మెదక్: తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా నిర్వహించిన ఎంసెట్-2015 పరీక్షల్లో మెతుకుసీమ ముత్యాలు మెరిశాయి. మెడిసిన్ విభాగంలో మెరుగైన ర్యాంకులతో బాలికలు అదరగొట్టగా.. ఇంజినీరింగ్ విభాగంలో తామేమి తీసిపోమంటూ బాలురు తమ సత్తా చాటారు. మెడిసిన్‌లో చిన్నశంకరంపేట మండలం కొర్విపల్లి గ్రామానికి చెందిన మైనంపల్లి కీర్తన రాష్ట్రస్థాయిలో 39వ ర్యాంకు సాధించి జిల్లాలో టాపర్‌గా నిలిచారు.
మెదక్ పట్టణానికి చెందిన డాక్టర్ సురేష్ కుమారుడు వినయ్‌చంద్ర మెడిసిన్ విభాగంలో 360వ ర్యాంకు సాధించగా, గజ్వేల్ పట్టణానికి చెందిన ఎన్.స్నేహ మెడిసిన్ విభాగంలో 387వ ర్యాంకు, పటాన్‌చెరుకు చెందిన చరిష్మా మెడిసిన్‌లో 390వ ర్యాంకు, సిద్దిపేటకు చెందిన సాయిస్ఫూర్తి మెడిసిన్‌లో 465వ ర్యాంకును సాధించి తమ సత్తా చాటారు.
కాగా ఇంజినీరింగ్‌లో సిద్దిపేట పట్టణానికి చెందిన కాతం ప్రవీణ్ 29వ ర్యాంకు, మెదక్ మండలం అవుసులపల్లికి చెందిన అక్షయ్ 31వ ర్యాంకు, నర్సాపూర్‌కు చెందిన ఉదయ్ కిరణ్ 1,220వ ర్యాంకు సాధించారు. ఇదిలా ఉండగా.. జిల్లాలో 5,637 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇంజినీరింగ్‌లో 3,589 మంది, మెడిసిన్‌లో 2,048 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. నిమిషం ఆలస్యంతో నలుగురు పరీక్షకు దూరమైన విషయం విదితమే..
మెతుకుసీమ ముత్యాలు
Published Fri, May 29 2015 1:06 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM
Advertisement