జైపూర్: ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పినప్పటికీ రాజస్థాన్‌లో కాంగ్రెస్ విజయం ఖాయమని సీఎం అశోక్ గహ్లోత్ ధీమా వ్యక్తం చేశారు. ఇందుకు ఆయన మూడు కారణాలను ప్రధానంగా ప్రస్తావించారు. ఒక్క రాజస్థాన్‌లోనే గాక ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా బీజేపీ విజయం సాధించబోదని గహ్లోత్ తెలిపారు.
రాజస్థాన్‌లో కాంగ్రెస్‌కు వ్యతిరేకత లేదని తెలిపిన గహ్లోత్.. అలాంటి గాలులు వీయడం లేదని తెలిపారు. బీజేపీకి మతం అవకాశాలు ఉంటే విజయం సాధించేవారు కానీ అలాంటిదేమీ లేదని ఆయన చెప్పారు.
"రెండోది ముఖ్యమంత్రి.. అభివృద్ధి పనులు చేయడంలో నాకు (ముఖ్యమంత్రి) తిరుగులేదని బీజేపీ ఓటర్లు సైతం చెబుతారు. మూడోది ప్రధాని, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు ఉపయోగించే భాష. ప్రచార సమయంలో వారు ఉపయోగించిన భాష ఎవరికీ నచ్చలేదు" అని గెహ్లోత్ తెలిపారు.
రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రతి చోట ఓడిపోతుందని ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. రాష్ట్రంలో తదుపరి ప్రభుత్వాన్ని బీజేపీ ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గహ్లోత్ నేతృత్వంలోని ప్రభుత్వం బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఇస్తున్న హామీల్లో అశోక్ గహ్లోత్‌కు ఎలాంటి అధికారం లేదని కూడా అమిత్ షా అన్నారు. సీఎం అశోక్ గహ్లోత్‌ను ప్రధాని మోదీ మెజీషియన్‌గా పేర్కొన్నారు. ఈ మాంత్రికునికి ఎవరూ ఓటు వేయబోరని ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు.
రాజస్థాన్‌లో నవంబర్ 25న పోలింగ్ జరిగింది. నేడు తెలంగాణలో పోలింగ్ జరుగుతోంది. డిసెంబర్ 3న ఐదు రాష్ట్రాలు రాజస్థాన్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మిజోరం, మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాలు వెల్లడవనున్నాయి.
ఇదీ చదవండి: రసాయన పరిశ్రమలో అగ్ని ప్రమాదం.. ఏడుగురు కూలీలు మృతి
Comments
Please login to add a commentAdd a comment