portfolios
-
మంత్రి శాఖల కేటాయింపుపై జనసేన, బీజేపీ అసంతృప్తి..!
-
ఏపీలో మంత్రులకు శాఖల కేటాయింపుపై కొనసాగుతున్న సస్పెస్స్
-
మహా కిరికిరి.. ఫడ్నవిస్ సీటుకే ఎసరు పెట్టి..
ముంబై: సంక్షోభ రాజకీయాలకు నెలవైన మహారాష్ట్రలో ముక్కోణపు పార్టీ అధికార కూటమి.. చీలికలకు గురికాకుండా జాగ్రత్త పడుతోంది. అదే సమయంలో బీజేపీ ఎత్తులను ముందుగానే అంచనా వేసిన ఎన్సీపీ(రెబల్) నేత అజిత్ పవార్.. తన వర్గానికి మంత్రివర్గంలో సుమచిత స్థానం కోసం జరిపిన లాబీయింగ్‌లో గ్రాండ్ సక్సెస్ అయినట్లు తెలుస్తోంది. కీలక శాఖలు రెండింటిని ఆయన వర్గమే దక్కించుకున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర రాజకీయాలు మళ్లీ ఆసక్తికరంగా మారుతున్నాయి. డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ నుంచి ఆర్థిక శాఖ.. ఎన్సీపీ నేత, మరో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ చేతికి వెళ్లనుంది. ముఖ్యమైన పోర్ట్‌పోలియోలు దక్కించుకోవడంలో సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌తో ఎన్సీపీ రెబల్ వర్గం జరిపిన చర్చలు ఫలవంతంగా ముగిశాయి. అదే సమయంలో ఎన్సీపీ(రెబల్)కి మంత్రి వర్గంలో ప్రాధాన్యత ఇవ్వాలనుకోవడంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న బీజేపీ-షిండే వర్గ ఎమ్మెల్యేలను ఆయా అధిష్టానాలు చల్లార్చే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్సీపీ ఎమ్మెల్యేలతో షిండే కూటమి(శివసేన)-బీజేపీ ప్రభుత్వంలో చేరిన అజిత్ పవార్.. పోర్టుపోలియోల కేటాయింపులో బెట్టు ప్రదర్శిస్తూ వచ్చారు. కీలకమైన ఆర్థికంతో పాటు ప్రణాళిక మంత్రిత్వ శాఖల్ని ఆయన డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌ను బీజేపీ ఎమ్మెల్యేలు కొందరు బహిరంగంగా వ్యతిరేకించారు కూడా. ఈ క్రమంలో బీజేపీ అధిష్టానాన్ని నేరుగా కలవకుండా.. ఎన్సీపీ(రెబల్) వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రఫుల్ పటేల్ ద్వారా హస్తిన నేతలతో చర్చలు నడిపించారు అజిత్ పవార్. ఫలితంగా.. మంత్రివర్గ విస్తరణ ఆసల్యం అవుతూ వచ్చింది. అయితే మంగళవారం అర్ధరాత్రి దాటాక కూడా సాగిన చర్చల్లో ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. ఈ మేరకు బుధవారం ప్రఫుల్ పటేల్ సమస్య పరిష్కారం అయ్యిందంటూ ప్రకటించడం గమనార్హం. ఒకటి రెండు రోజుల్లో పోర్ట్పోలియోల కేటాయింపు జరగవచ్చని తెలుస్తోంది. ఇక జులై 18వ తేదీన ప్రధాని మోదీని తాము కలవబోతున్నామని.. ఎన్డీయే సమావేశానికి తమకూ ఆహ్వానం అందిందని ప్రఫుల్ పటేల్ తెలిపారు. జులై 17 నుంచి ఆగస్టు 4వ తేదీల నడుమ మహారాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈసారి సమావేశాలు ఎన్సీపీ సంక్షోభంపైనా హీటెక్కే అవకాశం లేకపోలేదు. అంచేత సమావేశాల కంటే ముందే కేబినెట్ విస్తరణ కోసం ప్రయత్నాలు నడుస్తున్నాయి. -
గవర్నర్ Vs సీఎం స్టాలిన్:సెంథిల్ బాలాజీ అంశంలో మరో వివాదం..
తమిళనాడు:తమిళనాడులో గవర్నర్, రాష్ట్ర సీఎం మధ్య వివాదం.. మనీలాండరింగ్ కేసులో అరెస్టైన మంత్రి సెంథిల్ బాలాజీ విషయంలో మరోసారి వెలుగులోకి వచ్చింది. ఆరోగ్యం బాగులేని కారణంగా మంత్రి సెంథిల్ బాలాజీ నిర్వహిస్తున్న శాఖలను ఇతర మంత్రులకు కేటాయించే అంశాన్ని గవర్నర్ తోసిపుచ్చారు. రాష్ట్రంలో విద్యుత్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలను ప్రస్తుతం మంత్రి సెంథిల్ బాలాజీ నిర్వహిస్తున్నారు. ఈ శాఖలను ఆర్థిక శాఖ మంత్రి తంగం తెన్నెరసు, గృహ శాఖ మంత్రి ఎస్. ముత్తుస్వామికి కేటాయిస్తున్నట్లు పేర్కొని సీఎం స్టాలిన్.. గవర్నర్‌కు లేఖ పంపారు. దీనిపై స్పందించిన గవర్నర్ ఆర్.ఎన్. రవి.. ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. ఈ ప్రతిపాదన మనీలాండరింగ్ కేసును తప్పదారిపట్టించేదిగా ఉందని పేర్కొన్నారు. ఈ వ్యవహారాన్ని అధికార డీఎంకే వర్గాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. గవర్నర్ పూర్తిగా బీజేపీ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారని మంత్రి పొన్ముడి ఆరోపించారు. మనీలాండరింగ్ కేసులో మంత్రి సెంథిల్ బాలాజీ హస్తం ఉందనే ఆరోపణలపై ఆయన్ని కేబినెట్ నుంచి తొలగించాలని గవర్నర్ మే31 న సీఎం స్టాలిన్‌కు లేఖ రాశారని పొన్ముడి ఆరోపించారు. కేవలం ఆరోపణలపై ఎలాంటి చర్య తీసుకోబోమని సీఎం స్టాలిన్ తిరిగి లేఖలో అప్పుడే సమాధానమిచ్చినట్లు చెప్పారు. సెంథిల్ బాలీజీ కేసు.. ‘క్యాష్ ఫర్ జాబ్స్’ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తమిళనాడు విద్యుత్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ(47)ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు బుధవారం అరెస్టు చేశారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) కింద ఆయనను అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. రవాణా శాఖలో ఉద్యోగాలిప్పిస్తానంటూ మంత్రి సెంథిల్ బాలాజీ పలువురి నుంచి భారీఎత్తున నగదు తీసుకున్నారని ఈడీ ఆరోపించింది. తమిళనాడు సీఎం స్టాలిన్ మంత్రివర్గంలో ఈ చట్టం కింద అరెస్టయిన తొలి మంత్రి సెంథిల్ కావడం విశేషం. ఇదీ చదవండి:తమిళ మంత్రి అరెస్టు -
పదవి ఏదైనా అధికారం నాదే!
ముంబై: మహారాష్ట్ర రాజకీయాలు, డిప్యూటీ సీఎం పదవి చేపట్టటంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్. పదవి అనేది రాజకీయ సామర్థ్యాన్ని నిర్ధారించదని పేర్కొన్నారు. శివసేన రెబల్ నేత ఏక్నాథ్ షిండేకు ముఖ్యమంత్రి పదవి అప్పజెప్పినప్పుటికీ అధికారం ఫడ్నవీస్ చేతిలోనే ఉందనే వాదనలు వినిపిస్తున్న క్రమంలో ఈ వ్యాఖ్యలు చేయటం మరింత బలాన్ని చేకూర్చుతున్నాయి. మరోవైపు.. ఆయన చేతిలోనే ఆరు పోర్ట్‌ఫోలియోలు ఉండటమూ గమనార్హం. ముంబైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పదవి చేపట్టకపోవటంపై మాట్లాడారు. ప్రస్తుత ప్రభుత్వంలో పలు పోర్ట్‌ఫోలియోలు నిర్వహించటంపై ప్రశ్నించగా.. గతంలో ముఖ్యమంత్రిగా ఆ బాధ్యతలు నిర్వర్తించినట్లు గుర్తు చేశారు దేవేంద్ర ఫడ్నవీస్. ‘మంత్రివర్గ విస్తరణ పెండింగ్‌లో ఉన్నందున ఆ శాఖలు నా అధీనంలోనే ఉన్నాయి. విస్తరణ తర్వాత అందులో కొన్ని ఇతరుల చేతికి వెళ్తాయి. తమ ప్రభుత్వంలో మంత్రిత్వ శాఖలు ఎవరికైనా ఇవ్వొచ్చు. వారిని ఆ బాధ్యతల్లో విజయవంతం చేయటమే మా బాధ్యతగా విశ్వసిస్తాం. పోర్ట్‌ఫోలియో ఏదనేది పట్టింపులు లేవు.. సుపరిపాలన అందించటమనేదానిపైనే సమష్టి కృషి ఉంటుంది. రాజకీయంలో పోస్టును బట్టి శక్తిసామర్థ్యాలు నిర్ణయం కావు, నీవు ఎవరనేదే ముఖ్యం. నేను రాజకీయంగా బలపడ్డానా లేదా నష్టపోయానా? అనే అంశాన్ని మహారాష్ట్రలోని ఎవరినైనా అడగవచ్చు.’ అని పేర్కొన్నారు దేవేంద్ర ఫడ్నవీస్. థాక్రే వెన్నుపోటుకు ప్రతీకారం.. మహారాష్ట్రలో శివసేన నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ ప్రభుత్వం కూలిపోయి.. బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంపైనా స్పందించారు దేవేంద్ర ఫడ్నవీస్. శివసేన నేత ఉద్ధవ్ థాక్రే బీజేపీకి వెన్నుపోటు పొడిచారని, అందుకే కాషాయ పార్టీ ప్రతీకారం తీర్చుకోవాలనుకుందని అసలు విషయం వెల్లడించారు. ముందుగా ప్రభుత్వంలో ప్రాతినిథ్యం వహించకూడదని నిర్ణయించుకున్నానని, అయితే, వెలుపల ఉండి ప్రభుత్వాన్ని నడిపించలేమని, నా అనుభవం అవసరమని పార్టీ నేతలు ఒప్పించినట్లు చెప్పారు. వారి కోరిక మేరకే ప్రభుత్వంలో భాగమయ్యాయని వెల్లడించారు. ఏక్నాథ్ షిండే నేతృత్వంలో ఉపముఖ్యమంత్రిగా ఉండాలని బీజేపీ సూచించినప్పుడు షాక్‌కి గురయ్యానని, అయితే, తనను ఎప్పుడూ డిప్యూటీ అనే ఆలోచన రాకుండా షిండే చూసుకుంటున్నారని ప్రశంసించారు. ఇదీ చదవండి: ఢిల్లీలో డీజిల్ కార్లపై నిషేధం.. ఉల్లంఘిస్తే రూ.20వేల జరిమానా -
రెబల్స్ మంత్రులకు షాక్.. సీఎం ఉద్దవ్ ఠాక్రే సంచలన నిర్ణయం!
ముంబై: మహారాష్ట్రలో శివసేన ఎమ్మెల్యేల తిరుగుబాటుతో మొదలైన రాజకీయ సంక్షోభం రసవత్తర మలుపులు తిరుగుతోంది. తాజాగా శివసేన చీఫ్, సీఎం ఉద్ధవ్ ఠాక్రే సోమవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. శివసేన రెబల్స్‌పై కొరడా ఝళిపించేందుకు సిద్ధమై.. 9 మంది రెబల్స్ మంత్రులను వారి శాఖల నుంచి తొలగించారు. అందులో ఐదుగురు కేబినెట్, నలుగురు సహాయ మంత్రుల మంత్రిత్వశాఖలను వేరేవారికి అప్పగించారు. రాష్ట్రంలో పరిపాలనా పరంగా ఎలాంటి ఆటంకాలు, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడంతో పాటు ఆయా శాఖల ఆధ్వర్యంలో కొనసాగుతున్న పనుల్లో జాప్యం జరగకూడదని ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎంఓ కార్యాలయం ప్రకటించింది. ఎవరి శాఖలు... ఎవరికి.. రెబల్స్ గ్రూపు నాయకత్వం వహిస్తున్న ఏక్నాథ్ షిండే మంత్రిగా ఉన్న పట్టణాభివృద్ధి, పబ్లిక్ వర్క్స్ మంత్రిత్వ శాఖలను మంత్రి సుభాష్ దేశాయ్‌కు అప్పగించారు. మరో రెబల్ మంత్రి గులాబ్రావ్ పాటిల్ వద్ద ఉన్న నీటి సరఫరా, పారిశుద్ధ్యం శాఖల బాధ్యతలను మంత్రి అనిల్ పరబ్‌కు అప్పగించారు. అలాగే మంత్రి ఉదయ్ సావంత్ వద్ద ఉన్న ఉన్నత విద్య, సాంకేతిక విద్యా శాఖలను మంత్రి ఆదిత్య ఠాక్రేకు అప్పగించారు. మంత్రి దాదాజీ భూసే వద్ద ఉన్న వ్యవసాయం, మాజీ సైనికుల సంక్షేమ శాఖలు, రెబల్ మంత్రి సందీపన్ భూమారే వద్ద ఉన్న ఉపాధి హామీ, ఉద్యానవన శాఖలను మంత్రి శంకర్ గడఖ్‌కు కేటాయించారు. శంభురాజ్ దేశాయ్ వద్ద ఉన్న మూడు పోర్ట్‌ఫోలియోలను సంజయ్ బన్సోడే, సతేజ్ పాటిల్, విశ్వజిత్ కదమ్‌లకు అప్పగించారు. రాజేంద్ర పాటిల్ మంత్రిగా ఉన్న నాలుగు మంత్రిత్వ శాఖలు విశ్వజీత్ కదమ్, ప్రజక్త్ తాన్పురే, సతేజ్ పాటిల్, అదితి తత్కరేలకు కేటాయించారు. అబ్దుల్ సత్తార్‌తో ఉన్న మూడు పోర్ట్‌ఫోలియోలు ప్రస్తుతం ప్రజక్త్ తాన్పురే, సతేజ్ పాటిల్, అదితి తత్కరే వద్ద ఉన్నాయి. రెబల్ మంత్రి ఓంప్రకాష్ కుడు వద్ద ఉన్న నాలుగు పోర్ట్‌ఫోలియోలను మంత్రులు అదితి తత్కరే, సతేజ్ పాటిల్, సంజయ్ బన్సోడే, దత్తాత్రయ్ భర్నేలకు అప్పగించారు. మరోవైపు ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్‌ఠాక్రేకు ఏక్నాథ్ షిండే ఫోన్ చేశారు. ఈ నేపథ్యంలో ఎంఎన్ఎస్ కీలక నేతలతో రాజ్ ఠాక్రే భేటీ అయ్యారు. చదవండి: Maharashtra Poliical Crisis: శివసేన రెబల్ ఎమ్మెల్యేల పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ . -
సీఎం కేజ్రీవాల్‌కు శాఖ లేదు!
సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రిగా మూడో పర్యాయం హస్తిన పీఠం ఎక్కిన అరవింద్ కేజ్రీవాల్ తన కేబినెట్లోని ఆరుగురు మంత్రులకు శాఖలను కేటాయించినట్టు తెలుస్తోంది. తాను మాత్రం ఎటువంటి శాఖ తీసుకోలేదని సమాచారం. గత మంత్రివర్గంలో సమర్థవంతంగా పనిచేసి తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవడంలో కీలక భూమిక పోషించిన మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్, కైలాస్ గహ్లోత్, గోపాల్ రాయ్, రాజేంద్ర పాల్ గౌతమ్, ఇమ్రాన్ హుస్సేన్‌లకు మళ్లీ కేబినెట్ పదవులు దక్కాయి. గత కేబినెట్లో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన మనీశ్ సిసోడియా.. విప్లవాత్మక సంస్కరణలతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చడంలో ప్రధాన పాత్ర పోషించారు. ఈసారి ఆయనకు ఆర్థిక, ప్రణాళిక వ్యవహారాల శాఖ కేటాయించినట్టు ‘ఏఎన్ఐ’ వార్తా సంస్థ వెల్లడించింది. మంత్రులు- వారికి కేటాయించిన శాఖలు 1. మనీశ్ సిసోడియా: ఆర్థిక, ప్రణాళిక, పర్యాటకం, భూమి-భవనాలు, విజిలెన్స్, సర్వీసెస్, కళలు, సంస్కృతి, భాషలు 2. ఇమ్రాన్ హుస్సేన్: అడవులు, ఆహార సరఫరా, ఎన్నికలు 3. కైలాస్ గహ్లోత్: రవాణా, రెవెన్యూ, న్యాయ, శాసన వ్యవహారాలు, ఐటీ, కార్యనిర్వాహక సంస్కరణలు 4. గోపాల్ రాయ్: పర్యావరణం 5. రాజేంద్ర పాల్ గౌతమ్: మహిళా, శిశు సంక్షేమం 6. సత్యేందర్ జైన్: ఢిల్లీ జల్ బోర్డు (డీజేబీ) చదవండి: మోదీ ఆశీస్సులు కావాలంటున్న కేజ్రీవాల్ -
హరీశ్‌కు ఆర్థికం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా తన్నీరు హరీశ్‌రావు నియమితులయ్యారు.కేటీఆర్‌కు మళ్లీ పురపాలన, పట్టణాభివృద్ధి, పరిశ్రమలు, ఐటీ, కమ్యూనికేషన్ శాఖలు దక్కాయి. సబితా ఇంద్రారెడ్డికి విద్యా శాఖ, గంగుల కమలాకర్‌కు బీసీ సంక్షేమం, ఆహార, పౌరసరఫరాల, వినియోగదారుల వ్యవహారాలు, సత్యవతి రాథోడ్‌కు ఎస్టీ, స్త్రీ, శిశు సంక్షేమం, పువ్వాడ అజయ్‌కుమార్‌కు రవాణా శాఖలను కేటాయించారు. రాష్ట్ర మంత్రివర్గంలో ఆదివారం కొత్తగా చేరిన ఈ ఆరుగురు మంత్రులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సలహా మేరకు శాఖలను కేటాయిస్తూ గవర్నర్ తమిళసై సౌందర రాజన్ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుతో కొందరు ప్రస్తుత మంత్రుల శాఖల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. హరీశ్, కేటీఆర్‌లకు కేటాయించిన శాఖలను ఇప్పటివరకు సీఎం కేసీఆర్ స్వయంగా పర్యవేక్షిస్తూ వచ్చారు. జగదీశ్‌రెడ్డి విద్యా శాఖను కోల్పోగా, ఆయనకు మళ్లీ ఇంధన శాఖను కేటాయించారు. గత మంత్రివర్గంలో సైతం ఆయన ఇంధన శాఖను కలిగి ఉన్నారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ నిర్వహించిన ఎస్టీ సంక్షేమ శాఖను సత్యవతి రాథోడ్‌కు, బీసీ సంక్షేమం గంగుల కమలాకర్‌కు కేటాయించారు. దీంతో కొప్పుల వద్ద ఎస్సీ అభివృద్ధి, మైనారిటీ, వికలాంగ, వయోజనుల సంక్షేమ శాఖలు మిగిలాయి. వేముల ప్రశాంత్‌రెడ్డి నిర్వహించిన రవాణా శాఖను పువ్వాడ అజయ్‌కుమార్‌కు కేటాయించారు. చామకూర మల్లారెడ్డి నుంచి స్త్రీ, శిశు సంక్షేమ శాఖను సత్యవతి రాథోడ్‌కు అప్పగించారు. కీలకమైన రెవెన్యూ, నీటిపారుదల, గనుల శాఖలను సీఎం కేసీఆర్ తన దగ్గరే పెట్టుకున్నారు. ప్రతిష్టాత్మక నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పన, అమలుపై స్వీయ పర్యవేక్షణ కోసం సీఎం స్వయంగా ఈ శాఖలను నిర్వహించనున్నారు. గత మంత్రివర్గంలో పురపాలన, పట్టణాభివృద్ధి, పరిశ్రమలు, ఐటీ, కమ్యూనికేషన్ శాఖల మంత్రిగా తనదైన ముద్ర వేసిన కేటీఆర్‌కు మళ్లీ అవే శాఖలను కేటాయించారు. -
సుచరితకు సువర్ణవకాశం!
సాక్షి, అమరావతి : మంత్రివర్గం కూర్పులో సామాజిక సమతుల్యతకు పెద్ద పీట వేస్తూ దేశ రాజకీయ చరిత్రలో ఎప్పడూ లేని విధంగా ఐదుగురిని డిప్యూటీ సీఎంలుగా ప్రకటించి సంచలనం సృష్టించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాజాగా మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. కీలకమైన హోంశాఖను, ఉపముఖ్యమంత్రి పదవులను మహిళలకు కేటాయించి వారి పట్ల తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. హోంశాఖను మేకతోటి సుచరితకు కేటాయించగా, ఉపముఖ్యమంత్రి హోదాను పుష్పశ్రీవాణిలకు ఇచ్చి మరో రికార్డు సృష్టించారు. ఆంధ్రప్రదేశ్‌లో తొలి మహిళా హోంమంత్రిగా మేకతోటి సుచరిత, తొలి మహిళా ఉపముఖ్యమంత్రిగా పుష్పశ్రీవాణి చరిత్రకెక్కనున్నారు. (చదవండి : ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపు) తండ్రి బాటలోనే... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2009 ఎన్నికల తర్వాత నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సబితా ఇంద్రారెడ్డిను హోం మంత్రిగా నియమించిన సంగతి తెల్సిందే. తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా తండ్రి బాటలోనే నడిచారు. అనూహ్యంగా ఎస్సీ సామాజికవర్గానికి చెందిన సుచరితకు కీలకమైన హోంశాఖ బాధ్యతలను అప్పగించారు. నవ్యాంధ్రకు తొలి హోంమంత్రిగా ఆమె బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఎన్నికల సమయంలో రాజన్న రాజ్యం మళ్లీ తేస్తానని హామి ఇచ్చిన వైఎస్ జగన్.. సీఎం పదవి చేపట్టిన మొదటి రోజు నుంచే ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. వైఎస్సార్ కంటే ఒక అడుగు ముందుకేసి ఎస్సీ సామాజికవర్గానికి చెందిన మహిళకు కీలకమైన హోంశాఖ కేటాయించడం గొప్ప విషయమనే చెప్పాలి. (చదండి : ఏపీ మంత్రివర్గ పూర్తి వివరాలు) వైఎస్సార్ ఎమ్మెల్యే చేస్తే.. జగన్ మంత్రిని చేశారు వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలి మంత్రివర్గంలో హోంశాఖ బాధ్యతలు చేపట్టనున్న సుచరిత.. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. టీడీపీ అభ్యర్థి డొక్కా మాణిక్యవరప్రసాద్‌పై 7,398 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో మాజీమంత్రి రావెల కిశోర్‌బాబు చేతిలో ఆమె ఓటమిపాలయ్యారు. ఫిరంగిపురం మండల జెడ్పీటీసీగా తొలిసారి రాజకీయ రంగప్రవేశం చేశారు. తదనంతరం దివంగత వైఎస్సార్ ఆశీస్సులతో ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి 2009లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైఎస్ మరణాంతరం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ తరువాత 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున పోటీచేసి 16,781 ఓట్ల మెజార్టీతో సంచలన విజయాన్ని నమోదు చేశారు. అప్పటి నుంచి వైఎస్ జగన్ వెంటనడుస్తూ.. ప్రజల సమస్యలపై పోరాడుతున్నారు. ఆమె శ్రమకు తగిన ఫలితంగా వైఎస్ జగన్ ఆమెకు మంత్రిగా అవకాశం కల్పిస్తూ హోంశాఖను అప్పగించారు. -
ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపు
-
ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మంత్రి పదవులు చేపట్టిన 25 మందికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శాఖలు కేటాయించారు. దీనికి గవర్నర్ నరసింహన్ ఆమోదముద్ర వేశారు. ఐదుగురు మంత్రులకు డిప్యూటీ సీఎం హోదా కల్పించారు. ఆళ్ల నాని, అంజాద్ భాషా, నారాయణస్వామి, పిల్లి సుభాష్‌చంద్రబోస్, పుష్పశ్రీవాణిలకు ఉప ముఖ్యమంత్రి హోదా లభించింది. ఈ మేరకు శనివారం సాయంత్రం అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అధికారిక ట్విటర్ పేజీలోనూ ఈ వివరాలు పొందుపరిచారు. మేకతోటి సుచరితకు కీలకమైన హోంశాఖను అప్పగించారు. (చదవండి: ఏపీ మంత్రివర్గ పూర్తి వివరాలు) మంత్రులకు కేటాయించిన శాఖలు 1. ధర్మాన కృష్ణదాస్- రోడ్లు, భవనాలు 2. బొత్స సత్యనారాయణ- మున్సిపల్, అర్బన్ డెవలప్మెంట్ 3. పాముల పుష్పశ్రీవాణి- గిరిజన సంక్షేమ శాఖ (డిప్యూటీ సీఎం) 4. అవంతి శ్రీనివాస్- టూరిజం, సాంస్కృతిక, యువజన వ్యవహారాలు 5. కురసాల కన్నబాబు- వ్యవసాయం, సహకార శాఖ 6. పిల్లి సుభాష్‌చంద్రబోస్- రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంపులు (డిప్యూటీ సీఎం) 7. పినిపే విశ్వపరూప్- సాంఘిక సంక్షేమం 8. ఆళ్ల నాని- ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య (డిప్యూటీ సీఎం) 9. చెరుకువాడ శ్రీరంగనాథరాజు- గృహ నిర్మాణం 10. తానేటి వనిత- మహిళా, శిశు సంక్షేమం 11. కొడాలి నాని- పౌర సరఫరా, వినియోగదారుల శాఖ 12. పేర్ని నాని- రవాణా, సమాచార శాఖ 13. వెల్లంపల్లి శ్రీనివాస్- దేవాదాయ 14. మేకతోటి సుచరిత- హోం, విపత్తు నిర్వహణ 15. మోపిదేవి వెంకటరమణ- పశు సంవర్థకం, మత్స్య, మార్కెటింగ్ 16. బాలినేని శ్రీనివాస్‌రెడ్డి- అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ 17. ఆదిమూలపు సురేశ్- విద్యా శాఖ 18. అనిల్‌కుమార్ యాదవ్- ఇరిగేషన్ 19. మేకపాటి గౌతమ్‌రెడ్డి- పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ 20. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి- పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనులు 21. కళత్తూరు నారాయణస్వామి- ఎక్సైజ్, వాణిజ్య పన్నులు (డిప్యూటీ సీఎం) 22. బుగ్గన రాజేంద్రనాథ్- ఆర్థిక, ప్రణాళిక, అసెంబ్లీ వ్యవహరాలు 23. గుమ్మునూరు జయరామ్- కార్మిక, ఉపాధి శిక్షణ, కార్మాగారాలు 24. షేక్ అంజాద్ బాషా - మైనార్టీ సంక్షేమం (డిప్యూటీ సీఎం) 25. మాలగుండ్ల శంకర్ నారాయణ- బీసీ సంక్షేమం -
కొత్త రక్తం.. కొత్త రూపం!
► జవదేకర్‌కు కేబినెట్ హోదా.. వెంకయ్యకు సమాచారం ► మోదీ మంత్రివర్గంలో భారీ మార్పుచేర్పులు ► ఐదుగురు సహాయమంత్రులపై వేటు.. కొత్తగా 19 మందికి చోటు ► 78కి పెరిగిన మంత్రివర్గం.. జవదేకర్‌కు మానవవనరులు అప్పగింత ► మానవవనరుల నుంచి స్మృతి ఇరానీ తొలగింపు.. జౌళిశాఖకు బదిలీ ► పార్లమెంటరీ వ్యవహారాల శాఖ.. వెంకయ్య నుంచి అనంత్‌కుమార్‌కు బదిలీ ► అరుణ్‌జైట్లీ నుంచి వెంకయ్యనాయుడుకు సమాచార, ప్రసారశాఖ ► న్యాయశాఖ నుంచి గణాంకాలు, పథకాల శాఖకు సదానందగౌడ బదిలీ ► రవిశంకర్‌ప్రసాద్‌కు న్యాయశాఖ.. బీరేంద్రసింగ్‌కు ఉక్కుశాఖ కేటాయింపు ► నరేంద్రసింగ్‌తోమర్‌కు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, తాగునీరు శాఖలు సాక్షి, న్యూఢిల్లీ: భారీస్థాయి మార్పులు, చేర్పులతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన మంత్రివర్గానికి కొత్తరూపునిచ్చారు. ఐదుగురు సహాయమంత్రులను తొలగించి.. కొత్తగా 19 మందికి చోటు కల్పిస్తూ విస్తరించటంతో పాటు.. పలువురు మంత్రుల శాఖలనూ మార్చుతూ పునర్వ్యవస్థీకరించారు. మంగళవారం ఉదయం రాష్ట్రపతిభవన్‌లో కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం జరుగగా.. రాత్రికి మంత్రివర్గంలో పలు శాఖల మార్పులతో కేటాయింపులు చేశారు. ప్రధాని మోదీ, హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ శాఖలు మినహా మిగిలిన మంత్రుల్లో చాలా మందికి శాఖలు మారాయి. మానవవనరుల అభివృద్ధిశాఖను స్మృతి ఇరానీ నుంచి తొలగించారు. ఆ శాఖను ప్రకాశ్‌జావదేకర్‌కు తాజాగా కేబినెట్ హోదా కల్పిస్తూ ఆయనకు అప్పగించారు. స్మృతిఇరానీని అంతగా ప్రాధాన్యం లేని జౌళిశాఖకు మార్చారు. ముఖ్యంగా.. హెచ్ఆర్డీ శాఖ మంత్రిగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దళిత స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య విషయంలోనూ, జేఎన్‌యూ వివాదంలోనూ స్మృతి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న నేపథ్యంలో ఆమెను మానవవనరుల అభివృద్ధిశాఖ నుంచి తప్పించి తక్కువ ప్రాధాన్యం గల శాఖకు బదిలీ చేయటం వ్యూహాత్మక ఎత్తుగడేనా? లేకపోతే.. వచ్చే ఏడాది జరుగనున్న ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ప్రచారానికి ముఖచిత్రంగా ఆమెను వినియోగించుకునేందుకు బాధ్యతల బరువును తగ్గించారా? అన్న అంశాలపై ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ వద్ద అదనంగా ఉన్న సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖను ఎం.వెంకయ్యనాయుడికి కేటాయించారు. కార్పొరేట్ వ్యవహారాల శాఖ కూడా జైట్లీ వద్దే ఉంది. వెంకయ్యనాయుడు ఇప్పటివరకు పట్టణాభివృద్ధి శాఖ, గృహ నిర్మాణం, పట్టణ పేదరిక నిర్మూలన శాఖలతో పాటు పార్లమెంటరీ వ్యవహారాల శాఖను నిర్వహిస్తున్నారు. తాజా మార్పుల్లో ఆయన నుంచి పార్లమెంటరీ వ్యవహారాలను తప్పించి సమాచార ప్రసారశాఖను కేటాయించారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖను అనంత్‌కుమార్‌కు అదనంగా కేటాయించారు. అనంత్ ప్రస్తుతం రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. ► న్యాయశాఖను సదానందగౌడ నుంచి తప్పించి.. సమాచార సాంకేతికత(ఐటీ) శాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్‌కు అప్పగించటం కీలక మార్పు. సదానందకు గణాంకాలు, పథకాల అమలు శాఖను కేటాయించారు. ► చౌదరి బీరేంద్రసింగ్‌కు ఉక్కు శాఖను కేటాయించి.. ఆయన వద్ద ఉన్న గ్రామీణాభివృద్ధి శాఖ, తాగునీరు, పారిశుద్ధ్యం, పంచాయతీరాజ్ శాఖలను నరేంద్రసింగ్ తోమర్‌కు కేటాయించారు. తోమర్ ఇప్పటివరకూ గనులు, ఉక్కు శాఖ మంత్రిగా ఉన్నారు. హా విద్యుత్, బొగ్గు, పునర్వినియోగిత ఇంధనశక్తి శాఖకు స్వతంత్ర సహాయమంత్రిగా ఉన్న పీయూష్‌గోయల్‌కు అదనంగా గనుల శాఖ ఇచ్చారు. హా రైల్వేశాఖ సహాయమంత్రిగా ఉన్న మనోజ్‌సిన్హాకు సమాచారశాఖను స్వతంత్ర సహాయమంత్రి హోదాలో అప్పగించారు. ► జౌళిశాఖ స్వతంత్ర సహాయమంత్రిగా ఉన్న సంతోష్‌కుమార్ గాంగ్వర్ను ఆర్థికశాఖకు బదిలీ చేశారు. హా ఆర్థికశాఖలో సహాయమంత్రిగా ఉన్న జయంత్‌సిన్హాను పౌరవిమానయానశాఖకు మార్చారు. ఇప్పటివరకూ ఆ శాఖలో ఉన్న మహేశ్‌శర్మను సంస్కృతి, పర్యాటక శాఖకు మార్చారు. హా అర్జున్‌రామ్‌మేఘ్వాల్‌ను ఆర్థికశాఖలో రెండో సహాయమంత్రిగా చేర్చారు. హా ఇక కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన మంత్రుల్లో.. విజయ్‌గోయల్‌కు యువజన వ్యవహారాలు, క్రీడల శాఖకు స్వతంత్ర సహాయమంత్రిగా బాధ్యతలు అప్పగించారు. ఈ శాఖను ఇంతకుముందు సర్బానంద సోనేవాల్ నిర్వహించేవారు. ఆయన అస్సాం ముఖ్యమంత్రిగా వెళ్లిన విషయం తెలిసిందే. ► ఇక పర్యాటక శాఖకు జవదేకర్ స్థానంలో అనిల్‌మాధవ్ దవేను స్వతంత్ర సహాయమంత్రిగా నియమించారు. ► అప్నాదళ్ నేత అనుప్రియాపాటిల్‌తో పాటు, ఫగన్‌సింగ్ కులస్తేలకు ఆరోగ్యం, కుటుంబసంక్షేమ శాఖలో సహాయమంత్రులుగా చోటు కల్పించారు. ► డాక్టర్ ఎస్.ఆర్.భామ్రేను రక్షణమంత్రి మనోహర్ పారికర్‌కు సహాయమంత్రిగా బాధ్యతలు అప్పగించారు. ► కేబినెట్ మంత్రుల్లో గడ్కరీ, ఉమాభారతి, అశోక్‌గజపతిరాజు, పారికర్, సురేష్‌ప్రభు, రాంవిలాస్‌పాశ్వాన్, కల్రాజ్మిశ్రా, మేనకా సంజయ్‌గాంధీ, నజ్మాహెప్తుల్లా, జె.పి.నడ్డా, అనంత్ గీతే, హర్‌సిమ్రత్‌కౌర్, జ్యుయల్ ఓరమ్, రాధామోహన్‌సింగ్, తావర్‌చంద్ గెహ్లాట్ తదితరుల శాఖల్లో మార్పు లేదు. ఐదుగురు సహాయ మంత్రులపై వేటు... కేంద్రంలో 2014 మేలో అధికారంలోకి వచ్చిన మోదీ సర్కారు.. దాదాపు రెండేళ్ల తర్వాత చేపట్టిన రెండో మంత్రివర్గ విస్తరణతో పాటే.. కీలక మార్పులూ చేయటం విశేషం. ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో త్వరలో జరుగున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. దళితులు, వెనుకబడిన వర్గాల వారిలో పార్టీని బలోపేతం చేసుకోవటం లక్ష్యంగా సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేస్తూ ఈ విస్తరణ చేపట్టారు. ఇప్పటివరకు 64 మందిగా ఉన్న మంత్రివర్గ సభ్యుల సంఖ్య తాజా విస్తరణతో 78కి పెరిగింది. ఒకవైపు మంత్రివర్గానికి కొత్త రక్తం ఎక్కిస్తూనే.. పలు శాఖల మార్పులతో కేబినెట్‌కు కొత్త రూపునూ ఇచ్చారు. ఇప్పటివరకు స్వతంత్ర సహాయమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఒక్కరికే పదోన్నతినిస్తూ కేబినెట్ హోదా కల్పించారు. అలాగే ఐదుగురు సహాయమంత్రులు సన్వర్‌లాల్ జాట్ (జలవనరుల శాఖ), మోహన్‌భాయ్ కుందరియా (వ్యవసాయశాఖ), నిహాల్చంద్ (పంచాయతీరాజ్), మన్సుఖ్భాయ్ ధాంజీభాయ్ (గిరిజన వ్యవహారాలు), ప్రొఫెసర్ రామ్‌శంకర్ కతేరియా (మానవ వనరుల అభివృద్ధి)లపై వేటు వేశారు. వారి రాజీనామా లేఖలను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ మంగళవారం నాడే ఆమోదించారు. మంత్రుల శాఖల్లో తాజా మార్పులు ► ప్రకాశ్ జవదేకర్ - మానవ వనరుల శాఖ (కేబినెట్ హోదా) ► స్మృతి ఇరానీ - చేనేత, జౌళి శాఖ (మానవ వనరుల శాఖ మార్పు) ► రవిశంకర్ ప్రసాద్ - ఐటీ శాఖకు అదనంగా న్యాయ శాఖ ► సదానంద గౌడ - గణాంకాలు, కార్యక్రమ అమలు మంత్రి (న్యాయ శాఖ తొలగింపు) ► అనంత కుమార్ - ఎరువులు, రసాయనాల శాఖకు అదనంగా పార్లమెంటరీ వ్యవహారాలు ► వెంకయ్య నాయుడు - పట్టణాభివృద్ధి శాఖకు అదనంగా సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (పార్లమెంటరీ వ్యవహారాలు, గృహ నిర్మాణం తొలగింపు) ► పీయూశ్ గోయల్ - విద్యుత్, పునరుత్పత్తి విద్యుత్ శాఖకు అదనంగా గనులు ► చౌదరీ బీరేంద్ర సింగ్ - స్టీల్ (గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, తాగునీరు, పారిశుద్ధ్యం తొలగింపు) ► హన్సరాజ్ గంగారామ్ ఆహిర్ - హోం శాఖ సహాయ మంత్రి (ఎరువులు, రసాయనాలు శాఖ తొలగింపు) ► సంతోష్ కుమార్ గంగ్వార్ - ఆర్థిక శాఖ సహాయ మంత్రి (చేనేత, జౌళి శాఖ తొలగింపు) ► మనోజ్ సిన్హా - రైల్వే సహాయ మంత్రి, కమ్యూనికేషన్స్ (అదనం) ► సంజీవ్ కుమార్ - జలవనరులు, నదుల అనుసంధానం (సహాయ మంత్రి) వ్యవసాయం (తొలగింపు) ► జయంత్ సిన్హా - పౌర విమానయాన (సహాయ మంత్రి) (ఆర్థిక సహాయ మంత్రి తొలగింపు) ► హరిభాయ్ చౌదరి - సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి పరిశ్రమలు (సహాయ మంత్రి) (హోం శాఖ తొలగింపు) ► రావ్ ఇందర్జిత్ సింగ్ - ప్రణాళిక, పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ, పట్టణ పేదరిక నిర్మూలన (సహాయ మంత్రి) (రక్షణ శాఖ తొలగింపు) ► నరేంద్ర సింగ్ తోమర్ - గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్, తాగునీరు, పారిశుధ్య (సహాయ మంత్రి), (గనులు, స్టీల్ మంత్రిత్వ శాఖ తొలగింపు) కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు ► అనిల్ మాధవ్ దవే - అడవులు, పర్యావరణం, వాతావరణ మార్పులు (స్వతంత్ర) ► విజయ్ గోయల్ - క్రీడలు, యువజన సర్వీసులు (స్వతంత్ర) ► అర్జున్ రామ్ మేఘ్వాల్ - ఆర్థికర, కార్పొరేట్ వ్యవహారాలు (సహాయ మంత్రి) ► ఎస్ఎస్ అహ్లువాలియా - వ్యవసాయం, రైతు సంక్షేమం, పార్లమెంటరీ వ్యవహారాలు (సహాయ మంత్రి) ► ఫగన్ సింగ్ కులస్తే - ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ (సహాయ మంత్రి) ► అనుప్రియ పటేల్ - ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ (సహాయ మంత్రి) ► రాజన్ గోహెన్ - రైల్వే శాఖ (సహాయమంత్రి) ► ఎంజే అక్బర్ - విదేశీ వ్యవహారాలు (సహాయ మంత్రి) ► కృష్ణపాల్ - సామాజిక న్యాయం, సాధికారత (సహాయ మంత్రి) ► రాందాస్ అఠావలే - సామాజిక న్యాయం, సాధికారత (సహాయ మంత్రి) ► జస్వంత్ సింహ బహదూర్ - గిరిజన వ్యవహారాలు ► పీపీ చౌదరి - న్యాయ, ఐటీ శాఖలు (సహాయ మంత్రి) ► డాక్టర్ సుభాష్ భామ్రే - రక్షణ (సహాయమంత్రి) ► సీఆర్ చౌదరి - వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ (సహాయ మంత్రి) ► అజయ్ తాంతా - చేనేత, జౌళి (సహాయ మంత్రి) ► మన్షుక్ మాండవీయ - రహదారులు, రవాణా, షిప్పింగ్, ఎరువులు-రసాయనాలు (సహాయ మంత్రి) ► పర్షోత్తమ్ రూపాలా - వ్యవసాయం, రైతు సంక్షేమం, పంచాయతీ రాజ్ (సహాయ మంత్రి) ► డాక్టర్ మహేంద్రనాథ్ పాండే - మానవ వనరుల శాఖ (సహాయ మంత్రి) ► రమేశ్ చందప్ప జిగజినాగి - తాగునీరు, పారిశుద్ధ్యం వేటు వీరిపైనే ► సన్వర్‌లాల్ జాట్, మోహన్‌భాయ్ కుందరియా, నిహాల్చంద్, మన్సుఖ్భాయ్ ధాంజీభాయ్, ప్రొఫెసర్ రామ్‌శంకర్ కతేరియా -
కేంద్రమంత్రుల శాఖల్లో కీలక మార్పులు
న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారం చేపట్టిన తర్వాత మంగళవారం మరోసారి బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం కేబినేట్ ను విస్తరించింది. 19 మంది మంత్రులకు కొత్తగా పదవులను ఇచ్చిన ఎన్డీయే కూటమి, పలువురు మంత్రుల శాఖలను కూడా మార్చుతూ కీలక నిర్ణయం తీసుకుంది. 19 మంది మంత్రులలో గుజరాత్, రాజస్థాన్ ల నుంచి నలుగురి చొప్పున, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ల నుంచి ముగ్గురి చొప్పున, మహారాష్ట్ర నుంచి ఇద్దరు, కర్ణాటక, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ ల నుంచి ఒక్కొక్కరికి జాబితాలో స్థానం కల్పించారు. కొందరు కేంద్ర మంత్రులను కీలక శాఖల నుంచి సాధారణ శాఖలకు మంత్రులుగా బాధ్యతలు అప్పగించారు. మానవ వనరులశాఖ మంత్రిగా ఉన్న స్మృతి ఇరానీని చేనేత, జౌళిశాఖకు మంత్రిగా నియమించింది. ఆమె స్థానంలో ప్రకాశ్‌జవదేకర్‌ను నియమించారు. ఇక కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు పట్టణాభివృద్ధి శాఖను అలాగే ఉంచి.. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ బాధ్యతల నుంచి మాత్రమే తప్పించారు. ఆ శాఖకు బదులు గృహనిర్మాణం, పట్టణపేదరిక నిర్మూలన, సమాచార, పౌరసంబంధాల శాఖను వెంకయ్యనాయుడుకు అదనంగా కేటాయించారు. మంత్రులు-శాఖలు వెంకయ్యనాయుడు- పట్టణాభివృద్ధి, గృహనిర్మాణం, పట్టణపేదరిక నిర్మూలన, సమాచార, పౌరసంబంధాల శాఖ స్మృతి ఇరానీ- చేనేత, జౌళీశాఖ ప్రకాష్ జయదేవకర్- మానవ వనరుల శాఖ అనంతకుమార్- పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ఎంజే అక్బర్- విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి రవిశంకర్ ప్రసాద్- న్యాయశాఖ సదానంద గౌడ- గణాంక శాఖ బీరేంద్ర సింగ్- గనుల శాఖ రాందాస్ అథవలే- సామాజిక న్యాయశాఖ ఇంద్రజిత్ సింగ్- పట్టణాభివృద్ధి హౌసింగ్ పట్టణ దారిద్య్ర నిర్మూలన అనిల్ మాధవ్ దవే- స్వతంత్రహోదాలో అటవీ పర్యావరణ శాఖ విజయ్ గోయల్- క్రీడా శాఖ జశ్వంత్ సిన్హా బాభోర్- గిరిజన వ్యవహారాల శాఖ జయంత్ సిన్హా- పౌర విమానయాన సహాయమంత్రి కృష్ణారాజ్- మహిళా శిశు సంక్షేమశాఖ అర్జున్ మేఘ్ వాల్- ఆర్ధికశాక సహాయమంత్రి అనుప్రియ పాటిల్ - ఆరోగ్య కుటుంబ సంక్షేమ సహాయ మంత్రి -
తన వద్ద ఉన్న శాఖలను మంత్రులకు కేటాయించిన కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తన వద్ద ఉన్న శాఖలను మంత్రులకు కేటాయించారు. వచ్చే నెల 5 నుంచి జరిగే బడ్జెట్ సమావేశాల్లో సమాధానం చెప్పేందుకు శాఖల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. మంత్రులకు కేటాయించిన శాఖలు: నాయిని నరసింహారెడ్డి- శాంతిభద్రతలు ఈటెల రాజేందర్- బీసీ, ఎస్సీ, ఎస్టీ, దేవాదాయ పోచారం- పురపాలక మహమ్మద్ అలీ-మైనారిటీ సంక్షేమం హరీష్ రావు- విద్యుత్, సాధారణ పరిపాలన మహేందర్ రెడ్డి-వాణిజ్య పన్నులు కేటీఆర్-పరిశ్రమలు, చేనేత పద్మారావు-రోడ్లు, భవనాలు రాజయ్య-క్రీడలు, పర్యాటకం జగదీశ్వర్ రెడ్డి-స్త్రీ, శిశు సంక్షేమం, న్యాయశాఖ జోగురామన్న-పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ -
మంత్రుల పనితీరు పై కేసీఆర్ అసంతృప్తి!
-
శాఖలు అటూఇటూ!
మంత్రుల శాఖలు మార్పు.. పలువురి పనితీరుపై కేసీఆర్ అసంతృప్తి సాక్షి, హైదరాబాద్, ఖమ్మం: ముఖ్యమంత్రి కేసీఆర్ తన కేబినెట్లో పలువురి శాఖలు మార్చాలని యోచిస్తున్నారు. ముఖ్యమైన శాఖలు నిర్వహిస్తున్న కొందరు మంత్రుల పనితీరుపై ఆయన అసంతృప్తిగా ఉండటమే ఇందుకు కారణమని విశ్వసనీయంగా తెలుస్తోంది. మెదక్ లోక్‌సభకు ఉప ఎన్నికలు, బడ్జెట్ సమావేశాలు వంటివి పూర్తయిన తర్వాత దసరా పండుగకు అటూఇటుగా శాఖల మార్పుతో పాటు మంత్రివర్గ విస్తరణకు సీఎం శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం. తెలంగాణ మంత్రివర్గం ఏర్పాటై మూడు నెలలు (సెప్టెంబర్ 2న) కావస్తోంది. అయినప్పటికీ మెజారిటీ మంత్రులకు తమ శాఖలపై కనీస అవగాహన రాలేదని కేసీఆర్ అసంతృప్తిగా ఉన్నారు. మరికొందరు మంత్రుల పేషీలు వ్యవహరిస్తున్న తీరు, వారి చాంబర్లలో నడుస్తున్న అపసవ్య ధోరణులు కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి దృష్టికి వచ్చాయి. కాంగ్రెస్ మంత్రుల హయాంలో చక్రం తిప్పిన వారే ఇప్పుడు టీఆర్ఎస్ మంత్రుల దగ్గర కూడా అన్ని వ్యవహారాలను చక్కబెడుతున్నారు. గత మంత్రుల దగ్గర పనిచేసిన వారిని మళ్లీ ఓఎస్డీలు, పీఎస్లుగా తీసుకోవద్దని కేసీఆర్ ఆదిలోనే గట్టి హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో వారిని అధికారికంగా తీసుకోనప్పటికీ కొందరు మంత్రుల దగ్గర వారు ఆంతరంగికులుగా, సన్నిహితులుగా చలామణి అవుతున్నారు. బదిలీలు, ఇతర ముఖ్యమైన వ్యవహారాల్లో వారే చక్రం తిప్పుతున్నట్లు పలువురు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు కేసీఆర్‌కు ఫిర్యాదు చేశారు. ఇక కొందరు మంత్రుల పేషీల్లో ఉన్న వ్యక్తిగత కార్యదర్శులు, ఓఎస్డీలు సర్వం తామే అన్నట్టుగా వ్యవహరిస్తూ... సందర్శకుల పట్ల నిర్లక్ష్యంగా, అమర్యాదగా వ్యవహరిస్తున్నట్టు కూడా ఆయనకు ఫిర్యాదులు అందాయి. ఒకరిద్దరు మంత్రులైతే సచివాలయంలోని చాంబర్లో కూర్చుంటున్నప్పటికీ శాఖా పరమైన ఏ పనినీ పట్టించుకోవడం లేదని కూడా సీఎం దృష్టికి వెళ్లింది. వారికిప్పటికీ శాఖాపరమైన కనీస అవగాహన కూడా రాకపోవడం, కనీసం దాని అధ్యయనంపైనా దృష్టి కేంద్రీకరించకపోవడంపై కేసీఆర్ బాహాటంగానే అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కీలక పోర్టుఫోలియోను నిర్వహిస్తున్న హైదరాబాద్‌కు చెందిన మంత్రి ఒకరిని తక్షణమే మార్చాలనే ఆలోచనతో ఉన్నట్టు సమాచారం. అయితే మంత్రులు కూడా సీఎం తీరుపై ఒకింత గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. ‘మంత్రివర్గంలో ఉన్నామనే పేరు తప్ప చిన్న చిన్న బదిలీలకు కూడా సీఎం కార్యాలయం నుంచి ఆదేశాలు రావాల్సిందే. ప్రతీ చిన్న విషయంపైనా సీఎంకే నివేదిక పోతున్నది. మంత్రులుగా ఉన్నా మమ్మల్ని విశ్వాసంలోకి తీసుకుంటున్నట్టు కనిపించడం లేదు’ అని కొందరు మంత్రులు తమ సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేయడం కొసమెరుపు. చంద్రబాబుపై అసంతృప్తే కారణం.. టీడీపీకి మొదటి నుంచీ అండగా ఉండి, ఖమ్మం జిల్లాను ఆ పార్టీ కంచుకోటగా తీర్చిదిద్దిన తుమ్మల.. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుపై ఉన్న అసంతృప్తి వల్లే పార్టీని వీడుతున్నారని ఆయన సన్నిహితులంటున్నారు. జిల్లాలో ఆయనకు ప్రాధాన్యం తగ్గించి, తన వ్యక్తిగత కోటరీలోని సభ్యుడైన మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు మాటకే బాబు విలువనిస్తున్నారని వారు మండిపడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో టిక్కెట్ల కేటాయింపులో కూడా నామాకే బాబు ప్రాధాన్యమిచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. తుమ్మల అనుచరుడు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణకు పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి రాత్రికి రాత్రే మార్చేశారని, ఇందుకు నామానే కారణమని అప్పట్లోనే తుమ్మల వర్గం ఆగ్రహించింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో తుమ్మలను ఓడించేందకు నామా వర్గీయులు పనిచేశారని, అందుకే టీడీపీ బలంగా ఉన్నా తుమ్మల ఓటమి పాలయ్యారని ఆయన అనుచరులు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. దీంతో పార్టీని వీడటంపై తుమ్మల మల్లగుల్లాలు పడ్డారు. పార్టీ కేడర్ కూడా ఆయనపై ఒత్తిడి తెచ్చింది. అయితే, పార్టీ మారే విషయంలో చాలా గుంభనంగా వ్యవహరించిన తుమ్మల కార్యకర్తల ఒత్తిడికి మొదట్లో తలొగ్గినట్టు కనిపించలేదు. కానీ, టీఆర్ఎస్ కూడా ఆయన పట్ల సుముఖంగానే ఉండడం, ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ తర్వాత ఆయన హామీ మేరకు పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో జిల్లాలో తుమ్మల అనుచరులు వారం రోజులుగా హల్చల్ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల ఆయన పేరుతో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి తెలంగాణ పునర్నిర్మాణంలో పాలుపంచుకోవాలంటూ ‘తుమ్మల.. రా.. కదలిరా’.. ‘మీ వెంటే మేమంతా’ అని రాశారు. మరోవైపు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గడిపల్లి కవిత కూడా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తుమ్మల నిర్ణయమే తనకు శిరోధార్యమని, ఆయన వెంటే ఉంటానని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, 10 మంది జడ్పీటీసీలు, పెద్ద ఎత్తున సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, ఇతర నాయకులు తుమ్మలతో వెళ్లిపోతారన్న ప్రచారం జరుగుతోంది. అయితే, ఆయన వర్గానికే చెందిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాత్రం తాను టీడీపీలోనే ఉంటానని చెప్పడం గమనార్హం. మంత్రివర్గంలోకి తుమ్మల? టీడీపీ నేత తుమ్మల నాగేశ్వర్రావును మంత్రివర్గంలోకి తీసుకోవడానికి రంగం సిద్ధమైంది! టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు కేబినెట్లో కేసీఆర్, తుమ్మల సహచరులు.ఇదే సాన్నిహిత్యంతో వీరిరువురు ఇటీవల సమావేశం కూడా అయ్యారు. మంత్రివర్గంలోకి తీసుకుంటామని ఈ సందర్భంగా తుమ్మలకు కేసీఆర్ హామీ ఇచ్చినట్టుగా విశ్వసనీయ సమాచారం. టీఆర్ఎస్ నుంచి ఖమ్మం జిల్లాలో ఒక్కరే(జలగం వెంకట్రావు) ఎమ్మెల్యేగా గెలిచారు. కేసీఆర్ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో ఇప్పటికే ఎక్కువ ప్రాతినిధ్యం దక్కిందన్న కారణంతో జలగం వెంకట్రావుకు అవకాశమివ్వలేదు. ఈ నేపథ్యంలో ఖమ్మం నుంచి తుమ్మలను మంత్రివర్గంలోకి తీసుకుని, ఆ జిల్లాతో పాటు హైదరాబాద్‌లోనూ టీఆర్ఎస్ను బలోపేతం చేసుకోవాలనే వ్యూహంతో కేసీఆర్ ఉన్నారు. అయితే ప్రజాక్షేత్రంలో గెలిచిన తనను పక్కనబెట్టి, ఎమ్మెల్యేగా ఓడిపోయిన తుమ్మలను మంత్రివర్గంలోకి తీసుకుంటారనే సమాచారం అందుకున్న జలగం వెంకట్రావు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్కు ఏ మాత్రం బలం లేని ఖమ్మం జిల్లా నుంచి గెలిచిన తనను గుర్తించకపోవడంపై ఆయన ఆగ్రహంగా ఉన్నారు. మరోవైపు వచ్చే నెల తొలి వారంలోనే టీఆర్ఎస్లో చేరేందుకు తుమ్మల సిద్ధమవుతున్నట్లు జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. -
పరిశ్రమలు, విద్యుత్ చంద్రబాబు వద్దే
* కోరుకున్న మేరకు సీనియర్లకు శాఖల సర్దుబాటు * పలు శాఖల విలీనం... మిగతా వారికి కేటాయింపు హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గ సహచరులకు శాఖలను ఖరారు చేశారు. రాష్ట్ర విభజనానంతరం ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌లో భవిష్యత్తులో చేపట్టాల్సిన అనేక అంశాలకు సంబంధించిన కీలక శాఖలను చంద్రబాబు తన దగ్గరే ఉంచుకున్నట్లు శాఖల కేటాయింపును చూస్తే అర్థమవుతుంది. న్యాయ, విద్యుత్తు, మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడులు, పరిశ్రమలు, వాణిజ్యం, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్, సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖలు చంద్రబాబు తన దగ్గరే ఉంచుకున్నారు. వీటితో పాటు మంత్రులకు కేటాయించని ఇతర శాఖలను కూడా చంద్రబాబుకే దఖలు పడనున్నాయి. రాష్ట్ర రాజధాని నిర్మాణానికి సంబంధించిన అనేక అంశాలతో ముడిపడి ఉన్న మౌలికసదుపాయాలు, పెట్టుబడులు శాఖ చంద్రబాబు వద్దే ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు పరిశ్రమలన్నీ దాదాపుగా హైదరాబాద్ కేంద్రంగానే ఏర్పాటయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా పరిశ్రమలను ఏర్పాటుచేసుకోవాల్సిన అవసరమేర్పడింది. కేంద్రం కూడా పారిశ్రామికాభివృద్ధికి వీలుగా రాష్ట్రానికి ప్రత్యేక పతిపత్తిని కల్పించి పన్ను రాయితీలను కల్పించనుంది. ఇందుకు సంబంధించి కేంద్రం ఐదేళ్లపాటు ప్రత్యేక పతిపత్తిని ప్రకటించింది. అది వాస్తవరూపం దాల్చితే పరిశ్రమలు ఏర్పాటుచేసే వారికి వందల కోట్లమేర పన్ను రాయితీ లభించనుంది. పరిశ్రమలకు అనుమతులు, రాయితీల మంజూరు తదితర అనేక అంశాల్లో పరిశ్రమలు, వాణిజ్యం, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖల పాత్ర చాలా కీలకం కానుంది. యనమల రామకృష్ణుడికి ఇదివరకు ఆయన నిర్వహించిన ఆర్థిక, శాసనసభా వ్యవహారాలతో పాటుగా వాణిజ్యపన్నుల శాఖను కూడా అప్పగించారు. కేఈ కృష్ణమూర్తి రెవెన్యూ శాఖను పట్టుబట్టి దక్కించుకున్నారు. పంచాయతీరాజ్ శాఖతో గ్రామీణ నీటిసరఫరా, ఎన్నార్యీజీఎస్ విభాగాలను జతచేసి అయ్యన్నపాత్రుడికి ఇచ్చారు. బొజ్జల గోపాల కృష్ణారెడ్డి గతంలో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా పనిచేయగా ఈసారి అడవులు, పర్యావరణ శాఖతో సరిపెట్టారు. తమకు శాఖలను కేటాయించినందుకు పలువురు మంత్రులు చంద్రబాబును కలసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం విశాఖపట్నంలో గురువారం తొలిభేటీ జరగనుండడంతో అక్కడకు వెళ్లారు. -
నాయినికి హోం.. ఈటెలకు ఆర్థిక
-
నాయినికి హోం.. ఈటెలకు ఆర్థిక
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు తన మంత్రి వర్గ సహచరులకు శాఖలను కేటాయించారు. మున్సిపల్, విద్యుత్ శాఖలతో పాటు అన్ని సంక్షేమ శాఖలను కేసీఆర్ తన వద్దే ఉంచుకున్నారు. సోమవారం ఉదయం కేసీఆర్‌తో పాటు మరో 11మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఇందులో ఇద్దరిని ఉప ముఖ్యమంత్రులుగా నియమించారు. మంత్రులకు కేటాయించిన శాఖల వివరాలిలా ఉన్నాయి. మంత్రులు-శాఖలు *మహ్మద్ అలీ( మైనారీటి)- డీప్యూటీ సీఎం, రెవెన్యూ *డా.రాజయ్య-డిప్యూటీ సీఎం, వైద్య శాఖ *ఈటెల రాజేందర్- ఆర్థిక శాఖ *హరీష్ రావు- భారీ నీటి పారుదల, శాసనసభ వ్యవహారాలు కేటీఆర్-పంచాయతీరాజ్, ఐటీ *మహేందర్ రెడ్డి- రవాణ *పోచారం శ్రీనివాస్‌రెడ్డి- వ్యవసాయం *నాయిని నర్సింహారెడ్డి-హోంశాఖ *జగదీశ్వర్‌రెడ్డి- విద్యాశాఖ *జోగు రామన్న-అటవీ, పర్యాటక * పద్మారావు-ఎక్సైజ్ శాఖ -
తెలంగాణ మంత్రుల శాఖలు?
హైదరాబాద్ : కేసీఆర్ మంత్రివర్గంలో శాఖల కేటాయింపు ఈ క్రింది విధంగా ఉంటుందని సమాచారం. తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌తో పాటు మరో 11మంది మంత్రులుగా సోమవారం ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. కాగా ఈనెల 8వ తేదీన మరోసారి మంత్రివర్గ విస్తరణ జరగనుంది. మరో ఆరుగురిని కేసీఆర్ తన మంత్రివర్గంలో తీసుకోనున్నారు. శాఖల కేటాయింపు! *మహ్మద్ అలీ( మైనారీటి)- మైనార్టీ డీప్యూటీ సీఎం, మైనార్టీ సంక్షేమం *డా.రాజయ్య-డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్యశాఖ? *ఈటెల రాజేందర్- ఆర్థిక శాఖ? *హరీష్ రావు-విద్యుత్, నీటి పారుదలశాఖ? *మహేందర్ రెడ్డి-క్రీడలు, యువజన వ్యవహారాలు? *కేటీఆర్-ఐటీ, పరిశ్రమల శాఖ? *పోచారం శ్రీనివాస్‌రెడ్డి- పంచాయతీరాజ్? *నాయిని నర్సింహారెడ్డి-హోంశాఖ? *జగదీశ్వర్‌రెడ్డి- రోడ్లు, భవనాలు? *జోగు రామన్న-సాంఘిక సంక్షేమం? * పద్మారావు-ఎక్సైజ్ శాఖ?... కాగా మిగిలిన శాఖలను కేసీఆర్ తన ఆధీనంలోనే ఉంచుకోనున్నట్లు తెలుస్తోంది. -
సాయంత్రం కేంద్ర కేబినెట్ తొలి భేటీ
న్యూఢిల్లీ : నరేంద్ర మోడీ నేతృత్వంలో కొలువుతీరిన కొత్త కేబినెట్ మంగళవారం సమావేశం కానుంది. దేశ 15వ ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోడీ ఈరోజు సాయంత్రం కొత్త మంత్రులతో తొలిసారి భేటీ కానున్నారు.. దేశాభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలు, ప్రతిపాదనలపై ఈ భేటీలో చర్చించే సూచనలున్నాయి. మరోవైపు పోలవరం ప్రాజెక్ట్, ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిపై కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అలాగే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఎత్తివేతపై కూడా చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. అలాగే మంత్రులకు శాఖల కేటాయింపు విషయం కూడా చర్చించే అవకాశం ఉంది. -
కేంద్ర మంత్రులు-కేటాయించిన శాఖలు
న్యూఢిల్లీ : కొత్తగా కొలువు తీరిన కేబినెట్ సభ్యులకు శాఖల కేటాయింపు జరిగింది. నిన్న ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖలను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మంత్రులకు కేటాయించిన శాఖల వివరాలు: పేరు శాఖ 1) నరేంద్రమోడీ - ప్రధానమంత్రి 2) రాజ్‌నాథ్ సింగ్ - హోం శాఖ 3) సుష్మా స్వరాజ్ - విదేశీ వ్యవహారాలు 4) అరుణ్ జైట్లీ - ఆర్థిక(అదనంగా రక్షణ శాఖ) కార్పొరేట్ వ్యవహారాలు 5) ఎం. వెంకయ్యనాయుడు - పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాలు 6) నితిన్ గడ్కారీ - ఉపరితల రవాణా, షిప్పింగ్ 7) డీవీ సదానంద గౌడ - రైల్వే శాఖ 8) నజ్మా హెప్తుల్లా - మైనారిటీ వ్యవహారాలు 9) ఉమాభారతి - జల వనరులు, గంగా ప్రక్షాళన 10) గోపీనాథ్ ముండే - గ్రామీణాభివృద్ధి 11) రామ్‌విలాస్ పాశ్వాన్ - ఆహార, పౌర సరఫరాలు 12) కల్రాజ్ మిశ్రా - సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు 13) మేనకా గాంధీ - మహిళ, శిశు సంక్షేమం 14) అనంత్‌కుమార్ - ఎరువులు, రసాయన శాఖ 15) అశోక్ గజపతి రాజు - పౌర విమానయానం 16) అనంత్ గీతె- భారీ పరిశ్రమలు 17) హర్సిమ్రత్సింగ్ కౌర్ బాదల్- ఫుడ్ ప్రొసెసింగ్ 18) రవిశంకర్ ప్రసాద్ - న్యాయ, టెలికం 19) నరేంద్ర సింగ్ తోమర్ - గనులు, ఉక్కు, కార్మిక ఉపాధి కల్పన 20) జువల్ ఓరామ్ - గిరిజన వ్యవహారాలు 21) రాధామోహన్ సింగ్ - వ్యవసాయం 22) తావర్ చంద్ గెహ్లాట్ - సామాజిక న్యాయం, 23) స్మృతి జుబిన్ ఇరానీ - మానవ వనరులు 24) హర్షవర్ధన్ - ఆరోగ్యం సహాయ మంత్రులు (స్వతంత్ర హోదా) 1) జనరల్ (రిటైర్డ్) వీకే సింగ్ - విదేశాంగ సహాయ మంత్రి 2) ఇందర్‌జిత్‌సింగ్ రావు - గణాంకాలు, కార్యక్రమాల అమలు, రక్షణ ప్రణాళిక 3) సంతోష్‌కుమార్ గంగ్వార్ - టెక్స్టైల్స్ 4) శ్రీపద్ యశోనాయక్ - సంస్కృతి, పర్యాటకం 5) ధర్మేంద్ర ప్రధాన్ - పెట్రోలియం, సహజ వనరులు 6) సర్బానంద సోనోవాల్ - నైపుణ్యత, యూత్ ఎఫైర్స్ అండ్ స్పోర్ట్స్, 7) ప్రకాశ్ జవదేకర్ - అటవీ వ్యవహారాలు, పర్యావరణ శాఖ 8) పియూష్ గోయల్ - విద్యుత్, బొగ్గు గనులు 9) జితేంద్ర సింగ్ - సైన్స్ అండ్ టెక్నాలజీ 10) నిర్మల సీతారామన్ - వాణిజ్యం, పరిశ్రమలు సహాయ మంత్రులు 1) జీఎం సిద్ధేశ్వర - పౌర విమానయానం 2) మనోజ్ సిన్హా - రైల్వే శాఖ 3) నిహాల్చంద్ - కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ 4) ఉపేంద్ర కుష్వాహ - గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ 5) పీ రాధాకృష్ణన్ - భారీ పరిశ్రమలు, 6) కిరణ్ రాజు - హోం ఎఫైర్స్ 7) కృష్ణన్ పాల్ - రోడ్డు ట్రాన్స్పోర్ట్,రహదారులు,షిప్పింగ్ 8) సంజీవ్ కుమార్ బాల్యన్ - ఫుడ్ ప్రోసెసింగ్ 9) మన్సుఖ్భాయి ధన్జీభాయి వాసవ - గిరిజనాభివృద్ధి 10) రావు సాహెబ్ దాదారావు దాన్వే - కన్య్జూమర్ ఎఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ 11) విష్ణుదేవ్ సాయి - మైన్స్, స్టీల్, లేబర్ 12) సుదర్శన్ భగత్ - సామాజిక న్యాయం, -
గుట్టుచప్పుడు కాకుండా రెండుశాఖల కేటాయింపు