నేడే సాక్షి మాక్ ఎంసెట్
సాక్షి, హైదరాబాద్: ‘సాక్షి మాక్ ఎంసెట్’ పరీక్షను ఆదివారం నిర్వహించనున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఉదయం 9.30 గంటల నుంచి 12.30 గంటల వరకు ఈ పరీక్ష జరుగనుంది. తెలుగు రాష్ట్రాల్లోని లక్షల మంది ఇంజినీరింగ్, మెడిసిన్ ఔత్సాహిక విద్యార్థుల ప్రయోజనార్థం ‘సాక్షి మీడియా గ్రూప్’ ఆధ్వర్యంలో ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ లండ్ టెక్నాలజీ (అటానమస్), చిత్తూరు ఈ మాక్ ఎంసెట్‌కు ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. రెండు రాష్ట్రాల్లో వేర్వేరుగా మెరుగైన ప్రతిభ చూపిన మొదటి 10మంది ర్యాంకర్లకు నగదు బహుమతులుంటాయి.