దేశాన్ని కాదు... మీ కేబినెట్ను క్లీన్ చేయాలి: వీహెచ్ | v hanumantha rao slams swatchh bharat programme | Sakshi
Sakshi News home page

దేశాన్ని కాదు... మీ కేబినెట్ను క్లీన్ చేయాలి: వీహెచ్

Published Thu, Nov 13 2014 12:52 PM | Last Updated on Sun, Sep 2 2018 5:11 PM

దేశాన్ని కాదు... మీ కేబినెట్ను క్లీన్ చేయాలి: వీహెచ్ - Sakshi

దేశాన్ని కాదు... మీ కేబినెట్ను క్లీన్ చేయాలి: వీహెచ్

హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ్ భారత్ కార్యక్రమాన్ని రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు తీసిపారేశారు. స్వచ్ఛ భారత్ స్లోగన్ కొత్తదేమీ కాదని, గాంధీ నుంచి నెహ్రు, రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీలు చేసిన కార్యక్రమమేనని ఆయన చెప్పుకొచ్చారు. మోదీ ముందుగా తన కేబినెట్ను క్లీన్ చేసుకోవాలని, దేశాన్ని దోచుకున్నవారంతా మోదీ కేబినెట్లోనే ఉన్నారన్నారు. స్వచ్ఛ్ భారత్ పేరుతో కొద్దిసేపు సెలబ్రిటీలు ఫోటోలకు ఫోజులిచ్చిన తప్ప పెద్దగా ఒరిగిందేమీ లేదన్నారు.  నిరంతరం శ్రమించే కార్మికులను ఆదుకోవాలని వీహెచ్ అన్నారు.

కేంద్ర మంత్రివర్గంలో క్రిమినల్స్, అవినీతిపరులకు అవకాశం ఎలా కల్పించారని వీహెచ్ ప్రశ్నించారు. దేశంలోనే కాదని, ఇతర దేశాల్లోనూ బ్యాంకులకు వందలకోట్లు ఎగవేసిన సుజనా చౌదరికి చంద్రబాబు ఏవిధంగా  రికమెండ్ చేశారని ...అందుకు మోదీ ఎలా ఆమోదించారన్నారు. వెనకబడిన వర్గాలకు చెందిన దేవేందర్ గౌడ్, గుండు సుధారాణికి అవకాశం ఇస్తే బాగుండేదని వీహెచ్ అభిప్రాయపడ్డారు. సెటిలర్లు కూడా తెలంగాణలో టీడీపీ ఉండదని డిసైడయ్యారని ఆయన అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement