cabine expansion
-
ప్రభుత్వం ఏర్పాటు చేసి నాలుగు వారాలైంది.. కేబినెట్ సంగతేంటి?
ముంబై: మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే, బీజేపీ ప్రభుత్వం కొలువుదీరి నాలుగు వారాలు దాటింది. కానీ ఇప్పటివరకు మంత్రివర్గ విస్తరణ జరగలేదు. అప్పుడు ఇప్పుడు అంటున్నారు తప్ప కేబినెట్‌పై షిండే, బీజేపీ ఎటూ తేల్చడం లేదు. ఆగస్టు 1 తర్వాత కొత్త మంత్రివర్గాన్ని ప్రకటిస్తారని ప్రచారం జరుగుతున్నా.. దానిపైనా ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. అయితే కేబినెట్ విస్తరణ ఆలస్యం కావడానికి షిండే వర్గమే కారణమని బీజేపీ సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఉద్ధవ్ కేబినెట్లో మంత్రులుగా పనిచేసిన ఎమ్మెల్యేలందరికీ షిండే తన కేబినెట్లో చోటు కల్పిస్తారని ఇప్పటికే ఖరారైంది. కానీ షిండే వర్గంలోని ఇతర ఎమ్మెల్యేలు కూడా మంత్రి పదవులు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. వారిని చల్లబర్చేందుకే కేబినెట్ విస్తరణను ఆలస్యం చేస్తున్నట్లు బీజేపీ నేత ఒకరు చెప్పారు. మంత్రివర్గంపై పార్టీ ఉన్నత స్థాయి నాయకులే చర్చిస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు మంత్రివర్గ విస్తరణలో గుజరాత్ ఫార్ములాను పాటించాలని కమలం పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తమ పార్టీకి చెందిన వారిలో పాతవాళ్లకు కాకుండా మొత్తం కొత్తవారికే కేబినెట్లో చోటు కల్పించనున్నట్లు సమాచారం. కేబినెట్ విస్తరణ నేపథ్యంలోనే షిండే సహా కీలక నేతలు తరచూ ఢిల్లీకి వెళ్తున్నారు. బీజేపీ అధిష్ఠానంతో చర్చలు జరుపుతున్నారు. షిండే వర్గం మాత్రం తమకు మంత్రి పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా.. ఆయనకే మద్దతుగా ఉంటామని చెబుతున్నారు. సుప్రీంకోర్టులో మహారాష్ట్ర ప్రభుత్వంపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరుగుతున్నందునే కేబినెట్ విస్తరణ ఆలస్యం అవుతున్నట్లు పేర్కొన్నారు. రెండు దఫాలుగా.. అయితే మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ రెండు దఫాలుగా ఉంటుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. మొదటి విడతలో 25 మందితో కేబినెట్‌ను ప్రకటించనున్నట్లు పేర్కొన్నాయి. ఆ తర్వాత కొన్ని రోజులకు మరికొందరికి అవకాశం కల్పించనున్నట్లు తెలిపాయి. మొదటి కేబినెట్లో తమకు 14 నుంచి 15 బెర్తులు దక్కుతాయని షిండే వర్గం చెబుతోంది. చదవండి: పదేళ్ల క్రితం చేతిలో రూ.6,300.. ఇప్పుడేమో కోట్లు.. -
మోదీ కేబినెట్‌పై మిత్రపక్షాల కన్ను
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భారీ మెజారిటీతో అధికారంలోకి రావడంతో మంత్రివర్గ కూర్పుపై అన్నివర్గాల్లో ఆసక్తి నెలకొంది. మోదీ కేబినెట్లో చోటు కోసం బిహార్ సీఎం నితీశ్‌కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ యునైటెడ్(జేడీయూ), అన్నాడీఎంకే పార్టీలు గంపెడాశలు పెట్టుకున్నాయి. బిహార్‌లో బీజేపీతో పొత్తుకు ప్రతిఫలంగా మోదీ మంత్రివర్గంలో జేడీయూకు 1–2 మంత్రి పదవులు దక్కే అవకాశముందని తెలుస్తోంది. మే 30న ప్రధాని మోదీతో కలిసి వీరు ప్రమాణస్వీకారం చేస్తారని సమాచారం. దీంతో పాటు పశ్చిమబెంగాల్లో ఈసారి 18 లోక్‌సభ సీట్లు దక్కించుకున్న నేపథ్యంలో ఆ రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలను కేబినెట్లోకి తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. తమిళనాడులో పట్టుకోసం బీజేపీ కొన్నేళ్లుగా ప్రయత్నిస్తోంది. తాజా ఎన్నికల్లో ఒకే సీటు దక్కించుకున్న అన్నాడీఎంకేకు కూడా కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కవచ్చని తెలుస్తోంది. దీనివల్ల తమిళనాడులో బీజేపీ క్షేత్రస్థాయిలో బలపడుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఈ ఎన్నికల్లో 6 స్థానాలు దక్కించుకున్న ఎల్జేపీ అధినేత రామ్‌విలాస్ పాశ్వాన్‌తో పాటు బీజేపీ నేతలు రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కారీ, నిర్మలా సీతారామన్, రవిశంకర్ ప్రసాద్, పీయూష్ గోయల్, నరేంద్రసింగ్ తోమర్, ప్రకాశ్ జవదేకర్లు మరోసారి మంత్రి పదవులు దక్కించుకోనున్నట్లు సమాచారం. గాంధీనగర్ నుంచి భారీ మెజారిటీతో గెలుపొందిన బీజేపీ చీఫ్ అమిత్ షాకు కీలక మంత్రి బాధ్యతలు అప్పగిస్తారని వార్తలు వచ్చాయి. అయితే దీనిపై స్పందించేందుకు షా నిరాకరించారు. 2014 ఎన్నికల్లో తెలంగాణలో ఒక సీటుతో సరిపుచ్చుకున్న బీజేపీ, ఈసారి ఏకంగా నాలుగు సీట్లు దక్కించుకోవడంతో రాష్ట్రంలో పార్టీ విస్తరణకు బీజేపీ ప్రాధాన్యత ఇస్తోందనీ, కాబట్టి తెలంగాణ నుంచి కేబినెట్లో ఒకరికి చోటు దక్కే అవకాశముందంటున్నారు. -
దక్కకపాయె..
సాక్షిప్రతినిధి, ఖమ్మం: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో జిల్లాకు చోటు లభించలేదు. తొలివిడత విస్తరణలోనే జిల్లాకు మంత్రి పదవి లభిస్తుందని అందరూ భావించినా.. చివరి నిమిషంలోనైనా చోటు కల్పిస్తారని టీఆర్ఎస్ శ్రేణులు ఆశించినా.. చివరికి నిరాశే మిగిలింది. కొత్తగా కొలువుదీరిన మంత్రివర్గంలో సంఖ్య పరిమితంగా ఉండడం.. వివిధ సమీకరణాల ఆధారంగా కూర్పు ఉండడంతో తొలివిడతలో అవకాశం దక్కలేదని టీఆర్ఎస్ వర్గాలు పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి. రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లాలో ప్రత్యేక రాజకీయ పరిస్థితులు ఉండడం.. జిల్లాలో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసిన పువ్వాడ అజయ్‌కుమార్ మాత్రమే గెలవడంతో ఆయనకు మంత్రి పదవి ఖాయమని కొంతకాలంగా పార్టీ వర్గాల్లో ప్రచారం హోరెత్తింది. అజయ్ వర్గీయులు సైతం మంత్రి పదవి వస్తుందనే భరోసాతో ఉన్నా.. చివరి నిమిషంలో సీఎం కేసీఆర్ జిల్లా విషయంలో అనూహ్య నిర్ణయం తీసుకోవడంతో రాష్ట్రంలో ఒక్క ఖమ్మం జిల్లాకు మాత్రమే మంత్రివర్గంలో చోటు లభించలేదు. అయితే లోక్‌సభ ఎన్నికల తర్వాత మరోసారి మంత్రివర్గాన్ని పూర్తిస్థాయిలో విస్తరించే అవకాశం ఉన్నందున జిల్లా నుంచి అనూహ్య పరిణామాలు సంభవిస్తే తప్ప టీఆర్ఎస్కు ఏకైక ఎమ్మెల్యేగా ఉన్న అజయ్‌కుమార్‌కు మంత్రివర్గంలో చోటు లభించే అవకాశాలే ఎక్కువ అని పార్టీలోని ఆయన అభిమాన గణం విశ్లేషిస్తోంది. మంగళవారం జరిగిన మంత్రివర్గ విస్తరణకు ముందు ఖమ్మం జిల్లా నుంచి ఎవరికి స్థానం లభిస్తుందనే అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరిగినా.. చివరికి జిల్లాలో ఎవరికీ అవకాశం లభించని పరిస్థితి ఏర్పడింది. ‘సండ్ర’ స్థానంపై ప్రచారం.. సత్తుపల్లి నుంచి టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించిన సండ్ర వెంకటవీరయ్య టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటారని, ఆయనకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే సండ్ర టీఆర్ఎస్లో చేరిక అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో మంత్రివర్గ విస్తరణకు ఒక్కరోజు ముందు వరకు అజయ్‌కి మంత్రివర్గంలో అవకాశం ఇస్తారని జిల్లాలో ప్రచారం జరిగింది. అయితే జిల్లా రాజకీయ పరిస్థితులు, రాష్ట్ర రాజకీయ అవసరాలను బేరీజు వేసుకుని టీఆర్ఎస్ అధినేత మంత్రివర్గాన్ని కూర్పు చేశారని.. అందుకే జిల్లాకు తొలివిడతలో అవకాశం రాలేదని టీఆర్ఎస్ వర్గాలు అనుకూల వాదనలు వినిపిస్తున్నాయి. జిల్లాకు చెందిన మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క సీఎల్పీ నేతగా ఎన్నిక కావడంతో టీఆర్ఎస్ సైతం జిల్లాకు అదేస్థాయి ప్రాధాన్యం కల్పిస్తుందని రాజకీయంగా జిల్లాలో బలోపేతం కావడానికి వ్యూహ ప్రతివ్యూహాలు రూపొందిస్తుందని భరోసాగా ఉన్న టీఆర్ఎస్ శ్రేణుల్లో తొలి మంత్రివర్గ విస్తరణలో జిల్లాకు అవకాశం లేకపోవడం కొంత నిస్తేజాన్ని మిగిల్చింది. మరోసారి విస్తరించే మంత్రివర్గంలో జిల్లాకు స్థానం దక్కుతుందనే ఆశతో టీఆర్ఎస్ నేతలు ఉన్నారు. 2014లోనూ.. 2014లో ఏర్పడిన తొలి తెలంగాణ ప్రభుత్వంలోనూ ఖమ్మం జిల్లాకు మొదటి మంత్రివర్గ విస్తరణలో అవకాశం చిక్కలేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గాలకుగాను.. టీఆర్ఎస్ తరఫున ఆ సమయంలో కొత్తగూడెం నుంచి పోటీ చేసిన జలగం వెంకట్రావు విజయం సాధించారు. 2014, జూన్ 2న జరిగిన తొలి మంత్రివర్గ విస్తరణలో మాత్రం వెంకట్రావుకు స్థానం లభించలేదు. 2014, డిసెంబర్ 16వ తేదీన రెండోసారి మంత్రివర్గాన్ని విస్తరించిన సమయంలో జిల్లాకు ప్రాతినిధ్యం లభించింది. ఖమ్మం నియోజకవర్గం నుంచి ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిన తుమ్మల నాగేశ్వరరావు సెప్టెంబర్‌లో టీఆర్ఎస్లో చేరారు. సీఎం కేసీఆర్‌కు సన్నిహితుడిగా పేరొందిన తుమ్మలకు రెండో విడత మంత్రివర్గ విస్తరణలో స్థానం లభించింది. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజులకు ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత పాలేరు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున విజయం సాధించి.. తెలంగాణ తొలి ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించారు. గతంలోనూ టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో సైతం ఖమ్మం జిల్లాకు తొలి మంత్రివర్గ విస్తరణలో అవకాశం లభించని సంఘటనలు ఉన్నాయని, అయితే జిల్లాకు రాజకీయంగా గల ప్రాధాన్యత దృష్ట్యా.. పార్టీ అవసరాలను పరిగణనలోకి తీసుకుని జిల్లాకు మంత్రివర్గంలో స్థానం లేని లోటును తీర్చే దిశగా ప్రభుత్వం కసరత్తు చేసే అవకాశం ఉందని.. మంత్రివర్గ విస్తరణ మరోసారి జరిగేలోపే జిల్లా నేతలను కేబినెట్ స్థాయి పదవులు వరించే అవకాశం ఉన్నట్లు సైతం పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కేవలం ఖమ్మం జిల్లాకు మాత్రమే మంత్రివర్గంలో స్థానం కల్పించకపోవడంపై సైతం రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో నెలకొన్న వర్గపోరు కారణంగా పార్టీ ఒక స్థానానికే పరిమితం కావాల్సి వచ్చిందని భావిస్తున్న టీఆర్ఎస్ అధిష్టానం.. కొంత వేచిచూసే ధోరణితో ఉన్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. -
నాయినికి హోం.. ఈటెలకు ఆర్థిక
-
నాయినికి హోం.. ఈటెలకు ఆర్థిక
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు తన మంత్రి వర్గ సహచరులకు శాఖలను కేటాయించారు. మున్సిపల్, విద్యుత్ శాఖలతో పాటు అన్ని సంక్షేమ శాఖలను కేసీఆర్ తన వద్దే ఉంచుకున్నారు. సోమవారం ఉదయం కేసీఆర్‌తో పాటు మరో 11మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఇందులో ఇద్దరిని ఉప ముఖ్యమంత్రులుగా నియమించారు. మంత్రులకు కేటాయించిన శాఖల వివరాలిలా ఉన్నాయి. మంత్రులు-శాఖలు *మహ్మద్ అలీ( మైనారీటి)- డీప్యూటీ సీఎం, రెవెన్యూ *డా.రాజయ్య-డిప్యూటీ సీఎం, వైద్య శాఖ *ఈటెల రాజేందర్- ఆర్థిక శాఖ *హరీష్ రావు- భారీ నీటి పారుదల, శాసనసభ వ్యవహారాలు కేటీఆర్-పంచాయతీరాజ్, ఐటీ *మహేందర్ రెడ్డి- రవాణ *పోచారం శ్రీనివాస్‌రెడ్డి- వ్యవసాయం *నాయిని నర్సింహారెడ్డి-హోంశాఖ *జగదీశ్వర్‌రెడ్డి- విద్యాశాఖ *జోగు రామన్న-అటవీ, పర్యాటక * పద్మారావు-ఎక్సైజ్ శాఖ -
తెలంగాణ మంత్రుల శాఖలు?
హైదరాబాద్ : కేసీఆర్ మంత్రివర్గంలో శాఖల కేటాయింపు ఈ క్రింది విధంగా ఉంటుందని సమాచారం. తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌తో పాటు మరో 11మంది మంత్రులుగా సోమవారం ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. కాగా ఈనెల 8వ తేదీన మరోసారి మంత్రివర్గ విస్తరణ జరగనుంది. మరో ఆరుగురిని కేసీఆర్ తన మంత్రివర్గంలో తీసుకోనున్నారు. శాఖల కేటాయింపు! *మహ్మద్ అలీ( మైనారీటి)- మైనార్టీ డీప్యూటీ సీఎం, మైనార్టీ సంక్షేమం *డా.రాజయ్య-డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్యశాఖ? *ఈటెల రాజేందర్- ఆర్థిక శాఖ? *హరీష్ రావు-విద్యుత్, నీటి పారుదలశాఖ? *మహేందర్ రెడ్డి-క్రీడలు, యువజన వ్యవహారాలు? *కేటీఆర్-ఐటీ, పరిశ్రమల శాఖ? *పోచారం శ్రీనివాస్‌రెడ్డి- పంచాయతీరాజ్? *నాయిని నర్సింహారెడ్డి-హోంశాఖ? *జగదీశ్వర్‌రెడ్డి- రోడ్లు, భవనాలు? *జోగు రామన్న-సాంఘిక సంక్షేమం? * పద్మారావు-ఎక్సైజ్ శాఖ?... కాగా మిగిలిన శాఖలను కేసీఆర్ తన ఆధీనంలోనే ఉంచుకోనున్నట్లు తెలుస్తోంది.