
మోడీ టీంలో ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు
న్యూఢిల్లీ: భారతదేశ నూతన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ కేబినెట్ లో 46 మందికి చోటు దక్కింది. చిన్న కేబినెట్ అయితే నాణ్యమైన పాలన ఉంటుందని భావించిన మోడీ.. అందుకు అనుగుణంగానే మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. మోడీ మంత్రివర్గంలో 24 మందికి కేబినెట్ హోదా, 10 మందికి సహాయ మంత్రులు, 12 మందికి స్వతంత్ర హోదా దక్కింది. ఇక రక్షణ శాఖను మోడీ తన ఆధ్వర్యంలోనే ఉంచుకోవాలని భావించినా.. ఆ స్థానాన్ని అరుణ్ జైట్లీకి కేటాయించనున్నారని సమాచారం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్నాధ్ సింగ్కు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, సుష్మా స్వరాజ్ కు విదేశాంగమంత్రిగా , అరుణ్ జైట్లీకి ఆర్థిక శాఖ , హర్షవర్థన్కు ఆరోగ్య శాఖలు కేటాయించే అవకాశం ఉంది.
ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు..
1.రాజ్ నాథ్- (ఉత్తరప్రదేశ్)
2. సుష్మా స్వరాజ్-(హర్యానా)
3.అరుణ్ జైట్లీ (ఢిల్లీ)
4.ఎం.వెంకయ్య నాయుడు(కర్ణాటక)
5.నితిన్ జైరాం గడ్కరీ(మహారాష్ట్ర)
6.సదానంద గౌడ(కర్నాటక)
7.ఉమాభారతి(ఉత్తరప్రదేశ్)
8.నజ్మా హెప్తుల్లా(ఉత్తరప్రదేశ్)
9.గోపీనాథ్ ముండే(మహారాష్ట్ర)
10.రాం విలాస్ పాశ్వాన్ (బీహార్)
11.కల్ రాజ్ మిశ్రా(ఉత్తరప్రదేశ్)
12.మేనకా గాంధీ(ఉత్తరప్రదేశ్)
13.అనంత కుమార్(కర్నాటక)
14.రవిశంకర్ ప్రసాద్ (బీహార్)
15.అశోక్ గజపతిరాజు(ఆంధ్రప్రదేశ్)
16.అనంత్ గీతె(మహారాష్ట్ర)
17.హర్ సిమ్రత్ కౌర్ బాదల్(పంజాబ్)
18.నరేంద్ర సింగ్ తోమార్(మధ్యప్రదేశ్)
19.జ్యూల్ ఓరమ్(సుందర్ ఘడ్)
20.రాధామోహన్ సింగ్( బీహార్)
21.తవర్ చంద్ గెహ్లాట్(రాజస్థాన్)
22.స్మృతీ ఇరానీ(గుజరాత్)
23.డాక్టర్ హర్ష వర్ధన్(ఢిల్లీ)
24.జనరల్ వీకే సింగ్(ఉత్తరప్రదేశ్)
25ఇంద్రజిత్ సింగ్( ఢిల్లీ)
26.సంతోష్ గ్యాంగ్వర్ (బరేలి)
27.శ్రీపాద్ నాయక్ (గోవా)
28.ధర్మేంద్ర ప్రధాన్ (రాజ్యసభ)
29.శర్వానంద్ సొనోవాల్(అసోం)
30.ప్రకాష్ జవదేకర్ (రాజ్యసభ)
31.మనోజ్ సిన్హా(గాజీపూర్)
32.ఉపేంద్ర కుష్వాహ్(కరకట్)
33.సిపి రాధాకృష్ణన్(తమిళనాడు)
34.కిరెణ్ రిజిజు(అరుణాచల్ ప్రదేశ్)
35.కిషన్ పాల్ గుజ్జర్(రాజస్థాన్)
36.సంజీవ్ కుమార్(ఉత్తరప్రదేశ్)
37.వాసవ మన్ఫుక్ భాయ్ ధనాజీభాయ్(గుజరాత్)
38.పీయూష్ జయప్రకాష్ గోయల్(రాజ్యసభ)
39.డాక్టర్ జితేంద్ర సింగ్(ఉదంపూర్)
40.నిర్మలా సీతారామన్(తమిళనాడు)
41.దాదారావ్ పటేల్
42.విష్ణుదేవ్ సాయి
43.సుదర్శన్ భగత్
44. నిహాల్ చంద్
45.గౌడర్ మల్లికార్జునప్ప సిద్దేశ్వర(కర్నాటక)