T.Papireddy
-
టీఎస్ ఐసెట్ -2015 ప్రారంభం
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో 2015-2016 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకుగాను శుక్రవారం టీఎస్ ఐసెట్-2015 ప్రారంభమైంది. 69,232 మంది అభ్యర్థులు ఐసెట్ పరీక్ష రాయనున్నారు. టీఎస్ఐసెట్ నిర్వహణకు 15 రీజియన్ సెంటర్లు వరంగల్, ఆదిలాబాద్, హైదరాబాద్, జగిత్యాల, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, మహబూబ్‌నగర్, నల్లగొండ, నిజామాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, వనపర్తిలో 119 పరీక్ష కేంద్రాలను కేటయించారు. ఈ పరీక్ష శుక్రవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనుంది. పది గంటల తరువాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను పరీక్ష కేంద్రాలకు అనుమతించమని అధికారులు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఐసెట్‌కు సంబంధించి మే 25న ప్రాథమిక కీ విడుదల చేసి, జూన్ 3వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. ఫలితాలను జూన్ 9న విడుదల చేస్తారు. . శుక్రవారం ఉదయం 6గంటలకు ఐసెట్ ప్రశ్నాపత్రం సెట్‌ను కేయూ ఇన్చార్జ్ వీసీ చిరంజీవులు, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి.పాపిరెడ్డి కేయూలోని ఐసెట్ కార్యాలయంలో డ్రా తీయనున్నారు. icet - 2015, telangana icet, MBA,t.papireddy, ఐసెట్ 2015, తెలంగాణ, విద్యార్థులు, ఎంబీఏ -
నేడే టీఎస్ ఐసెట్ -2015
కేయూ క్యాంపస్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో 2015-2016 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకుగాను శుక్రవారం టీఎస్ఐసెట్-2015 నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. 69,232 మంది అభ్యర్థులు ఐసెట్ పరీక్ష రాయనున్నారు. టీఎస్ఐసెట్ నిర్వహణకు 15 రీజియన్ సెంటర్లు వరంగల్, ఆదిలాబాద్, హైదరాబాద్, జగిత్యాల, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, మహబూబ్‌నగర్, నల్లగొండ, నిజామాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, వనపర్తిలో 119 పరీక్ష కేంద్రాలను కేటారుుంచారు.119 మంది చీఫ్ సూపరింటెండెంట్లను నియమించారు. 500 మందికి ఒక అబ్జర్వర్, 35మంది స్పెషల్ అబ్జర్వర్లను నియమించారు. ప్రతి 20 మందికొక ఇన్విజిలేటర్‌ను నియమించారు. ఈ పరీక్ష శుక్రవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించ నున్నారు. నిర్ధేశించిన సమయానికి గంటముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. ఉదయం 10గంటల తరువాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను పరీక్ష కేంద్రాలకు అనుమతించమని అధికారులు స్పష్టం చేశారు. ఐసెట్‌కు సంబంధించి మే 25న ప్రాథమిక కీ విడుదల చేసి, జూన్ 3వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు.ఫలితాలను జూన్ 9న విడుదల చేయూలని ప్రాథమికంగా నిర్ణరుుంచారు. శుక్రవారం ఉదయం 6గంటలకు ఐసెట్ ప్రశ్నాపత్రం సెట్‌ను కేయూ ఇన్చార్జ్ వీసీ చిరంజీవులు, రాష్ట్ర ఉన్నతవిద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి.పాపిరెడ్డి కేయూలోని ఐసెట్ కార్యాలయంలో డ్రా తీయనున్నారు. -
విద్యను సామాజిక బాధ్యతగా గుర్తించాలి
మహబూబ్‌నగర్ విద్యావిభాగం: విద్యను సామాజిక బాధ్యతగా గుర్తించినప్పుడే విద్యార్థికి, సమాజానికి న్యాయం జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి.పాపిరెడ్డి అన్నారు. ఎంవీఎస్ డిగ్రీ, పీజీ కళాశాల 50 వార్షికోత్సవాన్ని మంగళవారం కళాశాల ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి విద్యార్థి విద్య ప్రాధాన్యతను గుర్తించి క్రమశిక్షణతో చదువాలన్నారు. ఎంతో మంది పోరాటాలు, త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్ర కల సాకారమైందని అన్నారు. ప్రభుత్వ కళాశాల 50 వసంతాలు పూర్తి చేసుకోవడం, కళాశాలలో 3వేల మంది విద్యార్థులుండటం గర్వించదగ్గ విషయమని అన్నారు. కళాశాల వ్యవస్థాపనకు కృషి చేసిన పల్లెర్ల హనుమంతరావు వంటి మహానీయుని విద్యార్థులు గుర్తించుకోవాలన్నారు. ప్రైవేట్ కళాశాలల పోటీని తట్టుకొని ఎంవీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నడపడం అభినందనీయమని అన్నారు. కేజీ టు పీజీ ఉచిత విద్యను అమలు చేయడానికి, విద్యారంగ అభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని అన్నారు. ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వెంకటాచలం మాట్లాడుతూ 50ఏళ్లుగా ఎంవీఎస్ కళాశాలలో చదివిన విద్యార్థులు ఎన్నో ఉన్నత పదవుల్లో ఉన్నారని అన్నారు. విద్యార్థులు గొప్ప ఆలోచనలు చేయాలని, అనుకున్నది సాధించాలని అన్నారు. బాలికా విద్య చాలా ముఖ్యమని, ఒక మహిళా చదువుకుంటే కుటుంబం మొత్తం బాగుపడుతుందని అన్నారు. పీయూ అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తామని అన్నారు. అంతకు ముందు ప్రిన్సిపల్ డాక్టర్ యాదగిరి కళాశాల నివేధికను, పురోగతిని వివరించారు. ఉన్నత విద్యామండలి కార్యదర్శి శ్రీనివాసరావు, పీయూ రిజిస్ట్రార్ వెంకటాచలం మాట్లాడుతూ ఈ కళాశాలలో చదివిన వారు అత్యున్నత స్థానంలో ఉన్నారని అన్నారు. పీయూ పరీక్షల నియంత్రణ అధికారి మధుసూదన్‌రెడ్డి, పీయూ పాలకమండలి సభ్యుడు శ్రీనివాసరావు, సీపీడీసీ సభ్యులు వినాయకరావు, క్రిష్ణారెడ్డి, డాక్టర్ సీహెచ్.చంద్రయ్య, విశ్వనాథం మాట్లాడుతూ ఎంవీఎస్ కళాశాల గురించి అనుభవాలను వివరించారు. అనంతరం కళాశాల సావనీర్‌ను విడుదల చేశారు. అదే విధంగా కళాశాల విద్యార్థి లక్ష్మినర్సింహ రాసిన కుట్రజేస్తున్న కాలం కవితల పుస్తకాన్ని ఆవిష్కరించారు. వివిధ కోర్సుల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు పురస్కారం, మెమొంటోలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. -
ఉన్నత విద్యా మండలి చైర్మన్‌గా ప్రొ. పాపిరెడ్డి
ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్‌గా కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ టి.పాపిరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం విద్యా శాఖ కార్యదర్శి వికాస్‌రాజ్ జీవో నంబర్ 8 జారీ చేశారు. ఆయన ఈ పదవిలో మూడేళ్లు కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ యాక్ట్ 1988 ప్రకారం ఆయన్ని నియమించినట్లు పేర్కొన్నారు. మరోవైపు మండలి ఏర్పాటుపై ప్రభుత్వం గెజిట్‌లో నోటిఫై చేస్తూ మరో జీవో జారీ చేశారు. దీని ప్రకారం ఈనెల 5 నుంచి తెలంగాణ ఉన్నత విద్యా మండలి అధికారికంగా ఏర్పాటు అయింది. ఇందులో చేపట్టే నియామకాలు 5వ తేదీ నుంచే వర్తిస్తాయి. చైర్మన్‌గా పాపిరెడ్డిని నియమించగా, ఒక వైస్ చైర్మన్‌ను నియమించాల్సి ఉంది. ఎక్స్ అఫీషియో సభ్యులుగా విద్యా, ఆర్థిక శాఖ, లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కార్యదర్శులు, ఇతర వర్సిటీల వీసీలు ఉంటారు. విద్యార్థులు ఆందోళన చెందవద్దు : పాపిరెడ్డి ఉన్నత విద్యమండలి చైర్మన్‌గా నియమాకమైన సందర్భంగా పాపిరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో విద్యార్థులు ఎలాంటి ఆందోళనా చెందవద్దన్నారు. ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియను సజావుగా చేపడతామన్నారు. ఉద్యమం నుంచి.. హన్మకొండ : పాపిరెడ్డి వరంగల్ జిల్లా పొలిటికల్ జేఏసీ చైర్మన్‌గా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. కాకతీయ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తూ ఈ ఏడాది జూన్ లో రిటైర్ అయ్యారు. ఆదిలాబాద్ జిల్లా జయపూర్ మండలం పవునూర్ ఆయన స్వగ్రామం. ప్రస్తుత మండలికి లేఖ: తెలంగాణ ఉన్నత విద్యా మండలికి చైర్మన్‌ను నియమించినట్లు ఏపీ ఉన్నత విద్యా మండలికి తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా మంగళవారం లేఖ రాసింది. తెలంగాణ మండలికి అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని అందులో పేర్కొంది.