
జైపూర్ : కొత్తగా కొలువుతీరిన రాజస్థాన్ ప్రభుత్వంలో 23 మంది మంత్రులుగా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో 22 మంది మంత్రులు కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలు కాగా ఆర్‌ఎల్డీ నుంచి ఒకరిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ సమక్షంలో రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో 13 మంది కేబినెట్ మంత్రులు, 10 మంది సహాయ మంత్రులచే గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు.
కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో బులకి దాస్, శాంతికుమార్ దరివాల్, ప్రసాదిలాల్ మీనాలున్నారు. ఈనెల 17న రాజస్ధాన్ సీఎం, డిప్యూటీ సీఎంలుగా అశోక్ గెహ్లోత్, సచిన్ పైలట్‌లు మంత్రివర్గ కూర్పుపై ఢిల్లీలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ సహా అధిష్టాన పెద్దలతో మూడు రోజుల పాటు విస్తృత సంప్రదింపులు జరిపారు.
తీవ్ర తర్జనభర్జనలు, సామాజిక సమీకరణలను పరిగణనలోకి తీసుకుని మంత్రుల ఎంపికపై కసరత్తు పూర్తిచేశారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్, డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ సహా 30 మందికి మంత్రులుగా అవకాశం ఉండగా మిగిలిన మరికొన్ని మంత్రి పదవులను తర్వాత విస్తరణలో భాగంగా భర్తీచేస్తారని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment