సాక్షి, హైదరాబాద్: సాక్షి మీడియా, నారాయణ విద్యాసంస్థలు కలసి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన సాక్షి మాక్ టీఎస్‌ఎంసెట్, నీట్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మాక్ ఎంసెట్‌లో 148 మార్కులతో కె.రిష్యంత్ మొదటి ర్యాంకు కైవసం చేసుకోగా.. 132 మార్కులతో బి.సాత్విక్ రెండో స్థానం సాధించాడు. తర్వాతి స్థానాల్లో రాడ్ షేక్ (3వ ర్యాంకు), ఎ.వికాస్‌రెడ్డి (4వ ర్యాంకు), కె.అనన్యరెడ్డి (5వ ర్యాంకు), ఎం.శ్రీసాయి మణిమాల (6వ ర్యాంకు), పి.సుమన్ (7వ ర్యాంకు), పల్ల వెంకటసాయి వంశీ విజయ్ (8వ ర్యాంకు), సాయి వివేక్ ఎం (9వ ర్యాంకు), స్వప్నిక్ (10వ ర్యాంకు) నిలిచారు.
మాక్ నీట్‌లో మొత్తం 720 మార్కులకు 605 మార్కులు సాధించిన బీవీఎన్ తరుణ్ వర్మ మొదటి ర్యాంకు సాధించగా.. 586 మార్కులతో జైసాయి భారతమ్ అభిరాజ్ రెండో స్థానంలో నిలిచాడు. తర్వాతి స్థానాల్లో జనగాల సాయి సుప్రియ (3వ ర్యాంకు), గరిమెళ్ల విశ్వనాథ శర్మ (4వ ర్యాంకు), కొండా సాయి నిఖిత (5వ ర్యాంకు), నూతన్ సాయి ప్రణీత్ (6వ ర్యాంకు), చలసాని వర్ధన్ (7వ ర్యాంకు), మేడిచర్ల సిరి సన్మయి (8వ ర్యాంకు), శ్రీశ్రీకర్ (9వ ర్యాంకు), ఎ.అక్షితారెడ్డి (10వ ర్యాంకు) నిలిచారు.
ఈ రెండు పరీక్షల్లో మొదటి పది స్థానాలు సాధించిన విద్యార్థులకు త్వరలో బహుమతులు అందజేస్తారు. ఈ నెల 15న రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన సాక్షి మాక్ ఎంసెట్‌కు 15,650 మంది, ఈ నెల 22న నిర్వహించిన సాక్షి మాక్ నీట్‌కు 10,350 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ పరీక్షలకు విజ్ఞాన్ యూనివర్సిటీ అసోసియేట్ స్పాన్సర్‌గా వ్యవహరించింది. ఈ పరీక్షల ఫలితాలను http://www.sakshieducation. com/లో చూడొచ్చు.
‘సాక్షి’ మాక్ ఎంసెట్, నీట్ ఫలితాలు విడుదల
Published Sat, Apr 28 2018 1:54 AM | Last Updated on Sat, Oct 20 2018 5:44 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment