ఫాంహౌస్లపై పోలీసుల దాడి, పలువురి అరెస్ట్ | Police raid farmhouse, several arrested | Sakshi
Sakshi News home page

ఫాంహౌస్లపై పోలీసుల దాడి, పలువురి అరెస్ట్

Published Sun, Dec 21 2014 11:00 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

Police raid farmhouse, several arrested

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని పలు ఫాంహౌస్లపై పోలీసులు శనివారం మెరుపు దాడి చేశారు. ఈ సందర్భంగా మద్యం, హుక్కాతో పాటు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. మండలంలోని అమ్దాపూర్లోని మల్లేష్‌యాదవ్  ఓ ఫాంహౌస్పై దాడి చేసిన పోలీసులు...అనుమతి లేకుండా ఫాంహౌస్‌లో విందు ఏర్పాటు చేసినవారిపై  కేసు నమోదు చేసి 20మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజుల క్రితం కూడా ఈ ఫాంహౌస్పై పోలీసులు దాడి చేసి సుమారు 40మంది విద్యార్థులను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

అలాగే పలు ఫాంహౌస్ల్లో పేకాడుతున్నవారిని అదుపులోకి తీసుకున్నారు. గత కొద్దికాలంగా నగర శివార్లలో ఫాంహౌస్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారటంతో పాటు, రేవ్ పార్టీలు జోరుగా సాగుతుండటంతో పోలీసులు రంగంలోకి దిగారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement