతిధిగా పాల్గొన్న ఆనంద్ కూచిభొట్ల, వైద్యులు డా. ముక్కామల అప్పారావు (డిట్రాయిట్) గారు, డా. కేశవ రావు గారు అనుకోని పనిమీద హ్యూస్టన్ వచ్చి వంగూరి చిట్టెన్ రాజుగారిని పరామర్శించడం విశేషం. ఇక చిట్టెన్ రాజు గారు ఎంఏ తెలుగు పట్టాలో పరిశోధానంశం “అమెరికా తెలుగు డయస్పోరా కథలు-చారిత్రక, వస్తు విశ్లేషణ.
వంగూరీ చిట్టెన్ రాజు
(చదవండి: 18వ ఆటా కన్వెన్షన్ యూత్ కాన్ఫరెన్స్ సర్వం సన్నద్ధం!)
Comments
Please login to add a commentAdd a comment