Mac EAMCET
-
‘సాక్షి’ మాక్ ఎంసెట్, నీట్ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: సాక్షి మీడియా, నారాయణ విద్యాసంస్థలు కలసి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన సాక్షి మాక్ టీఎస్ఎంసెట్, నీట్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మాక్ ఎంసెట్‌లో 148 మార్కులతో కె.రిష్యంత్ మొదటి ర్యాంకు కైవసం చేసుకోగా.. 132 మార్కులతో బి.సాత్విక్ రెండో స్థానం సాధించాడు. తర్వాతి స్థానాల్లో రాడ్ షేక్ (3వ ర్యాంకు), ఎ.వికాస్‌రెడ్డి (4వ ర్యాంకు), కె.అనన్యరెడ్డి (5వ ర్యాంకు), ఎం.శ్రీసాయి మణిమాల (6వ ర్యాంకు), పి.సుమన్ (7వ ర్యాంకు), పల్ల వెంకటసాయి వంశీ విజయ్ (8వ ర్యాంకు), సాయి వివేక్ ఎం (9వ ర్యాంకు), స్వప్నిక్ (10వ ర్యాంకు) నిలిచారు. మాక్ నీట్లో మొత్తం 720 మార్కులకు 605 మార్కులు సాధించిన బీవీఎన్ తరుణ్ వర్మ మొదటి ర్యాంకు సాధించగా.. 586 మార్కులతో జైసాయి భారతమ్ అభిరాజ్ రెండో స్థానంలో నిలిచాడు. తర్వాతి స్థానాల్లో జనగాల సాయి సుప్రియ (3వ ర్యాంకు), గరిమెళ్ల విశ్వనాథ శర్మ (4వ ర్యాంకు), కొండా సాయి నిఖిత (5వ ర్యాంకు), నూతన్ సాయి ప్రణీత్ (6వ ర్యాంకు), చలసాని వర్ధన్ (7వ ర్యాంకు), మేడిచర్ల సిరి సన్మయి (8వ ర్యాంకు), శ్రీశ్రీకర్ (9వ ర్యాంకు), ఎ.అక్షితారెడ్డి (10వ ర్యాంకు) నిలిచారు. ఈ రెండు పరీక్షల్లో మొదటి పది స్థానాలు సాధించిన విద్యార్థులకు త్వరలో బహుమతులు అందజేస్తారు. ఈ నెల 15న రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన సాక్షి మాక్ ఎంసెట్‌కు 15,650 మంది, ఈ నెల 22న నిర్వహించిన సాక్షి మాక్ నీట్‌కు 10,350 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ పరీక్షలకు విజ్ఞాన్ యూనివర్సిటీ అసోసియేట్ స్పాన్సర్‌గా వ్యవహరించింది. ఈ పరీక్షల ఫలితాలను http://www.sakshieducation. com/లో చూడొచ్చు. -
ఏప్రిల్ 16న మాక్ ఎంసెట్, 23న నీట్
‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహణ సాక్షి, హైదరాబాద్: సన్నద్ధతతోనే సగం విజయం లభిస్తుంది. ముందు మీ శక్తి, సామర్థ్యాలను మీకు మీరుగా అంచనా వేసుకుని దానికి అనుగుణంగా చక్కని ప్రణాళికను సిద్ధం చేసుకుంటే కీలక సమయం లో విజయం సాధించడం సులభతరమవుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో లక్షలాది మంది ఇంజనీరింగ్, మెడికల్ ఔత్సాహిక విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేలా సాక్షి మీడియా గ్రూపు మాక్ ఎంసెట్–17, నీట్–17 ప్రవేశ పరీక్షలను ఏప్రిల్ 16, 23వ తేదీల్లో నిర్వహించనుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని జిల్లా కేంద్రాల్లో ఉదయం 9.30 గంటల నుంచి 12.30 గంటల వరకు ఈ పరీక్ష జరుగుతుంది. గతేడాది నిర్వహించిన మాక్ ఎంసెట్‌కు దాదాపు 20 వేల మంది హాజరై తమ ప్రతిభకు పదును పెట్టుకున్నారు. అదే స్ఫూర్తితో ఈ ఏడాది ఎంసెట్‌తోపాటు, మొదటిసారిగా నీట్ పరీక్షలను కూడా నిర్వహించేందుకు సాక్షి మీడియా గ్రూప్ నిర్ణయించింది. ఈ రెండు పరీక్షల ప్రశ్నపత్రాలను సాక్షి భవితకు సంబంధించిన సీనియర్ లెక్చరర్లు రూపొం దిస్తారు. ఎంసెట్ పరీక్షకు మూడు వారాల ముందు, నీట్‌కు రెండు వారాల ముందు నిర్వహించే ఈ నమూనా పరీక్షల్లో విద్యార్థులు తమ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడమే కాక, ప్రతిభను పెంపొందించుకోవడానికి దోహద పడుతుంది. ఈ మాక్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు ఆకర్షణీయమైన బహుమతులు కూడా అందుకోవచ్చు. -
‘సాక్షి’ మాక్ ఎంసెట్ విజేతలకు బహుమతులు
హైదరాబాద్ : ‘సాక్షి’ మాక్ ఎంసెట్ విద్యార్థుల భవితకు బంగారు బాట వేస్తుందని ‘సాక్షి’ టీవీ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ డెరైక్టర్ రాణిరెడ్డి అన్నారు. ‘సాక్షి’ టీవీ స్టూడియోలో బుధవారం ‘సాక్షి’ మీడియా గ్రూప్, ఎస్వీ సెట్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన మాక్ ఎంసెట్ - 2015లో హైదరాబాద్ రీజియన్‌లో విజేతలుగా నిలిచిన ర్యాంకర్లకు నగదు బహుమతిని అందజేశారు.ఈ సందర్భంగా రాణిరెడ్డి మాట్లాడుతూ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మాక్ ఎంసెట్‌కు విశేష స్పందన లభించిందన్నారు. విద్యార్థులకు ప్రయోజనం చేకూరే ఇలాంటి పరీక్షలు రాబోయే రోజుల్లో కూడా నిర్వహిస్తామన్నారు. ‘సాక్షి’ ఫైనాన్స్ , అడ్మినిస్ట్రేషన్ డెరైక్టర్ వైఈపీ రెడ్డి మాట్లాడుతూ ‘సాక్షి’ పత్రిక మొదటి నుంచి విద్యార్థుల పక్షపాతిగా నిలుస్తోందన్నారు. ‘సాక్షి’ మార్కెటింగ్ డెరైక్టర్ కె.ఆర్.పి. రెడ్డి మాట్లాడుతూ ఈ మాక్ ఎంసెట్‌కు ఎస్వీ సెట్ వారు స్పాన్సరర్స్‌గా వ్యవహరించారని తెలిపారు. సెంట్రల్ ఆంధ్రా రీజియన్ స్పాన్సర్స్‌గా నలంద ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ వ్యవహరించిందన్నారు. తిరుపతి వరకు తిరుపతి పట్టణ శ్రీరామ ఇనిస్టిట్యూట్ వారు సహకరించారన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రీజియన్‌లో మాక్ ఎంసెట్‌లో విజేతలైన పది ర్యాంక్‌ల లోపువారికి నగదు బహుమతులు అందజేశారు. అందులో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వారికి రూ.15 వేలు, రూ. 10 వేలు, రూ.5 వేలు నగదు మొత్తాన్ని, ప్రశంసాపత్రం అందజేశారు. మాక్ ఎంసెట్ ఇంజనీరింగ్‌లో డి. తేజ వర్దన్ రెడ్డి(ఫస్ట్ ర్యాంక్) , ఎం. రాహుల్ (5వ ర్యాంక్), జి. రాధ రేవతి (8వ ర్యాంక్), బి.అనుదీప్ రెడ్డి( 9వ ర్యాంక్), ఎ. అనుదీప్( 11వ ర్యాంక్), మెడికల్ విభాగంలో కేపీ అనూహ్య(ఫస్ట్ ర్యాంక్), ఎస్ ప్రణయ్ రెడ్డి( 2వ ర్యాంక్), కె. మౌక్తిక ( 3వ ర్యాంక్), జి. నిఖిల్ రెడ్డి( 5వ ర్యాంక్), ఎ. ప్రియాంక( 6వ ర్యాంక్), ఎ. పుష్ప చందన( 9వ ర్యాంక్) సాధించారు. వీరికి ‘సాక్షి’ టీవీ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ డెరైక్టర్ రాణిరెడ్డి, సాక్షి ఫైనాన్స్, అడ్మినిస్ట్రేషన్ డెరైక్టర్ వైఈపీ రెడ్డిల చేతుల మీదుగా నగదు బహుమతిని అందజేశారు. -
సాక్షి మాక్ ఎంసెట్ టాపర్లు వీరే...
హైదరాబాద్: విద్యార్థుల్లో ఆందోళనను పోగొట్టడంతో పాటు వారి సామర్థ్యాన్ని పరీక్షించుకోవడం కోసం ‘సాక్షి’ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహించిన మాక్ ఎంసెట్ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఇందులో తెలంగాణ రాష్ట్రానికి గాను ఇంజనీరింగ్ విభాగంలో డి.తేజవర్ధన్‌రెడ్డి మొదటి స్థానంలో నిలవగా.. జె.అరవింద్ రెండో ర్యాంకు, దేవన్ష్గుప్తా మూడో ర్యాంకు సాధించారు. మెడిసిన్ విభాగంలో కె.పి.అనూహ్య తొలి ర్యాంకు సాధించగా, ఎస్.ప్రణయ్‌రెడ్డి రెండో స్థానంలో, కె.మౌక్తిక మూడో స్థానంలో నిలిచారు. దీనిలో మొదటి ర్యాంకులు సాధించిన రాష్ట్ర విద్యార్థులకు త్వరలో నగదు బహుమతులు అందజేయనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. మొదటి బహుమతిగా రూ.15 వేలు, రెండో బహుమతిగా రూ.10 వేలు, మూడో బహుమతిగా రూ.5వేలతో పాటు నాలుగు నుంచి పదో ర్యాంకు వరకు సాధించినవారికి రూ.3 వేల చొప్పున బహుమతిగా అందజేయనున్నట్లు తెలిపారు. సాక్షి మాక్ ఎంసెట్ పూర్తి ఫలితాలను sakshieducation.com వెబ్సైట్లో చూడవచ్చు. -
సాక్షి ఆధ్వర్యంలో మాక్ ఎంసెట్
విశాఖపట్నం: రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్ష మంది ఇంజినీరింగ్, మెడిసిన్ ఔత్సాహిక విద్యార్థుల ప్రయోజనార్థం సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో త్వరలో మాక్ ఎంసెట్ జరగనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో అన్ని జిల్లా కేంద్రాల్లో ఏప్రిల్ 12వ తేదీ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ మాక్ ఎంసెట్ నిర్వహించనుంది. శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (అటానమస్) చిత్తూరు...ఈ మాక్ ఎంసెట్‌కు ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. మే నెలలో జరగనున్న ఎంసెట్‌కు సరిగ్గా నెల రోజుల ముందు సాక్షి నిర్వహించనున్న ఈ మాక్ ఎంసెట్ ద్వారా విద్యార్థులు తమ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసుకోవడమే కాకుండా...తమ ప్రతిభను పెంపొందించుకోవచ్చు. ప్రశ్న పత్రాలను తమ సామర్థ్యాన్ని అంచనా వేసుకుని ప్రిపరేషన్‌ను మరింత మెరుగు పరుచుకునేందుకు వీలవుతుంది. దీంతో పాటు రెండు రాష్ట్రాల్లో వేర్వేరుగా మెరుగైన ప్రతిభ చూపిన మొదటి 10 ర్యాంకర్లకు నగదు బహుమతులుంటాయి. సాక్షి మాక్ ఎంసెట్‌కు హాజరుకావాలనుకునే విద్యార్థులు ఏప్రిల్ రెండో తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులను మార్చి రెండో తేదీ నుంచి ఎంపిక చేసి సాక్షి కార్యాలయాల్లో స్వీకరిస్తున్నారు. దరఖాస్తు వెల రూ.75తో పాటు రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలు తీసుకుని వచ్చి వెంటనే హాల్‌టికెట్ పొందవచ్చు. -
సాక్షి, ఎస్‌వీసీఈటీ మాక్ ఎంసెట్
రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షల మంది ఇంజినీరింగ్, మెడిసిన్ ఔత్సాహిక విద్యార్థుల ప్రయోజనార్థం సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో త్వరలో మాక్ ఎంసెట్ జరుగనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో అన్ని జిల్లా కేంద్రాల్లో ఏప్రిల్ 12న ఉదయం 9.30 గంటల నుంచి 12.30 గంటల వరకు సాక్షి మాక్ ఎంసెట్ నిర్వహించనుంది. శ్రీవెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ(అటానమస్) చిత్తూరు ఈ మాక్ ఎంసెట్‌కు ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. మే నెలలో జరుగనున్న ఎంసెట్‌కు సరిగ్గా నెల రోజుల ముందు సాక్షి నిర్వహించనున్న ఈ మాక్ ఎంసెట్ ద్వారా విద్యార్థులు తమ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసుకోవడమే కాకుండా, తమ ప్రతిభను పెంపొందించుకోవచ్చు. ప్రశ్న పత్రాలను తమ సామర్థ్యాన్ని అంచనా వేసుకుని ప్రిపరేషన్‌ను మరింత మెరుగుపరచుకునేందుకు వీలవుతుంది. దీంతో పాటు రెండు రాష్ట్రాల్లో వేర్వేరుగా మెరుగైన ప్రతిభ చూపిన మొదటి 10 ర్యాంకర్లకు నగదు బహుమతులుంటాయి. సాక్షి మాక్ ఎంసెట్‌కు హాజరు కావాలనుకునే విద్యార్థులు ఏప్రిల్ 2లోపు దరఖాస్తుచేసుకోవాలి. దరఖాస్తు వెల రూ.75తో పాటు రెండు పాస్‌పోర్టుసైజు ఫోటోలు తీసుకుని వస్తే వెంటనే హాల్ టికెట్ పొందవచ్చు. -
సాక్షి మీడియా గ్రూప్, ఎస్‌వీసీఈటీ ఆధ్వర్యంలో ఏప్రిల్ 12న మాక్ ఎంసెట్
సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లోని లక్షలాది మంది ఇంజనీరింగ్, మెడికల్ ఔత్సాహిక విద్యార్థులకు ప్రయోజనం కల్పించేలా ‘సాక్షి’ మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో మాక్ ఎంసెట్ జరుగనుంది. ఇరు రాష్ట్రాల్లోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఏప్రిల్ 12న ఉదయం 9.30 గంటల నుంచి 12.30 వరకు ఈ మాక్ ఎంసెట్‌ను నిర్వహిస్తారు. ఇందులో రెండు రాష్ట్రాలకు సంబంధించి వేర్వేరుగా ప్రతిభ కనబరిచిన టాప్ 10 మంది విద్యార్థులకు నగదు బహుమతులు ఉంటాయి. ఈ మాక్ ఎంసెట్ దరఖాస్తులు ఈ నెల 12వ తేదీ నుంచి ఎంపిక చేసిన సాక్షి కార్యాలయాల్లో లభ్యమవుతాయి. అభ్యర్థులు దరఖాస్తు ఫారం ధర రూ. 75తో పాటు రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలను వెంట తీసుకువస్తే వెంటనే హాల్‌టికెట్ పొందవచ్చు. దరఖాస్తులకు ఏప్రిల్ 2వ తేదీ తుది గడువు. దరఖాస్తులు లభించే కేంద్రాలు, పరీక్షా కేంద్రాల వివరాలను www.sakshieducation.comలో తెలుసుకోవచ్చు. ఇంటర్ జూనియర్ కాలేజీల నిర్వాహకులు ఏకమొత్తంగా ఈ మాక్ ఎంసెట్‌కు రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే 040-23256138 నంబర్లో సంప్రదించవచ్చు.