అగ్రరాజ్యం అమెరికాలో దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. ఉత్తర కాలిఫోర్నియా, మిల్పిటాస్ నగరంలోని సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణంలో దీపావళి వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి దీపోత్సవాన్ని ప్రారంభించారు. మహిళలు పెద్ద సంఖ్యలో దీపాలు వెలిగించి ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. ప్రవాసులు సంప్రదాయ వస్త్రధారణతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షులు కూచిభొట్ల ఆనంద్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఇక అందరూ కలిసి బాణసంచా కాల్చుతూ సంబరాలు చేసుకున్నారు.
చిన్నారులు, యువత.. టపాసులు, తారాజువ్వలు, చిచ్చుబుడ్లు వెలిగించి ఆనందాలు పంచుకున్నారు. అన్ని రకాల టపాసులు పేలుస్తూ సంబరాలు చేసుకున్నారు. దీపాలు, టపాసుల కాంతులతో సిలికానాంధ్ర యూనివర్సిటీ ప్రాంగణం వెలిగిపోయింది. ప్రవాసులు బారీగా తరలివచ్చి.. వెలుగుల పండుగ దీపావళిని ఆనందోత్సాహాల మధ్య సెలబ్రేట్ చేసుకున్నారు. దీపావళి ఉత్సవంలో భాగంగా భక్తి గీతాలు, భజనలతో పాటు వైవిధ్యభరిత సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను అలరింపజేశాయి. దీపావళి వేడుకలు గ్రాండ్‌గా జరగటం పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
(చదవండి: న్యూయార్క్‌లో ఘనంగా దీపావళి వేడుకలు)
Comments
Please login to add a commentAdd a comment