న్యూఢిల్లీ : కొత్తగా కొలువు తీరిన కేబినెట్ సభ్యులకు శాఖల కేటాయింపు జరిగింది. నిన్న ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖలను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మంత్రులకు కేటాయించిన శాఖల వివరాలు:
పేరు శాఖ
1) నరేంద్రమోడీ - ప్రధానమంత్రి
2) రాజ్‌నాథ్ సింగ్ - హోం శాఖ
3) సుష్మా స్వరాజ్ - విదేశీ వ్యవహారాలు
4) అరుణ్ జైట్లీ - ఆర్థిక(అదనంగా రక్షణ శాఖ) కార్పొరేట్ వ్యవహారాలు
5) ఎం. వెంకయ్యనాయుడు - పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాలు
6) నితిన్ గడ్కారీ - ఉపరితల రవాణా, షిప్పింగ్
7) డీవీ సదానంద గౌడ - రైల్వే శాఖ
8) నజ్మా హెప్తుల్లా - మైనారిటీ వ్యవహారాలు
9) ఉమాభారతి - జల వనరులు, గంగా ప్రక్షాళన
10) గోపీనాథ్ ముండే - గ్రామీణాభివృద్ధి
11) రామ్‌విలాస్ పాశ్వాన్ - ఆహార, పౌర సరఫరాలు
12) కల్‌రాజ్ మిశ్రా - సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు
13) మేనకా గాంధీ - మహిళ, శిశు సంక్షేమం
14) అనంత్‌కుమార్ - ఎరువులు, రసాయన శాఖ
15) అశోక్ గజపతి రాజు - పౌర విమానయానం
16) అనంత్ గీతె- భారీ పరిశ్రమలు
17) హర్‌సిమ్రత్‌సింగ్ కౌర్ బాదల్- ఫుడ్ ప్రొసెసింగ్
18) రవిశంకర్ ప్రసాద్ - న్యాయ, టెలికం
19) నరేంద్ర సింగ్ తోమర్ - గనులు, ఉక్కు, కార్మిక ఉపాధి కల్పన
20) జువల్ ఓరామ్ - గిరిజన వ్యవహారాలు
21) రాధామోహన్ సింగ్ - వ్యవసాయం
22) తావర్ చంద్ గెహ్లాట్ - సామాజిక న్యాయం,
23) స్మృతి జుబిన్ ఇరానీ - మానవ వనరులు
24) హర్షవర్ధన్ - ఆరోగ్యం
సహాయ మంత్రులు (స్వతంత్ర హోదా)
1) జనరల్ (రిటైర్డ్) వీకే సింగ్ - విదేశాంగ సహాయ మంత్రి
2) ఇందర్జిత్‌సింగ్ రావు - గణాంకాలు, కార్యక్రమాల అమలు, రక్షణ ప్రణాళిక
3) సంతోష్‌కుమార్ గంగ్వార్ - టెక్స్టైల్స్
4) శ్రీపద్ యశోనాయక్ - సంస్కృతి, పర్యాటకం
5) ధర్మేంద్ర ప్రధాన్ - పెట్రోలియం, సహజ వనరులు
6) సర్బానంద సోనోవాల్ - నైపుణ్యత, యూత్ ఎఫైర్స్ అండ్ స్పోర్ట్స్,
7) ప్రకాశ్ జవదేకర్ - అటవీ వ్యవహారాలు, పర్యావరణ శాఖ
8) పియూష్ గోయల్ - విద్యుత్, బొగ్గు గనులు
9) జితేంద్ర సింగ్ - సైన్స్ అండ్ టెక్నాలజీ
10) నిర్మల సీతారామన్ - వాణిజ్యం, పరిశ్రమలు
సహాయ మంత్రులు
1) జీఎం సిద్ధేశ్వర - పౌర విమానయానం
2) మనోజ్ సిన్హా - రైల్వే శాఖ
3) నిహాల్‌చంద్ - కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్
4) ఉపేంద్ర కుష్వాహ - గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్
5) పీ రాధాకృష్ణన్ - భారీ పరిశ్రమలు,
6) కిరణ్ రాజు - హోం ఎఫైర్స్
7) కృష్ణన్ పాల్ - రోడ్డు ట్రాన్స్పోర్ట్,రహదారులు,షిప్పింగ్
8) సంజీవ్ కుమార్ బాల్యన్ - ఫుడ్ ప్రోసెసింగ్
9) మన్సుఖ్‌భాయి ధన్జీభాయి వాసవ - గిరిజనాభివృద్ధి
10) రావు సాహెబ్ దాదారావు దాన్వే - కన్య్జూమర్ ఎఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్
11) విష్ణుదేవ్ సాయి - మైన్స్, స్టీల్, లేబర్
12) సుదర్శన్ భగత్ - సామాజిక న్యాయం,
కేంద్ర మంత్రులు-కేటాయించిన శాఖలు
Published Tue, May 27 2014 10:17 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM
Advertisement