toppers
-
ట్రోలర్లకు స్ట్రాంగ్ కౌంటరిచ్చిన ప్రాచీ: ఉచితంగా ట్రీట్ చేస్తామన్న వైద్యులు
ఉత్తరప్రదేశ్ 10వ తరగతి పరీక్షల్లో అగ్రస్థానంలో నిలిచిన ప్రాచీ నిగమ్ ట్రోలర్స్‌కు దిమ్మదిరిగే సమాధానం ఇచ్చింది. ఎవరేమన్నా, తన విజయమేతనకు ముఖ్యమంటూ తేల్చి చెప్పింది."ట్రోలర్లు వారి ఆలోచనలతో వారుంటారు. నా విజయమే నా ప్రస్తుత గుర్తింపు. దీంతో నే సంతోషంగా ఉన్నాను" అని అంటూ బుధవారం తొలిసారి స్పందించింది. అలాగే తన రూపాన్ని చూసి, తన కుటుంబంగానీ, తనకు చదువు చెప్పిన ఉపాధ్యాయులుగానీ, తోటి మిత్రులు గానీ ఎన్నడూ చిన్నచూపు చూడలేదని, దీంతో తన దృష్టి అంతా తన చదువుపైనే కేంద్రీకృతమైందని చెప్పుకొచ్చింది. అసలు తన రూపం గురించి తానెప్పుడూ బాధపడలేదనీ ఇంజనీర్ కావడమే లక్ష్యమని తెలిపింది. అంతిమంగా తన విజయం తప్ప తాను ఎలా ఉన్నాను అన్నది ముఖ్యం కాదని స్పష్టం చేసింది.విశ్వనాథన్ మద్దతుమరోవైపు భారత చెస్ గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ప్రాచీకి మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా ఆమెను విద్యాపరమైన లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరించాలని సలహా ఇచ్చారు. హార్మోన్ల ప్రభావం, చికిత్స ఉందిప్రాచీ నిగమ్‌కి సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎస్జీపీజీఐఎంఎస్) డైరెక్టర్ ప్రొఫెసర్ ఆర్కే ధీమాన్ తమ ఇన్స్టిట్యూట్ ఉచితంగా చికిత్స చేయనున్నట్లు వెల్లడించడం విశేషం. హార్మోన్ల ప్రభావంతో వచ్చే మహిళల్లో కనిపించే అవాంఛిత రోమాల పెరుగుదలను ఎండోక్రినాలజీ ద్వారా నియంత్రించవచ్చనీ, టీనేజ్ పిల్లల్లో సాధారణంగా కనిపించే ఈ సమస్య నెలరోజుల్లో నయమవుతుందని ధీమాన్ అన్నారు.ఇటీవల విడుదలైన 10వ తరగతి 98.5 శాతం మార్కులతో యూపీలో టాప్‌లో నిలిచింది. ఈ సందర్భంగా ప్రాచీ నిగమ్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే 600లకు గాను 591 మార్కులు సాధించిన ఆమె ప్రతిభను చూడాల్సిన నెటిజన్లు కొంతమంది ఆమె ముఖంపై ఉన్న రోమాలను మాత్రమే చూశారు. అనుచిత వ్యాఖ్యలతో ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. -
SVPNPA: ఎవరికి వారే.. మహిళా‘మణులే’!
హైదరాబాద్ శివార్లలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీసు అకాడెమీలో (ఎస్వీపీ ఎన్ పీఏ) శిక్షణ పూర్తి చేసుకున్న 155 మంది ఐపీఎస్ ట్రైనీల్లో 32 మంది మహిళలు ఉన్నారు. అన్ని విభాగాల్లోనూ తన సత్తా చాటి ఓవరాల్ టాపర్‌గా నిలిచిన అనుష్త కాలీయా శుక్రవారం జరిగే పాసింగ్ ఔట్ పరేడ్‌కు (పీఓపీ) నేతృత్వం వహించనున్నారు. ఇలా ఓ మహిళ ట్రైనీ పీఓపీకి నేతృత్వం వహించడం 75 ఏళ్ళ అకాడెమీ చరిత్రలో ఇది మూడోసారి. ప్రొబేషనరీ ఐపీఎస్ అధికారులుగా బయటకు రానున్న మహిళామణుల్లో ఉన్న ప్రత్యేకతల గురించి... గంటకు 16 కిమీ పరిగెత్తే సత్తా సాధించి... ఢిల్లీకి చెందిన అనుష్త కాలియా ఢిల్లీ యూనివర్శిటీలోని క్లస్టర్ ఇన్నోవేషన్ సెంటర్ నుంచి డేటా సైన్్సలో బీటెక్ పూర్తి చేశారు. అక్కడే బ్లింకిట్ అనే స్టార్టప్ సంస్థలో డేటా సైంటిస్ట్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. సివిల్ సర్వీసెస్ పరీక్షలపై ఉన్న ఆసక్తితో ఆరునెలలకే ఈ ఉద్యోగం వదిలారు. కోవిడ్ ప్రభావంతో కోచింగ్ సెంటర్లకు బదులు ఆన్ లైన్ క్లాసులకు పరిమితం అయ్యారు. లాక్డౌన్ కారణంగా ఇతరుల్ని కలవడం తగ్గిపోవడంతో దాన్ని పాజిటివ్‌గా వాడుకుని చదువుకే పరిమితం అయ్యారు. మొదటి ప్రయత్నంలోనే 143వ ర్యాంకు సాధించారు. స్కూలు, కాలేజీ రోజుల్లో బ్యాడ్మింటన్, కరాటే పోటీల్లో పాల్గొన్నారు. అయినప్పటికీ ఎన్ పీఏలో అడుగు పెట్టే సమయానికి గంటకు కిలోమీటరు దూరం కూడా పరిగెత్తలేని స్థితిలో ఉన్నారు. ఇక్కడి శిక్షణ కారణంగా ప్రస్తుతం గంటకు 16 కిమీ పరిగెత్తే సామర్థ్యాన్ని సాధించారు. ఈ బ్యాచ్‌లో ఓవరాల్ టాపర్‌గా, ఔట్‌డోర్ టాపర్‌గానే కాకుండా పరేడ్ కమాండర్‌గా నిలిచే అవకాశంతోపాటు స్వార్డ్ ఆఫ్ ఆనర్ సొంతం చేసుకున్నారు. ప్రజాసేవలో సాంకేతికతని వినియోగించాలన్నదే తన లక్ష్యమని చెప్తున్నారు. ఎన్ పీఏ శిక్షణలో ఎన్నో అంశాలు నేర్చుకున్నానని, గ్రేహౌండ్స్ ఆ«ధ్వర్యంలో జరిగిన నెల రోజుల జంగిల్ ట్రైనింగ్ మాత్రం కఠినంగా అనిపించిందని చెప్పారు. లాయర్‌గానే సఫాయీ కార్మికుల కోసం... ముంబైకి చెందిన ఇషా సింగ్ తండ్రి యోగేష్ ప్రతాప్ (వైపీ) సింగ్ ఐపీఎస్ అధికారి అయినప్పటికీ వీఆర్ఎస్ తీసుకుని న్యాయవాదిగా మారారు. తల్లి అభాసింగ్ సైతం న్యాయవాది. వైపీ సింగ్ మహారాష్ట్రలో కలకలం సృష్టించిన ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ స్కామ్‌లో బాధితుల తరఫున న్యాయపోరాటం చేస్తున్నారు. 2018లో బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్శిటీ నుంచి ఇషా పట్టా పొందారు. 26వ ఏటనే పీపుల్స్ లాయర్‌గా పేరు తెచ్చుకున్నారు. అక్కడి గొవాండీలో ఉన్న మౌర్య హౌసింగ్ సొసైటీలో 2019 డిసెంబర్ 3న జరిగి ఉదంతం ఇషా దృష్టికి వచ్చింది. అక్కడ సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేయడానికి ప్రయత్నించిన ముగ్గురు సఫాయీ కార్మికులు చనిపోయారు. చనిపోయిన వారి భార్యలకు న్యాయం చేయడం కోసం అసిస్టెన్ ్స ఫర్ సఫాయీ కరమ్‌చారీ (ఆస్క్) స్థాపించారు. క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిధులు సమీకరించి అందించారు. ఇలా మరణించిన వారికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని 1993 నుంచి మహారాష్ట్ర లో నిబంధనలు ఉన్నా అమలు కాలేదు. దీనిపై ముంబై హైకోర్టులో 2021లో రిట్ దాఖలు చేసి వారి తరఫున పోరాడి వారికి పరిహారం ఇప్పించారు. ఈ కేసుపై అప్పటి జడ్జ్ ఉజ్వల్ భూయాన్ 1993 నుంచి ఇలా చనిపోయిన వారి జాబితా తయారీకి ఆదేశాలు జారీ చేశారు. తండ్రి చూపిన మార్గంలో ఐపీఎస్ కావాలని భావించిన ఇషా రూ.20 లక్షల ప్యాకేజీతో వచ్చిన ఉద్యోగం వదులుకుని రెండో ప్రయత్నంలో 191వ ర్యాంక్ సా«ధించింది. యూట్యూబ్ చూసి యూపీఎస్సీ పరీక్షలు క్రాక్ చేసి... మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ సమీపంలో ఉన్న మావు పట్టణానికి చెందిన సిమ్రన్ భరద్వాజ్ ఢిల్లీ యూనివర్శిటీ నుంచి జర్నలిజంలో డిగ్రీ పూర్తి చేశారు. తండ్రి ఆర్మీలో లెఫ్ట్‌నెంట్ కల్నల్‌గా పని చేస్తుండటంతో సాధారణంగానే యూనీఫామ్∙సర్వీసెస్‌పై మక్కువ ఏర్పడింది. తాను నివసించేది చిన్న పట్టణం కావడంతో పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి అవసరమైన కోచింగ్ సెంటర్ల వంటి సదుపాయాలు లేవు. దీనికితోడు 2021 జూన్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి కాగానే సివిల్స్ పరీక్ష రాయాల్సి ఉంది. కరోనా ప్రభావంతో కోచింగ్ సెంటర్లు అన్నీ మూతపడ్డాయి. దీంతో యూట్యూబ్ ఛానల్స్‌లో క్లాసులు వింటూ రోజుకు 8 నుంచి 10 గంటల పాటు సివిల్స్‌కు ప్రిపేర్ అయింది. మిగిలిన సమయం కంబైన్ ్డ డిఫెన్ ్స సర్వీసెస్ (సీడీఎస్) పరీక్షకు వెచ్చించింది. కోవిడ్ కారణంగా వాయిదా పడిన ఈ రెండు పరీక్షలు 2021 అక్టోబర్‌లో జరిగాయి. మొదటి ప్రయత్నాల్లోనే సీడీఎస్‌లో ఆరో ర్యాంక్, సివిల్స్‌లో 172వ ర్యాంక్ సాధించింది. 23 ఏళ్ళ వయస్సులోనే ఐపీఎస్‌కు ఎంపికైంది. ఎలాంటి ఇతర యాక్టివిటీస్ లేని కోవిడ్ టైమ్ తనకు కలిసి వచ్చిందని సిమ్రన్ చెప్తున్నారు. ఐఏఎస్ అనుకున్నా ఐపీఎస్‌గా... వరంగల్‌కు చెందిన బి. చైతన్య రెడ్డి అక్కడి ఎన్ఐటీ నుంచి బీటెక్ పూర్తి చేశారు. తండ్రి గ్రూప్–1 ఆఫీసర్‌గా ఉండటంతో సివిల్ సర్వీసెస్‌పై మక్కువ ఏర్పడింది. సివిల్ సర్వెంట్స్‌గా ఉంటేనే ప్రజలకు నేరుగా సేవ చేసే అవకాశం దక్కుతుందని అని తండ్రి చెప్పిన మాటలు ఆమెలో స్ఫూర్తి నింపాయి. ఇరిగేషన్ శాఖలో ఏఈగా పని చేస్తూనే ఐఏఎస్ కావాలనే లక్ష్యంతో సివిల్స్ వైపు మొగ్గారు. మెయిన్ ్సలో మూడుసార్లు అపజయం ఎదురైనా కుటుంబం ఇచ్చిన ప్రోత్సాహంతో ముందుకు వెళ్ళారు. సివిల్స్‌తోపాటు కేంద్ర సాయుధ బలగాల్లో ఎంపికకు సంబంధించిన పరీక్షల్నీ రాశారు. దీంతో ఐఏఎస్ నుంచి దృష్టి ఐపీఎస్ వైపు మళ్ళింది. 2022 లో 161వ ర్యాంక్ సాధించి తెలంగాణ క్యాడర్‌కు ఎంపికయ్యారు. – శ్రీరంగం కామేష్, సాక్షి సిటీబ్యూరో, హైదరాబాద్ ; ఫొటోలు: ఎస్.ఎస్.ఠాకూర్ -
ఇంటర్ విద్యార్థులకు అవార్డులు అందజెసిన సీఎం జగన్
-
మీ అందరికి గ్రాండ్ వెల్కమ్
-
‘జగనన్న ఆణిముత్యాలు’ కార్యక్రమం వాయిదా
సాక్షి, విజయవాడ: ‘జగనన్న ఆణిముత్యాలు’ కార్యక్రమం వాయిదా వేసినట్లు పాఠశాల విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు. టెన్త్, ఇంటర్ టాపర్లకు జగనన్న ఆణిముత్యాలు పేరుతో ప్రోత్సాహకాలు, సత్కార కార్యక్రమాలని నిర్వహించాలని ఆంధ్రపదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 25 నియోజకవర్గాలు, 27 న జిల్లా కేంద్రాలు, 31 న రాష్ట్ర స్ధాయి కార్యక్రమం నిర్వహించాలని మొదటగా నిర్ణయించగా, అయితే ఈ కార్యక్రమాలని పాఠశాలలు పున: ప్రారంభం తర్వాత జరపాలని తాజాగా ప్రభుత్వం ప్రకటించింది. విద్యార్ధులు, వారి తల్లితండ్రుల కోరిక మేరకు వాయిదా ప్రభుత్వం వాయిదా వేసింది. పాఠశాలలు రీ ఓపెన్ తర్వాత జరిపితే ఎక్కువ మంది హాజరై స్పూర్తిదాయకంగా ఉంటుందని తల్లిదండ్రులు విజ్ణప్తి చేశారు. జూన్ 12 తర్వాత ‘జగనన్న ఆణిముత్యాలు’ కార్యక్రమం నిర్వహిస్తామని ప్రవీణ్ ప్రకాష్ వెల్లడించారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుకుని పదో తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ‘జగనన్న ఆణిముత్యాలు (స్టేట్ బ్రిలియన్స్ అవార్డ్స్)’ పేరిట ప్రభుత్వం సత్కరించనుంది. ఈ అవార్డుల వేడుకను నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో నిర్వహించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ ప్రభుత్వ మేనేజ్మెంట్లలో నడుస్తున్న పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో 2023 మార్చి, ఏప్రిల్ పబ్లిక్ పరీక్షల్లో మొదటి మూడు స్థానాలు సాధించిన ప్రతిభావంతులైన విద్యార్థులను జగనన్న ఆణిముత్యాలు అవార్డులతో ప్రభుత్వం సన్మానించనుంది. చదవండి: నాలుగేళ్ల పాలనపై సీఎం వైఎస్ జగన్ ట్వీట్ ఇంటర్ స్థాయిలో ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసీ, సీఈసీ/ఎంఈసీ గ్రూపుల వారీగా అత్యధిక మార్కులు సాధించిన వారిని సత్కరించనుంది. విద్యా రంగంలో పలు సంస్కరణలను అమలు చేస్తున్న ప్రభుత్వం.. విద్యలో నాణ్యత, విద్యార్థుల్లో ప్రతిభను ప్రోత్సహించేందుకు ఈ వేడుక నిర్వహిస్తోంది. మూడు స్థాయిల్లోనూ విద్యార్థులకు నగదు పురస్కారం, మెడల్, మెరిట్ సర్టిఫికెట్ ఇవ్వనుంది. సంబంధిత పాఠశాలకు మెమెంటోతో పాటు ప్రధానోపాధ్యాయులకు, విద్యార్థుల తల్లిదండ్రులను కూడా సత్కరించనున్నారు. -
టెన్త్ టాపర్లకు సీఎం వైఎస్ జగన్ బొనాంజా..
సాక్షి, అమరావతి: టెన్త్ టాపర్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బొనాంజా ప్రకటించారు. నియోజకవర్గాల్లోని టాపర్లకూ ప్రోత్సాహకాలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. గవర్నమెంటు స్కూళ్లలో టెన్త్‌లో టాప్ విద్యార్థులకు ప్రోత్సాహకాలను విస్తరించనున్నారు. రాష్ట్ర, జిల్లాస్థాయి టాపర్లకే కాకుండా నియోజకవర్గాల వారీ టాపర్లరూ ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారు. నియోజకవర్గంలో 1,2,3 స్థానాల్లోని విద్యార్థులకు వరుసగా రూ.15వేలు, రూ.10వేలు, రూ.5వేలు చొప్పున నగదు ప్రోత్సాహకాలు అందించనున్నారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విప్లవాత్మక సంస్కరణలతో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యా ప్రమాణాలు పెరిగాయి. టెన్త్, ఇంటర్ ఫలితాలే అందుకు నిదర్శనం. ఈ విద్యా సంవత్సరం పదో తరగతి, ఇంటర్ ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులను సన్మానించనున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించిన సంగతి తెలిసిందే. చదవండి: గేరు మార్చి.. స్పీడ్ పెంచి.. సీఎం జగన్ బలం అదే.. ఇదీ లెక్క..! నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో తొలి మూడు స్థానాల్లో నిలిచిన ప్రభుత్వ విద్యాసంస్థల విద్యార్థులను అవార్డులు, నగదు పురస్కారాలతో సత్కరించనున్నారు. జడ్పీ, ప్రభుత్వ, మున్సిపల్, ఏపీ మోడల్, బీసీ రెసిడెన్షియల్, ఏపీ రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, జీటీడబ్ల్యూ ఆశ్రమ స్కూళ్లు, కేజీబీవీ విద్యార్థులకు ఈ అవకాశం కల్పించినట్లు తెలిపారు. మార్కుల ఆధారంగా టెన్త్, ఇంటర్లో 2,831 మంది విద్యార్థులను సత్కరించనున్నట్లు మంత్రి చెప్పారు. -
టెన్త్ ,ఇంటర్ టాపర్స్ కు హెలికాప్టర్ రైడ్
-
మాట నిలబెట్టుకున్న సీఎం.. టెన్త్, ఇంటర్ టాపర్లకు హెలికాప్టర్ రైడ్
రాయ్‌పూర్: టెన్త్, ఇంటర్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి హెలికాప్టర్ రైడ్ కల్పిస్తానని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్. రాష్ట్ర, జిల్లా స్థాయిలో టాపర్లుగా నిలిచిన వారిని హెలికాప్టర్లో తనతో పాటు తీసుకెళ్లి గగన విహారం చేయించారు. తొలిసారి హెలికాప్టర్ ఎక్కిన క్రమంలో విద్యార్థుల ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. చాలా సంతోషంగా ఉందని, ఈ రైడ్ ద్వారా ఇతర విద్యార్థుల్లోనూ ఉత్సాహం నింపినట్లవుతుందన్నారు. 10, 12వ తరగతి పరీక్షల్లో రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 10మంది విద్యార్థులను హెలికాప్టర్లో తిప్పుతామని గత మే నెలలో సీఎం భూపేశ్ బఘేల్ హామీ ఇచ్చారు. చదవుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచేందుకు విద్యార్థుల్ని ప్రోత్సహించేలా ఈ ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఇచ్చిన హామీని నెరవేర్చిన సందర్భంగా హెలికాప్టర్ రైడ్‌పై ట్వీట్ చేశారు. ‘చూడండి పిల్లలు ఎంత ఆనందంగా ఉన్నారో. 10, 12వ తరగతి పరీక్షల్లో ఉత్తమంగా రాణించిన వారిని హెలికాప్టర్లో తిప్పుతామని ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నాం. 125 మంది విద్యార్థులు ఈ హెలికాప్టర్ రైడ్‌ను ఆస్వాదిస్తారు’ అంటూ సీఎం ట్వీట్ చేశారు. మరోవైపు.. విద్యార్థులను ప్రోత్సహించేందుకే ఈ ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు రాష్ట్ర మంత్రి ప్రేమ్‌సాయి సింగ్ టెకమ్. ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చామని తెలిపారు. #WATCH | Raipur, Chhattisgarh: Toppers of class 12 and class 10 were taken on a helicopter ride by the state govt as was promised by CM Bhupesh Baghel in May pic.twitter.com/gjHu8lGBKS — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) October 8, 2022 𝗛𝗲𝗹𝗶𝗰𝗼𝗽𝘁𝗲𝗿 𝗥𝗶𝗱𝗲🚁 देखिए, बच्चे कितने खुश हैं! हमने वादा किया था कि 10वीं और 12वीं के टॉपर बच्चों को हम हेलीकॉप्टर राइड कराएँगे। आज इसकी शुरुआत हो गयी है। कक्षा 10वीं और 12वीं के 125 छात्र-छात्राएं लेंगे हेलीकॉप्टर जॉयराइड का आनंद। pic.twitter.com/5c4dbOvTbx — Bhupesh Baghel (@bhupeshbaghel) October 8, 2022 ఇదీ చదవండి: అధ్యక్ష ఎన్నికల్లో చివరి వరకు కొనసాగుతా: శశిథరూర్ -
CBSE 10th Result 2022: సీబీఎస్ఈ టెన్త్ టాపర్లు వీరే
న్యూఢిల్లీ: సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో అమ్మాయిలు సత్తా చాటారు. బాలికలు 95.21 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా.. బాలురు 93.80 శాతం మంది పాసయ్యారు. బాలికల్లో దియా నామ్‌దేవ్, బాలురలో మయాంక్ యాదవ్ నేషనల్ టాపర్స్‌గా నిలిచారు. వీరిద్దరూ 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. వీరిద్దరూ ఉత్తరప్రదేశ్‌కు చెందినవారే కావడం విశేషం. కాన్సెప్ట్‌లను అర్థం చేసుకుని చదివా షామ్లీ జిల్లాకు చెందిన దియా నామ్‌దేవ్.. స్థానిక స్కాటిష్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివారు. తల్లిదండ్రులకు, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతోనే తాను టాపర్‌గా నిలిచానని దియా నామ్‌దేవ్ తెలిపారు. ఫలితాలు విడుదలైన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘నా తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ఎంతో రుణపడి ఉంటాను. నేను ప్రతిరోజూ 7 నుంచి 8 గంటలు చదువుకున్నాను. కాన్సెప్ట్‌లను బాగా అర్థం చేసుకుని చదవడం వల్ల టాపర్‌గా నిలిచాన’ని అన్నారు. అన్ని సబ్జెక్టుల్లో పూర్తి మార్కులు నోయిడాలోని అమిటీ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిన మయాంక్ యాదవ్ కూడా 100 శాతం మార్కులతో టాపర్‌గా నిలిచాడు. అన్ని సబ్జెక్టుల్లో పూర్తి మార్కులు తెచ్చుకుని సత్తా చాటాడు. టాపర్‌గా నిలవడం పట్ల మయాంక్‌తో పాటు అతడి కుటుంబ సభ్యులు, టీచర్లు సంతోషం వ్యక్తం చేశారు. త్రివేండ్రం టాప్.. గువాహటి లాస్ట్ సీబీఎస్ఈ టెన్త్ ఫలితాల్లో త్రివేండ్రం ముందు వరుసలో నిలిచింది. త్రివేండ్రంలో అత్యధికంగా 99.68 శాతం ఉత్తీర్ణత నమోదయింది. గువాహటి 82.23 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో ఉంది. ఢిల్లీలో 86.55 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. తూర్పు ఢిల్లీలో 86.96 శాతం, పశ్చిమఢిల్లీలో 85.94 శాతం ఉత్తీర్ణత నమోదయింది. ( కాలేజీ విద్యార్థుల కిస్సింగ్ కాంపిటీషన్.. పోలీసుల అదుపులో ఒకరు) -
జ్ఞానదుర్గమ్మలు
దుర్గాశక్తికి ప్రతిరూపం సరస్వతీదేవి. సరస్వతీదేవి స్వరూపాలు.. ఈ తొమ్మిదిమంది ‘నీట్’ టాపర్లు. ఆకాంక్ష.. స్నికిత.. అమ్రిష చైతన్య.. ఆయేష.. సాయి త్రిష మానస.. లులు.. ఇషిత.. ప్రతికూలతలను జయించి.. విజయం సాధించిన జ్ఞానదుర్గమ్మలు. ఈ ఏడాది సెప్టెంబరు 13, 14 తేదీలలో ‘నీట్’ పరీక్ష రాసిన 13 లక్షల 60 వేల మంది అభ్యర్థుల అందరి లక్ష్యం ఒక్కటే. మంచి కాలేజ్‌లో మెడిసిన్‌లో సీటు సాధించడం. లక్ష్యం ఒక్కటే కానీ, లక్ష్యాన్ని చేరుకునేందుకు చేసిన సాధనలో ఒక్కొక్కరిదీ ఒక్కొక్క అనుభవం. ఎవరి పరిస్థితులు వారివి. అననుకూలతలు, అవరోధాలు, అవాంతరాలను దాటుకుని పరీక్ష రాసే తేదీ వరకు వచ్చినవారే అంతా. చివరి నిముషంలో పరీక్ష హాలును చేరలేక ఒక ఏడాదిని కోల్పోయిన వారూ ఉన్నారు. ఈసారి పరీక్ష రాసినవాళ్లలో సగానికన్నా ఎక్కువ సంఖ్యలోనే అమ్మాయిలు ఉన్నారు. 8 లక్షల 80 వేల మంది! సాధారణంగా అబ్బాయిలతో పోల్చి చూస్తే ‘నీట్’ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెస్ట్ టెస్ట్) ప్రిపరేషన్‌కు అమ్మాయిలే ఎక్కువ కష్టపడవలసి వస్తుంది. వాళ్లకున్నన్ని అనుకూలతలు వీళ్లకు ఉండవు. నీట్లో టాపర్ నే చూడండి, ఢిల్లీ అమ్మాయి ఆకాంక్ష రోజుకు నూట నలభై కి.మీ. దూరం కోచింగ్‌కి వెళ్లొచ్చింది! ఆమె తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడే కూతురి మెడిసిన్ కోచింగ్ కోసం భారత సైన్యంలోని తన ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేసి, గ్రామం నుంచి ఢిల్లీకి కుటుంబాన్ని మార్చారు ఆమె తండ్రి. ఆకాంక్షతో పాటు బాలికల్లో తొమ్మిది తొలి స్థానాల్లో ర్యాంకు సాధించిన స్నికిత, అమ్రిష, చైతన్య, ఆయేష, సాయి త్రిష, మానస, లులు, ఇషిత కూడా ప్రిపరేషన్లో ఏదో ఒక ప్రతికూలతను ఎదుర్కొని విజయం సాధించిన జ్ఞాన దుర్గమ్మలే. ఆకాంక్షా సింగ్ తర్వాతి స్థానం తుమ్మల స్నికితది. ఆమె ఆలిండియా ర్యాంకు 3. వీళ్లది వరంగల్. ఆకాంక్ష పేరెంట్స్లానే స్నికిత పేరెంట్స్ కూడా కూతురి కాలేజ్‌కి దగ్గరగా ఇల్లు చూసుకున్నారు. స్నికితకు కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఎంత చదివినా గుర్తుండేవి కావు. ఒత్తిడి పెరిగేది. ఆ ఒత్తిడిని తట్టుకోడానికి పాటలు వినేది. అమ్మమ్మకు ఫోన్ చేసి మాట్లాడేది. అమ్మాయిల్లో మూడో స్థానంలో నిలిచిన అమ్రిష ఖైతాన్ ర్యాంకు 5. తండ్రి, తల్లి, తాతయ్య, అన్నయ్య ఇంట్లో అంతా డాక్టర్లే. ‘నువ్వూ డాక్టర్ కావాలి’ అని బంధువుల నుంచి ఆమ్రిషకు ఒత్తిడి ఉండేది. వాళ్ల ఒత్తిడి ‘ఫస్ట్ అటెంప్ట్‌లోనే వచ్చేయాలి అమ్మాయ్’ అని! అయితే ఆ మాటను తను ఒత్తిడిగా కాక, ఒక ఛాలెంజ్‌గా తీసుకున్నాను అంటుంది అమ్రిష. ఆలిండియా 6వ ర్యాంకు పొంది, అమ్మాయిల్లో నాలుగో స్థానం పొందిన ఏపీ విద్యార్థిని చైతన్య సింధు ఇంట్లో కూడా అంతా డాక్టర్లే. బయాలజీ కోసం ఎక్కువ కష్టపడవలసి వచ్చింది తను. ఇంటర్ చదువుతున్నప్పుడు ఇంటి మీద బెంగ ఉండేది. అంతా ఉండేది విజయవాడే అయినా, తను ఉండటం హాస్టల్లో. ఆ బెంగ పోగొట్టడానికి పేరెంట్స్ వచ్చిపోతుండేవారు. సింధు తర్వాత ఐదో స్థానం ఆయేషాది. 12వ ర్యాంకు. కేరళ అమ్మాయి. తండ్రి యు.ఎ.ఇ.లో సేల్స్ ఎగ్జిక్యూటివ్. గత ఏడాది ఫస్ట్ అటెంప్ట్‌లో ఆయేషా సీటు సంపాదించ లేకపోయింది. ఈసారి ఎలాగైనా సాధించాలనే పట్టుతో ఒత్తిడికి లోనయింది. 14వ ర్యాంకు సాధించిన సాయి త్రిషకు అమ్మాయిల్లో ఆరో స్థానం. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరి, న్యూరోసర్జన్ అవాలని ఆమె లక్ష్యం. ఎయిమ్స్‌లో సీటు వచ్చేంత ర్యాంకును తెచ్చుకోగలనా అని కొంత ఆందోళనకు గురైంది. టీచర్స్, పేరెంట్స్ కాన్ఫిడెన్స్ ఇచ్చారు. అమ్మాయిల్లో త్రిష తర్వాత ఏడో స్థానం మానసది. ఆమె ర్యాంకు 16. రోజుకు 12 గంటలు ప్రిపేర్ అయినా, అది సరిపోదేమోనని ఆమె సందేహం. 8, 9 స్థానాల్లో లులు (కేరళ), ఇషిత (పంజాబ్) ఉన్నారు. లులు కు 22వ ర్యాంకు, ఇషితకు 24 ర్యాంకు. ఆయేషాలానే లులుకు కూడా ఇది సెకండ్ అటెంప్ట్. ఇంకో అటెంప్ట్ చేయకూడదన్న పట్టుతో కూర్చొని చదివింది. ఇషితకు ఫస్ట్ అంటెప్ట్లోనే కొట్టేయాలనే పట్టు. ‘సీటు వస్తుందంటావా.. వస్తుందంటావా’ అని తల్లిని సతాయిస్తుండేది. ‘అమ్మ నా గైడింగ్ ఏంజెల్’ అంటుంది ఇషిత. -
వివిధ కేటగిరీల్లో టాప్ 15ర్యాంకులు
సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గ్రామ సచివాలయ ఫలితాలలో వివిధ కేటగిరీల్లో (బీసీ, ఎస్సీ, ఎస్టీ) మొదటి 15 ర్యాంకులు పొందిన విద్యార్థుల సంఖ్యను విడుదల చేశారు. ఈ సందర్భంగా మొత్తం 18 విభాగాల్లో ఇవి ప్రకటించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. విభాగం బీసీలు ఎస్సీలు ఎస్టీలు 1 ఉమెన్ పోలీస్ 36 1 0 2 యానిమల్ హస్బండరీ అసిస్టెంట్ 20 7 0 3 వార్డ్ హెల్త్ సెక్రటరీ 32 10 1 4 ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 21 0 0 5 పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5 23 2 0 6 పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 6 24 0 0 7 విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ 25 1 0 8 విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ 18 8 1 9 విలేజ్ హార్టీకల్చర్ అసిస్టెంట్ 22 3 2 10 విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ గ్రేడ్ 2 61 1 1 11 విలేజ్ సెరీకల్చర్ అసిస్టెంట్ 34 8 2 12 విలేజ్ సర్వెయర్ గ్రేడ్ 3 69 1 1 13 వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ 23 2 0 14 వార్డ్ ఎమినిటీస్ సెక్రటరీ గ్రేడ్ 2 22 0 0 15 వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డాటా ప్రాసెసింగ్ సెక్రటరీ 26 1 0 16 వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యూలేషన్ సెక్రటరీ 19 0 0 17 వార్డ్ సానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ 26 3 0 18 వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ గ్రేడ్ 3 24 3 0 -
ఏపీ ఎంసెట్‌లో తెలంగాణ హవా
సాక్షి, అమరావతి : ఏపీ ఎంసెట్‌లో తెలంగాణ విద్యార్థులు సత్తా చాటారు. టాప్ ర్యాంకుల్లోనే కాకుండా ఉత్తీర్ణతలోనూ ముందంజలో నిలిచారు. ఇంజనీరింగ్ విభాగంలో టాప్–10లో ఆరుగురు రాష్ట్ర విద్యార్థులే ఉన్నారు. గట్టు మైత్రేయ ఇంజనీరింగ్‌లో రెండో ర్యాంకు సాధించాడు. అగ్రి, మెడికల్ విభాగంలోనూ టాప్–10లో ఇద్దరు తెలంగాణ విద్యార్థులు ఉన్నారు. ఏపీ ఎంసెట్–2018 ఫలితాలను బుధవారం విజయవాడలో ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. హైదరాబాద్ కేంద్రంగా ఇంజనీరింగ్‌లో 25,410 మంది పరీక్ష రాయగా 21,750 మంది ఉత్తీర్ణులయ్యారు. అగ్రి మెడికల్ విభాగంలో 10,359 మంది పరీక్ష రాయగా 9,514 మంది ఉతీర్ణులయ్యారు. అభ్యర్థుల ర్యాంకు కార్డులు ఈ నెల 7 నుంచి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీ.జీఓవీ.ఐఎన్/ఈఏఎంసీఈటీ’ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. జేఈఈ మెయిన్ ఫలితాల్లో ర్యాంకులు సాధించినవారే ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగంలో కూడా టాప్ ర్యాంకులు సాధించడం విశేషం. జేఈఈ మెయిన్‌లో ప్రథమ ర్యాంకు సాధించిన భోగి సూరజ్‌కృష్ణ ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగంలో మొదటి ర్యాంకు సాధించాడు. ఐదో ర్యాంకు సాధించిన మైత్రేయ రెండో ర్యాంకు దక్కించుకున్నాడు. ఈ నెల 26 నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రారంభిస్తున్నట్లు మంత్రి గంటా చెప్పారు. మైత్రేయకు ఫస్ట్ ర్యాంకు రావాల్సి ఉన్నా.. ర్యాంకుల నిర్ణయంలో ఎంసెట్‌లో (160 మార్కులు) సాధించిన మార్కులను, ఇంటర్లో మార్కులను నార్మలైజేషన్ చేసి 75 శాతం, 25 శాతంగా తీసుకొని కంబైన్డ్ స్కోర్‌ను నిర్ణయించారు. ఆ స్కోర్ ప్రకారం ర్యాంకులను ప్రకటించారు. దీంతో ఎంసెట్‌లో మంచి మార్కులు సాధించినా ఇంటర్ మార్కులతో కలిపి కంబైన్డ్ స్కోర్‌ను తీసుకున్నప్పుడు కొందరు ర్యాంకుల్లో వెనుకంజలో నిలిచారు. ఉదాహరణకు ఇంజనీరింగ్‌లో తొలి ర్యాంకర్ సూరజ్ కృష్ణకు ఎంసెట్ మార్కులు 150.1803 రాగా కంబైన్డ్ స్కోర్ 95.2720 వచ్చింది. రెండో ర్యాంకర్.. గట్టు మైత్రేయకు ఎంసెట్ మార్కులు 151.7622 రాగా కంబైన్డ్ స్కోర్ 94.9302. ఫలితంగా ఎంసెట్‌లో తక్కువ మార్కులు ఉన్నా కంబైన్డ్ స్కోర్‌లో ముందున్న సూరజ్‌కృష్ణను ఫస్టు ర్యాంకర్‌గా ప్రకటించారు. === పరిశ్రమను స్థాపించడమే లక్ష్యం: విష్ణు మనోజ్ఞ ర్యాంకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ కోర్సు చదవాలని నిర్ణయించుకున్నా. హైదరాబాద్‌లో మంచి కంపెనీ స్థాపించి, పది మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నా. === పరిశోధనలు చేయాలనేదే లక్ష్యం: గోసుల వినాయక శ్రీవర్థన్ మాది సంగారెడ్డి జిల్లా. ఐఐటీ ముంబైలో కంప్యూటర్ సైన్స్ కోర్సులో చేరాలని భావిస్తున్నా. భవిష్యత్తులో సైన్స్ రంగంలో పరిశోధనలు చేయాలనేదే లక్ష్యం. === సైంటిస్ట్‌ను కావడమే లక్ష్యం: బసవరాజు జిన్షు సైంటిస్ట్ కావాలన్నది నా లక్ష్యం. ఇంటర్నేషనల్ కెమిస్ట్రీ ఒలంపియాడ్‌కు కూడా ఎంపికయ్యాను. ఇండియా నుంచి ఏటా 25 మంది ఎంపిక చేస్తుండగా, దీనిలో నేను ఒకటిని === సివిల్ సర్వీసే లక్ష్యం: అయ్యపు వెంకటపాణి వంశీనాథ్ ఐఐటీ ముంబైలో కంప్యూటర్ సైన్స్ కోర్సులో చేరుతాను. భవిష్యత్తులో సివిల్స్ సర్వీస్‌లో చేరి సమాజానికి సేవ చేయాలన్నదే లక్ష్యం. === సర్జన్‌గా సేవలందిస్తా: జయసూర్య అమ్మానాన్నలు ఇచ్చిన ప్రోత్సాహమే నేను ఈ ర్యాంకు సాధించడానికి ప్రధాన కారణం. భవిష్యత్‌లో సర్జన్‌గా సేవలందిస్తా. === ముంబై ఐఐటీలో చదువుతా జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంక్ సాధించి ముంబై ఐఐటీలో చేరాలనుకుంటున్నా. కుటుంబసభ్యుల సహకారంతో ప్రణాళికబద్ధంగా చదవడం వల్లనే ఇదంతా సాధ్యమైంది. – గట్టు మైత్రేయ -
నేడు టెన్త్ టాపర్లకు సన్మానం
పాన్‌గల్: గత విద్యాసంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో టెన్త్‌లో టాపర్లుగా నిలిచిన విద్యార్థులు, పాఠశాల హెచ్ఎంలకు బుధవారం స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో సన్మానిస్తున్నట్లు మండల శాఖ అధ్యక్షుడు భీమయ్య ప్రకటనలో తెలిపారు. ఎంపీపీ వెంకటేష్‌నాయుడు, జెడ్పీటీసీ రవికుమార్‌ల చేతుల మీదుగా కార్యక్రమం నిర్వహిస్తామని పేర్కొన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు తరలిరావాలని కోరారు. -
హవ్వా.. వీళ్లా ఇంటర్ టాపర్లు!
పాట్నా: 'రాజనీతి శాస్త్రం వంటలు చేయడం గురించి నేర్పిస్తుందట. ఇక నీళ్లకు హెచ్2వోకు చాలా బేధాలున్నాయట' ఈ మాటలు మొన్న బిహార్‌లో వెల్లడించిన ఇంటర్మీడియట్ పరీక్షల్లో టాప్ వచ్చిన విద్యార్థులు చెప్పిన సమాధానాలు. దీంతో వారికి మరోసారి పరీక్షలు పెట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. బిహార్‌లో ఇటీవల పన్నెండో తరగతి పరీక్ష ఫలితాలు వచ్చిన విషయం తెలిసిందే. అందులో రూబీ రాయ్(17) అనే విద్యార్థి ఆర్ట్స్ విభాగంలో టాపర్. అలాగే మరో విద్యార్థి జూనియర్ లెవల్లో టాపర్. వీరిద్దరిని స్థానిక మీడియా ఒకటి ఇంటర్వ్యూ చేసింది. ఇందులో రూబీని పాలిటిక్స్ గురించి ప్రశ్నించగా.. వంట చేయడం గురించి చెబుతుందని, మరో జూనియర్ విద్యార్థి హెచ్ టూ వో, నీళ్లు గురించి అడిగితే తెలియదని చెప్పడంతో వాళ్లు అవాక్కయ్యారు. ఇలాంటి వారు మొత్తం పదిమంది టాపర్లను ప్రశ్నించినా ఇలాంటి సమాధానాలే చెప్పడంతో ఆ వివరాలు బయటకొచ్చాయి. దీంతో ఆ పదిమంది విద్యార్థులకు వచ్చే వారంలో మళ్లీ పరీక్ష పెట్టేందుకు బిహార్ అధికారులు సిద్ధమయ్యారు. కాగా, ఇక్కడ హాజీపూర్‌లోని వీన్ రాయ్ అనే కాలేజీకి చెందిన విద్యార్థులే అధికంగా చీటింగ్ పాల్పడ్డారని విద్యాశాఖ అధికారులు చెప్పారు. -
సాక్షి మాక్ ఎంసెట్ టాపర్లు వీరే...
హైదరాబాద్: విద్యార్థుల్లో ఆందోళనను పోగొట్టడంతో పాటు వారి సామర్థ్యాన్ని పరీక్షించుకోవడం కోసం ‘సాక్షి’ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహించిన మాక్ ఎంసెట్ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఇందులో తెలంగాణ రాష్ట్రానికి గాను ఇంజనీరింగ్ విభాగంలో డి.తేజవర్ధన్‌రెడ్డి మొదటి స్థానంలో నిలవగా.. జె.అరవింద్ రెండో ర్యాంకు, దేవన్ష్గుప్తా మూడో ర్యాంకు సాధించారు. మెడిసిన్ విభాగంలో కె.పి.అనూహ్య తొలి ర్యాంకు సాధించగా, ఎస్.ప్రణయ్‌రెడ్డి రెండో స్థానంలో, కె.మౌక్తిక మూడో స్థానంలో నిలిచారు. దీనిలో మొదటి ర్యాంకులు సాధించిన రాష్ట్ర విద్యార్థులకు త్వరలో నగదు బహుమతులు అందజేయనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. మొదటి బహుమతిగా రూ.15 వేలు, రెండో బహుమతిగా రూ.10 వేలు, మూడో బహుమతిగా రూ.5వేలతో పాటు నాలుగు నుంచి పదో ర్యాంకు వరకు సాధించినవారికి రూ.3 వేల చొప్పున బహుమతిగా అందజేయనున్నట్లు తెలిపారు. సాక్షి మాక్ ఎంసెట్ పూర్తి ఫలితాలను sakshieducation.com వెబ్సైట్లో చూడవచ్చు.