సాక్షి మీడియా గ్రూప్, ఎస్‌వీసీఈటీ ఆధ్వర్యంలో ఏప్రిల్ 12న మాక్ ఎంసెట్ | Mac EAMCET in sakshi and svcet | Sakshi
Sakshi News home page

సాక్షి మీడియా గ్రూప్, ఎస్‌వీసీఈటీ ఆధ్వర్యంలో ఏప్రిల్ 12న మాక్ ఎంసెట్

Published Thu, Mar 12 2015 1:45 AM | Last Updated on Sat, Sep 2 2017 10:40 PM

సాక్షి మీడియా గ్రూప్, ఎస్‌వీసీఈటీ ఆధ్వర్యంలో ఏప్రిల్ 12న మాక్ ఎంసెట్

సాక్షి మీడియా గ్రూప్, ఎస్‌వీసీఈటీ ఆధ్వర్యంలో ఏప్రిల్ 12న మాక్ ఎంసెట్

సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లోని లక్షలాది మంది ఇంజనీరింగ్, మెడికల్ ఔత్సాహిక విద్యార్థులకు ప్రయోజనం కల్పించేలా ‘సాక్షి’ మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో మాక్ ఎంసెట్ జరుగనుంది. ఇరు రాష్ట్రాల్లోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఏప్రిల్ 12న ఉదయం 9.30 గంటల నుంచి 12.30 వరకు ఈ మాక్ ఎంసెట్‌ను నిర్వహిస్తారు. ఇందులో రెండు రాష్ట్రాలకు సంబంధించి వేర్వేరుగా ప్రతిభ కనబరిచిన టాప్ 10 మంది విద్యార్థులకు నగదు బహుమతులు ఉంటాయి.

ఈ మాక్ ఎంసెట్ దరఖాస్తులు ఈ నెల 12వ తేదీ నుంచి ఎంపిక చేసిన సాక్షి కార్యాలయాల్లో లభ్యమవుతాయి. అభ్యర్థులు దరఖాస్తు ఫారం ధర రూ. 75తో పాటు రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలను వెంట తీసుకువస్తే వెంటనే హాల్‌టికెట్ పొందవచ్చు.

దరఖాస్తులకు ఏప్రిల్ 2వ తేదీ తుది గడువు. దరఖాస్తులు లభించే కేంద్రాలు, పరీక్షా కేంద్రాల వివరాలను www.sakshieducation.comలో తెలుసుకోవచ్చు. ఇంటర్ జూనియర్ కాలేజీల నిర్వాహకులు ఏకమొత్తంగా ఈ మాక్ ఎంసెట్‌కు రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే 040-23256138 నంబర్‌లో సంప్రదించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement