swatchh bharat
-
దేశాన్ని కాదు... మీ కేబినెట్‌ను క్లీన్ చేయాలి: వీహెచ్
హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ్ భారత్ కార్యక్రమాన్ని రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు తీసిపారేశారు. స్వచ్ఛ భారత్ స్లోగన్ కొత్తదేమీ కాదని, గాంధీ నుంచి నెహ్రు, రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీలు చేసిన కార్యక్రమమేనని ఆయన చెప్పుకొచ్చారు. మోదీ ముందుగా తన కేబినెట్‌ను క్లీన్ చేసుకోవాలని, దేశాన్ని దోచుకున్నవారంతా మోదీ కేబినెట్లోనే ఉన్నారన్నారు. స్వచ్ఛ్ భారత్ పేరుతో కొద్దిసేపు సెలబ్రిటీలు ఫోటోలకు ఫోజులిచ్చిన తప్ప పెద్దగా ఒరిగిందేమీ లేదన్నారు. నిరంతరం శ్రమించే కార్మికులను ఆదుకోవాలని వీహెచ్ అన్నారు. కేంద్ర మంత్రివర్గంలో క్రిమినల్స్, అవినీతిపరులకు అవకాశం ఎలా కల్పించారని వీహెచ్ ప్రశ్నించారు. దేశంలోనే కాదని, ఇతర దేశాల్లోనూ బ్యాంకులకు వందలకోట్లు ఎగవేసిన సుజనా చౌదరికి చంద్రబాబు ఏవిధంగా రికమెండ్ చేశారని ...అందుకు మోదీ ఎలా ఆమోదించారన్నారు. వెనకబడిన వర్గాలకు చెందిన దేవేందర్ గౌడ్, గుండు సుధారాణికి అవకాశం ఇస్తే బాగుండేదని వీహెచ్ అభిప్రాయపడ్డారు. సెటిలర్లు కూడా తెలంగాణలో టీడీపీ ఉండదని డిసైడయ్యారని ఆయన అన్నారు. -
ప్రధాని పర్యటనలో భద్రతా వైఫల్యం
వారణాసి: ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో భద్రతా వైఫల్యం స్పష్టంగా కనబడింది. సొంత నియోజక వర్గం వారణాసిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన రెండోరోజు కొనసాగుతుండగా కంట్రోల్ రూమ్ మానిటర్లు పనిచేయకపోవడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధాని భద్రత వైఫల్యం చెందడంపై దర్యాప్తు జరపాలని ఐబీ డైరెక్టర్ కు హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది. శనివారం ఉదయం మోదీ అస్సీ ఘాట్‌లో గంగా పూజలో పాల్గొన్నారు. అనంతరం ఆయన అస్సీ ఘాట్‌లో 'నిర్మల్ గంగ' కార్యక్రమంలో పాల్గొని గంగమ్మ ప్రక్షాళనకు నడుం బిగించారు. నిర్మల్ గంగ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని తన పర్యటను కొనసాగిస్తుండగా కంట్రోల్ రూమ్ మానిటర్లు పనిచేయకపోవడంతో కలకలం రేగింది. -
గంగానది ప్రక్షాళనకు నడుం బిగించిన మోదీ
-
గంగానది ప్రక్షాళనకు నడుం బిగించిన మోదీ
వారణాశి : సొంత నియోజక వర్గం వారణాసిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన రెండోరోజు కొనసాగుతోంది. శనివారం ఉదయం ఆయన అస్సీ ఘాట్‌లో గంగా పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ గంగమ్మకు పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన అస్సీ ఘాట్‌లో 'నిర్మల్ గంగ' కార్యక్రమంలో పాల్గొని గంగమ్మ ప్రక్షాళనకు నడుం బిగించారు. నిర్మల్ గంగ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని... స్వయంగా పార చేతబట్టారు. మట్టిని ఎత్తిపోశారు. ప్రధాని మోదీ ఈ సందర్భంగా ఉత్తర ప్రదేశ్‌కు చెందిన 9మందిని స్వచ్ఛ్ భారత్‌లో పాల్గొనాలని ఆహ్వానించారు. యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌తో పాటు క్రికెటర్లు మహ్మద్ కైఫ్, సురేష్ రైనా, బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ, మనుశర్మ, రాజూ శ్రీవాత్సవ, ప్రొఫెసర్ దేవీ ప్రసాద్ ద్వివేదీ సహా మొత్తం 9 మందిని స్వచ్చ్భారత్ కోసం మోదీ ప్రతిపాదించారు. -
తొంభై లక్షల మందికి కమల్ హాసన్ సవాల్
చెన్నై : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చాలెంజ్‌ను నటుడు కమల్ హాసన్ స్వీకరించారు. దేశాన్ని పరిశుభ్రంగా మార్చాలని కంకణం కట్టుకున్న మోడీ స్వచ్ఛ భారత్ సవాల్ విసిరిన విషయం తెలిసిందే. ప్రధాని చాలెంజ్‌ను కమల్ హాసన్ స్వీరించారు. అంతే కాకుండా ఆయన 'నైన్ మిలియన్ పీపుల్'కు చాలెంజ్ చేశారు. 'స్వచ్ఛ భారత్' కార్యక్రమంలో లో ప్రధాని తనను భాగస్వామ్యం చేయటంపై కమల్ ధన్యవాదాలు తెలిపారు. ఇది తనకు నూతన బాధ్యత అన్నారు. అయితే పరిశుభ్రతపై తాను ఇప్పటికే పని చేస్తున్నట్లు పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్‌లో పాల్గొనాలని కమల్ తొంభై లక్షల మంది ప్రజలకు పిలుపు నిచ్చారు. ఈ మేరకు ఆయన ఓ వీడియాలో మాట్లాడుతూ పారిశుద్ధ్యం విషయంలో గత ఇరవై ఏళ్లుగా పాల్గొంటున్నానని, తనతో పాటు అభిమానులు సామాజిక సేవ చేస్తున్నట్లు చెప్పారు. తన పని కొనసాగుతోందని, అయితే ఇది ప్రజల పని అని, అందులో తాను ఓ భాగమన్నారు. అయితే ఈ కార్యక్రమాన్ని రాజకీయంగా మార్చవద్దని సూచించారు. ప్రస్తుతం కమల్ హాసన్ మళయాళం, తెలుగులో విజయవంతమైన 'దృశ్యం' షూటింగ్లో బిజీగా ఉన్నారు. తమిళంలో ఈ చిత్రాన్ని 'పాపనాశం' పేరుతో కమల్ తెరకెక్కిస్తున్నారు. కాగా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ప్రధాని మోడీ పరిశుభ్ర భారతావని ఆవశ్యకతపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలంటూ పలు రంగాల్లోని తొమ్మిది మంది ప్రముఖులకు ఆహ్వానం పలికారు. అలాగే ఆ ప్రముఖుల్లో ఒక్కొక్కరూ మరో తొమ్మిదేసి మందిని ఈ ప్రచారంలో పాల్గొనాల్సిందిగా కోరాలని సూచించారు. మోడీ ఎంపిక చేసిన 9 మంది ప్రముఖుల్లో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, పారిశ్రామిక దిగ్గజం అనిల్ అంబానీ, కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్, నటులు కమల్‌హాసన్, సల్మాన్‌ఖాన్, ప్రియాంకా చోప్రా, గోవా గవర్నర్ మృదుల సిన్హా, ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్‌తోపాటు తారక్ మెహతా ఉన్నారు.