గంగానది ప్రక్షాళనకు నడుం బిగించిన మోదీ
వారణాశి : సొంత నియోజక వర్గం వారణాసిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన రెండోరోజు కొనసాగుతోంది. శనివారం ఉదయం ఆయన అస్సీ ఘాట్లో గంగా పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ గంగమ్మకు పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన అస్సీ ఘాట్లో 'నిర్మల్ గంగ' కార్యక్రమంలో పాల్గొని గంగమ్మ ప్రక్షాళనకు నడుం బిగించారు. నిర్మల్ గంగ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని... స్వయంగా పార చేతబట్టారు. మట్టిని ఎత్తిపోశారు.
ప్రధాని మోదీ ఈ సందర్భంగా ఉత్తర ప్రదేశ్కు చెందిన 9మందిని స్వచ్ఛ్ భారత్లో పాల్గొనాలని ఆహ్వానించారు. యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్తో పాటు క్రికెటర్లు మహ్మద్ కైఫ్, సురేష్ రైనా, బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ, మనుశర్మ, రాజూ శ్రీవాత్సవ, ప్రొఫెసర్ దేవీ ప్రసాద్ ద్వివేదీ సహా మొత్తం 9 మందిని స్వచ్చ్‌భారత్ కోసం మోదీ ప్రతిపాదించారు.