‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహణ
సాక్షి, హైదరాబాద్: సన్నద్ధతతోనే సగం విజయం లభిస్తుంది. ముందు మీ శక్తి, సామర్థ్యాలను మీకు మీరుగా అంచనా వేసుకుని దానికి అనుగుణంగా చక్కని ప్రణాళికను సిద్ధం చేసుకుంటే కీలక సమయం లో విజయం సాధించడం సులభతరమవుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో లక్షలాది మంది ఇంజనీరింగ్, మెడికల్ ఔత్సాహిక విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేలా సాక్షి మీడియా గ్రూపు మాక్ ఎంసెట్–17, నీట్–17 ప్రవేశ పరీక్షలను ఏప్రిల్ 16, 23వ తేదీల్లో నిర్వహించనుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని జిల్లా కేంద్రాల్లో ఉదయం 9.30 గంటల నుంచి 12.30 గంటల వరకు ఈ పరీక్ష జరుగుతుంది.
గతేడాది నిర్వహించిన మాక్ ఎంసెట్‌కు దాదాపు 20 వేల మంది హాజరై తమ ప్రతిభకు పదును పెట్టుకున్నారు. అదే స్ఫూర్తితో ఈ ఏడాది ఎంసెట్‌తోపాటు, మొదటిసారిగా నీట్ పరీక్షలను కూడా నిర్వహించేందుకు సాక్షి మీడియా గ్రూప్ నిర్ణయించింది. ఈ రెండు పరీక్షల ప్రశ్నపత్రాలను సాక్షి భవితకు సంబంధించిన సీనియర్ లెక్చరర్లు రూపొం దిస్తారు. ఎంసెట్ పరీక్షకు మూడు వారాల ముందు, నీట్‌కు రెండు వారాల ముందు నిర్వహించే ఈ నమూనా పరీక్షల్లో విద్యార్థులు తమ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడమే కాక, ప్రతిభను పెంపొందించుకోవడానికి దోహద పడుతుంది. ఈ మాక్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు ఆకర్షణీయమైన బహుమతులు కూడా అందుకోవచ్చు.
ఏప్రిల్ 16న మాక్ ఎంసెట్, 23న నీట్
Published Sun, Jan 22 2017 12:26 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM
Advertisement