silicon Andhra
-
చరిత్ర సృష్టించిన సిలికానాంధ్ర స్నాతకోత్సవం..ఏకంగా 16 మంది..
కాలిఫోర్నియాలో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం ఆరవ స్నాతకోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ స్నాతకోత్సవం అత్యంత చరిత్రాత్మకమైనది. ఎందుకంటే రెండువేల ఏళ్ళనాటి చరిత్రలో తొలి సారిగా ఒక విదేశం..అంటే అమెరికాలో 16 మంది తెలుగులో మాస్టర్స్ డిగ్రీ పట్టాలు అందుకున్నారు. ఆ 16 మందిలో ఒకరు వంగెన్ చిట్టెన్ రాజు చెప్పారు. "సరిగ్గా 50 ఏళ్ళ క్రితం, 1974 లో బొంబాయి ఇండియన్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి డాక్టరేట్ పట్టా అందుకున్న నేను ఈ ఏడాది 2024లో తెలుగులో ఎంఏ పట్టా అందుకోవడం భలే ఆనందంగా అనిపించిందంన్నారు" చిట్టెన్ రాజు . అందుకోసమే వంగెన్ చిట్టెన్ రాజు గారి కుటుంబం అంతా కలిసి ఈ స్నాతకోత్సవంలో పాల్గొనడానికి సిద్ధమయ్యింది. అయితే తెలుగులో పట్టభద్రులైన ఆ 16 మందిలో వంగెన్ చిట్టెన్ రాజుగారి వయసులో అందరికంటే పెద్ద వ్యక్తి. ఆయన 76 ఏళ్ల వయసులో సిలికానాంధ్ర విశ్వ విద్యాలయం లో ఈ ఎంఏ తెలుగు కోర్స్‌లో చేరడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం వారు వేలిడిక్టోరియన్ స్థాయిలో ఆయన్ను మాట్లాడమని తగిన ఏర్పాట్లు కూడా చేశారు. వృధాప్య రీత్యా వచ్చే శారీరక సమస్యలు కారణంగా కాలిఫోర్నియాలో జరుగుతున్న సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి వెళ్లలేకపోయారు. దీంతో సహాధ్యాయులు రావడం కుదరకపోతే కనీసం వీడియోలో సందేశం పంపిస్తే దాన్ని ఈ కార్యక్రమం రోజున ప్రశారం చేస్తామని చెప్పారు. ఇదేదో బాగానే ఉందని వంగెన్ చిట్టెన్ రాజు గారు..తాను సిద్ధం చేసుకున్న గ్రాడ్యయేషణ గౌనూ, టోపీ పెట్టుకుని తన ఇంట్లోనే కూర్చొని ప్రసంగం రికార్డు చేసి పంపించడం జరిగింది. ఆ ప్రసంగంలో ఆయన తెలుగు శాఖని పటిష్టం చేయడానికి, వంగూరి సంస్థ ఆశయాలు, భాష, సాహిత్యాల అభివృద్ధికి తన వంతుగా లక్ష డాలర్ల విరాశంతో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఎండోమెంట్ ఫండ్ ఫర్ తెలుగు స్టడీస్ పేరిట ధార్మిక నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దానికి అందరూ చప్పట్లు కొడుతూ స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వడం జరిగింది. అంతేగాదు మన సనాతన భారతీయ భాషా, సాహిత్య, సాంస్కృతిక, సంగీత, నాట్య సంపదలని, కళారూపాలని స్నాతకోత్తర స్థాయిలో అధ్యయన అవకాశాలని కల్పిస్తున్న సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం, ఇతర వ్యవస్థలని మనం అందరం బలోపేతం చేయ్యాలి అని చెప్పారు. ఇలా అందరం కలిసి తలో చెయ్యీ వేసి ప్రోత్సహిస్తేనే కదా బావితరాలకి మన సాంస్కృతిక అస్తిత్వాన్ని అందజేయగలం అని చెప్పారు చిట్టెన్ రాజు. ఇక వంగెన్ చిట్టెన్ రాజు గారి తోపాటు ఎంఏ పట్టాలు తీసుకుంటున్న 15 మంది ఎవరంటే.. ప్రముఖ రచయిత్రి కొమరవోలు సరోజ (కెనడా), అమెరికాలో పలు నగరాల నుంచి అమృతవల్లి కవి, భాస్కర్ రాయవరం, వేణు ఓరుగంటి, కిరణ్ సింహాద్రి, మధు కిరణ్ ఇవటూరి, పావని తణికెళ్ళ, ప్రసాద్ జోస్యుల, రామారావు పాలూరి, శ్రీ గౌరి బానావత్తుల, శ్రీని రామనాధం, సుమలిని సోమ, సువర్ణ ఆదెపు, వేణుగోపాల నారాయణ భట్ల, విద్యాధర్ తాతినేని తదితరులు. అలాగే మాకు అసమానమైన పాండిత్యమూ, బోధనా పటిమలతో రెండేళ్ళు పాఠాలు చెప్పి, పరీక్షలు పెట్టి, పరిశోధనలు చేయించి, థీసిస్ లు రాయించి పట్టాలు ఇప్పించిన ఆచార్యులు సి. మృణాళిని, పాలెపు వారిజా రాణి, అద్దంకి శ్రీనివాస్, లక్ష్మణ చక్రవర్తి, గురజాడ శ్రీశ్రీ, గంగిశెట్టి లక్ష్మీనారాయణ గార్లు. వీరిలో మృణాళిని గారు, వారిజా రాణి గారు తదితరులు ఈ స్నాతకోత్సవంలో పాలుపంచుకున్నారు. ఈ స్నాతకోత్సవం లో తెలుగు పట్టభద్రులతో పాటు కూచిపూడి నృత్యం, భరత నానాట్యం, హిందూస్తానీ సంగీతం, కర్నాటక సంగీతం, భరత నాట్యం విభాగాలలో సుమారు 40 మంది మాస్టర్స్, డిప్లమా లు అందుకున్నారు. అది కూడా చరిత్రలో ఒక మైలు రాయి. కాగా, ఈ స్నాతకోత్సవంలో ప్రత్యేక అతిధిగా పాల్గొన్న ఆనంద్ కూచిభొట్ల, వైద్యులు డా. ముక్కామల అప్పారావు (డిట్రాయిట్) గారు, డా. కేశవ రావు గారు అనుకోని పనిమీద హ్యూస్టన్ వచ్చి వంగూరి చిట్టెన్ రాజుగారిని పరామర్శించడం విశేషం. ఇక చిట్టెన్ రాజు గారు ఎంఏ తెలుగు పట్టాలో పరిశోధానంశం “అమెరికా తెలుగు డయస్పోరా కథలు-చారిత్రక, వస్తు విశ్లేషణ.వంగూరీ చిట్టెన్ రాజు(చదవండి: 18వ ఆటా కన్వెన్షన్ యూత్ కాన్ఫరెన్స్ సర్వం సన్నద్ధం!) -
అగ్రరాజ్యంలో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు!
అగ్రరాజ్యం అమెరికాలో దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. ఉత్తర కాలిఫోర్నియా, మిల్పిటాస్ నగరంలోని సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణంలో దీపావళి వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి దీపోత్సవాన్ని ప్రారంభించారు. మహిళలు పెద్ద సంఖ్యలో దీపాలు వెలిగించి ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. ప్రవాసులు సంప్రదాయ వస్త్రధారణతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షులు కూచిభొట్ల ఆనంద్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఇక అందరూ కలిసి బాణసంచా కాల్చుతూ సంబరాలు చేసుకున్నారు. చిన్నారులు, యువత.. టపాసులు, తారాజువ్వలు, చిచ్చుబుడ్లు వెలిగించి ఆనందాలు పంచుకున్నారు. అన్ని రకాల టపాసులు పేలుస్తూ సంబరాలు చేసుకున్నారు. దీపాలు, టపాసుల కాంతులతో సిలికానాంధ్ర యూనివర్సిటీ ప్రాంగణం వెలిగిపోయింది. ప్రవాసులు బారీగా తరలివచ్చి.. వెలుగుల పండుగ దీపావళిని ఆనందోత్సాహాల మధ్య సెలబ్రేట్ చేసుకున్నారు. దీపావళి ఉత్సవంలో భాగంగా భక్తి గీతాలు, భజనలతో పాటు వైవిధ్యభరిత సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను అలరింపజేశాయి. దీపావళి వేడుకలు గ్రాండ్‌గా జరగటం పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. (చదవండి: న్యూయార్క్‌లో ఘనంగా దీపావళి వేడుకలు) -
ఘనంగా సిలికానంధ్ర సంస్థాపక దినోత్సవ వేడుకలు
ఉత్తర కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ నగరంలో సిలికానాంధ్ర 22వ సంస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలోని డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి భవనం ఈ వేడకకు వేదికయ్యింది. గత 22ఏళ్ల ఆనవాయితీ ప్రకారం.. ఈ సభ కూడా బ్రహ్మశ్రీ మారేపల్లి నాగవేంకటశాస్త్రిగారి వేదాశ్వీరచనంతో మొదలయ్యింది. సంస్థాపక దినోత్సవ వేడుకలో ప్రముఖ ఆకర్షణగా కళారత్న గుమ్మడి గోపాలకృష్ణ దర్శకత్వంలో, ఆకెళ్ల రచించిన శ్రీనాథుడు పూర్తి నిడివి తెలుగు పద్య నాటకాన్ని ప్రదర్శించారు. ఇందులో గుమ్మడి గోపాలకృష్ణ శ్రీనాథుడి పాత్ర పోషించగా, సిలికానాంధ్ర కుటుంబ సభ్యులు మిగిలిన పాత్రలు పోషించారు. నాటకాన్ని తిలకించిన ప్రేక్షకులు పాత్రలతో మమేకమైపోయారు. శ్రీనాథుడి జీవిత చరమాంక సన్నివేశాల్లో సభలో కంటతడి పెట్టని వారు లేరంటే అతిశయోక్తి కాదు. నాటకం అనంతరం డా. లక్కిరెడ్డి హనిమిరెడ్డి చేతుల మీదుగా గుమ్మడి గోపాలకృష్ణకు సన్మానం జరిగింది. ఆయనకు శాలువా కప్పి పదివేల డాలర్ల బహుమతి కూడా ప్రకటించారు. ఈ కార్యక్రమానికి బూదరాజు శ్రీనివాసమూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇలాంటి ఒక పద్యనాటక ప్రదర్శన చూడలేదని పేర్కొన్నారు. సిలికానంద్ర కుటుంబానికి ఆప్తులు, సన్నిహితులు దివంగత సిరివెన్నెల సీతారామశాస్త్రి కుటుంబం కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వేదికంతా పొగ కమ్మేయగా సిరివెన్నెలే వచ్చారా అన్నట్టుగా వారి కుమారుడు యోగిని వాళ్ళ నాన్నగారిలా వేదిక మీదకి రావడం ఆహూతులకు ఆశ్చర్యానంద అనుభూతిని కలిగించింది.సిరివెన్నెల కుటుంబసభ్యుల సమక్షంలో యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర తెలుగు శాఖలో వచ్చే ఏడాది నుంచి సిరివెన్నెల ఆచార్య పీఠం ప్రారంభిస్తున్నట్టు యూనివర్సిటీ అధ్యక్షులు డా. కూచిభొట్ల ఆనంద్ ప్రకటించారు. అలానే ప్రతీ సంవత్సరం విశ్వవిద్యాలయ స్నాతకోత్సవ సభలో సిరివెన్నెల స్మారకోపన్యాసము, సిరివెన్నెల స్మారక పతకం ఇవ్వనున్నట్టు తెలియజేశారు. -
అమెరికాలో ‘బాలమురళి’ గానామృతం
కాలిఫోర్నియా: సిలికానాంధ్ర మ్యూజిక్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అండ్ డాన్స్ అకాడమీ "సంపద" ఆధ్వర్యంలో కాలిఫోర్నియాలో కర్ణాటక సంగీత సామ్రాట్ తెలుగువారు గర్వించదగిన మంగళంపల్లి బాలమురళీకృష్ణ 91వ జయంతి ఉత్సవాలు సిలికానాంధ్ర సంపద ఆధ్వర్యంలో కన్నుల పండువగా జరిగాయి. జులై 4న వర్చువల్‌గా నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎంతోమంది కళాకారులు హాజరై బాల మురళి కృష్ణ గారితో తమకున్న అనుబంధాలని పంచుకున్నారు. స్వర నివాళి ఈ కార్యక్రమంలో కేరళ నుంచి మంగళంపల్లి శిష్యులు ప్రిన్స్ రామ వర్మ, హైదరాబాద్ నుంచి డీవీ మోహన కృష్ణ పాల్గొని గురువు గారితో వారికున్న అనుభవాలని పంచుకున్నారు. ప్రముఖ మ్యూజికాలజిస్ట్ డాక్టర్ బి ఎం సుందరం, డాక్టర్ పప్పు వేణుగోపాలరావు, సుప్రసిద్ధ సంగీత విద్వాంసులు చిత్రవీణ రవి కిరణ్, చిత్రవీణ నరసింహం, ప్రముఖ ఘటం కళాకారులు కార్తీక్, ప్రముఖ మృదంగ విద్వాంసులు పత్రి సతీష్ కుమార్ గారు మరియు సంగీత విద్వాంసులు శ్రీరాం పరశురాం గారు, మోదుమూడి సుధాకర్ గారు, వయోలిన్ కళాకారిణి పద్మ శంకర్ గారు, జీవీ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. అంతేకాదు మంగళంపల్లి వారి కుటుంబ సభ్యులు అభిరామ్, డాక్టర్ మంగళంపల్లి వంశీ, కస్తూరి గోపాల రావు తదితరులు ఈ వేడుకల్లో భాగమయ్యారు. బాలమురళి గారి థిల్లానాలకు ప్రముఖ నాట్య గురువు ప్రియదర్శిని గోవింద్ శిష్యురాలు శ్వేత ప్రచండె అద్భుతమైన నాట్య ప్రదర్శన చేసి వీక్షకులను అలరించారు. బాలమురళి గారి శిష్యులు చిట్టమూరి కారుణ్య, చిన్మయిలు బాలమురళి గారి కీర్తనలు పాడి స్వర నివాళినర్పించారు. ఆకట్టుకున్న డాక్యుమెంటరీలు సంపద ఉపాధ్యక్షుడు ఫణి మాధవ్ కస్తూరి నాయకత్వంలో డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి జీవన విశేషాల పై ఇంగ్లీష్ మరియు తెలుగు భాషల్లో రూపొందించిన డాక్యుమెంటరీలు వీక్షకులను మంత్రముగ్ధులను చేసాయి. దీనికి స్క్రిప్ట్ మరియు వాయిస్ ఓవర్ అందించిన డాక్టర్ మాలస్వామి (ఇంగ్లీష్), వాచస్పతి అంబడిపూడి మురళీకృష్ణ(తెలుగు)కు సంపద అధ్యక్షులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖుల ఏమన్నారంటే - ప్రఖ్యాత వాయులీనం విద్వాంసులు అన్నవరపు రామస్వామి గారు మాట్లాడుతూ ‘సంపద’ వారికి ఇలాంటి కార్యక్రమం నిర్వహించాలని ఆలోచన రావడం చాలా గొప్ప విషయమన్నారు. సంగీతం లోనే కాకుండా లోనే కాకుండా వయోలిన్, వయోలా మరియు మృదంగం, కంజీర వంటి వాద్యాలలో బాలమురళి కృష్ణ చక్కటి ప్రతిభను కనపరిచేవారు అని పేర్కొన్నారు. - ప్రముఖ నాట్యాచార్యులు పద్మభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ పద్మా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ... భగవంతుడు సంగీత ప్రపంచానికి ఇచ్చిన అతి గొప్ప వరం డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ అని తాను భావిస్తున్నట్లు చెప్పారు. ఆయన రచించి స్వరపరిచిన హిందోళ తిల్లానాకు డాన్స్ చేసే అవకాశం తొలిసారిగా తనకు కలిగిందన్నారు. - బాలమురళి కృష్ణ గారి జీవించి ఉన్న సమయంలో తను జీవించడం గొప్ప అదృష్టంగా భావిస్తానని ప్రముఖ సంగీత విద్వాంసురాలు పద్మభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ సుధ రఘునాథన్ అన్నారు. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండే సామెతకు మంగళంపల్లి బాలమురళీకృష్ణ చిరునామ అన్నారు. - బాలమురళి కృష్ణ జయంతి సందర్భంగా సంపద ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని ప్రముఖ వాయులీన విద్వాంసులు పద్మశ్రీ పురస్కార గ్రహీత అవసరాల కన్యాకుమారి అన్నారు. ‘సంపద’కు అభినందనలు ఈ కార్యక్రమం మొత్తాన్ని సమన్వయపరిచి దిగ్విజయం చేయడానికి నాయకత్వం వహించిన సంపద అధ్యక్షులు దీనబాబు గారికి మంగళంపల్లి బాలమురళీకృష్ణ వారి శిష్యులు, కుటుంబ సభ్యులు మరియు సన్నిహితులు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా సిలికానాంధ్ర వాగ్గేయకార విభాగం ఉపాద్యక్షులు వంశీకృష్ణ నాదెళ్ళ, సృజన నాదెళ్ళ మరియు మమత కూచిభొట్ల బాలమురళి గారి అభిమానులందరికీ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని youtube.com/sampadatv ద్వారా చూడవచ్చు. -
ఒకేసారి 50 దేశాల్లో హనుమాన్ చాలీసా పారాయణం
కరోనా మహమ్మారిని నుంచి మానవాళిని రక్షించుకునేందుకు.. జరిపే పోరులో విజయం సాధించడానికి ఆ దేవుడి ఆశీస్సులు కూడా సాధించే లక్ష్యంతో అంతర్జాలంలో సిలికానాంధ్ర హనుమాన్ చాలీసా లక్ష గళార్చన నిర్వహించింది. సాయిదత్తపీఠం, నాట్స్‌తో పాటు అనేక తెలుగు సంఘాలు, ఆధ్యాత్మిక సంస్థలు ఈ లక్ష గళార్చనకు తమ సహకారాన్ని అందించాయి. భారత స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఒకేసారి లక్షమంది హనుమాన్ చాలీసా పఠించడంతో, హనుమాన్ చాలీసా లక్ష గళార్చన కార్యక్రమం గిన్నీస్ రికార్డు కూడా సొంతం చేసుకుంది. సిలికానాంధ్ర వ్యవస్థాపకులు ఆనంద్ కూచిభొట్ల, ఆరెంజ్ మూన్ అధినేత అశోక్ బడ్డి, ఆరెంజ్ మూన్ సాంకేతిక బృంద సమన్వయకర్త హరి దేవబత్తుని అకుంఠిత కార్యదీక్షతో లక్ష గళార్చన లక్ష్యాన్ని సాధించారు. 50 దేశాల నుంచి హిందు భక్త సమాజం ఈ హనుమాన్ చాలీసా పారాయణంలో పాల్గొన్నారు. ఇందులో ఎందరో హిందు ప్రముఖులు కూడా పాల్గొని భక్తి శ్రద్ధలతో హనుమాన్ చాలీసాను పారాయణం చేశారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, గజేంద్ర షెకావత్‌లు ఇది ఓ అద్భుతమైన కార్యక్రమాన్ని కొనియాడారు. ఒకేసారి ఇంతమంది ఆన్లైన్ వేదికగా గళార్చన చేయడంతో ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కి యావత్ భారతీయులంతా గర్వపడేలా చేసింది. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ సిలికానాంధ్ర వ్యవస్థాపకులు ఆనంద్ కూచిభొట్ల, ఆరెంజ్ మూన్ అధినేత అశోక్ బడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సంకల్పం గొప్పదైతే సాధించలేనిది ఏదీ లేదనేది ఈ లక్ష గళార్చన నిరూపించిందని... కరోనా పై పోరులో దైవబలం కూడా మానవాళికి తోడుగా ఉండి త్వరలోనే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. న్యూజెర్సీ సాయిదత్త పీఠం ద్వారా భక్తులను ఆన్లైన్ ద్వారా అనుసంధానం చేయడంలో రఘు శర్మ శంకరమంచి కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు. ఈ కార్యక్రమానికి నాట్స్ అందించిన సహకారం కూడా మరువలేనిదని ఆనంద్ కూచిభొట్ల అన్నారు. ఈ విషయంలో నాట్స్ నాయకులు మురళీకృష్ణ మేడిచర్లను కూడా ఆయన ప్రత్యేకంగా అభినందించారు. -
‘సంపద’పెంచుకున్న ప్రవాసాంధ్రులు
వాషింగ్టన్: డబ్బు మాత్రమే సంపద కాదు. కళ కూడా ఓ సంపదే. ఆ సంపద సంపాదనలో కొందరు ప్రవాసాంధ్రుల పిల్లలు ముందడుగేశారు. కరోనా కష్టకాలంలో ఇంటి నుంచే సాంస్కృతిక కళల పరీక్షల్లో పాల్గొన 1500 మంది ప్రవాసాంధ్రుల పిల్లలు ఉత్తీర్ణులయ్యారని సిలికానాంధ్ర మ్యూజిక్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అండ్ డాన్స్ అకాడమీ(సంపద) డీన్, ప్రెసిడెంట్ దీనబాబు కొండుభట్ల పేర్కొన్నారు. తెలుగు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో సంపద ద్వారా ప్రవాసంలో నివసిస్తున్న తెలుగు వారి పిల్లలకు కర్ణాటక సంగీతం, హిందుస్తానీ సంగీతం, కూచిపూడి, భరతనాట్యంలో శిక్షణనిస్తున్నట్లు ఆయన తెలిపారు. పక్కా పాఠ్యప్రణాళికలతో నిర్వహించే కోర్సుల్లో ఉత్తీర్ణులైన వారికి జూనియర్, సీనియర్ సర్టిఫికెట్స్ అందజేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది 1500 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా పాసైన వాళ్లకు సర్టిఫికేట్లు అందించినట్లు వివరించారు. కోవిడ్–19 కష్టకాలంలో పరీక్షలను ఇళ్లలో సజావుగా నిర్వహించిన సంపద సభ్యులు ఫణి మాధవ్ కస్తూరి, శాంతి కొండా, ఉష మాడభూషి , తెలుగు విశ్వ విద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి డా. రెడ్డి శ్యామలను విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశంసించారని చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరంలో చేరదలచిన విద్యార్ధులు SAMPADA.SILICONANDHRA.ORG వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని సూచించారు. కరోనా కాలంలో ప్రవాసాంధ్రులకు సాంత్వన చేకూర్చేందుకు సంపద రూపొందించిన కార్యక్రమాలకు అద్భుతమైన స్పందన వచ్చినట్లు వెల్లడించారు. మ్యూజిక్‌పై నిర్వహించిన కాంపిటీషన్‌కు 550 మంది నమోదు చేసుకున్నట్లు చెప్పారు. తొలి విడతలో ఐదు నగరాలలో నిర్వహించిన ప్రాంతీయ పోటీలలో గెలుపొందిన 65 మంది జూలై 11, 12 తేదీల్లో జరిగే జాతీయ పోటీల్లో పాల్గొంటారని సిలికానాంధ్ర వాగ్గేయకార ఉపాధ్యక్షుడు వంశీకృష్ణ నాదెళ్ల తెలిపారు. ఈ పోటీలకు సాంకేతిక నిర్వహణ బాధ్యతను సిలికానాంధ్ర ఉపాధ్యక్షులు ఫణిమాధవ్ కస్తూరి నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఆగస్టు 8, 9 తేదిల్లో కర్ణాటక సంగీత వాద్య పరికరాలు వీణ, వయోలిన్, ఫ్లూట్, మృదంగంలో కుడా అంతర్జాలం ద్వారా పోటీలు నిర్వహించబోతుఉన్నట్లు తెలిపారు. ఈ పోటీలలో పాల్గొనాలనుకునే వారు త్యాగయ్య, దీక్షితార్, శ్యామ శాస్త్రి కృతులను ఎంచుకుని, రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పారు. ఇతర వివరాలకు vaggeyakara.siliconandhra.org వెబ్‌సైట్‌ని సందర్శించాలని సూచించారు. ఈ కార్యక్రమాలు ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. సంపద కార్యక్రమాలు విజయవంతం కావడానికి నార్త్ కరోలినా నుంచి గౌతమి మద్దాలి, మల్లికా వడ్లమాని, వర్జీనియా నుంచి సిలికానాంధ్ర ఉపాధ్యక్షురాలు మాధురి దాసరి, రత్నవల్లి తంగిరాల, మాచిరాజు సుబ్రహ్మణ్యం, న్యూజెర్సీ నుంచి విజయ తురిమెల్ల, బాలు పసుమర్తి, లక్ష్మి నండూరి, రవి కామరసు, సిలికానాంధ్ర ఉపాధ్యక్షుడు శరత్ వేట, చికాగో నుంచి మాలతీ దామరాజు, శాంతి చతుర్వేదుల, సిలికానాంధ్ర ఉపాధ్యక్షురాలు సుజాత అప్పలనేని, పద్మారావు అప్పలనేని, కాలిఫోర్నియా నుంచి మమత కూచిభొట్ల, సృజన నాదెళ్ల, నారాయణ్ రాజు, సిలికానాంధ్ర వాగ్గేయకార విభాగం ఉపాధ్యక్షులు వంశీకృష్ణ నాదెళ్ళ తదితరులు కృషి చేస్తున్నారు. -
సిలికానాంధ్ర ఆధ్వర్యంలో అన్నమయ్య జయంతి ఉత్సవాలు
కాలిఫోర్నియా : సిలికానాంధ్ర అన్నమయ్య 611వ జయంతి ఉత్సవాలు మిల్పిటాస్లోని సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో 3రోజులపాటు అత్యంత వైభవంగా జరిగాయి. మొదటిరోజు శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలతో రథోత్సవంతో ప్రారంభమైన ఈ ఉత్సవంలో భాగంగా జరిగిన సప్తగిరి సంకీర్తనల గోష్టిగానంలో 1000మందికి పైగా గాయనీ గాయకులు పాల్గొన్నారు. అన్నమాచార్య రచించిన 108 కీర్తనలతో నిర్వహించిన అష్టోత్తర శత సంకీర్తనల కార్యక్రమంలో వివిధ నగరాలనుండి వచ్చిన వందలాది కళాకారులు ఆలపించిన అన్నమయ్య కీర్తనలతో ప్రాంగణమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అష్టోత్తర శత సంకీర్తనల కార్యక్రమానికి ప్రియ తనుగుల, మమత కూచిభొట్ల, వాణి గుండ్లపల్లి నేతృత్వం వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన డా. లకిరెడ్డి హనిమిరెడ్డి చేతులమీదుగా సుజనరంజని ప్రత్యేక సంచిక ఆవిష్కరణ జరిగింది. ఈ సంచికలో ప్రముఖ రచయితలు అన్నమయ్య కీర్తనల గురించి వ్రాసిన అమూల్యమైన రచనలు పొందుపరిచారు. సిలికానాంధ్ర వాగ్గేయకార బృందం నేతృత్వంలో రెండవరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగిన అన్నమయ్య సంగీత పోటీలు 3వరోజు జరిగిన నృత్య పోటీలతో పాటు 3 రోజులు సాయంత్రం వేళల్లో ఏర్పాటు చేసిన ప్రముఖ కళాకారులు గరిమెళ్ల అనిల్ కుమార్, శ్రీలక్ష్మి కోలవెన్ను, గాయత్రి అవ్వారి, జోశ్యుల సూర్యనారయణ, హలీం ఖాన్‌లతో సంగీత నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను తన్మయులను చేశాయి. ఈ 3 రోజుల ఉత్సవాలలో దాదాపు 2000 మందికి పైగా ప్రేక్షకులు పాల్గొని అన్నమయ్యకు స్వర నివాళి అందించారు. ఈ సందర్భంగా సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఆనంద్ కూచిభొట్ల మాట్లాడుతూ 611 సంవత్సరాల క్రితం అన్నమయ్య రచించిన ఈ కీర్తనలు పదికాలాలు పదిలంగా ఉంచడానికి, తరువాతి తరాలకు అందించడానికే సిలికానాంధ్ర అన్నమయ్య జయంతి ఉత్సవాలను ప్రతి ఏటా అమెరికా వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇంతకు ముందు లక్ష అరవైవేలమందితో అన్నమయ్య లక్షగళార్చన, సహస్రగళ సంకీర్తనార్చన, నిర్విరామంగా 108 గంటలపాటు అన్నమయ్య 444 కీర్తనల ఆలాపన వంటి కార్యక్రమాలు సిలికానాంధ్ర ఆధ్వర్యంలో నిర్వహించామని పేర్కొన్నారు. త్వరలో అమెరికాలో 18 వేలమందితో అన్నమయ్య సప్తగిరి సంకీర్తనోత్సవాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. సిలికానాంధ్ర వాగ్గేయకార బృందం అధ్యక్షులు సంజీవ్ తనుగుల నేతృత్వంలో వంశీ నాదెళ్ల, దుర్గ దేవరకొండ, చంద్రిక తాడూరి, మృత్యుంజయుడు తాటిపాముల, దిలీప్ కొండిపర్తి, రాజు చమర్తి, దీనబాబు కొండుభట్ల, సాయి కందుల, ఫణి మాధవ్ కస్తూరి తదితరులు పాల్గొన్నారు. -
ఈ తూరుపు..ఆ పశ్చిమం