నాయినికి హోం.. ఈటెలకు ఆర్థిక
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు తన మంత్రి వర్గ సహచరులకు శాఖలను కేటాయించారు. మున్సిపల్, విద్యుత్ శాఖలతో పాటు అన్ని సంక్షేమ శాఖలను కేసీఆర్ తన వద్దే ఉంచుకున్నారు. సోమవారం ఉదయం కేసీఆర్తో పాటు మరో 11మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఇందులో ఇద్దరిని ఉప ముఖ్యమంత్రులుగా నియమించారు. మంత్రులకు కేటాయించిన శాఖల వివరాలిలా ఉన్నాయి.
మంత్రులు-శాఖలు
*మహ్మద్ అలీ( మైనారీటి)- డీప్యూటీ సీఎం, రెవెన్యూ
*డా.రాజయ్య-డిప్యూటీ సీఎం, వైద్య శాఖ
*ఈటెల రాజేందర్- ఆర్థిక శాఖ
*హరీష్ రావు- భారీ నీటి పారుదల, శాసనసభ వ్యవహారాలు
కేటీఆర్-పంచాయతీరాజ్, ఐటీ
*మహేందర్ రెడ్డి- రవాణ
*పోచారం శ్రీనివాస్‌రెడ్డి- వ్యవసాయం
*నాయిని నర్సింహారెడ్డి-హోంశాఖ
*జగదీశ్వర్‌రెడ్డి- విద్యాశాఖ
*జోగు రామన్న-అటవీ, పర్యాటక
* పద్మారావు-ఎక్సైజ్ శాఖ