టీఎస్ ఐసెట్ -2015 ప్రారంభం | telangana ICET-2015 begin | Sakshi
Sakshi News home page

టీఎస్ ఐసెట్ -2015 ప్రారంభం

Published Fri, May 22 2015 10:01 AM | Last Updated on Sun, Sep 3 2017 2:30 AM

telangana ICET-2015 begin

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో 2015-2016 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకుగాను శుక్రవారం  టీఎస్‌ ఐసెట్-2015 ప్రారంభమైంది. 69,232 మంది అభ్యర్థులు ఐసెట్ పరీక్ష రాయనున్నారు. టీఎస్‌ఐసెట్ నిర్వహణకు 15 రీజియన్ సెంటర్లు వరంగల్, ఆదిలాబాద్, హైదరాబాద్, జగిత్యాల, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, మహబూబ్‌నగర్, నల్లగొండ, నిజామాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, వనపర్తిలో 119 పరీక్ష కేంద్రాలను కేటయించారు.

ఈ పరీక్ష శుక్రవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనుంది.  పది గంటల తరువాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను పరీక్ష కేంద్రాలకు అనుమతించమని అధికారులు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఐసెట్‌కు సంబంధించి  మే 25న ప్రాథమిక కీ విడుదల చేసి, జూన్ 3వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. ఫలితాలను జూన్ 9న విడుదల చేస్తారు. . శుక్రవారం ఉదయం 6గంటలకు  ఐసెట్ ప్రశ్నాపత్రం సెట్‌ను కేయూ ఇన్‌చార్జ్ వీసీ చిరంజీవులు, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి.పాపిరెడ్డి కేయూలోని ఐసెట్ కార్యాలయంలో డ్రా తీయనున్నారు.

icet - 2015, telangana icet, MBA,t.papireddy, ఐసెట్ 2015, తెలంగాణ, విద్యార్థులు, ఎంబీఏ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement