
సాయంత్రం కేంద్ర కేబినెట్ తొలి భేటీ
న్యూఢిల్లీ : నరేంద్ర మోడీ నేతృత్వంలో కొలువుతీరిన కొత్త కేబినెట్ మంగళవారం సమావేశం కానుంది. దేశ 15వ ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోడీ ఈరోజు సాయంత్రం కొత్త మంత్రులతో తొలిసారి భేటీ కానున్నారు.. దేశాభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలు, ప్రతిపాదనలపై ఈ భేటీలో చర్చించే సూచనలున్నాయి.
మరోవైపు పోలవరం ప్రాజెక్ట్, ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిపై కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అలాగే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఎత్తివేతపై కూడా చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. అలాగే మంత్రులకు శాఖల కేటాయింపు విషయం కూడా చర్చించే అవకాశం ఉంది.