మానవత్వంతో కరోనాను అధిగమిస్తాం: ప్రధాని | COVID-19: Humanity will overcome pandemic Says PM Narendra Modi | Sakshi
Sakshi News home page

మానవత్వంతో కరోనాను అధిగమిస్తాం: ప్రధాని

Published Sun, Apr 19 2020 4:13 AM | Last Updated on Sun, Apr 19 2020 4:13 AM

COVID-19: Humanity will overcome pandemic Says PM Narendra Modi - Sakshi

న్యూఢిల్లీ: కరోనా ముప్పును మానవత్వాన్ని ప్రదర్శించడం ద్వారా అధిగమిస్తామని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. దేశానికే తాళాలు వేసుకున్న ఈ పరిస్థితుల్లో నిరుపేదలకు సాయం చేయడంలో కేంద్ర మంత్రులు శక్తివంచన లేకుండా చేస్తున్న కృషిని ఆయన కొనియాడారు. ‘కోవిడ్‌పై ప్రపంచం కలసికట్టుగా పోరాడుతోంది. మానవత్వంతో ఈ విపత్తు నుంచి బయటపడతాం’ అని మోదీ ట్వీట్‌ చేశారు. స్విట్జర్లాండ్‌లో నివసిస్తున్న భారతీయులు కరోనాపై పోరాటానికి సంఘీభావంగా వెయ్యి మీటర్ల భారత త్రివర్ణ పతాకాన్ని జెర్మట్‌లో ఎగురవేశారు. ఈ విషయాన్ని అక్కడి భారత ఎంబసీ ట్వీట్‌ చేసింది. ఆ ట్వీట్‌ని మోదీ రీ ట్వీట్‌ చేస్తూ కోవిడ్‌పై పోరాటంలో భాగస్వాములైన వారందరినీ అభినందించారు. ప్రత్యేకంగా కేంద్ర కేబినెట్‌లో మంత్రులు చేస్తున్న కృషిని కొనియాడారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement