సాక్షి ఆధ్వర్యంలో మాక్ ఎంసెట్
విశాఖపట్నం: రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్ష మంది ఇంజినీరింగ్, మెడిసిన్ ఔత్సాహిక విద్యార్థుల ప్రయోజనార్థం సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో త్వరలో మాక్ ఎంసెట్ జరగనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో అన్ని జిల్లా కేంద్రాల్లో ఏప్రిల్ 12వ తేదీ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ మాక్ ఎంసెట్ నిర్వహించనుంది. శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (అటానమస్) చిత్తూరు...ఈ మాక్ ఎంసెట్‌కు ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. మే నెలలో జరగనున్న ఎంసెట్‌కు సరిగ్గా నెల రోజుల ముందు సాక్షి నిర్వహించనున్న ఈ మాక్ ఎంసెట్ ద్వారా విద్యార్థులు తమ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసుకోవడమే కాకుండా...తమ ప్రతిభను పెంపొందించుకోవచ్చు.
ప్రశ్న పత్రాలను తమ సామర్థ్యాన్ని అంచనా వేసుకుని ప్రిపరేషన్‌ను మరింత మెరుగు పరుచుకునేందుకు వీలవుతుంది. దీంతో పాటు రెండు రాష్ట్రాల్లో వేర్వేరుగా మెరుగైన ప్రతిభ చూపిన మొదటి 10 ర్యాంకర్లకు నగదు బహుమతులుంటాయి. సాక్షి మాక్ ఎంసెట్‌కు హాజరుకావాలనుకునే విద్యార్థులు ఏప్రిల్ రెండో తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులను మార్చి రెండో తేదీ నుంచి ఎంపిక చేసి సాక్షి కార్యాలయాల్లో స్వీకరిస్తున్నారు. దరఖాస్తు వెల రూ.75తో పాటు రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలు తీసుకుని వచ్చి వెంటనే హాల్‌టికెట్ పొందవచ్చు.