తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో 2015-2016 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకుగాను శుక్రవారం టీఎస్‌ఐసెట్-2015 నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.
కేయూ క్యాంపస్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో 2015-2016 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకుగాను శుక్రవారం టీఎస్‌ఐసెట్-2015 నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. 69,232 మంది అభ్యర్థులు ఐసెట్ పరీక్ష రాయనున్నారు. టీఎస్‌ఐసెట్ నిర్వహణకు 15 రీజియన్ సెంటర్లు వరంగల్, ఆదిలాబాద్, హైదరాబాద్, జగిత్యాల, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, మహబూబ్‌నగర్, నల్లగొండ, నిజామాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, వనపర్తిలో 119 పరీక్ష కేంద్రాలను కేటారుుంచారు.119 మంది చీఫ్ సూపరింటెండెంట్లను నియమించారు. 500 మందికి ఒక అబ్జర్వర్, 35మంది స్పెషల్ అబ్జర్వర్లను నియమించారు.
ప్రతి 20 మందికొక ఇన్విజిలేటర్‌ను నియమించారు. ఈ పరీక్ష శుక్రవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించ నున్నారు. నిర్ధేశించిన సమయానికి గంటముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. ఉదయం 10గంటల తరువాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను పరీక్ష కేంద్రాలకు అనుమతించమని అధికారులు స్పష్టం చేశారు. ఐసెట్‌కు సంబంధించి మే 25న ప్రాథమిక కీ విడుదల చేసి, జూన్ 3వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు.ఫలితాలను జూన్ 9న విడుదల చేయూలని ప్రాథమికంగా నిర్ణరుుంచారు. శుక్రవారం ఉదయం 6గంటలకు ఐసెట్ ప్రశ్నాపత్రం సెట్‌ను కేయూ ఇన్‌చార్జ్ వీసీ చిరంజీవులు, రాష్ట్ర ఉన్నతవిద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి.పాపిరెడ్డి కేయూలోని ఐసెట్ కార్యాలయంలో డ్రా తీయనున్నారు.