ts emcet
-
ఈ నెల 21న తెలంగాణ ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ EAPCET(ఎంసెట్) నోటిఫికేషన్‌ను ఈ నెల 21న విడుదల చేయనున్నట్లు సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ డీన్ కుమార్ వెల్లడించారు. 21న నోటిఫికేషన్ విడుదల చేసి.. 26వ తేదీ నుంచి దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరించనున్నారు. ఇక.. ఏప్రిల్ 6 తేదీ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ. మే 9వ తేదీ నుంచి 12 తేదీ వరకు ఆన్లైన్లో ఎప్‌సెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది టీఎస్ ఎప్‌సెట్‌ను జేఎన్టీయూ నిర్వహించనుంది. ఈ నెల 6వ తేదీన ఎప్‌సెట్ తొలి సమావేశం.. తెలంగాణ ఉన్నత విద్యా కార్యాలయంలో జరగనుంది. చదవండి: తెలంగాణ ఎంసెట్ పేరు మార్పు.. పరీక్ష తేదీల షెడ్యూల్ విడుదల -
కాస్త ముందుగానే తెలంగాణ ఎంసెట్ ఫలితాలు.. కారణం ఇదే..
సాక్షి, హైదరాబాద్: రేపు(గురువారం) ఉదయం తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు విడుదల చేస్తామని ప్రకటించిన అధికారులు.. సమయంలో మార్పులు చేశారు. ఉదయం 9:30 గంటలకే తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల చేయనున్నారు. కలెక్టర్లతో సీఎం కాన్ఫరెన్స్ కారణంగా ఫలితాల సమయంలో మార్పు చేసినట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ కార్యదర్శి (ఉన్నత విద్య) వి.కరుణ, కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్, తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి, జేఎన్టీయూ హైదరాబాద్ వీసీ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. చదవండి: సివిల్స్‌లో మెరిసిన తెలుగు తేజాలు -
తెలంగాణ ఎంసెట్: ‘ఒక్క నిమిషం నిబంధన అమల్లో ఉంటుంది’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 4 నుంచి ఎంసెట్ ప్రవేశ పరీక్షలు జరుగుతాయని తెలంగాణ ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ తెలిపారు. తెలంగాణలో 82, ఏపీలో 23 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం12 గంటల వరకు మొదటి షెషన్, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్ ఉంటుందని తెలిపారు. ఒక్క నిమిషం నిబంధన అమల్లో ఉంటుందని పేర్నొన్నారు. రెండు గంటల ముందు నుంచే పరీక్ష కేంద్రంలో పలికి అనుమతిస్తామని చెప్పారు. హాల్ టికెట్‌పై లొకేషన్ కూడా ఇస్తున్నామని వెల్లడించారు. విద్యార్థులు ఒక రోజు ముందే టెస్ట్ సెంటర్ తెలుసుకోవాలని అన్నారు. ఎంసెట్‌లో ఇంటర్ సిలబస్ వెయిటేజ్ లేదని, గతంలో వెయిటేజి ఉండేదని కానీ ఇప్పుడు లేదని తెలిపారు. కోవిడ్‌తో ఇబ్బందులు పడ్డ విద్యార్థులు నష్టపోకూడదని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద కోవిడ్ ప్రోటోకాల్ పాటించాలని, సెల్ఫ్ డిక్లరేషన్ ఫారం ఉంటుందని విద్యార్థులు ఆరోగ్య అంశాలు ఫిల్ చేసి ఇవ్వాలని చెప్పారు. కోవిడ్ వచ్చిన విద్యార్థుల కోసం పరీక్ష రీషెడ్యూల్ చేస్తామని, లేదంటే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. -
‘సాక్షి’ మాక్ ఎంసెట్, నీట్ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: సాక్షి మీడియా, నారాయణ విద్యాసంస్థలు కలసి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన సాక్షి మాక్ టీఎస్ఎంసెట్, నీట్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మాక్ ఎంసెట్‌లో 148 మార్కులతో కె.రిష్యంత్ మొదటి ర్యాంకు కైవసం చేసుకోగా.. 132 మార్కులతో బి.సాత్విక్ రెండో స్థానం సాధించాడు. తర్వాతి స్థానాల్లో రాడ్ షేక్ (3వ ర్యాంకు), ఎ.వికాస్‌రెడ్డి (4వ ర్యాంకు), కె.అనన్యరెడ్డి (5వ ర్యాంకు), ఎం.శ్రీసాయి మణిమాల (6వ ర్యాంకు), పి.సుమన్ (7వ ర్యాంకు), పల్ల వెంకటసాయి వంశీ విజయ్ (8వ ర్యాంకు), సాయి వివేక్ ఎం (9వ ర్యాంకు), స్వప్నిక్ (10వ ర్యాంకు) నిలిచారు. మాక్ నీట్లో మొత్తం 720 మార్కులకు 605 మార్కులు సాధించిన బీవీఎన్ తరుణ్ వర్మ మొదటి ర్యాంకు సాధించగా.. 586 మార్కులతో జైసాయి భారతమ్ అభిరాజ్ రెండో స్థానంలో నిలిచాడు. తర్వాతి స్థానాల్లో జనగాల సాయి సుప్రియ (3వ ర్యాంకు), గరిమెళ్ల విశ్వనాథ శర్మ (4వ ర్యాంకు), కొండా సాయి నిఖిత (5వ ర్యాంకు), నూతన్ సాయి ప్రణీత్ (6వ ర్యాంకు), చలసాని వర్ధన్ (7వ ర్యాంకు), మేడిచర్ల సిరి సన్మయి (8వ ర్యాంకు), శ్రీశ్రీకర్ (9వ ర్యాంకు), ఎ.అక్షితారెడ్డి (10వ ర్యాంకు) నిలిచారు. ఈ రెండు పరీక్షల్లో మొదటి పది స్థానాలు సాధించిన విద్యార్థులకు త్వరలో బహుమతులు అందజేస్తారు. ఈ నెల 15న రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన సాక్షి మాక్ ఎంసెట్‌కు 15,650 మంది, ఈ నెల 22న నిర్వహించిన సాక్షి మాక్ నీట్‌కు 10,350 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ పరీక్షలకు విజ్ఞాన్ యూనివర్సిటీ అసోసియేట్ స్పాన్సర్‌గా వ్యవహరించింది. ఈ పరీక్షల ఫలితాలను http://www.sakshieducation. com/లో చూడొచ్చు. -
'తెలంగాణ ఎంసెట్‌పై తేలుస్తాం'
హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్‌పై వస్తున్న ఫిర్యాదుల విషయంలో విచారణకు ఆదేశిస్తామని మంత్రి లక్ష్మా రెడ్డి హామీ ఇచ్చారు. అన్ని అనుమానాలను నివృత్తి చేస్తామని చెప్పారు. తెలంగాణ ఎంసెట్‌లో అవకతవకలు జరిగాయంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఏపీ ఎంసెట్‌లో వేలల్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులు తెలంగాణ ఎంసెట్‌లో మాత్రం వందల్లో ర్యాంకులు తెచ్చుకున్నారని తల్లిదండ్రులు ఆరోపించారు. కోచింగ్ సెంటర్లలో కూడా ప్రతిభ అంతతమాత్రమేనని తెలియడంతో తల్లిదండ్రులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఆందోళనకు దిగారు. దీంతో అందరి అనుమానాలు నివృత్తి చేస్తామని లక్ష్మారెడ్డి చెప్పారు.