వారణాసి: ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో భద్రతా వైఫల్యం స్పష్టంగా కనబడింది. సొంత నియోజక వర్గం వారణాసిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన రెండోరోజు కొనసాగుతుండగా కంట్రోల్ రూమ్ మానిటర్లు పనిచేయకపోవడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధాని భద్రత వైఫల్యం చెందడంపై దర్యాప్తు జరపాలని ఐబీ డైరెక్టర్ కు హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది.
శనివారం ఉదయం మోదీ అస్సీ ఘాట్లో గంగా పూజలో పాల్గొన్నారు. అనంతరం ఆయన అస్సీ ఘాట్లో 'నిర్మల్ గంగ' కార్యక్రమంలో పాల్గొని గంగమ్మ ప్రక్షాళనకు నడుం బిగించారు. నిర్మల్ గంగ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని తన పర్యటను కొనసాగిస్తుండగా కంట్రోల్ రూమ్ మానిటర్లు పనిచేయకపోవడంతో కలకలం రేగింది.
ప్రధాని పర్యటనలో భద్రతా వైఫల్యం
Published Sat, Nov 8 2014 8:15 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM
Advertisement
Advertisement