సాక్షి మాక్ ఎంసెట్ టాపర్లు వీరే... | they are mac eamcet toppers | Sakshi
Sakshi News home page

సాక్షి మాక్ ఎంసెట్ టాపర్లు వీరే...

Published Wed, May 6 2015 1:26 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

సాక్షి మాక్ ఎంసెట్ టాపర్లు వీరే... - Sakshi

సాక్షి మాక్ ఎంసెట్ టాపర్లు వీరే...

హైదరాబాద్: విద్యార్థుల్లో ఆందోళనను పోగొట్టడంతో పాటు వారి సామర్థ్యాన్ని పరీక్షించుకోవడం కోసం ‘సాక్షి’ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహించిన మాక్ ఎంసెట్ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఇందులో తెలంగాణ రాష్ట్రానికి గాను ఇంజనీరింగ్ విభాగంలో డి.తేజవర్ధన్‌రెడ్డి మొదటి స్థానంలో నిలవగా.. జె.అరవింద్ రెండో ర్యాంకు, దేవన్ష్‌గుప్తా మూడో ర్యాంకు సాధించారు. మెడిసిన్ విభాగంలో కె.పి.అనూహ్య తొలి ర్యాంకు సాధించగా, ఎస్.ప్రణయ్‌రెడ్డి రెండో స్థానంలో, కె.మౌక్తిక మూడో స్థానంలో నిలిచారు.


దీనిలో మొదటి ర్యాంకులు సాధించిన రాష్ట్ర విద్యార్థులకు త్వరలో నగదు బహుమతులు అందజేయనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. మొదటి బహుమతిగా రూ.15 వేలు, రెండో బహుమతిగా రూ.10 వేలు, మూడో బహుమతిగా రూ.5వేలతో పాటు నాలుగు నుంచి పదో ర్యాంకు వరకు సాధించినవారికి రూ.3 వేల చొప్పున బహుమతిగా అందజేయనున్నట్లు తెలిపారు. సాక్షి మాక్ ఎంసెట్ పూర్తి ఫలితాలను sakshieducation.com వెబ్‌సైట్లో చూడవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement